శరన్నవరాత్రోత్సవాంతర్గత శుద్ధ తదియ నాటి చంద్రరేఖ కాబట్టి,
ఆ శ్రీశారదాచంద్రమౌళీశ్వర అభిన్నస్వరూపంగా ఈనాటి చంద్రరేఖను దర్శించి, ధ్యానించి సేవించి, అర్చించి తరించండి....😊
ఇవ్వాళ స + ఉమ = సోమవారం
( ఇందువాసరే ) మరియు విశాఖ నక్షత్రం...
( శ్రీచాగంటి సద్గురువులు బోధించినట్టుగా విశాఖుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి.... )
మొత్తం శివపరివారం మొత్తం కైలాసం నుండి కదిలి వచ్చి శుద్ధ తదియ చంద్రరేఖ లో కొలువైనవైనం కడు ఆశ్చర్యకరం కదు....😊
ఓం చంద్రవిద్యాయై నమః |
ఓం చంద్రమండలమధ్యగాయై నమః |
ఓం చారురూపాయై నమః |
ఓం చారుహాసాయై నమః |
ఓం చారుచంద్రకళాధరాయై నమః |
శ్రీ చాగంటి సద్గురువులు బోధించినట్టుగా శుద్ధ తదియనాటి చంద్రరేఖను ధరించేది కేవలం ముగ్గురు మాత్రమే....
పార్వతీపరమేశ్వరులు మరియు గణపతి పరబ్రహ్మం....
శ్రీచంద్రమౌళీశ్వరుడిగా శివుడు,
చారుచంద్రకళాధరి గా పరేశ్వరి,
మరియు ఈ అభిన్న శివశక్త్యాత్మక తత్త్వముల కలయికగా ఉండి "ఆదౌపూజ్యోగణాధిప" గా పూజలందుకొని అనుగ్రహించే ఆ గణపతి పరబ్రహ్మము...!
చంద్రరేఖను ధరించి ఉండడం ఎందుకు ప్రత్యేకం...?
అలా శుద్ధతదియనాటి చంద్రరేఖను మాత్రమే ఎందుకు ధరించడం...?
అసలు చంద్రవిద్యలో గల ప్రత్యేకత ఏమి...?
ఇత్యాది చంద్రసంబంధమైన విశేషాలను వేరే పోస్ట్లో రాస్తాను...
శ్రీ చంద్రమండలమధ్యగీం శ్రీచక్రనివాసినీం శ్రీకంఠవామభాగస్థితాం శ్రీకరీం శ్రీమాతరాం భావయేత్..🙏😊
No comments:
Post a Comment