Tuesday, May 5, 2020

శ్రీ శార్వరి వైశాఖ శుద్ధ చతుర్దశి / శ్రీనారసిమ్హ జయంతి శుభాభినందనలు......😊 ( 6-మే-2020 )

శ్రీ శార్వరి వైశాఖ శుద్ధ చతుర్దశి / శ్రీనారసిమ్హ జయంతి శుభాభినందనలు......😊 ( 6-మే-2020 )
"శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఎందరో దేవతా స్వరూపాలుగా కొలిచి ఆ అన్ని దేవతాస్వరూపాలు కూడా ఇదిగో ఈ శ్రీవేంకటేశ్వరుడై ఇప్పుడు ఇలా మన ముందు నిలుచొని ఉన్నాడు మనల్ని కరుణించుటకు......"
అని చెబుతు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు మనకు ఎన్నో సంకీర్తనలు అందించారు.........
శ్రీహరి యొక్క ప్రశస్తమైన దశావతారాలను కూడా వివిధ వర్ణనలతో కొలిచి ఆ రూపం ఇప్పుడు శ్రీవేంకటేశ్వరుడై ఉన్నాడు అనడం కీర్తనలో స్వాభావిక రచనాశైలి అవడం సహజమే.......
కాని శ్రీనృసిమ్హుడిగా స్వామి వారిని కీర్తించి
" ఇదిగో ఆ శ్రీనారసిమ్హుడు శ్రీవేంకటేశ్వరుడిగా తిరుమలలో కొలువై ఉన్నాడు....." అని అన్నమాచార్యులు తమ శ్రీవేంకటనృసిమ్హ కీర్తనల్లో చెప్పినప్పుడు అది ప్రత్యక్షసత్యమే.....
ఎందుకంటే అక్కడ తిరుమలలో ఆయన శ్రీయోగనారసిమ్హుడిగా నిజంగానే కొలువైఉన్నాడు కాబట్టి.....!!
ఎంతో శక్తివంతమైన ఆ శ్రీనృసిమ్హుడు
తిరుమల ఆలయ తూర్పుఈశాన్యభాగాన పశ్చిమాభిముఖుడై తన చేతి వేళ్ళ గోర్లు ఎంతో స్పష్టంగా గోచరించేలా యోగముద్రలో ఆసీనుడై కొలువైఉండడం ఎల్లరికి విదితమే కద......
కాబట్టి లోన ఆనందనిలయంలో ఉన్న శ్రీవేంకటేశ్వరుణ్ణి శ్రీవేంకటనృసిమ్హం అని కీర్తించినప్పుడు / కొలిచినప్పుడు అది ఇతర స్వరూపాల లా కాకుండా ఇక్కడ ప్రత్యక్షం గా కూడా అన్వయమైతుంది......
శ్రీలక్ష్మీనారసిమ్హుడి వైభవం అటువంటిది కనుకనే తిరుమలలో ఆ శక్తివంతమైన యోగనారసిమ్హాన్ని
ఈశాన్య భాగంలో ( ఈశాన్యం అత్యంత సున్నితమైన రుద్ర స్థానం ) కొలువైఉండేలా వ్యవస్థీకరించారు
ఆచార్యులు.....
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది.....
వివిధ దేవతా స్వరూపాలు పలు ఆయుధాలు ధరించి సమ్రక్షకులుగా ఉండడం చూసే ఉంటారు.....
దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం అలా వివిధ ఆయుధాలను ఉపయోగించడం పరిపాటి......
కాని శ్రీనారసిమ్హుడి కి ప్రత్యేకంగా ఆయుధాలు అవసరంలేదు......
"చక్రమేల ఖడ్గమేల నారసిమ్హ....నీ చేతి వేళ్ళ గోళ్ళె చాలు నారసిమ్హ....." అని శ్రీవైష్ణవాచార్యులు స్తుతించినట్టుగా.......
అత్యంతపదునైన ఆయన యొక్క పది నఖములు చాలు.....
ఎంతటి భీకరమైన దుష్టశిక్షణ చేయుటకైనను.......
అన్న హిరణ్యాక్ష వధకు ప్రతీకారం తీర్చుకోవడానికి తపస్సు చేసి, బాగా తెలివి గలవాడిని అనుకొని బ్రహ్మగారి నుండి....
