Monday, May 18, 2020

శ్రీకరమైన భారతీయసంస్కృతి / భారతీయ సనాతన అహార విధివిధానాలు / జీవన శైలి..... :)

శ్రీకరమైన భారతీయసంస్కృతికి అనాదిగా ఉన్న ఇక్కడి సర్వశ్రేయో దాయకమైన, జీవన విధానానికి మూల కారణం భారతీయ సనాతన అహార విధివిధానాలు, వాటితో పెనవేసుకున్న జీవన శైలి.....
అవును వినడానికి విడ్డూరం గా అనిపించినా ఇది ముమ్మాటికి నిజం.....
" అదేంటి బాబు యావద్ దేశం యొక్క గొప్పదనం మొత్తం ఆ దేశ ప్రజల తిండి మీద ఆధారపడి ఉంటుందా....
అదెట్లా....? " అని అంటారేమో....
చెప్తా వినండి.....
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు వినే వారికి ఒక విషయం మాత్రం బాగా రూఢమై మదిలో ఎదలో దృఢంగా నాటుకోవడం కద్దు....
అది మనం భుజించే ఆహారం విషయంలో బాగ జాగ్రత్తగా ఉండడం......
ఎందుకంటే, మనం తినే ఆహారంలోని 6 వ వంతు మన మనసు గా మారుతుంది కాబట్టి....
నిరంతర జీవన పోరాటం అనే చదరంగంలో, అసంఖ్యాక సంకల్ప వికల్పాల సంఘాతమైన ఆ
" మనసు " అనే కనిపించని
" మంత్రి " మనల్ని తన అధీనంలోకి తీసుకుని నడిపించే విధానమే మన జీవితం అవుతుంది కాబట్టి.....
మంచి మనసు మంచి విషయాలపైకి మనల్ని ఉద్యుక్తులను గావిస్తుంది......
అది జ్ఞ్యానార్జన కు దోహదం చేస్తుంది.....
నిరంతరం గావించే ఆ జ్ఞ్యానార్జనే క్రమక్రమంగా మన
" బుద్ధి " గా స్థిరపడుతుంది కాబట్టి....
' మనసు ' , ' బుద్ధి ' / ' మంత్రి ' , ' రాజు ' గా
మనల్ని నిరంతరం ఆటాడించే ఈ ఇరు శక్తులే మొత్తం మన జీవితాన్ని శాసించే కీలకమైన అంశాలు.....
మిగతా విషయాలన్నీ కూడా మన మనసు, బుద్ధి అనే ఈ శక్తి ద్వయం యొక్క జనితములు......
లౌకిక చదరంగం అనే ఆటలో
ఒక్కొక్క గడిని మాత్రమే దాటుకుంటు వెళ్ళగల రాజు, మరియు ఒక్కసారిగా. ఎన్ని గళ్ళైనా దాటి ఎక్కడికైనా తుర్రుమని దూసుకుపోగల మంత్రి అనే ఇరు కీలక శక్తులకు తోడుగా మరిన్ని శక్తులు అనగా,
గజ శక్తి, హయ శక్తి, ఉష్ట్ర శక్తి, సైనిక శక్తి తోడుగా ఉండి మన ఆటకు సహకరిస్తాయి.....
కాని జీవితం అనే చదరంగంలో ఉండే మనసు, బుద్ధి అనే శక్తి ద్వయమే మిగతా ఇతర శక్తులన్నిటిని
సృజించి తమ ఆటను వాటితో ఆడిస్తాయి.....
ఇంకా సింపుల్ గా అర్ధయమయ్యేల చెప్పలంటే....
లౌకిక చదరంగంలో ప్రత్యర్ధి ఎత్తుకు పైఎత్తు వేయడం అనే ప్రక్రియలో, ఒక వైపు మంత్రి తనదైన రీతిలో వల వేస్తాడు....మరో వైపు మిగతా ఇతర శక్తులు కూడా తమ తమ నిర్దేశిత మార్గాల్లో తమదైన రీతిలో వల వేసి ప్రత్యర్ధిని మట్టుపెట్టే పనిలో
నిమగ్నమవుతాయి.......
అనగా ఇవి ఒకదానికొకటి దేని కవే
ప్రత్యేకత గలిగిన పావులు.....
