Monday, October 19, 2020

Don't underestimate someone's silence...and mistake it for their powerlessness...Because....."Some of the most powerful times are when we are quiet....!"


అని లొల్లి చేసేముందు ఒకసారి మీకు మేరే ఆత్మవిచారణ గావించి చూడండి...మీరు ఎనెన్ని విధాలుగా ఒకరిని బాధించి వారి ఇల్లుని మొత్తం వంకరటింకరగా చేసి తద్వారా వాళ్ళ జీవితాన్ని కూడా మీకు తెలియకుండానే ఎంతో ఇబ్బందికరంగా చేసి, మీ అపరిపక్వమైన అర్ధరహితమైన అనాహ్వానిత పెద్దరికంతో ఎందరో జీవితాల్లో అశాంతి కుంపట్లు రాజేసి, ఇప్పుడు వారి దెగ్గరి నుండే బాగ మెక్కాలనుకోవడం ఎంత వరకు సమంజసం...??

ఒక రైతుకు వ్యవసాయంలో సాయం చేసాను అనే నెపంతో వచ్చిన పంటమొత్తం నేనే మేస్తాను అని ఒక 
ఎద్దు అనడం ఎంత అర్ధరహితమో మీ వాదనలు ప్రేలాపనలు కూడా అంతే అర్థరహితమైనవి....

వచ్చిన పంట యొక్క విక్రయంతో లభించిన
" నికర ఆదాయంలో " 2% మేత అడగడం సాధారణమైనది....

మాకు ఆకలి బాగా ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ కావాలి అని 4% మేత అడగడం లాభం ఆశించడం  అనబడుతుంది...

కాదు సరిపోదు ఇంకాకావాలి అని 6% మేత అడగడం అధికలాభం ఆశించడం అనబడుతుంది...

ఇంకా ఇంకా కావాలి అని 8% మేత అడగడం అత్యధికలాభం ఆశించడం అనబడుతుంది...

10% మా మేతకు కావాలసిందే అని
తెగబడడం హద్దనిపించుకుంటుంది....

13% మేత ఎట్లైనను నొక్కి తీరవలసిందే అని మీరనుకుంటే గౌరవమరియాదలు అనే హద్దులు దాటి వ్యాపారాన్ని దురాశల దరిలో నిర్వహించడం అనబడుతుంది...

15% అత్యధిక శాతం మేతకు కూడా మీ జఠరాగ్ని ఉపశమించకపోతే వ్యవహారాలు చక్కదిద్దే సంస్కారవంతమైన మధ్యవర్తులు, ఆచార్యులు/పంతులు, పెద్దమనుషులు, అందరు కలిసి చెప్పుతో కొట్టి బుద్ధిచెప్తారు....

కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి అన్నట్టుగా తలాతోక తేలని వ్యవహారంలా దోచడమే ధ్యేయంగా 
ప్రవర్తించి హద్దులు మీరి ప్రవర్తిస్తే
ఉన్న కొంచెం మర్యాద కూడా కోల్పోయి
చాలా దీనావస్థలోకి దిగజారవలసి ఉంటుంది...

శుభమా అని అప్పుచేసి కష్టపడి ఒక సొంతింటిని కడుతుంటే ఓర్వలేక ఎన్నెన్ని విధాలా ఆ ఇల్లును చెడగొట్టాలో అన్ని ప్రయత్నాలు చేసి
ఎన్ని రకాలుగా ఆ ఇంటిని, ఇంట్లోని తలుపులను, కిటికీలను, షెల్ఫులను, బీంలను, వెంటిలేటర్లను గోడలను ఇలా సర్వం సహా యావద్ గృహన్ని నూటొక్కవంకరల వక్రగృహంగా చేసి బాధించినప్పుడు సోయిలేదా ఎప్పటికైనా వారు ప్రశ్నించితీరుతారని...??

పని చేసే వారి మధ్యలో ప్రాంతీయ విభేదాల చిచ్చు పెట్టి ఇంటిపనిచెడగొట్టినప్పుడు సోయి లేదా ఎప్పటికైనా బాధించబడుతున్న ఆ గృహయజమాని ఎగిసిపడి మీ తాట ఒలిచేలా ప్రశ్నిస్తాడని...??

మీ ఇంట్లో ధగధగలాడే చక్కెర, బెల్లం వచ్చేది సామర్లకోట ఫ్యాక్టరీల్లోనుండి...

మీ ఇంట్లో నిగనిగలాడే సోనామసూరి సన్న బియ్యం వచ్చేది కర్నూల్ నుండి...

మీ ఇంట్లో మిలమిలలాడే ఆకుపచ్చని ఆక్కూరలు, కూరగాయలు వచ్చేది హైదరాబాద్ పరిసర గ్రామీణపంటచేన్లనుండి....