"
'మనిషి చేత కాని, మృగం చేత కాని, ఇప్పటివరకు ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణి చేత కాని, పగలు కాని, రాత్రి కాని, భూమి మీద కాని, ఆకాశంలో కాని, జీవం ఉన్న వాటితో కాని, లేని వాటితో కాని,......' నాకు మరణం లేకుండ ఉండేలా వరం అనుగ్రహించు స్వామి..... "
అని కోరి తన రాక్షస ప్రకోపంతో లోకంలో సాధు సత్పురుషులను, భక్త భాగవతులను పీడించడం తో యథావిథిగా దేవతలందరు శ్రీహరికి తమ బాధను విన్నవించుకోవడం,
సాధు సత్పురుషులను భక్త భాగవోత్తములను దేవతలను సమ్రక్షించడమే తన పని కాబట్టి,
శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఎవరు ఎంత తెలివిగలవారైనా, ఎంత అతి తెలివిగలవారైనా సరే, భగవంతుడి నుండి తమ కర్మఫలితాలను తప్పించుకోవడం అసంభవం.......
కర్మసిద్ధాంతానికి సమ్రక్షకుడైన భవంతుడి వినా మరెవ్వరికీ కూడా ఆ కర్మ చట్రాన్ని తమ అధీనంలోకి తీసుకోవడం అనేది కుదరని ప్రక్రియ......
కర్మాచరణ స్వాతంత్ర్యం మాత్రమే జీవులకు కలదు.....వాటి ఫలితాల నిర్ణేత మాత్రం కేవలం ఈశ్వరుడే.......
" కర్మ తత్ జడం...." అని అనబడేది అందుకే.......
శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా,
కోట్ల కొలది డబ్బు ఉండి, Z క్యాటగిరి సెక్యురిటి ఉండి, ప్రపంచంలో ఏ వైద్యుడు కావాలంటే వారితో వైద్యం చేయించుకోగల స్థాయిలో ఉండే వారు,
కాలు కింద పెట్టకుండ ఇంకో వంద సంవత్సరాలైనా సరే అట్లే జీవించడానికి సరిపడా అన్ని వసతులు వారికి ఉన్నాయి కద....? మరి ఎందుకు ఊపిరి ఆపుకొని జీవితాలను ముగించేస్తున్నారు....?
ఇక్కడ అందరు మరిచే విషయం ఏంటంటే సదరు జీవుడు ఉన్న శరీరం యొక్క ఊపిరి ఆపబడలేదు......
అది అయిపోయినది......లేదా ముగిసినది......కాబట్టే అది ఆగినది.......
అంటే ఆ లెక్కలన్నీ చూసే వారు వేరు...... ఎవరు అది ఇచ్చారో వారే అది ఆపు చేస్తారు......ఆ గహనమైన కర్మ సిద్ధాంతపు లెక్కలన్నీ చిత్రంగా ప్రతి చోట కూర్చొని గుప్తంగా రాసుకునే వారు చిత్రగుప్తుడు అని కద సద్గురువుల ఉవాచ......
అంటే నిజంగా అలా ఒక వ్యక్తి ఎప్పుడు మన చుట్టూ ఉండి అన్ని పాప పుణ్య కర్మల లెక్కలు రాసుకుంటాడా.......
ఇన్ని కోట్ల జనాభ కి అన్ని కోట్ల మంది చిత్రగుప్తులు ఉంటారా....?
ఇదేక్కడి విడ్డూరం......
అని అనిపిస్తుందేమో......
కాని అది ఒక బృహత్ వ్యవస్థ......
పరిమితమైన మానవ మేధకు అందనంత ఉన్నతమైన మేధోసంపత్తి గల ఊర్ఢ్వలోక దివిజుల కట్టడిలో ఉండే జీవాత్మ ఆయుః ప్రమాణ నిర్ణయ వ్యవస్థ.......
ఒక చిన్న లౌకిక ఉదాహరణ తో అది సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను.....
ఊర్లోని ఒక తుంటరి పోరడికి కొత్తగా సెల్ ఫోన్ కొనిచ్చి "ప్రపంచంలో ఎవ్వరితోనైనా మాట్లాడుకో......
కాని అవసరమైన ముఖ్యమైన వాటి కోసమే ఉపయోగించుకో.....లేదా నీకు ఇవ్వబడిన నిర్ణీతమైన టాక్ టైం అయిపోతుంది జాగ్రత్త....."
