Friday, May 8, 2020

శ్రీ కంచి పరమాచార్య / చంద్రశేఖరసరస్వతీ మహాస్వామి వారి జయంత్యుత్సవమైన 2020 శ్రీ వైశాఖ అనూరాధ నక్షత్ర మహోత్సవ శుభాభినందనలు...😊

శ్రీకంచికామాక్షిపరదేవతకు ప్రతిరూపంగా భువిపై 
" నడిచే దేవుడు " గా వినుతికెక్కిన

శ్రీ కంచి పరమాచార్య / చంద్రశేఖరసరస్వతీ మహాస్వామి వారి జయంత్యుత్సవమైన శ్రీ వైశాఖ అనూరాధ నక్షత్ర మహోత్సవ శుభాభినందనలు...😊

శ్రీ చాగంటి సద్గురువులు మనకు ఎనెన్నో ప్రవచనాల్లో బోధించినట్టుగా శ్రీ ఆదిశంకరభగవద్పాదులకు మరియు శ్రీ కంచి మహాస్వామివారికి అభేదం..... అప్పుడెప్పుడో ఇప్పుడున్న మన ఈ తరం వారెవ్వరు చూడని శ్రీ ఆదిశంకరులకు ప్రతిరూపంగా ఇప్పుడు

ఈ తరం లోని ఎందరో పెద్దలు ప్రత్యక్షంగా దర్శించి, ఆరాధించి, సేవించి అనుగ్రహం పొంది తరించేలా ఎందరెందరినో అనుగ్రహించిన  అపారకారుణ్యమూర్తులు శ్రీ కంచి మహాస్వామి వారు..

వారి దర్శనం / అనుగ్రహం కోసం వచ్చే వారందర్ని సమంగా అనుగ్రహించే సమతా స్వరూపులు వారు....

వారి దర్శనం కోసం వచ్చింది ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించడానికి కీలకమైన వ్యక్తుల్లో ఒకరిగా భావించబడే మహాత్మా గాంధి గారైనా, లేదా ఈ దేశం యొక్క అత్యున్నతమైన, గౌ | ప్రధానమంత్రి పదవిని అలంకరించిన వనితయా, లేదా అత్యంత సాధారణ జీవితం గడిపే సామాన్యులా అనే భేదభావాలు లేకుండా ఎల్లరిని ఒకేరీతిగ ఆదరించి అనుగ్రహించడం కేవలం మహాత్ములకు మాత్రమే చెల్లుతుంది....

అటువంటి అరుదైన జగద్గురువులు శ్రీ కంచి మహాస్వామి వారు.....

శ్రీ తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి ప్రీతిపాత్రమైన వాహనసేవల్లో అత్యంత ప్రముఖమైన, మహత్తరమైన, గరుడసేవను సంప్రదాయంలో
" పెరియతిరువడి " అని వ్యవహరించినట్టుగా, ఈ భరతభూమికి అలంకారంగా పరిఢవిల్లిన ఎందరెందరో మహనీయుల, సన్యాసాశ్రమ సాధుసత్పురుషుల, కోవిదుల, జగద్గురువుల, అందరిలోను ఎంతో ఆప్యాయంగా " పెరియవ " అని పిలువబడే ఎకైక మహనీయులు శ్రీ కంచి మహాస్వామి వారు......!

శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో శ్రీపరమాచార్యుల వైభవం విన్నప్పుడు నేను నిజంగా ఎంతగా ఆశ్చర్యపోయానంటే ఆనాటి నుండి ఈనాటివరకు కూడా శ్రీ పరమాచార్యుల శ్రీపాదపద్మములు నన్ను ఎన్నో విధాలా రక్షిస్తూ, నడిపిస్తూ, గెలిపిస్తూనే ఉన్నాయి...!

ఎవరి స్వానుభవపూర్వక అధ్యాత్మతత్త్వవిశేషవైభవం వారిది......

అది ఇతరులకు అంతగా అర్ధం అవ్వొచ్చు అవ్వకపోవచ్చు........