ఏ పావు ఏ గడిలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రత్యర్ధి ఆటను చిత్తు చేసే విధంగా ఎత్తుగడ వేసి సరైన సమయం లో ప్రత్యర్ధి తన వలలో చిక్కగానే వేటు వేయడానికి సిద్ధంగా ఉంటుందో ఆ పావుకు మాత్రమే తెలుసు.....అది ఇతర పావులకు తెలియనవసరం లేదు....
అనగా ఆటలో ఒక వైపున్న అన్ని పావులు కలిసి సమిష్టిగా ఆట ఆడుతూ తమ రాజు కు ఎవ్వరు చెక్ పెట్టలేని విధంగా, ఒక వేళ పెడితే చిత్తయ్యే విధంగా తమ కదలికలను వ్యవస్థీకరించుకోవడం నిజమే అయినా, దేని ఆట దానిదే.....కద.....
( మీరు చిన్నప్పుడు కాంట్ర, మారియో,
లాంటి వీడియో గేంస్ బజార్లో ఉండే షాపుల్లో ఆడి ఉంటే, కాంట్ర గేం లో మల్టిపుల్ ప్లేయర్స్ తో ఆడినప్పుడు, "every soldier jumps in to the battle field with his own roadmap and executes his Matrix inspite of their common goal....." అనే ఆటతీరుకి మన లౌకిక చదరంగం ప్రతిరూపం...... )
కాకపోతే వీడియో గేం లో మనం వేసే ఎత్తు కనిపిస్తుంది.....
చదరంగంలో మనం వేసే ఎత్తు కనిపించకుండా కేవలం పావుల కదలిక మాత్రమే కనిపిస్తుంది.....
అనగా పావు ఎదురుగా ఉంటుంది....
అది వేసే ఎత్తు మన మదిలో ఉంటుంది...
కాని నిజజీవిత చదరంగం అనే ఆటలో ఉండేవి కేవలం మనసు, బుద్ధి అనే రెండు పావులు మాత్రమే...!
మిగతా ఎన్ని ఉన్నా అవన్నీ కూడా ఈ రెంటితో సృజించబడిన శక్తులే...కద....
అనగా మంచి మనసు కలిగి ఉండి, ఆ మంచి మనసుకు తగు రీతిలో ఎంతో ఘనమైన బౌద్ధిక పరిపక్వత కలిగి ఉండడం అనేదే నిజ జీవితం అనే చదరంగంలో ఉన్న అత్యున్నతమైన శక్తి....
ఆ శక్తి యొక్క సృజనలే మిగతా శక్తులన్నీ కూడా....
( లలిత లోని
" కరాంగుళినఖోత్పన్న నారాయణదశాకృతిః " అనే నామం మనకు బోధించినట్టుగా, అనాదిగా ఉన్నది అభిన్నమైన శివశక్త్యాత్మకం అనే అద్వయమైన శక్తి ఒక్కటే.....
ఆ శక్తి యొక్క సృజనయే ఈ అఖిల చరాచర విశ్వంలో ఉండే అణువణువు కూడాను.... )
అట్లే మన యొక్క మనసు, బుద్ధి అనే అనాదిగా ఉండే అభిన్నమైన అద్వయమైన శక్తి యే మన జీవితంలోని ఎల్ల శక్తుల సృజనకు కారణం.....
ఎట్లనగా....
" ఎవ్వరి దెగ్గర ఏ విద్వత్తు ఉన్నాసరే అది నాయొక్క విభూతియే.... " అని గీతాచార్యుడు మనకు బోధించినట్టుగా....
ఎవ్వరి దెగ్గర ఏ శక్తి / ఎవ్విధమైన విద్వత్తు ఉన్నాసరే.....
అది కేవలం వారి యొక్క ఘనమైన
" మనో శక్తి / బుద్ధి శక్తి " అనే
శివశక్త్యాత్మక స్వరూపమైన ఆత్మశక్తి యొక్క ప్రతిరూపమే.......
ఒకరు ఎంతో ఘనమైన రీతిలో గంగోత్రి వద్ద ఉద్భవించి ప్రవహించే జలసిరుల సరిగమల లా తమ గాత్రవైభవం ప్రకటించ గలరు......
.......సదరు గాయకుల లోని ఆ గాంధర్వ శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద......
ఒకరు ఎంతో ఘనమైన రీతిలో భద్రాచలం లో అమితమైన వేగాన్ని పుంజుకొని రాజమహేంద్రవరానికి వచ్చే సరికి సంతరించుకున్న గోదారమ్మ యొక్క విశ్వరూపంలా ఎల్లలన్నవే ఎరగని రీతిలో సాగిపోయే తమ రచనా ప్రౌఢిమలో దాగిన సారస్వత సాహితీ శక్తిని ప్రకటించగలరు.......
