Tuesday, May 5, 2020

శ్రీమాన్ పరిటాలగోపికృష్ణగురువుగారికి జన్మదినశుభాభినందనాపూర్వక నమస్సుమాంజలులు ..... :)

శ్రీఆదిశంకరుల జయంత్యుత్సవ తిథి శ్రీవైశాఖశుద్ధపంచమి నాడే భాగవతార్ శ్రీమాన్ పరిటాలగోపికృష్ణగురువుగారి జన్మదివసం కూడా అవ్వడం నిజంగా ఎంతో ఆనందదాయకం....
ఎందుకంటే ఈ కలియుగంలో స్వార్ధం అనేది ఎల్లరిజీవితాల్లో ఒక అంతర్భాగమైనందున,
ఇతరుల గురించి పట్టించుకునేంత ఓపిక, తీరిక ఉండడం చాలా అరుదు......
అందునా ఆధ్యాత్మికత అనే సున్నితమైన, ముఖ్యమైన, గొప్పదైన, కష్టమైన, మహత్తరమైన మార్గంలో ఇతరులకు సహాయసహకారాలు అందిస్తూ ముందుకు సాగడం అనేది ఒక గొప్ప సాహసోపేతమైన సత్కార్యమే.......
అవతలి వ్యక్తి ఎవరు ఏంటి ఎందుకు అనేదాంతో
సంబంధం లేకుండ
ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టిన వారే దేవుడు......
దాహం తో ఉన్నవారికి గుక్కెడు చల్లని నీరుతో దాహార్తిని తీర్చిన వారే దేవుడు....
ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు వారికి డబ్బిచ్చి ఆదుకున్న వారే దేవుడు.....
అజ్ఞ్యానంతో ఉన్నవారికి జ్ఞ్యానప్రసాదాన్ని అందించి ఆదుకునే వారే దేవుడు.....
ఎవ్వరు ఔనన్నా కాదన్నా ఇది లోకసహజమైన సిద్ధాంతం......
అట్లే ఈ కలియుగ వాసులకు కావలసింది శ్రీనివాసుని శ్రీపాద శరణాగతి.....
శ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహం వినా ఈ కలియుగంలో మనగలిగి ప్రశాంతంగా జీవించడం అనేది కల్ల......
శ్రీనివాసుని కరుణకై పరితపించే వారికి ఆ స్వామి అనుగ్రహానికి బాటలు పరిచి వారి జీవితాలకు శ్రీనివాసుడిని ఒక వరంగా అందించి వారి ఉన్నతికి పలువిధాలా కారణమైన వారు కూడా అట్లే భగవద్ సమానులు.......
2010 సంవత్సరం వరకు నాక్కూడా తిరుమల అనేది ఒక కొత్త ప్రదేశం..... అక్కడ ఒక దేవుడు ఉంటాడు.....
గుడి...
గుండు...
దర్శనం.....
తీర్థాలు...
లడ్డూ ప్రసాదాలు....
అంటూ యథావిధిగా సాగే తంతు గా ఒకసారి కుటుంబం అందరం కలిసి ఒకసారి శ్రీనివాస దర్శనానికి
వెళ్ళొచ్చాం..... అదే జీవితంలో బుద్ధి గడించిన తరువాత లభించిన మొట్టమొదటి శ్రీనివాస దర్శనం....
అప్పటికి గుర్తొచ్చిందేమో స్వామికి నన్ను చూసిన తర్వాత.....వీడు కూడా జీవయాత్రల్లో భాగంగా నాకు దూరమైన ఒకానొక భక్తపరమాణువు అని......
ఆయన వచ్చిందే ఆయన
భక్తుల కోసం కాబట్టి, తన భక్తభాగవతుల ద్వార అనుగ్రహించడం ప్రారంభించాడు.....
1. ఏదో స్తోత్రం గిరించి అంతర్జాలంలో వెతుకుతున్న నాకు "తెలుగు భక్తి పేజెస్" అనే ఒక యాహూ గ్రూప్ ద్వారా " శ్రీవారి " సేవకు తిరుమల కొండపై 7 రోజులు వివిధ చోట్ల స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులకు ఒనరించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు
ఈ క్రింది సమాచారం ప్రకారంగా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చు.....
అంటూ
"శ్రీమాన్ పరిటాల గోపికృష్ణ" అనే వారి దెగ్గరి నుండి ఒక మేయిల్
రావడం.....