ఇది వరకే ఒక పోస్ట్లో చెప్పాను....

విను వీధిలో ఎంతో ఎత్తులో ఎగురుతున్న ఒక ప్లేన్ యొక్క విశ్వరూపం ఆ స్థాయిలో ఉన్న మరో ప్లేన్ కి మాత్రమే తెలుస్తుంది అని.....

అదే విధంగా ఒక మహనీయుని వైభవం అంతటి కోవిదులైన మరో మహనీయుల అనుగ్రహం వల్ల మాత్రమే మనకు అర్ధమయ్యేది....

అస్మద్ గురుదేవుల దర్శనానికై నేను 2013 సంవత్సరము నుండి వెళ్ళే కాకినాడ భానుగుడి జంక్షన్ అయ్యప్ప స్వామి ఆలయంలో, శ్రీ దత్తమందిరంలో కొలువైన శ్రీపరమాచార్యుల శ్రీపాదపద్మములు నా జీవితంలో ఆ వైభవానికి, ఆ అనుగ్రహానికి ఎకైకకారణం.....!

ఇది కొందరికి విడ్డూరం గా అనిపించవచ్చు.....

అసలు అక్కడికొచ్చే చాలమంది చాల క్యాసువల్ గా దర్శనలు చేస్కొని వెళ్తుంటారు కాని ఆ చిన్న దత్తమందిరంలో కొలువైన పరమాచార్య
వారి పాదుకల మహత్తు అంతా ఇంతా కాదు..... అది వాటి పై ధ్యానం చేసిన వారికి మాత్రమే గోచరించే సత్యం.....!

ఇప్పుడంటే వాటికి రజతకవచం అలకరించారు కాని ఇంతకుముందు అందరికి ఆ శ్రీపాదుకలు ఒరిగినల్ గా ఎట్లుండేవో అట్లే దర్శనం ఇచ్చేలా అక్కడ ఉండేవి.....

బాగా దోరగా నేతిలో వేయించిన క్యారెట్ తురుము, జీడిపప్పు, ఎండుద్రాక్ష తో గాజర్ క హల్వ చేసి అక్కడపెట్టినా కొందరు అది విచిత్రంగా పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు.....

నాలాంటి వారైతే ఆ హల్వా ను ఒక పట్టు పట్టకుండా ఉండరు కద....

అట్లే ఎంతో మహత్తరమైన శ్రీ పరమాచార్య వారి పాదధూళి సోకిన ఆ శ్రీపాదుకలు పక్కనే ఉన్నాసరే వాటిని బాగ దర్శించి ధ్యానించకుండా విచిత్రంగా అలా జస్ట్ చాలా క్యాజువల్ గా చూసి వేళ్ళిపోతుంటారు.......

ఈ దేశం యొక్క వైభవం మొత్తం ఇక్కడ జన్మించిన సాటిలేని మహనీయుల వల్ల భక్తభాగవతులకు అందివ్వబడిన భగవత్తత్త్వం.....

అటువంటి మహనీయుల శ్రీచరణాలను అలకరించిన పాదుకల్లో వారి తపఃశక్తి నిగూఢంగా నిక్షిప్తమై ఉంటుంది..... అది ఎంతటి అనుగ్రహమైనా భక్తులకు అందివ్వగలదు.....

అందుకే మీరు ఎక్కడ ఏ ఆలయంలో చూసినా సరే,

మేము శిరిడి వెళ్ళినప్పుడు బాబా వారి పాదుకలపై రోజా పూలు పెట్టి నమస్కరించే భాగ్యం కలిగిందండి అని మురిసిపోతారు ఒకరు.....

ఇంకొకరు మేము పిఠాపురం వెళ్ళినప్పుడు శ్రీదత్తశ్రీపాదవల్లభ స్వామి వారి పాదుకల దర్శనం ఎంత బాగా లభించిందో తెలుసా మీకు అని మురిసిపోతారు ఇంకొందరు.....