.......సదరు రచయిత లోని ఆ గాణాపత్య శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద......
ఒకరు ఎంతో ఘనమైన రీతిలో
దేవగురు బృహస్పతి లా సమాలోచన గావించి ఆశ్రయించిన వారిని గురుస్వరూపమై అనుగ్రహించి వారికి ఎనలేని పరదేవతా అనుగ్రహాన్ని కాటాక్షిస్తుంటారు..... ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహంతో సాధించబడనిది ఏముంటుంది గనక.....
......అవ్విధంగా వారిచే ప్రకటించబడే అమేయమైన బార్హస్పత్య శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద.....
మరొకరు తమ అసాధరణ నైపుణ్యం తో ఎందరో జ్ఞ్యానులను ఏకీకృతం గావించి, వారందరి సహాయ సహకార సమ్మిళిత సంఘాతమైన వివేకం తో ఆరితేరిన రాజనీతిని ప్రదర్శించి ఎందరినుండో మన్ననలను పొంది,
" అవురా వీరు ఎంతటి తలపండిన రాజనీతిజ్ఞ్యులో కద.....ఇంతటి చతురత భరిత వ్యూహాలను రచించడం నిజంగా వీరికే చెల్లింది...! "
అనే రీతిలో తమ నాయకత్వ పటిమను ప్రదర్శిస్తారు......
......అవ్విధంగా వారిచే ప్రకటించబడిన
వారి యొక్క దేవేంద్ర సమమైన నాయకత్వ శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద.....
మరొకరు తమ సాటిలేని దయ అనే సద్గుణం తో ఎందరో జీవితాల్లో ఆకలి బాధని తీర్చి అపర అన్నపూర్ణగా వినుతికెక్కుతారు....
ప్రాణుల క్షుద్బాధకు చలించి దివి నుండి దిగి వచ్చిన శాకంబరి అమ్మవారా ఏమి......
అనే రీతిలో తమదాతృత్వాన్ని ప్రదర్శిస్తారు......
......అవ్విధంగా వారిచే ప్రకటించబడిన
వారి యొక్క పరదేవతా సమమైన సాహసోపేతమైన దయా శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద.....
( శ్రీ డొక్కా సీతమ్మ గారిలా... )
ఒకరేమో ఈ సంపదలన్నీ, శక్తియుక్తులన్నీ నాకు నేనే ఆర్జించుకున్నవి..... అని అంటారు.....
మరొకరేమో ఈ సంపదలన్నీ, శక్తియుక్తులన్నీ నాకు గురువుల అనుగ్రహంగా, ఈశ్వరప్రసాదంగా సమకూరినవి.....అని అంటారు.....
........అలా అనగలగడం కూడా సదరు వ్యక్తి యొక్క మనో శక్తి / బుద్ధి శక్తి యొక్క పరిణతను సూచించి వారి యొక్క గౌరవాన్ని మరింతగా ఇనుమడింప జేసే దైవానుగ్రహమై వర్ధిల్లుతుంది......
కాబట్టి దీనివల్ల మనకు బోధపడేది ఏమనగా,
మనసు / బుద్ధి అనే ఇరు చక్రాలను ఆధారంగా చేసుకొని నిరంతరం సాగే మన జీవితం అనే బండికి మూలాధారం ఏది....?
మన ఆహారం.....!
మన శరీరంచే స్వీకరించబడే ప్రతి వస్తువు కూడా ఆహారమే....
అనగా కేవలం మనం తినే తిండి / తాగే నీళ్ళు మాత్రమే కాదు.....
మనం పీల్చే గాలి....
మనం వినే మాటలు / పాటలు.....
మన వ్యాపకాలు / ప్రవృత్తులు....
ఆఖరికి మన ఆహార్యం కూడా మన ఆహారమే....!
కాబట్టి ఆహారం లో శుద్ధి ఉన్నప్పుడు, తన్మూలంగా
మనో శుద్ధి / బౌద్ధికశుద్ధి / వాక్శుద్ధి / కార్యశుద్ధి ఇత్యాది సకల విధ శుద్ధి ఏర్పడి.....
అవి క్రమక్రమంగా
మనోసిద్ధి గా,
బౌద్ధికసిద్ధి గా,
వాక్సిద్ధి గా,
కార్య సిద్ధి గా,
దైవానుగ్రహం తో రూపాంతరం చెంది
మనిషికి అసాధ్యం అనేది కూడా సాధ్యం గా మారి
మనిషి ని ఋషిని గా మారుస్తుంది.....
