Friday, May 8, 2020

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల 612 వ జయంత్యుత్సవ / శ్రీశార్వరి వైశాఖ పౌర్ణమి శుభాభినందనలు.......!!

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల 612 వ జయంత్యుత్సవ / శ్రీశార్వరి వైశాఖ పౌర్ణమి శుభాభినందనలు.......!!

శ్రీహరి నందక ఖడ్గాంశ సంభూతులుగా జన్మించి స్వామికార్యంగా 32000 వేల సంకీర్తనలను రచించి శ్రీ శ్రీనివాసుని అమేయ కటాక్షానికి మార్గమును చూపే జ్ఞ్యానదివిటీలుగా
వాటిని భక్తలోకానికి అందించి అందరిని తరింపజేసిన ఆ మహనీయుణ్ణి వారి పౌత్రులైన చినతిరుమలాచార్యులు రచించిన
" అప్పని వరప్రసాది అన్నమయ్య....." అనే
కీర్తనలో

బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||

అని మనకు తెలిపినారు కద......

ఏవిధంగా అయితే అలనాడు కలియుగారంభమున శ్రీవ్యాసమహర్షి
ఈ కలియుగవాసుల అశక్తతను దర్శించి వేదాన్ని
ఋగ్ సామ యజుర్ అథర్వణం అనబడే 4 భాగాలుగా విభాగించి తమ శిష్యులకు అందించినారో.....

అచ్చం అదే విధంగా శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు రాబోవు ఆధునిక యుగంలో లుప్తమయ్యే అధ్యాత్మ జిజ్ఞ్యాస, వివిధ శాస్త్రాలను ఆకళింపుచేసుకొని అన్వయించుకునేంతటి తీరిక ఓపిక సమర్ధత లేని జీవితాలను దర్శించి ఆ వేదసారాన్ని, మరీ ముఖ్యంగా ఎల్లరికి ఉద్ధరణహేతువైన పరమాత్మతత్వాన్ని అత్యంత సులభమైన రీతిలో ఎల్లరికి అందుబాటులో ఉండేలా పదకవితలుగా ఉండే సంకీర్తనల రూపంలో అందించడం అనే మహత్తరమైన జ్ఞ్యాన యజ్ఞ్యాన్ని జరిపి ఈ కలియుగవాసులకు ఆ శ్రీనివాస భగవంతుడి దయను
కరతలామలకం గావించి రక్షించారు.........

శ్రీచాగంటి సద్గురువులు ఇదివరకు మనకు ఈ క్రింది ఒకపోస్ట్ లో

( http://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/photos/a.256156637767075/605638599485542/?type=3&scmts=scwspsdd&extid=issc50k1fECeIS9Q )

బోధించినట్టుగా శక్తిప్రధానమైన శక్తిప్రదాయకమైన
శివశక్త్యాత్మకమైన వర్తులాకార వామవర్త లిపి కారణంగా తెలుగు భాషకే ఆ పరమాత్మతత్వన్ని ప్రతిపాదించే అదృష్టం దక్కింది......

తెలుగు భాషకు గల విశిష్టత వల్ల, మరే భాషలో లో లభ్యం కాని అక్షరబ్రహ్మ శక్తి ని తమలో నింపుకున్న అక్షరాలు గల కారణంచేత కేవలం తెలుగు భాష మాత్రమే దేవభాష సంస్కృతం తర్వాత పరిపూర్ణుడైన పరమాత్మ యొక్క పరబ్రహ్మ తత్త్వాన్ని ప్రకటించేందుకు సమర్ధమైన భాషగా అనాదిగా వినుతికెక్కింది....

శ్రీకాళిదాసు గారు తన రఘువంశంలో పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారని ఆదిదంపతులను ఈ శ్లోకంలో స్తుతించారు.

శ్లో॥ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

అవ్విధంగా అక్షరమయి, నాదమయి, శబ్దమయి, గా ఆ త్రయి యొక్క శక్తి, అనగా యావద్ విశ్వంలో నిండినిబిడీకృతమైన పరబ్రహ్మశక్తిని

నాద శక్తిగా
శబ్ద శక్తిగా
అక్షర శక్తిగా

మనుజులకు అందివ్వగలిగే ఎకైక భాష తేట తెలుగు భాష.....