మేము తిరుమల కి వెళ్ళినప్పుడు మాకు

' నిజపాద దర్శనం ' లాటరి టికెట్ / దర్శనం లభించిందని మురిసిపోతుంటారు మరి కొందరు.....

మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు మెట్లు దిగి సిద్ధ రామప్ప పాదాల దర్శనం చేసుకున్నామండి అని మురిసిపోతుంటారు ఇంకొందరు.....

ఎందుకలా...?

సాయి బాబ వారి కఫినీ వస్త్రం అక్కడ లేదా ?

శ్రీదత్తశ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి ఇతర వస్తువులు అక్కడ లేవా....?

శ్రీవేంకటేశ్వర స్వామి వారి నిజ హస్త దర్శనం, ఇతరత్రా టికెట్లు లేవా....?

ఎందుకంటే

యోగుల, సిద్ధపురుషుల, సద్గురువుల, ఆచార్యుల, యతీంద్రుల, ఇత్యాది మహనీయుల యోగశక్తి, తపఃశక్తి, మంత్ర శక్తి, సిద్ధ శక్తి, వారి యొక్క పాదల నాడిమండలంలో స్థిరీకరించబడి వారి దేహం మొత్తం నలుదిశల ఎగజిమ్మబడుతూ ఉంటుంది.....

అందుకే విజ్ఞ్యులైన పెద్దలెవ్వరికైనా సరే వంగి వారి పాదాలకే నమస్కరిస్తారు.....వారి అనుగ్రహం కొరకై.....

( కొందరు అలా వారి పాదాలను తాకి నమస్కరించేందుకు ఇతరులను సమ్మతించరు.....

వారి తపః శక్తికి ఎమైనా ఇబ్బందులు కలుగుతాయేమో అని భావించి....

కాని అది నిజం కాదు....

మీరు ఒక వెలుగుతున్న దీపం నుండి ఒక
చిన్న పుల్ల ద్వార అగ్నిని సంగ్రహించి ఇంకో దీపం వెలిగించినప్పుడు, మొదటి దీపంలోని అగ్ని శక్తి తరిగిందా.....??

అట్లే ఒకరి పాదాల నాడిమండలంలో కొలువై ఉండే వారి తపఃశక్తి ఇతరులు నమస్కరించినప్పుడు వారికి  అనుగ్రహంగా ఇవ్వబడినప్పుడు అది ఎటువంటి తరుగును పొందదు అనేది అధ్యాత్మవిజ్ఞ్యానసూక్ష్మం...

కాకపోతే అవతలి వ్యక్తి ఎక్కడెక్కడినుంచో ప్రయాణం చేసివచ్చిన తరువాత బాహ్య శౌచం తో ఉన్నాడో లేదో తెలియదు కాబట్టి అలా కొందరు తమ పాదాలను, తమను ముట్టుకోడానికి సమ్మతించరు.....

కాబట్టి బాహ్యాంతరశౌచంతో ఉన్న వారు ఇతరుల పాదాలకు నమస్కరించినప్పుడు, నమస్కరించబడిన మహనీయులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు..... )

ఒక దీపం దేదీప్యమానంగా వెలిగినప్పుడు ఆ దీపానికి ఆధారమైన ప్రమిద ఎవ్విధంగా ఉష్ణశక్తిని సంతరించుకుంటుందో....

ఒక సూదంటురాయి ( మ్యాగ్నెట్ ) ని ఆశ్రయించిన ఇనుప ముక్క కొంతకాలానికి ఆ అయస్కాంత శక్తిప్రభావం తో ఒక చిన్న మ్యాగ్నెట్ గా మారినట్టు.....

ఒక తుమ్మెద భ్రమర కీటక న్యాయంతో ఒక చిన్న కీటకన్ని తనలా ఒక భ్రమరం గా మార్చినట్టు.....

ఒక మహనీయుని పాదాల నాడీమండలో కొలువైన వివిధ శక్తులకు రక్షణ కల్పించిన పాదుకలు కూడా అవ్విధంగా చాలాకాలం ఆ శక్తితాలుకా తరంగాలను వెదజల్లుతుంటాయి......