"ఈ సేవలో పాల్గొన్న వారికి ఆఖరి రోజున స్వామివారి దర్శనం మరియు లడ్డు ప్రసాదం ఫ్రీ....." అనే విషయం తెలియగానే నా వివరాలన్నీ కూడా వారికి పంపించడం....,
వివిధ చోట్ల నుండి వచ్చిన భక్తులందరితో తిరుమల
' టి.బి.పి శ్రీవారిసేవకులు ' అనే బృందంలో నేను కూడా తెల్లని దుస్తులతో ఎర్రని స్కార్ఫ్ ధరించి తిరుమల సేవా సదన్ లో లైన్లో నిలబడి మా వివరాలు నమోదు చేయించి సేవలో పాల్గొనడం చకచకా జరిగిపోయాయి.......
అక్కడున్న అందరికి ఎవరికి ఎవరు తెలియదు....
కొద్ది మంది మినహా మిగతా అందరు కొత్త వారే....
" శ్రీనివాసభక్తి " అనే ఒకేఒక సూత్రం వారందరిని అక్కడికి చేర్చి ఒక బృదంగా కూర్చింది.......
అది మాత్రమే అందరికి తెలిసిన విషయం......
ఒక్కొకరిది ఒక్కొక్కనేపథ్యం.......
ఎవరి కష్టాలు వారివి....
ఎవరి ప్రార్ధనలు వారివి......
శ్రీనివాసుణ్ణి సేవించి జీవితాలకు స్వామి అనుగ్రహం అనే ఆలంబన సాధించుకోవాలి అనేదే అక్కడున్న అందరి మదిలోని ఆకాంక్ష......
ఇందరినీ ఒక జట్టుగా నడిపించి స్వామి సేవలో తరింపజేసిన
ఆ భాగవతులే శ్రీమాన్ పరిటాలగోపికృష్ణగారు......
వారు అది ఒక సేవగా భావించి చేసినా, ఒక ఆధ్యాత్మిక కార్క్యక్రమంగా భావించి చేసినా,
ఒక వ్యాపకంగా భావించి చేసినా,
ప్రత్యక్షంగా పరోక్షంగా వారు ఎందరో జీవితాల్లో శ్రీనివాసుడిని ఒక అంతర్భాగంగా చేసి అనుగ్రహించారు.......
స్వామి కరుణకై ఎదురు చూస్తున్న వారికి ఆ సేవ ఒక
మహత్తరమైన అనుగ్రహం....
ఎంతో గంభీరంగా ప్రవహిస్తున్న గోదావరి కళ్ళెదుట ఉన్నాసరే ఒక క్షేమదాయకమైన మార్గంలో ఆ నీటిని గ్రహించుటకు మనకు దారి చూపిన వారు ఎప్పటికీ మన శ్రేయోభిలాషిగా ఎల ఉండిపోతారో......
అలా అపార కరుణాసాగరుడైన భగవంతుడు మనకళ్ళెదుటే ఉన్నా సరే ఒక శ్రేయస్కరమైన మార్గంలో ఆ భగవద్ అనుగ్రాహన్ని మూటకట్టుకునేందుకు మార్గం చూపిన వారు కూడా అట్లే ఎప్పటికీ మన శ్రేయోభిలాషిగా ఉంటారు అని భావించడం కద్దు......
ఏది ఎమైనా ఎవ్వరు ఎన్ని బోధలు చేసినా, ఈ కలియుగంలో
" వినా వేంకటేశం ననాధో ననాధః.....
సదా వేంకటేశం స్మరామి స్మరామి.....
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద......
ప్రియం వేంకటేశ ప్రయఛ్చ ప్రయఛ్చ......"
అని అనునిత్యం ఆ దివ్యమంగళమూర్తి యొక్క క్షణకాల సందర్శనాభాగ్యం కోసము ఎంతగా పరితపిస్తుంటారో...,
అటువంటి పరమాత్మ ముందు గంటల తరబడి నిలబడి ఒకవైపు భక్తుల దర్శనం లైన్ ని త్వరితగతిన ముందుకు నడిపించే సేవక్ గా విధులు నిర్వహిస్తున్న సంగతి నిజమే కాని.....
ఆ పరమాత్మ యొక్క అత్యంత ఆనందాశ్చర్యకరమైన స్వరూపాన్ని అలా గంటల కొద్దీ కళ్ళతో జుర్రుకునే సౌభాగ్యానికి కారణమైన శ్రీ గోపికృష్ణగురువుగారిని
నా జీవితంలోకి స్వామి వారు పంపించడం నాకు ఎన్నో జన్మల సుకృత ఫలం...!