అంతటి శక్తివంతంగా అజ్ఞ్యానమనబడే సహజమైన జీవజనిత అవాంఛిత జడాన్ని కోసి వెయ్యగల ఖడ్గప్రహారంలా ఉండే తెలుగు పదగుళికలనే తమ శబ్దప్రేరేపిత దివ్యాస్త్రాలుగా మలిచి తద్వారా అల్లబడిన ఆ శక్తిసంఘాతాలను సంకీర్తనా మంత్రములుగా క్రోడీకరించి శ్రీహరి నందక ఖడ్గాంశ సంభూతులైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు భక్తలోకానికి సేవించి తరించమని అందించినారు......

అందుకే ఈ కలియుగంలో కలిప్రకోప జనిత తాపములన్నిటికీ కూడా అత్యంత శక్తివంతమైన, చాలా సులభంగా లభ్యమయ్యే డోలో-650 mg లా పనిచేసే సంకీర్తనా దివ్యౌషధంగా ఆ శ్రీహరి సంకీర్తనలు ఆశ్రయించిన భక్తులెల్లరిని సమ్రక్షించి అనుగ్రహిస్తున్నాయి.......

శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా, డాక్టర్ గారు మనకు ఇచ్చిన మందుల కెమికల్ కాంపొసిషన్ వివరాల గురించి మనకు ఎటువంటి జ్ఞ్యానం లేకపోయిన,
"వైద్యో నారాయణో హరిః...." అనే విశ్వాసంతో వైద్యులు సూచించిన రీతిలో ఆ ఔషధాలను మనం సేవించి మన భౌతిక ఋగ్మతలనుండి ఉపశమనం పొందుతున్నాం కద.....

ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ శ్రమ, కృషితో వైద్య విద్యను అభ్యసించి IMC వారిచే ఆమోదించబడిన MBBS పట్టా సాధించిన తర్వాతే వైద్యులు అనబడే వ్యక్తులు అలా రోగులకు ఔషధాలు సూచించి వారికి శ్రేయస్సు కలిగిస్తున్నారు.....అవునా....???

మనకున్న కొద్దిపాటి ఇంగ్లిష్, కొద్ది పాటి బేసిక్ సైన్స్, జ్ఞ్యానంతో కాగితం మీద నాలుగు మందు బిళ్ళలు రాసివ్వడంలో వారికి గల వైద్యవిద్యా కౌశలాన్ని మీరు ఎన్నగలరా....?

అది స్వీకరించి శ్రేయస్సు పొందడంలోనే విజ్ఞ్యత ఉంటుంది....కదు......

"అలా కాకుండా 'జనవిజ్ఞ్యాన వేదిక' అని ఒక బోర్డ్ పెట్టుకొని అలా ఎలా రాసిస్తారు, వాటి వెనక ఉన్న సైన్స్ ఏంటి, మాకు డీటైల్డ్ గా వివరిస్తేనే మీరు వైద్యులు అని మేము ఒప్పుకుంటాము....."
అంటూ వితండవాదాలు చేసే వారికి వైద్యులు ఏం సమాధానాం చెప్తారు...?

" నీకు రాసిచ్చే రెండు యాంటిబయోటిక్లు, రెండు యాంటిసెప్టిక్లు, రెండు పేన్ కిల్లర్ల కోసం ఇప్పుడు నీకు మా 8 సంవత్సరాల వైద్య విద్య కోర్స్ లో ఆర్జించిన విజ్ఞ్యానం మొత్తం వివరించాలా.....?

అది వివరించిన తర్వాత నువ్వు దాన్ని ఆకళింపుజేస్కొని మాకు కొత్తగా ఇప్పుడు సెర్టిఫికెట్లు జారీ చేస్తావా......ఇట్స్ ఎ సైంటిఫిక్ వే ఫర్ ట్రీటింగ్ ఏ పేషెంట్ అని....??

వెళ్ళి బైపిసి చదివి ఎంసెట్ రాసి మెడిసిన్ జాయిన్ అయ్యి 8 సంవత్సరాల తర్వాత రా....అప్పుడు చెప్తా.....
ఇష్టముంటే / నమ్మకముంటే తీస్కొని ఉపయోగించి శ్రేయస్సు పొందు....లేదా వెళ్ళి నీ పని చూస్కొపో...."

అని చెప్తారు......అవునా.....