అని మీరు చెప్పారనుకుందాం......
అది ఏ మాత్రం పట్టించుకోకుండా రోజు గంటల తరబడి తన ఫ్రెండ్స్ తో బాతాఖాని పెడుతు 1000 రూపాయల టాక్ టైం ని పది రోజుల్లో ఖతం చేసి......
"నాకు ఏం తెల్వదు..... నేను ఏం ఎక్క్వ మాట్లాడలే......నాకు ఇంకా టాక్ టైం కావాలి......" అని అలా తన ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంటే మీరెం చేస్తారు......
సదరు మొబైల్ నెటెవర్క్ ఆఫిస్ కెళ్ళి ఫలనా 1234567890 అనే నంబర్ యొక్క......
గత పది రోజుల కాల్ రికార్డ్ మొత్తం ఇవ్వండి అని విజ్ఞ్యప్తి గావిస్తే వాళ్ళిచ్చే కాల్ లాగ్ లో ప్రపంచంలో
ఆ నంబర్ నుండి ఏ ఏ నంబర్లకు ఎన్ని నిమిషాల ఎన్ని సెకన్ల సేపు కాల్ వెళ్ళింది....దానికి తగు రీతిలో ఎంత రుసుము టాక్ టైం నుండి కట్ చేయబడింది......
అనే వివరాలన్నీ కూడా స్పష్టంగా ఆ పోరడి ముందు పెట్టి
" ఇప్పుడు చెప్పు నీ టాక్ టైం ఊరికే దానంతట అదే అయిపోయిందా.....లేదా నువ్వు వీరందరితో ముచ్చట్లు పెట్టడంతో అయిపోయిందా....?"
అని ప్రశ్నిస్తారు..... అవునా....?
ఆ ఒక్క నంబర్ కాల్ రికార్డ్ ఇచ్చిన ఒక్క కంప్యుటరే ఎన్ని నంబర్లకైనా అట్లే డేటబేస్ నుండి రిపోర్ట్ పుల్ చేసి ఇవ్వగలదు......
అంతే తప్ప ఎంత మంది కస్టమర్లు ఉంటే అన్ని కంప్యుటర్లు మేంటేన్ చేయడం లేదు కద టెలికాం కంపెని వాళ్ళు....
అట్లే ఎంతమంది జీవులు ఉంటే అంత మంది చిత్రగుప్తులు ఉంటారు అని కాదు అర్ధం......
" చిత్రగుప్తుడు " అనే ఒక పోస్ట్ లో ఉన్న దేవతా శరీరం జీవుల కర్మసిద్ధాంతపు లెక్కలన్నీ మేంటేన్ చేసే ఒక టెలికాం ఆపరేటర్ లాగ అన్నమాట......
( i.e., one who has an authentic access to all the deeds performed by every single living being on the planet recorded in a cosmic data base system that is under the control of Brahmadeava with Lord Yamadharmaraaja as the Database Administrator and his assistant Lord Chitragupta as DB / Crystal Reports' generator....... )
ఈ complex cosmic database system గురించి బాగా అర్ధం అవ్వాలంటే కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి దెగ్గర్లో ఉండే
" సిత్తిరగుప్తై పెరుమాల్ కోయిల్ " కెళ్ళి అక్కడ అర్చన, ఆరాధన గావించి ధ్యానం చేస్తే బాగ తెలుస్తుంది....
అసలు ఈ భూమి పై మరెక్కడా లేదేమో అట్లాంటి చిత్రగుప్త ఆలయం......!
( శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనం విన్న పుణ్యమా అని 2018 లో కంచికి వెళ్ళినప్పుడు నాకు ఈ చిత్రగుప్త ఆలయ సందర్శనాభాగ్యం కూడా లభించింది..... 😊)
కాబట్టి నిరంతరం ఆ పిల్లాడి చుట్టూ ఒక వ్యక్తి ఉండి ఆ వివరాలన్నీ రాసుకున్నాడా....?
లేదా ఆ టెలికాం వ్యవస్థలోనే అదొక అంతర్నిహితమైన వ్యవస్థగా కొలువై ఉందా ....?
ఈ లోకంలో ఉన్న కోట్ల కొలది మొబైల్ వినియోగదారులకు కూడా అదే వ్యవస్థ ద్వార అన్నీ వివరాలు అందివ్వగలం కద... ( వారు అడిగితే....)