ఋషిని మహర్షి గా మారుస్తుంది.....
మహర్షిని రాజర్షిని గా మారుస్తుంది.....
రాజర్షిని బ్రహ్మర్షి గా మారుస్తుంది.....
"బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి...."
కాబట్టి బ్రహ్మర్షిని బ్రహ్మగారిలా గౌరవించబడేలా చేస్తుంది....
ఇంతటి సుదీర్ఘమైన ప్రస్థానానికి
నాంది ఎక్కడ....?
మనం స్వీకరించే ఆహారంలో.....!!
ఇది కేవలం అన్నిరకాల జీవశక్తులను పరిపుష్టం గావించే మన భారతీయ సనాతన భూజనితమైన ఆహారం ద్వారా మాత్రమే సాధ్యం సుమా...!
అది ఈ దేశంలో ప్రవహించే జీవనదుల గొప్పదనం....!!
దైవానుగ్రహం అంతగా తమ నేలలోకి సారంగా స్వీకరించలేని ఇతరదేశాల భూమికి ఇది సాధ్యం కాదు.....
ఇక్కడ మాత్రమే ఆహారానికి అమృతత్వాన్ని ఆపాదించే దేశవాళి గోఘృతం లభ్యమయ్యేది.....
ఇక్కడ మాత్రమే ఆహారంలోని విషాన్ని విరిచేసే కదళీపత్రాలు ( నాన్ హైబ్రీడ్ అరటాకులు) లభ్యమయ్యేది....
ఇక్కడ మాత్రమే ఆహారానికి సంపూర్ణమైన స్వచ్ఛతను / జీర్ణశక్తిని / రోగనాశక శక్తిని సమకూర్చే వివిధ మసాలా దినుసులు లభ్యమయ్యేది.....
అందుకే ఈ భరతభూమి ప్రపంచానికి ఎందరో మహనీయులను అందించి
వారికి అభిరుచి గల శాస్త్రాల్లో, మార్గాల్లో, వారిని అగ్రగామిగా నిలిపి యుగయుగాలకు జగజగాలకు వారి యొక్క కీర్తిపతాకములు రెపరెపలాడేలా
శాశ్వతత్వాన్ని ప్రసాదించింది....!!
అందుకే ఇది శ్రీరాముడికి భక్త శబరి రేగుపళ్ళను తినిపించిన నేల అయ్యింది.....!
అందుకే ఇది శ్రీకృష్ణుడికి గొపబాలురు వెన్నముద్దలను తినిపించిన నేల అయ్యింది.....!
అందుకే ఇది శ్రీవేంకటేశ్వరుడికి
కుమ్మరి భీముడు మట్టిపెంకలో ఆరగింపు గావించిన వృత్తాంతానికి గుర్తుగా ఇప్పటికీ ' ఓడు ' అనే కొత్త మట్టి పెంకులో శ్రీనివాసుడికి ప్రతి రోజు పెరుగన్నం తినిపించబడే నేల అయ్యింది....!!
( వికటకవి తెనాలి రామకృష్ణ గారి మాటల్లో తిరుమలేశుడు తిండిమెండయ్య అయ్యింది కూడా ఈ నెలపైనే.... 😊 )
అలాంటి బహు విశేషమైన భారతీయ సంప్రదాయపు రుచుల తయారీలో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్న కొన్నిటిని షాపుల్లో కొనడమే చూసుంటారు కాని వాటి చెట్లను / మొక్కలను చూసి ఉండరు....
ఇలైచి ( యాలకులు),
లవంగాలు ,
మిరియాలు,
దాల్చినచెక్క,
గసగసాలు,
ఇత్యాది మసాల దినుసుల చెట్లను / మొక్కలను నేనైతే ఇంతవరకు ఎక్కడా ప్రత్యక్షంగా చూడలేదు..😊
ఎప్పుడైనా ఈశ్వరానుగ్రహంతో చూడాలని అభిలషిస్తు వేచిఉండడమే కద మనం ఈ పిక్లోని చెట్లను చూసి ఆశపడేది....😊
" ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణం |
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ ‖ 25 ‖ "
అని సుప్రభాతంలో పఠించే స్వామి వారి తీర్థం లో ఉపయోగించబడే దినుసులు నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నాయో కద.....😊

No comments:

Post a Comment