ఇక్కడ మీరు మెడిసిన్ అనే ఉన్ననోన్నతమైన, కొందరు భాగ్యవంతులకు భగవద్ అనుగ్రహంగా మాత్రమే లభించే విద్య పై మీ యొక్క అవగాహనా రాహిత్యాన్ని, సదరు వైద్యుడి యొక్క వైద్యవిద్యా కౌశలాన్ని ఎన్నడం అనే పేరుతో వారిని అవమానించి మీ యొక్క పొగరుబోతుతనం వెళ్ళడించడం తప్ప మరేమి లేదు.....
అవునా.......

అట్లే

మెడిసిన్ లా, ఈ లోకంలో మరెన్నో గహనమైన విద్యలు ఉంటాయి.....

వాటి గురించి అందరికీ అన్నీ తెలిసి ఉండాలని ఏం లేదు కద.....

భగవద్ అనుగ్రహం కొలది ఎవరి శ్రమకు తగ్గట్టు వారికి ఈశ్వరానుగ్రహంగా ఆయా విద్యలు అబ్బుతుంటాయి......

వాటిని గుర్తించి గౌరవించడమో, లేదా అర్ధం కానప్పుడు ఒక నమస్కారం చేసి వినమ్రంగా ఉండగలగడమో చేసినప్పుడే మీకు గౌరవం ఉంటుంది.......

అలా కాకుండా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిలోని సరస్వతీ కటాక్షాన్ని మీరు గుర్తించకున్నా పర్వలేదు కాని మీకున్న పిసరంత లౌకిక జ్ఞ్యానంతో అవమానిస్తే మాత్రం ఆ ఉగ్ర సరస్వతీ ప్రవాహంలో మీ జీవితాలు కొట్టుకొనిపోతాయి.....
లౌకికంగా కూడా సరస్వతీ నదీ ప్రవాహం గంగమ్మ ప్రవాహం కంటే కూడా చాలా వేగమైనది.....
క్షణాల్లో కొన్ని వందల మీటర్ల దూరం ఈడ్చివేసే వేగంతో ఉరుకులమీద ప్రవహిస్తూ ఉంటుంది సరస్వతీ నదీ...... అంతర్వాహిని అవ్వడంతో ఎక్కడో బహిర్గతమైన కొన్ని ప్రదేశాల్లో తప్ప సరస్వతీ నదీ విజృంభణను ఈ కాలంలో మనకు దర్శించలేము......

మెడిసిన్ ఆధునిక గహనమైన శాస్త్రం....

సంగీతం
సాహిత్యం
చిత్రలేఖనం
నృత్యం
శిల్పకళ
వాస్తు
ఆగమం

ఇత్యాది గా ఎన్నో శాస్త్రాలు ఈ ప్రపంచంలో కలవు.....

వేటి శక్తి వాటిదే, వేటి విలువ వాటిదే, వేటి గొప్పదనం వాటిదే....

మీకు తెలియనంత మాత్రన శాస్త్రం యొక్క గొప్పదనం తరిగిపోదు......

కాకపోతే....,

కొన్ని కొందరిని మాత్రమే ప్రభావితం చేసేవి......

కొన్ని అందరిని ప్రభావితం చేసేవి....

సంగీతం సాహిత్యం నృత్యం ఇత్యాది శాస్త్రాలు అవి అభ్యసించిన వారిని, వాటిపై మక్కువ గలవారిని మాత్రమే ప్రభావితం చేస్తాయి......

కాని వాస్తు, ఆలయ / ఆగమ ఇత్యాది శాస్త్రాలు అందరిని ప్రభావితం చేస్తాయి......
అన్ని కాకున్నా కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం కఛ్చితంగ ప్రభావితం చేసి తీరుతాయి....
మీరు అవునన్నా కాదన్నా ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెళ్తుంది....అది పెద్దల ద్వార, శాస్త్రాన్ని గౌరవించి అభ్యసించిన వారి ద్వారా అర్ధం చేస్కొని మసలుకోవడంలోనే విజ్ఞ్యత ఉంటుంది....

' అవి రెండు కూడా తెల్లని చిన్న గొలీ బిళ్ళలే నాయన.....
కాని దేని డోసెజ్ దానిదే.....దేని పవర్ దానిదే.....దేనికి ఏది ఉద్దేశ్యించ బడిందో అందుకు మాత్రమే అది వాడబడాలి.....అప్పుడే అవి శ్రేయోదాయకాలు ...... లేనిచో అవి అనర్ధదాయకాలు......జాగ్రత్తా
అని డాక్టర్ గారు చెప్పాక........