అచ్చం ఇదే విధంగా కర్మసిద్ధాంతం కూడా ఈశ్వరుడి అధీనంలో ఉండే ఒక అత్యంత అధునాతనమైన వ్యవస్థ.....
ఎన్నో కోట్ల మొబైల్ యుజర్స్ ఉన్న మన సాంకేతిక వ్యవస్థలోని కంప్యుటర్లు అప్పుడప్పుడు లెక్కలు తప్పగలవేమో కాని.....
ఎన్ని కోట్ల మంది జీవులు ఉన్నాసరే ఆయన వ్యవస్థ లోని కంప్యుటర్లు లెక్కలు తప్పవు......
కాకపోతే ఇక్కడ ఈశ్వరుడిని ప్రశ్నించే అధికారం మాత్రం జీవుడికి లేదు.....
ప్రార్ధించేందుకు మాత్రమే వీలున్న వ్యవస్థ ఈ కర్మ సిద్ధాంతం.....
అందుకే కద ఎంతో అతి తెలివితో వరాన్ని అడిగిన హిరణ్యకశిపుడికి..,
మనిషి కాని మృగం కాని నరసిమ్హమై, ఇప్పటివరకు ఈ సృష్టిలో లేని ప్రాణిగా అవతరించి, పగలు కాని రాత్రి కాని ఉత్తర సంధ్యలో భూమి మీద కాకుండ ఆకాశంలో కాకుండా గడప మీద నిలిచి తన తొడలపై వాణ్ణి పరుండబెట్టి, జీవం ఉన్నవి కావు
( కత్తిరిస్తే నొప్పి ఉండదు కాబట్టి ) జీవం లేని కావు ( కత్తిరించినా గోర్లు పెరుగుతుంటాయి కాబట్టి ) అయిన తన వాడి గోళ్ళతో వాడి ఉదరభాగాన్ని ఛీల్చి సమ్హరించాడు......
ఇలా వాడి వరానికి అనుగుణంగా సమ్హరించడం ఒకెత్తైతే, శ్రీనారసిమ్హ అవతార వైభవ విశేషాలు ఇంకొక ఎత్తు......
శ్రీ చాగంటి సద్గురువులు విశదీకరించినట్టుగా
సిమ్హ / హింస అనే పదాలు అనులోమ విలోమ ప్రక్రియలో భాగంగా సామ్యములు.......
హింసకు పెట్టింది పేరు సిమ్హం......
వేటకు సిద్ధమై మృగరాజు తన జూలు విదిల్చి అడవిలో బయలుదేరితే మదగజాలు సైతం హడలెత్తి పరుగులు పెట్టవలసిందే.....
గురి చూసి వేట మొదలు పెట్టిన తర్వాత అది ఎంతటి ప్రాణి అయినా సరె, ఎంతటి వేగంతో విరుచుకుపడాల్సివచ్చినా సరె, ఎంత దూరం పరుగెత్తవలసివచ్చినా సరె, వెటలో గురిచూసిన ప్రాణిని సమ్హరించితీరడంలో సిమ్హానికి సిమ్హమే సాటి.....!
అవతలి ప్రాణి ఎంతగా ప్రతిఘటిస్తే అంతగా రెచ్చిపోయి విరుచుకుపడి విరిచేయడం సిమ్హం యొక్క లక్షణం.....
అచ్చం అదే విధంగా ఉగ్రనారసిమ్హుడు సైతం అవతలి ఆసురి శక్తి ఎంతటిదైనను, ఎంత ప్రబలమైనదైనాసరే, అంతటి ఉగ్రత్వంతో రెచ్చిపోయి సమ్హరించగల దైవిక శక్తిస్వరూపం.......
" ఉగ్రం వీరం మహావిష్ణుం....
జ్వలంతం సర్వతో ముఖం....
నృసిమ్హం భీషణం భద్రం ....
మృత్యోర్ మృత్యుం నామామ్యహం....🙏 "
అని కదా ధ్యాన శ్లోకం...!
అందుకే మన పెద్దలు లోకంలో సాధు సత్పురుషుల భక్త భాగవతుల సమ్రక్షనార్థం శ్రీనృసిమ్హారాధన బాగా విస్తారంగా ఉండేలా ఎన్నెన్నో ఆలయాలు కట్టించి అర్చారాధనలను వ్యవస్థీకరించారు.......