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తిండిని తింటూ బ్రతికే మీకు, వివిధ ప్రాంతాల నుండి బ్రతుకుతెరువుకై వచ్చి ఒక ఇల్లు కట్టేపనిలో అందరు కలిసికట్టుగా పనిచేస్తుంటే ప్రాంతీయ విభేదాల చిచ్చు పెట్టి ఒకరి ఇల్లు వెలవెలపోయేలా వంకరలు
కలగజేయమని జనాలను ఎగేసినప్పుడు సోయిలేద...? 
ఎప్పటికైనా వీటన్నికి ఓర్చుకుంటూ బ్రతికిన ఆ యజమాని ఇంట్లోకి ప్రవేశించినతర్వాత తన సమయం వచ్చినప్పుడు మీపైకి విరుచుకుపడతాడని...??

మంచి శుభముహూర్తంలో గృహప్రవేశం చేసేందుకు కాచుకొని ఉన్నవారిని మరిన్ని డబ్బులకోసం వత్తిడి చేసి వాడిని బాగ బాధించండని ఇంటిపనిని అయోమయంలో పడేసి వారిని ఇంట్లోకి ప్రవేశించకుండా మీ కౄరత్వాన్ని వెళ్ళగక్కినప్పుడు సోయి లేదా మీరు సలిపే ఇంతటి ఘొరకలికి 
ఎప్పడికైనా ఈశ్వరుడు మిమ్మల్ని అంతకంతకు శిక్షించి తీరుతాడని...?

పేట్రోల్ బంక్లో రాంగ్రూట్లో ఒక బండి దూసుకొచ్చేలా చేసి యాక్సిడెంట్ చేయించి తన బండి ఘోరంగా కరాబయ్యేలా, గాయాలయ్యేలా చేయడమే కాకుండా
పక్కనే లారి ఆపి, ఒక వ్యక్తిని అందులో కాపుగా పెట్టి, 
అసలే బైక్ విరిగి దెబ్బలు తగిలి ఉన్న వ్యక్తి పైకి ఆ లారిడ్రైవర్ గా ఉన్న ఒక అడ్డగాడిదను ఉసికొల్పి 
రాంగ్రూట్లో బండిని గుద్ది యాక్సిడెంట్ చేసి నిలువుగాడిదలా ఎదుటే నిల్చున్న వ్యక్తితో కలిసి ఎగబడి తెగబడినప్పుడు సిగ్గు, సోయి, మంచితనం, మరియాద, మానవత్వం మొదలైనవి ఏవి గుర్తురాలేదా...??

( మీ సిగ్గులేనితనానికి ఒక యెదవ కవరింగ్ అన్నట్టుగా, బైక్ ని రిపేర్ కోసం ఇచ్చి నొప్పితో ఇంటికి తిరిగి నడుచుకుంటూ వెళ్తుండగా తన ఇంటిదెగ్గరే ఉండే ఒక కుర్రాడిని దార్లో పికప్ చేస్కోడానికి పంపించడం ఎంతటి దుర్మార్గం...)

చాలా న్యారో టర్నింగ్లో కార్ ని ఆపి
డోర్ని బాగా ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేయించి బండి ఎగిరి అవతలపడేలా కొట్టించి గాయపరిచి, ఇంటిపక్కనే ఉండే సమోసాలు విక్రయించే అంకుల్ ని 
ఎదురుగా కాపుగా పెట్టి దెబ్బలు ఎంత బాగా తగిలాయో తనద్వారా తెలుసుకున్నప్పుడు సోయిలేదా ఇన్ని చేసి, ఇంతగా మీ వల్ల గాయపడిన, బాధించబడిన వ్యక్తి ఎప్పటికైనా సమాధానం లభించే వరకు మిమ్మల్ని మీ తరతరాలను శపిస్తూ కాటేస్తూనే ఉంటాడని....

ఇన్ని చేసి, ఆ వ్యక్తి కి దైవానుగ్రహంగా లభించే సొత్తును నొక్కేసి మీరు ఎలా బాగుపడతారని అనుకుంటున్నారు...???

మీరు ఎంతో అతితెలివిగా, చాకచక్యంగా ఎవ్వరికి తెలియకుండా ఎన్ని చేసినా సరే,
దైవం ఎదురుగా తప్పనిసరిగా మీరు ఒకనాడు తలదించవలసి ఉంటుంది అనే సోయి లేదా..??

హుమ్మ్.... అసలు దైవభీతి అనేదే ఉంటే ఇన్ని దుర్మార్గాలు ఎందుకు చేస్తార్లే....

అది లేని జీవితం కాబట్టే ఇలా బరితెగించి ఇతరుల బ్రతుకులను ఇన్ని ఇబ్బందులకు గురిచేసి బ్రతికే దౌర్భాగ్యులై బ్రతుకుతున్నారు.... 

మీరు బాగా ఉన్నవారో..లేనివారో...
మీరు అత్యాశాపరులో దురాశాపరులో పేరాశాపరులో....