ఒక వ్యక్తి అవేమి పెద్దగా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఒకేలా కనిపించే గోలీలన్నీ ఒకటే అని మింగితే కిడ్నీలు ఎగిరిపోతాయి, గుండె లయ తప్పుతుంది, మనిషినేలకూలుతాడు..... ఆ హై డోసేజ్ టాబ్లెట్స్ మింగితే....
అవునా...??

ఏది ఎంత మోతాదులో వేసుకోవాలో అలా వేసుకోవడంలోనే శ్రేయస్సు ఉంటుంది.....

ఏది వేసుకోకూడదో అది వేసుకోకపోవడంలోనే శ్రేయస్సు ఉంటుంది.....

అవునా.....?

అట్లే ఒక చిన్న 100 గజాల స్థలం లో చుట్టూ ఉన్నవి 4 మూలలే....

కాని ఏ మూల ఎందుకు బలంగా దమించి బరువుతో  ఉండాలో...

ఏ మూల ఎందుకు బాగ తేలికగా భారరహితంగా ఉండాలో చెప్పేది వాస్తుశాస్త్రం.....

అది గౌరవించినవాడికి శ్రేయస్సు.....
లేనిచో అనర్ధం.....

"శాసనాత్ శంసనాత్ ఇతి శాస్త్రం...."
అని శ్రీ చాగంటి సద్గురువులు తరచుగా చెప్పడం వినే ఉంటారు....

అనగా ఇది ఇలా ఉంటే శ్రేయస్సు అని చెప్పేది శాస్త్రం.....అది పాటిస్తార లేదా అనేది సదరు వ్యక్తి యొక్క విజ్ఞ్యతకు సంబంధించిన విషయం....

ఫర్ ఎక్సాంపుల్, దక్షిణం పశ్చిమం కలిసే నైరుతి మూల రాక్షస స్థానం.....అక్కడ సిమ్హ ద్వారాలు, మేన్ గేట్లు పెట్టడం తీవ్రమైన అనర్ధదాయకం అని శాస్త్రం చెప్తుంది......

అది పట్టించుకోకుండా తెలిసో తెలియకో, నైరుతిలో ఇంటి సిమ్హద్వారం, దానికి ఎదురుగా ఇంటి మేన్ గేటు పెట్టి ఒక పెద్దమనిషి ఇల్లు కట్టుకున్నాడనుకుందాం......

అది తెలిసి చేసినా తెలియక చేసినా
శాస్త్రానికి విరుద్ధంగా ముఖ్యమైన విషయాల్లో తీవ్రమైన దోషం జరిగింది కనుక, ఆ ఇంటి యజమాని ఎంత సంపన్నుడైనా, సమాజంలో ఎంత గొప్ప పేరున్నా, క్రమక్రమంగా ఆ నైరుతి దోషం సకల రాక్షస బాధలకు కారణం అవుతుంది......

నిత్యం తాగుడు, ఇత్యాది విలాసాలకు అలవడి ఉద్యోగ వ్యాపరాలు దెబ్బతినడం, అన్ని సంపదలు హరించుకుపోవడం, తుదకు ఆ రాక్షసబాధలకు తాళలేక విషాన్ని స్వీకరించి జీవితం ముగించేయడం వంటి తీవ్రమైన బాధలతో ఆ కుటుంబం అల్లకల్లోలమైపోతుంది......

వారికి ఆ బాధలన్నీ కూడా ఆ తీవ్రమైన నైరుతి దోషం వల్లే అని తెలిసి చక్కదిద్దుకుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో........

ఆ ఇల్లు అమ్మబడి మరొకరి చేతిలోకి వెళ్ళగా, పాపం వాళ్ళకు కూడా వాస్తు శాస్త్రం పై అవగాహన లేక అట్లే నివసించడం తో ఆ ఇల్లు కొనుకున్న మరో యజమాని కూడా అట్లే మృతి చెండదం జరుగుతుంది.....

వారు కూడా ఆ ఇల్లు ఇంకొకరికి అమ్మేస్కుంటారు.....

కాని ఈసారి ఆ ఇల్లు కొనుకున్న ఆ 3వ యజమాని, పంతులు గారు చెప్పిన మాట విని ఆ తీవ్రమైన నైరుతి దోషంతో పాటుగా మిగత ఇతర దోషాలు కూడా
చక్కదిద్ది నైరుతిలో ఉన్న ఆ మేన్ గేట్, మేన్ డోర్ తీసేస్తాడు, ఉండవలసిన చోట అనగా ఆ పశ్చిమముఖ గృహానికి ఉచ్ఛమైన స్థానంలో అనగా పశ్చిమ వాయవ్యంలో ఆ మేన్ గేట్ పెట్టి, తూర్పులో తగు రీతిలో ఖాలి జాగ ఉండేలా, దక్షిణం మొత్తం మూసి దమించబడేలా కొన్న వెంటనే మార్పులు చేస్తాడు......