వాటిని ఆరాధించి సేవించి ధ్యానించి అలా వివిధ మార్గాల ఆ మహనీయుని అనుగ్రహం మనకు వారి శ్రీపాదుకలు అనుగ్రహిస్తాయి అనేది ఇక్కడి అధ్యాత్మ సత్యసూక్ష్మం......

అటువంటిది, మహనీయులకే మహనీయులైన శ్రీ కంచి మహాస్వామి వారి పాదుకల మహత్తు అంతా ఇంతా అని చెప్పగలమా.... ?

వారు ఎనెన్నో శాస్త్రాలను తమ మేధోమండలంలో ఒడిసిపట్టిన అసామాన్య శాస్త్రవేత్తలు.......

మంత్రశాస్త్రంలో వారికి తెలియని మంత్రంలేదు....

వారు అంగన్యాసకరన్యాసం గావించి ప్రార్ధిస్తే రాని దేవతలు లేరు....

వారి త్రికాల జ్ఞ్యానసిద్ధికి అందని విషయం లేదు.....

ఒక వ్యక్తి పై వారు తమ దివ్యదృష్టి సారిస్తే ఆ వ్యక్తి గురించిన తెలియని విషయం ఉండదు......

తిరుప్పావై ని భక్తులకు ఎంతగా వివరించి అనుగ్రహించగలరో, తిరువెంబాయ్ ని కూడా అంతే ఘనంగా వివరించే సమదర్శనులు......

అందరిలా వారు కూడా ఒక ఎలిమెంటరి స్కూల్లో చదువుకునే ఆ బాల్య ప్రాయంలో,

" శ్రీ కంచి పీఠానికి అధికారిగా ఉన్న మీ అన్మయ్యగారు,
అస్వస్థతతో ఉన్న వారి గురుదేవులను సేవిస్తూ ఉండగా  విధివశాత్తు సంభవించిన అదే మశూచి వ్యాధి తో కాలంచేసారు.....

ఇక మీరే కంచి పీఠానికి ఉత్తరాధికారులు.....

మీ ఇంటివారెవ్వరు ఇక మీతో ఉండరు....మీరు సన్యాసాశ్రమం స్వీకరించి ఇక ఇక్కడే మఠంలో ఉండిపోవాలి ఎప్పటికీ...."

అంటూ జెట్కాబండిలో కంచి పీఠానికి ప్రయాణిస్తున్న ఆ బాలుడికి చెప్తూ ఉంటే, ఏం చెప్తున్నారో ఏంటో ఎందుకో అసలు ఏమి అర్ధం కాక, అధ్యాత్మికతపై కనీస అవగాహన కూడా లేని ఆ బాలకులు, అప్పుడు వారికొచ్చిన శ్రీరామ నామం స్మరిస్తు పీఠానికి చేరుకొని పీఠ సంప్రదాయానుగుణంగా సన్యాసాశ్రమం స్వీకరించి ఎన్నో సంవత్సరాలు కాలంచేసిన వారి పూర్వ పీఠాధిపతుల బృందావనాలే గురువులుగా భావించి ధ్యానించి సేవించి ఎవ్వరూ ప్రత్యక్షంగా ఏ సహాయం చేయకున్నా అనతి కాలంలోనే యావద్ ప్రపంచం లో సాటిలేని జగద్గురువులుగా కంచికామకోటి పీఠ వైభవాన్ని నలుదిశలా వ్యాప్తిగావించిన మహనీయులై,

చిన్నప్పుడు ఏదో క్యాజువల్ గా వారి నాన్నగారి మితృలొకరు ఆ బాలకుడి జాతకం చూసి ఆశ్చర్యంచెంది ఆ బాలునకు అప్పుడే సాష్టాంగనమస్కారం చేసిన ఆ జ్యోతిష శాస్త్ర విద్వాంసులు....

" నీ కొడుకు పెద్దయ్యాక యావద్ ప్రపంచం తన కాళ్ళమీద పడి నమస్కరించేంతటి మహనీయుడౌతాడు......
అప్పటికి నేను ఉంటానో ఉండనో అని ఇప్పుడే నీ కొడుక్కి అలా దండం పెట్టుకున్నానయ్య....."