అందరికి తెలిసిన నవనారసిమ్హ క్షేత్రాలతో పాటుగా మరెన్నో ఇతర శక్తివంతమైన శ్రీనారసిమ్హక్షేత్రాలకు ఈ తెలుగు నేల పెట్టింది పేరు....
శ్రీభద్రాచల క్షేత్రపాలకుడిగా ఆలయం ఎదురుగా ఉన్న కొండపై ఎంతో శక్తివంతమైన యోగనారసిమ్హుడు కొలువైఉండడం గమనించవచ్చు.....
సంప్రదాయం తెలిసిన వారు ముందుగా ఈ యోగనారసిమ్హుడిని దర్శించి ఆతర్వాతే శ్రీవరభద్రగిరీశుడైన కోదండ రాముడిని దర్శించడం కద్దు....!
శ్రీ చాగంటి సద్గురువులు ప్రవచనంలో ఒకచోట చెప్పినట్టు మంథని దెగ్గరి సుందిళ్ళ శ్రీలక్ష్మీనారసిమ్హుడు ఈ భూప్రపంచంలో మరెక్కడా లేని విధంగా బాహ్యాంతర శౌచ సిద్ధి గలవారినే అనుగ్రహించే విధంగా ఉండడం మనం గమనించ వచ్చు.....
ఇలా ఎన్నెన్నో చోట్ల శ్రీలక్మీనారసిమ్హుడు తనదైన ప్రత్యేకతతో విరాజిల్లడం మనం గమనించ వచ్చు.......
నృసిమ్హారాధన ఎంతో మహిమాన్వితమైనది కాబట్టే
గౌ | సీ.ఎం, శ్రీ కేసీఆర్ గారు అంత ఘనమైన రీతిలో శ్రీయాదాద్రీశుడి ఆలయాన్ని పాంచరాత్రాగమరీత్య చక్కదిద్ది ఆ శ్రీలక్ష్మీనారసిమ్హుడి అనుగ్రహం మరింత ఘనంగా భక్తులెల్లరికి లభించేవిధంగా అలాంటి బృహత్ ఆలయనిర్మాణ కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో రూపొందిస్తున్నారు.....
వివిధ వైదిక శాస్త్రాలకు అధిదేవతగా ఉండే విరాట్ వేదపురుషుడికి నేత్ర స్థానంలో ఉండే జ్యోతిషశాస్త్రం పై అవగాహాన కలిగిన పెద్దలకు తెలిసిన విధంగా సిమ్హ లగ్నంలో జన్మించిన వారు, స్వాభావికంగా ఒక సిమ్హం ఎంత ఘనమైన రీతిలో తన వేట కొనసాగిస్తుందో, అదే విధంగా అంత శార్ప్ గా , అక్క్యూరేట్ గ , ఫొకస్స్డ్ గా , క్యాలిబ్రేటెడ్ గా , తమ జీవితంలో ఉండి ఎన్నెన్నో విషయాల్లో అందె వేసిన చెయ్యితో రాణిస్తు ఎంతో దృఢమైన చాణక్యంతో మెలగుతుంటారు......
సామాన్యంగా లోకంలో ఒక సామెత వింటుంటారు....
" వాడి జోలికి పోకండ్రా నాయన....
ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం వాడు....."
ఇది సిమ్హ లగ్న జాతకులకు సరిగ్గా సరిపోతుంది.....
సరైన సమయంలో సరైన విధంగా పంజా విసరడం లో వీరికి వీరే సాటి అనేంతటి గంభీరంగా ఉంటుంది వారి కార్యాచరణ సరళి..!
శ్రీలక్ష్మీనారసిమ్హుడి మరో ప్రత్యేకత సాటిలేని భక్త రక్షణ........అసలు ఆయన కంభముండి
( స్థంభమునుండి ) బయల్వడడానికి కారణం కూడా భక్తుడైన ప్రహ్లాదుడే........
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో నారసిమ్హవైభవం విన్నవారికి తెలిసినట్టుగా....,
" ఎక్కడరా నీ శ్రీహరి.....?? అని పదే పదే ప్రహ్లాదుడిని నానా చిత్రహింసలకు గురిచేసి కన్న కొడుకని కూడా కనికరం లేకుండా తన రాక్షస చర్యలతో ఎంతగానో వేధించి ఇక విసుగుచెందిన హిరణ్యకశిపుడు
" ఏడి.....ఈ స్తంభంలో ఉన్నాడా...?"