ఇప్పుడు ఆ ఇల్లు కొన్న వారు, అందులో కిరాయికి ఉండే వారు కూడా క్షేమంగా శ్రేయస్కరంగా ఉన్నారు....

ఇప్పుడు చెప్పండి శాస్త్రాన్ని గౌరవించి జీవితాన్ని నిలుపుకున్న ఆ 3వ వ్యక్తి సంబంధితులు ఉన్నది అదే నాలుగు మూలల ఇంట్లో,
శాస్త్రాన్ని మరచిన ఇతరులు ఇదివరకు ఉన్నది అదే నాలుగు మూలల ఇంట్లో.....

మరి ఎందుకు వారి జీవితాల్లో అంతటి భేదం....??

అది మన పూర్వ ఋషులు ఎంతగానో కష్టించి సాధించిన శాస్త్ర విజ్ఞ్యానం యొక్క వైభవం......

మరో వ్యక్తి ఇదే మాదిరిగ తెలియని అజ్ఞ్యానంతో నైరుతితో చలగాటమాడి చావు అంచులవరకు వెళ్ళొచ్చి భగవదనుగ్రహంతో, సద్గురువుల అనుగ్రహంతో బ్రతికి బయటపడ్డాడు......

నైరుతిలో ఉన్న చిన్న రెండు రేకుల రూముల ఇల్లుని అట్లే పక్కనబెట్టి  ఉత్తరంలో ఖాళిస్థలం ఉంది కదా అని 5 ఫీట్లవరకు ఎత్తుచేసి గృహం కట్టుకున్నాడు......

ఇక అంతే.... ఆ తీవ్రమైన నైరుతి దోషం తనపని తనుచేసుకుంటూ వెళ్ళింది.....దమించి ఉండవలసిన నైరుతి తేలికైనందున, తేలికగా ఉండవలసిన ఈశాన్యం దమించబడిన కారణంగా జీవితం మొత్తం అతలాకుతలమే.....

సకల రాక్షస బాధలు లైన్ కట్టి ఒకదాని వెంట ఒకటి తమ ప్రతాపం చూపి తాగుడు తిరుగుడు కుటుంబాన్ని వేధించడం ఇత్యాది గా సకల రాక్షసప్రవృత్తులు తన జీవితంలో దైనందిన భాగమై
" నైరుతి దోషం చివరకు ఇంటి యజమానిని మింగి తీరుతుంది....."
అనే శాస్త్ర వచనానుగుణంగా విషంతాగి చావుగుప్పిట్లోకి చేరి కేవల దైవానుగ్రహంగా బ్రతకడం అనేది జరగడం.....

ఆ దోషం సవరించాక ఇప్పుడు అక్కడున్న వారు క్షేమంగా ఉండడం....

మీరు ఔనన్నా కాదన్నా, మీరు బ్రతుకుతెరువుకోసం ఒక కూలి గా బ్రతికే వారైనా లేదా రాజ్యాన్ని పరిపాలించే పులి లాంటి వారైనా సరే, శాస్త్రానికి భేదం ఉండడు.......

అది చెప్పింది చెప్పినట్టే చేస్తుంది...
ఈశాన్యం ప్రాణమిస్తుంది.....
నైరుతి ప్రాణం తీస్తుంది...

మన అవగాహనలో మాత్రమే భేదం ఉండేది.....

ఎక్కడ గృహం యొక్క ప్రధాన ద్వారం ఉండాలో, ఎక్కడ గృహం యొక్క మేన్ గేట్ ఉండాలో, ఎక్కడ గృహంలో పొయ్యి ఉండాలో అవి అక్కడ ఉన్నప్పుడు శ్రేయస్సు కలిగిస్తాయి.....

ఎక్కడ గృహం యొక్క ప్రధాన ద్వారం ఉండకూడదో, ఎక్కడ గృహం యొక్క మేన్ గేట్ ఉండకూడదో, ఎక్కడ గృహంలో పొయ్యి ఉండకూడదో అవి అక్కడ ఉన్నప్పుడు అన్ని శ్రేయస్సులను మెల్లగా హరించి వేసి చివరకు బ్రతుకును శూన్యం గావిస్తాయి......