అని పలికినట్టుగా,

శ్రీకంచికామకోటి పీఠానికి 67 వ పీఠాధిపతులుగా, యావద్ ప్రపంచం వారి పాదాల మీద పడి నమస్కరించేందుకు రోడ్లు, బాటలు, బస్టాప్లు, అనె విషయం తో సంబంధం లేకుండా పరమాచార్యులు వస్తున్నారు అనే సమాచారం అందిన వెంటనే ఉన్నవారు ఉన్నచోటే క్రింద భూమి మీద పడి సాష్టాంగనమస్కారాలు చేసేంతటి మహనీయులై, ఈ ప్రపంచం ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో గౌరవించబడిన శ్రీ కంచి మహాస్వామి గా భారతదేశపు సర్వోన్మతమైన సాధు సత్పురుష సన్యాసాశ్రమ చక్రవర్తిగా ఈ నవయుగ శ్రీ ఆదిశంకరులుగా భరతభూమిపై నడయాడిన మనీషి శ్రీ మహాస్వామి వారు....!

అంతటి మహోన్నతమైన గురుభక్తి తత్పరత తో జీవిత తొలి సంధ్యలో ఎంతో కష్టించి జ్ఞ్యానార్జన గావించినారు కాబట్టే వారి గురువుల అనుగ్రహంగా శ్రీ కంచి మహాస్వామిగా అంతటి ఖండాంతర ఖ్యాతి గడించిన మహనీయులుగా ఆనాటి నుండి ఈ నాటి వరకు కూడా నమ్ముకున్న ఎంతో మంది భక్తులను ఎంతో ఘనంగా అనుగ్రహించి రక్షిస్తున్నారు.....

అలా వారి బృందావనం నుండే ప్రార్ధించిన వారందరిని అనుగ్రహిస్తూనే ఉంటారు కూడా....!

2018 లో కంచి యాత్రకు వెళ్ళినప్పుడు శ్రీ పరమాచార్య వారి ఉత్తరాధికారులైన ఇరు జగద్గురువులను దర్శించి వారి కరకమలములచే తీర్థ ప్రసాదాలు స్వీకరించే భాగ్యంతో పాటుగా,

ఎన్నో జన్మల పుణ్యఫలంగా శ్రీ పరమాచార్యుల స్వర్ణరథయాత్రలో పాల్గొని వారి బృందావనానికి ప్రదక్షిణానమస్కారాలు చేసుకునే సౌభాగ్యం లభించింది.....😊

ఈ కరోన కారణంగా స్కందగిరిలో జరిగే శ్రీపరమాచార్యుల వారి రథోత్సవంలో పాల్గొనడం ఈసారి కుదరదేమో.....

కనీసం వచ్చే వైశాఖమాసం కల్లా ఈ లోకం ప్రశాంతంగా అన్ని ఉత్సవాలు చేసుకుని ఆనందంగా ఉండేలా శ్రీ పరమాచార్యులు ఎల్లరిని అనుగ్రహించి సమ్రక్షించాలని కోరుకుంటూ,

సాక్షాత్ శ్రీ ఆదిశంకరాచార్యులచే మొదలుకొని అవిఛ్చిన్నంగా కొనసాగుతున్న
శ్రీకంచికామకోటిజగద్గురుపరంపరకు మనసాశిరసా ప్రణిపాతం గావిస్తు, వారందరు ఆ శ్రీకంచికామాక్షీఏకామ్రేశ్వరుల అనుగ్రహన్ని భక్తులకు సదా కలుగజేస్తుండాలని అభిలషిస్తూ,

శ్రీ మహాస్వామి వారి పాదపద్మములకు, వారి జయంత్యుత్సవం సందర్భంగా ఒక భక్తపరమాణువు యొక్క కవనకుమాంజలి భరిత నమస్సుమాంజలులు......😊

🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼లు......😊
🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼

No comments:

Post a Comment