అని గద్దించగా,
ప్రహ్లాదుడు ఎక్కడ వేలు పెట్టి ఇక్కడ ఉన్నాడు నా శ్రీహరి అని చూపెట్టడమే ఆలస్యంగా......
ఎక్కడినుండైనా సరే ప్రభవించి విరుచుకుపడి రక్కసుని వధించుటకు సిద్ధంగా ఉన్న ఆ ఉగ్రనారసిమ్హుడి వైభవం నిజంగా మాటలకు అతీతమైనది.....
అవతారం యొక్క నిడివి తక్కువే అయినా ప్రభావం మాత్రం చాల శక్తివంతమైనది.......
పిడుగు ఆకాశమునుండి రాలి పడడానికి ఎక్కువ సమయం తీస్కోదు.....కాని రాలిపడ్డ ప్రదేశంలో అది సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు......!
ఆచం అదే విధంగా శ్రీనారసిమ్హుడి వైభవం కూడాను.....
ఆయన అవతరించడానికి పెద్దగా అక్కడ జరిగిన నేపథ్యం ఏమి లేదు...... భక్తుడు పిలిచాడు.....స్థంభమునుండి బయల్వడినాడు.......
కాని ఆ తరువాత ఆ ఉగ్రమూర్తి యొక్క విశ్వరూపాన్ని చూసిన దేవతలందరు కూడా సంభ్రమాశ్చర్యాలతో
" అహో బలం......! అహో బలం.....!! "
అని ఆ అత్యంత బలిశ్టమైన దేవనారసిమ్హాన్ని కీర్తించారు కాబట్టి ఆయన అహోబలనారసిమ్హుడై అక్కడే కొలువైనాడు.....
( కాల క్రమంలో అది ఒక బిల ప్రాంతం గా మారడంతో 'అహోబిలం 'గా జనబాహుళ్యంలో నామాంతరం చెందింది.....)
అంతటి ఉగ్రనారసిమ్హంగా ప్రభవించాడు కాబట్టే ఇప్పటికి ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా ఆయనను శాంతింపజేసే విధంగా ఉండేలా అర్చారాధనలు ఉండడం మనం గమనించవచ్చు......
( మంగళగిరి శ్రీపానకాల స్వామికి నిత్యం పానక సమర్పణం......,
శ్రీ సిమ్హాచలా అప్పన్న గా వెలసిన స్వామికి నిత్యం చందన లేపనం..... ఇత్యాదిగా.....)
సైన్స్ మనకు చెప్పినట్టుగా
" Every action has an equal and opposite reaction ....."
అనే సూత్రానికి అనుగుణంగా,
అవతలి శక్తి ఎంతటి ఘనమైనదైనను, ఎంతటి భీకరమైనదైనను, అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేలా ఉగ్రనారసిమ్హుడు తన విజృంభణను నిత్యం కొనసాగిస్తుంటాడు......
అందుకే శ్రీనృసిమ్హారాధన అంతటి ప్రశస్తమైనదని మన పెద్దలు మనకు సెలవిచ్చిరి.......
శ్రీవేంకటేశ్వరుడి తిరుమల సన్నిధి చేరుకొని తపః సిద్ధి గడించేలా మహా యోగిని శ్రీ తరిగొండ వెంగమాంబకు అనుగ్రహం ప్రసాదించింది సత్యప్రమాణాల స్వామి శ్రీతరిగొండలక్ష్మీనారససిమ్హుడే కద...!
ఆ శ్రీవేంకటనారసిమ్హుడిని ఎన్నెన్నో కీర్తనలతో సేవించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు ఈ క్రింది కీర్తనలో స్వామిని వర్ణించిన వైనం, శత్రుహననంలో ఎదురులేని శ్రీనారసిమ్హుడు ప్రభవించిన అమోఘమైన తీరుకి దర్పణం పడుతుందని నా భావన....! 😊
ఆ శ్రీవేంకటలక్ష్మీనారసుమ్హుడు అందరి దురితాలను ఛీల్చి చెండాడి, సకల దుష్టగ్రహబాధలను నిర్మూలించి ఎల్లరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి కరుణించుగాక....😊🙏

No comments:

Post a Comment