ఇది ముమ్మాటికి సత్యం సత్యం పునః సత్యం....!

ఇవాళ్టి ఆధునిక మనుష్యులకు అన్నీ కూడా సైన్స్ & టెక్నాలజి పేరుతో చెప్తేనే వినడం అనే జాఢ్యం ఒకటి తయారయ్యింది......

సద్గురువులను, శాస్త్రాన్ని, అది అభ్యసించే సాంప్రదాయికులను  భక్తభాగవతులను చిన్నచూపు చూడడం అనేది ఒక ఫ్యాషన్ గా తయారయ్యింది.......

కాబట్టి మాడర్న్ పీపుల్ కి మాడర్న్ గానే ఒక చిన్న ఎక్సాంపుల్ తో చెప్తాను శక్తి ఎంత చిన్నగా కనిపించినా దాని ప్రభావం ఎంత ఘనంగా ఉంటుందో అనే దాని గురించి .......

సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి తాము ఉపయోగించే దైనందిన కమాండ్స్ లో లినక్స్ ఆపరేటింగ్ సిస్టెంలో,

" rm -rf " అనే ఒక చిన్న కమాండ్ గురించి తెలిసే ఉంటుంది.....

" రికర్సివ్ ఫోర్స్ డిలీట్..." అనే ఈ 4 అక్షరాల కమాండ్ ఎంత పవర్ఫుల్ కమాండో వారందరికి తెలిసిందే....

టెంప్ ఫైల్స్, అన్వాంటెడ్ జంక్ ఫైల్స్, ఇత్యాది వాటిని అనగా సిస్టెం ని స్లో చేసే వాటిని ఒక్క దెబ్బలో క్లీన్ చేయడానికి ఉపయోగించే కమాండ్.....

అది ఎక్కడ ఉపయోగించాలో అక్కడకాకుండా పొరపాటున కీలకమైన OS ఫైల్స్ ఉన్న డైరెక్టరీలో ఎక్సిక్యూట్ చేసారో ఇక అంతే సంగతులు.....
మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్నే నిమిషాల్లో తుడిచిపెట్టి OS ని క్రాష్ చేసి పడేస్తుంది..... అంతే....అది సిస్టెం కి కోలుకోలేని దెబ్బ.....మళ్ళీ కొత్తగా OS  ని ఇన్స్టాల్ చేయడం తప్ప ఇక మరేమి చెయ్యలేము......

'అదేంటి ఒక చిన్న 4 అక్షరాల కమాండ్ అంత ఘొరం చేసేసిందా అయ్యొ.....' అంటూ మీరు మీ యొక్క మీనమేషాలు ప్రదర్శించే ముందు ఆ కమాండ్ యొక్క శక్తిని గ్రహించి జాగ్రత్తగా మసలుకోవడంలో మీరు విఫలం అయ్యారు.....లేదా మీ యొక్క అజ్ఞ్యానం అంత ఘోరానికి కారణమయ్యింది అనేది నిర్వివాదాంశం.... !

అట్లే ప్రతీ శాస్త్రంలోను తమదైన శైలిలో శక్తికేంద్రాలు అనేవి ఉంటాయి.....

వాటిని డీల్ చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించడం అత్యంత ఆవశ్యకం......

జాగ్రత్తగా సరైన విధంగా వాడినప్పుడు అవి ఎంతగానో పాసిటివ్ ఎఫెక్ట్స్ కలిగించి శుభాలు కిలిగిస్తాయి......

అజాగ్రత్తగా ఒక సరైన పద్ధతిలో కాకుండా తలబిరుసుతనంతో ఇష్టం వచ్చినట్టు వాటితో ఆటలాడితే అవి కలిగించే శక్తి విస్ఫోటనాలు అంతా ఇంతా కావు.....

అది
వాస్తు శాస్త్రమైనా....
ఆగమ శాస్త్రమైనా......
మెడిసిన్ శాస్త్రమైనా....
మంత్ర శాస్త్రమైన.....
సంగీత శాస్త్రమైనా.....

మరే ఇతర శాస్త్రమైనా సరే....
ప్రతి దానిలో వాటియొక్క ప్రత్యేకమైన శక్తి దృష్ట్యా కొన్ని కీలక అంశాలు ఉంటాయి......

