శ్రీకంఠుడే శ్రీమహావిష్ణువుగా మూర్తిభవించిన ఈ అహోబల శ్రీనారసిమ్హుడి వైభవం నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమో కద....!
రుద్రావేశం సంపూర్ణంగా తనలోకి ఆవహించుకొని మూర్తిభవించిన స్థితికారక దైవస్వరూపం శ్రీలక్ష్మీనారసిమ్హుడు...
నవనారసిమ్హ క్షేత్రాలే కాక ఇతరత్రా ఎన్నో చోట్ల శ్రీలక్ష్మీనారసిమ్హుడిగా స్వయంభువై వెలసిన ఆ నృసిమ్హుడి వైభవం ప్రస్ఫుటంగా మనం ఇప్పటికీ శ్రీమంగళగిరి పానకాలస్వామి ఆలయంలో చూస్తున్నాం కద...
స్వామి స్వీకరించేది కేవలం బెల్లం
/ పటికబెల్లం పానకం కాదు.....
ఆ రూపంలో మన సంచిత ప్రారబ్ధ కర్మశేషాన్ని తను స్వీకరించి తన అంతులేని దైవిక జఠరాగ్నికి వాటిని ఆహుతి గావించి తన భక్తులకు శ్రేయస్సులను కలిగించడమే ఆ పానకలా స్వామి యొక్క గొప్పదనం....
ఈ కరోనా కారణంగా నిలిచిపోయిన
వివిధ తీర్థయాత్రలు భక్తులందరికి మళ్ళి యథావిధిగా ఎప్పుడు మొదలౌతాయో ఏమో కాని అప్పటి వరకు ఆ సకల దురితభంజక, సకల శత్రువినాశక, సకల పీడానివారక, సకల శ్రేయోదాయక శ్రీలక్ష్మీనారసిమ్హుడిని ఇంట్లోనే అర్చించికోవడం ఉత్తమం...
శ్రీ ఆదిశంకరభగవద్పాద విరచిత
శ్రీలక్ష్మీనృసిమ్హకరావలంబస్తోత్రంతో ఎల్లరు ఆ స్వామికి మరింత ప్రీతిపాత్రులౌతారు....
మన ఉన్నతిని ఓర్వలేని వారు సమాజంలో మన చుట్టూనే అగోచరంగా ఉంటారు.....
మనవారితోనే మనకు గోతులు తీసేలా ఉండే గుంటనక్కలను అన్నివేళలా మనం గుర్తించకపోవచ్చు....
కాని శ్రీలక్ష్మీనారసిమ్హుడి అనుగ్రహం సముపార్జించుకున్న వారి యోగక్షేమములు కంటికిరెప్పవలే నిత్యం కాచుకునే ఘనదైవం ఆ శ్రీనారసిమ్హం.....
అందుకే ఇప్పటికీ తిరుమల తూర్పు ఈశాన్యభాగంలో పశ్చిమాభిముఖుడై సద్యోజాత రుద్రతేజోవిరాజితుడై
( పాండవ తీర్థం దెగ్గర కొలువైన తిరుమల క్షేత్ర పాలక శ్రీరుద్రశక్తే ఈ యోగనారసిమ్హుడిలో సదా ప్రవహిస్తూ ఉండేది....)
తిరుమల కొండెక్కే ప్రతి ప్రాణిని తన తీక్షణమైన దైవిక దృక్కులతో పరికిస్తు ఏ క్షణం లోనైనా ఎక్కడికైనా ఉత్తరక్షణం దూసుకెళ్ళి తన భక్తులను, శ్రీనివాసుడి శ్రీపాదసేవకులను ఇబ్బంది పెట్టే వారిపై తన పదునైన పది గోర్లతో విరుచుకుపడేందుకు సదా సన్నద్ధంగా ఉండే ఆ శ్రీయోగనారసిమ్హుడిని ఎల్లరు దర్శించే ఉంటారు కద....
శ్రీవేంకటనారసిమ్హాన్ని నుతిస్తు అన్నమాచార్యులు ఎన్నెన్నో సంకీర్తనలు రచించడం..... వాటిలో
"ఫాలనేత్రానలప్రభలవిద్యుల్లతాకేళీవిహారా లక్ష్మీనారసిమ్హా..."
(స్వర్గీయ శ్రీ ఎస్.పి.బాలు గారు అన్నమయ్య సినిమాలో ఆలపించిన పాట..)
అనే సంకీర్తనలో ఆచార్యులు నుడివినట్టుగా
ఫాలభాగంలో ఉండే నేత్రం విరజిమ్మే విద్యుల్లతలవెలుగులు ఎవరివి....?
ముక్కంటివే కద.....
కాబట్టి శివుడే విష్ణువు...విష్ణువే శివుడు అని అన్నమాచార్యులు అలా చమత్కరించారు....😊
https://m.facebook.com/story.php?story_fbid=2765811576801556&id=176629199053153
No comments:
Post a Comment