మరీ ముఖ్యంగా ఒకసారి వారికి సేవాసదన్లో ఆపుకోలేని కన్నీళ్ళ ధారలతో సాష్టాంగ ప్రణామాలు చేసి,
" మీరు ఇవ్వాళ పదే పదే నేను గావించిన వినతికి ప్రతిగా నాకు సన్నిధి డ్యూటి ఇప్పించారు......
ఎందరికి లభిస్తుందో ఆ సౌభాగ్యం తెలియదు కాని.....
గురువారం నాడు నేత్రదర్శంతో దివ్యాభరణాల సడలింపుతో, భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారి తిరుమేని ముందు రాములవారి మేడలో నిలుచొని లఘుదర్శనంలో భక్తుల లైన్ ను ముందుకు పంపించడం అనే సేవను యాంత్రికంగా నా శరీరం చేసెస్తున్నది కాని,
కుడి వక్షసీమలో శ్రీవత్సచిహ్నం దర్శనమిస్తూ ఉండగా వల్లెవాటు వస్త్ర ధారణలో ఉన్న స్వామి వారిని అంత దెగ్గరగా దర్శించే తన్మయత్వంలో నాకు మాటలు రాక అసలు ఎక్కడునాన్నో ఏం చేస్తునానో తెలియని శూన్యంలో ఉన్నానా అనేలా ఆ పరిపూర్ణుడైన పరమాత్ముని మందస్మిత ముఖరావింద సోయగంలో నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను
గురువుగారు......"
అంటూ ఆ నాడు గురువారం సన్నిధి డ్యూటి అయినతర్వాత నాకు స్వామివారు ఎంతగా దెగ్గరైపొయారో వివరిస్తూ వారితో సంభాషించడం జీవితంలో ఎన్నడూ మరవలేని మధురస్మృతి.......
ఎందుకంటే ఆ నాటి దర్శనం లో శ్రీవత్సచిహ్నభూషితుడైన పరమాత్మ నాకు ఒసగిన అనుగ్రహం అటువంటిది....!
అలనాటి శ్రీనివాసుడి మహత్తు ఏ వర్ణనలకు అందని దేవతానుగ్రహం...!!
మరెందరో భక్తులకు మీరు శ్రీవారిసేవాంతర్గతంగా ఆ కలియుగ పరమాత్మను వారి వారి జీవితాల్లో భాగంగా చేసి అనుగ్రహించేలా మీ అధ్యాత్మ ప్రయాణం కొనసాగాలని అకాంక్షిస్తూ మీకు జన్మదినశుభాభినందనాపూర్వక నమస్సుమాంజలులు గురువుగారు.....🍧🍇👏🍟🎇😊🙏🍕🍨
Renukumar Gupta Tadikonda is with Paritala Gopi Krishna and 22 others.
28 ఏప్రిల్ 2020 వైశాఖ శుద్ధ పంచమి, ఈ రోజు నాకు పెద్దదిక్కు, తండ్రి సమానులు, శ్రీ పరిటాల గోపికృష్ణ గారి జన్మించిన పర్వదినం ఎందుకంటే శ్రీ శంకర భగవత్పాదులూ జన్మించిన తీదే వారిది కూడా శ్రీ శంకరులు లాగానే వారుకూడా ఎందరికో గురువు. ఈ జన్మతిది నాడు వారి పాదాలకు నా షాష్టంగా ప్రాణామం. వారితో నాకున్న అనుబంధం ప్రపంచానికి అర్థం కానిది, భౌతికంగా దూరంగా ఉన్న ఎప్పుడు గుండెల్లోనా ఉంటారు. ఎక్కడ ఉన్నా వారు చల్లగా ఉండాలి, సహస్రచంద్ర దర్శనం చేయాలి, ఆ ఈశ్వరుడు వారికి ఆయుష్షు ఆరోగ్యం ఇవ్వాలి.
శ్రీవారి సేవ అంటే ఏమిటో కూడా తెలియని రోజులనుండే ఎందరినో స్వామి సేవకు తీసుకువెళ్లి సన్నిధిలో తరించడం అంటే ఏమిటి నేర్పి, స్వామి చెంతనే కాదు జీవితంలో కూడా ఎలా బతకాలో నిర్దేశించి ఎందరి జీవితాలనో తరింపచేసి తాను మాత్రం సాక్షిగా భగవత్ గీత మరియు భగవాన్ నామ తప్ప మరేదీ పట్టని మనిషి, మనుషుల్లో ఋషి నాకు గురువుకన్నా తండ్రి గానే ఎక్కువ.
Paritala Gopi Krishna గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు.

No comments:

Post a Comment