అందరికి వాటిగురించి అవగాహన ఉండి సరైన రీతిలో వాటిని ఉపయోగించడం కుదరకపోవచ్చు.....

అందుకే మనకు గురువులు, ఆచార్యులు, సాధుసత్పురుషులు, ఇత్యాదిగా ఎందరో వివిధ శాస్త్రాల్లో మార్గదర్శకులై మనకి సహాయసహకారాలు అందించి మన ఉన్నతికి తోడ్పడుతుంటారు.......

ఇక మన అసలు టాపిక్కొస్తే,
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులు
అధ్యాత్మ తత్త్వ మహత్త్వ భరిత విశేష సంగీత సాహిత్య సమ్మిళితమైన " శ్రీహరి సంకీర్తనలు....." అనే శాస్త్రంలో ఆరితేరిన అనన్యసామాన్యమైన సంకీర్తనాచార్యులు అనేది జగద్విదితమైన విషయం.......

ఏ బీజాక్షరాలు సాహిత్యంలో ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ఎందుకు ఉపయోగించాలో......

ఏ యతి ప్రాసలు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎంతవరకు ఉపయోగించాలో......

ఏ పదాల అల్లికతో ఏ ఏ విధంగా ఆ పరమాత్మ తత్వాన్ని అత్యంత సున్నితంగా శక్తివంతంగా సమర్ధవంతంగా తిరుగులేని విధంగా రచించాలో.....

అవ్విధంగా రచించి ఈ లోకానికి శ్రీశ్రీనివాసుని అమేయ కటాక్షానికి ఎంతో ఘనమైన మార్గంగా ఎన్నటికి వాడని ఆ సంకీర్తనా తులసీదళాలను మనకు అందించి వాటితో శ్రీవేంకటపరబ్రహ్మాన్ని సేవించి తరించండని ఈ కలియుగవాసులందరిని అనుగ్రహించిన సాటిలేని అధ్యాత్మ తత్త్వశాస్త్రవేత్తలు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు.......

మరియు ఆ నిత్యనూతనమైన హరిసంకీర్తనాసరాలు పరతత్త్వమరిమళాలు గుబాళించే విధంగా వాటికి సొబగైన శాస్త్రీయ రాగాలను అలది మనకు అందించే ఈనాటి స్వరకర్తలు, గాయకులు కూడా అన్నామాచార్యుల లా మనకు ఆరాధ్యమూర్తులు....!

మరీ ముఖ్యంగా శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గురువుగారి కీర్తనలు,
( వారి చిన్న కుమారులు, శ్రీ గరిమెళ్ల అనీలకుమార్ గారు, నాకు 5 సంవత్సరాల పాటు నా ఆఫిస్లో ప్రత్యక్ష మితృలవ్వడం నా జన్మాంతర సుకృతం.....😊),

శ్రీమతి శోభారాజు మ్యాడం గారి కీర్తనలు,
( వారి అన్నమాచార్య భావనా వాహిని నా ఆఫిస్ కి అతి దెగ్గర్లోనే ఉండి వారి ఆధ్వర్యంలో జరిగే ఎన్నో ప్రొగ్రాంస్ కి సాయంత్రం చటుక్కుమని వెళ్ళగలగడం నా జన్మాంతర సుకృతం....😊)

శ్రీ ప్రియాసిస్టర్స్ మరియు శ్రీ వేదవ్యాస భట్టర్ గారి కీర్తనలు,

ఇత్యాదిగా ప్రముఖుల రెండిషన్స్, ఎందరో శ్రీనివాసుని భక్తుల జీవితాల్లో దైనందినభాగమై వారందరిని అనుగ్రహించడం జగద్విదితమే కద.....!

ఒక డాక్టర్ గారు మనకిచ్చిన టాబ్లెట్ లోని కెమికల్ కంపోసిషన్ ఏ విధంగా మన రక్తంలో చేరి రుగ్మతను మాపుతుందో,
ఒక ఇన్ హేలర్ లోని ప్రెషరైస్డ్ క్యానిస్టర్ లో ఉన్న ఔషధం ఏ విధంగా మన ఊపిరితిత్తులోకి ప్రవహించి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే మృత్యుసదృశమైన వేదననుండి ఉపశమనం కలిగించి కాపాడుతుందో.....

మనకు తెలియకున్నా సరే అందులో ఉన్న ఔషధ శక్తి మనకు శ్రేయస్సు కలిగించి కాపాడుతున్నదో.....