ఇత్యాదివాటితో నిమిత్తం లేకుండా
మీరు ఇతహ్పూర్వం ఇంతగా బాధించిన వ్యక్తిని బాధించి నొక్కే ఒక్క పైసా కూడా మీకు ఎటువంటి మంచిచేయదు సరికదా అది మిమ్మల్మి, మీ తరతరాలను వెంటాడి వేటాడే కాలసర్పపుకాటుగా పరిణమించితీరడం తథ్యం..

కాబట్టి మీచే బాధింపబడిన వ్యక్తి సొమ్ముకి, అది నొక్కాలని చూసే గుంటనక్కలకి, వారికి కొమ్ముకాసే వారికి, మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది....
లేనిచో మీకు కాలమే తగు సమయంలో తగిన శాస్తిచేసితీరుతుంది....

కాడెడ్లకి కావలసింది మేత...

రైతు అది ఎక్కడినుండి తెచ్చి వేస్తాడు అనేది అనవసరమైన విషయం....

అట్లే కమీషన్ల మేత కోసం కాచుకొని ఉన్నవారికి కావలసింది రొక్కం...సదరు వ్యక్తి ఎక్కడ తన కష్టాన్ని, సొమ్ముని పణంగా పెట్టి మీకు కావలసిన మేత అందిస్తాడనేది మీకు అనవసరమైన విషయం....

 "ఫలనా చోటే నువ్వు నీ సొమ్ముని పెట్టితీరాలి..." అని మీరు రైతుని బాధిస్తే అతని హితులు, రక్షకులు, ఆచార్యులు, మరియు ఇతర పెద్దలు చెప్పందుకొని నాలుగు పీకుతరు...

మీకు ఎంత మేత కావాలో, ఎందుకు కావాలో
అది మాత్రమే మధ్యవర్తులకు / పెద్దలకు చెప్పండి...

అది ఎంత వరకు సమ్మతమైనదో, ఎంత వరకు మీకు మేత వెయ్యాలో అనేది పెద్దలు నిర్ణయించి ఆ వ్యక్తికి తమదైన జ్ఞ్యాన మార్గంలో బోధిస్తారు.....

పెద్దలు అనగా కేవలం వయసురీత్యా కాదు...
ఒకరికి ఏ ఇబ్బంది కలగని రీతిలో పనులను చక్కబెట్టగల మంచి మాట నైపుణ్యం, సద్వర్తనభరిత కార్యదక్షత, ఒకరి వల్ల పదిమందికి మంచి జరగాలి, ఒకరి జీవితం ఇంకో 100 మందికి అన్నంపెట్టగలిగేలా అభివృద్ధి చెందాలి అనే మంచి మనసు కలవారు అని అర్ధం....

అంతేకాని ఎల్లప్పుడూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జోబ్లోకి ఎంతగా లాగొచ్చు....ఇంకా ఎవరి దెగ్గరినుండి గట్టిగా మాట్లాడి ఎంతెంత నొక్కొచ్చు....
అనేలా మాత్రమే అలోచించే తలనెరిసిన వారు మాత్రం పెద్దవారు కారు... కాలేరు....

రైతుకు ఏ నేలలో సాగు అనుకూలమో అనేది ఆ రైతు నిర్ణయించుకుంటాడు... ఆ నేలలో పండించే సాగులోనుండి ఇంత మేత కావాలి అనుకోవడం సబబు అనిపించుకుంటుంది కాని...

అంతగా గిట్టుబాటుకాని, పెట్టుబడి అధికం రాబడి శూన్యం అనేలా ఉండే భూమిపై రైతును తన కష్టాన్ని పెట్టమనడం అవివేకం, అసంబద్దం,
ఆ రైతుకి అది ఆగ్రహకారకం కూడా...

కాబట్టి రైతు ఎక్కడ సాగు చేస్తే అక్కడ ధర్మబద్ధంగా కొంత మేతను అందుకోండి....అంతేకాని ఫలానా చోటే నువ్వు సాగు చెయ్యాలి అనేలా మీ అహంకారం మితిమీరితే ఆ రైతు ఆక్రోశం కూడా హద్దుమీరి తన మనోవేదన మీ పాలిటి మరణమృదంగమై మ్రోగగలదు...!
తస్మాత్త్ జాగ్రత్త...!!
అది ఎవ్వరైనా సరే...
ఎంతటి వారైనా సరే...
కాలానికి ఎల్లరు సమానులే....
అది అందర్ని ఒకేలా తనలో కలిపేసుకుంటుంది.....
కాబట్టి కాలాతీతమైన దైవానికి ఎల్లప్పుడు నమస్కరించేలా, ఆ దైవం మెచ్చేలా మాత్రమే
మీ మీ జీవితాలు ఉండేలా చూసుకొండి...
మరోలా ఉండడం ససేమిరా దైవానికి సమ్మతం కానిది....

ఓం శాంతిః...ఓం శాంతిః...ఓం శాంతిః...

Don't underestimate someone's silence...
and mistake it for their powerlessness...

Because.....

"Some of the most powerful times are when we are quiet....!"

No comments:

Post a Comment