అచ్చం అదేవిధంగా, ఒక సంకీర్తన
లో సమ్మిళితమై అంతర్భాగంగాఉండే బీజాక్షర శబ్ద శక్తి, రాగశక్తి, సాహిత్య శక్తి, మంత్ర శక్తి, మనకి
భగవద్ అనుగ్రహం అనే శ్రేయస్సు కలిగించి కాపాడుతుంది అనడం అంతే సత్యం.....!!

ఆ ఘనమైన గహనమైన సాహిత్య శాస్త్ర, సంగీత శాస్త్ర, శబ్దశాస్త్ర, మంత్ర శాస్త్ర శక్తికేంద్రాల గురించి మనకు అవగాహన ఉన్నా లేకున్నా అవి సాధనచేయబడినంత మాత్రాన మనకు అనుగ్రహం వర్శించడం కద్దు.....!

కలియుగ ప్రత్యక్ష పరమాత్మగా శ్రీవేంకటగిరిపై కొలువైన ఆ అత్యంత కారుణ్యమూర్తిని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా చెయ్యెత్తి నమస్కరించినంత మాత్రాన షోడశ దానములు, వివిధ యాగములు, పంచ మహాయజ్ఞ్యములను ఆచరించినంత మహాపుణ్యమును మనకు స్వామి కటాక్షిస్తాడు అనే మహా గంభీరమైన అధ్యాత్మ సత్యసూక్ష్మాన్ని వివరిస్తూ అన్నమాచార్యుల వారు మనకు అనుగ్రహించిన సంకీర్తనను ఎంతో రసరమ్యంగా అమృతవర్శిని రాగంలో కూర్చి భక్తులకు అందించిన శ్రీ గరిమెళ్ళ గురువుగారి ఈ సంకీర్తన వింటే నేను అసలు ఏ లోకంలో తేలిపోతున్నానో ఏమో అనే స్పృహలేనంతగా మైమరచిపోతుంటాను........

అది షడ్చక్రభేదనంలో సహస్రారంలో కి తన కుండలినీ
శక్తిని స్థిరీకరించి ఆనందామృతాన్ని ఆస్వాదించే యోగికి......

మరియు

"సహస్రారాంభుజారూఢా సుధాసారాభివర్షిణీ...." అనే లలిత నామంపై ధ్యానంలో మునిగిన యోగికి వర్శించే ఆనందామృతంలా......

భక్తునికి ఒక అలౌకిక ఆనంద రససిద్ధిని ప్రసాదిస్తుంది అనేది నా వ్యక్తిగత భావన......😊

ఎవరి భావనకు తగ్గట్టు భగవంతుడు వారిని అనుగ్రహిస్తాడు అనేది నా అభిప్రాయం......

అలా భావనాత్మకంగా భగవంతుడిని ఉత్తర క్షణం చేరుకోగల రీతిలో మనకు ఆ శ్రీవేంకటహరిసంకీర్తనలను అందించిన అన్నమాచార్యులకు ఈ కలియుగభక్తులెల్లరు సదా ఋణగ్రస్తులే కద.....!

శ్రీతాళ్ళపాక అన్నమగురవే నమః....🙏
శ్రీశ్రీనివాసపరబ్రహ్మాణేనమః...🙏😊

*******************************************
Archive Audio link : G Balakrishnaprasad
Ragam : Chakravakam, Composer : Balakrishnaprasad

ప|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును |
వొకటి కోటిగుణితంబగుమార్గములుండగ బ్రయాసపడనేలా ||

చ|| తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి |
కనకబిందుయమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ |
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసినఫలములు |
తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగగ మరి యేలా ||

చ|| హరి యనురెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు |
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున జదివినపుణ్యములు |
పరమతపోయోగంబులు మొదలగుబహుసాధనములసారంబు |
పరిపక్వంబై ఫలియించగా బట్టబయలు వెదకనేలా |

చ|| మొదల శ్రీవేంకటపతికిని జేయెత్తి మొక్కినమాత్రములోపలనే |
పదిలపుషోడశదానయాగములుపంచమహాయజ్ఞంబులును |
వదలక సాంగంబులుగా జేసినవాడే కాడా పలుమారు |
మదిమదినుండే కాయక్లేశము మాటికి మాటికి దనకేలా ||

http://annamacharya-lyrics.blogspot.com/2007/11/336-trikaranasuddhiga-jesinapanulaku.html?m=1

No comments:

Post a Comment