శ్రీ శార్వరి మార్గశిర పౌర్ణమి / శ్రీదత్తజయంతి శుభాభినందనలు...😊🍕💐🍨🍟
మన సనాతన ధర్మంలో దాదాపుగా ప్రతినెల ఏదో ఒక పండుగ, ఉత్సవం వస్తూనే ఉంటాయి... ( శూన్యమాసం గా భావించబడే ఆషాఢంలో ఆదిపరాశక్తి యొక్క జాతరలు ( నైసర్గికప్రాంతీయాచారానుగుణంగా ) మరియు గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి ఉత్సవాలు గా జరుపుకోవడం వల్ల ఆ నెలలో కూడా పంచాంగ వ్యవస్థ యొక్క పారమార్ధిక స్థిరత్వం ఎట్లు మన పెద్దలు సమకూర్చినారో ఇతహ్పూర్వం ఒక పోస్ట్లో వివరించాను )
ప్రతి పండుగ వెనక ఒక ఐతిహ్యం, ఒక పౌరణికప్రాశస్త్యం, ఒక దేవుడి అవతార వైశిష్ట్యం, ఒక చారిత్రక సంఘటన యొక్క సంస్మరణ, ఇలా ఏదో ఒక నేపథ్యం తో ఆ పండుగ జరుపబడి, మనుజానీకానికి ఒక చక్కని సందేశం / తత్సంబంధ దైవానుగ్రహం అందించి మనల్ని తరించేలా మన సనాతన ధర్మావలంబిత సదాచార సంపన్నులు అనుగ్రహించారు....
అనాదిగా ఉన్న దైవిక వ్యవస్థను ఒకసారి గమనిస్తే,
"పూర్వజాత్రిపురాంబిక" గా ఎప్పటినుండో చెప్పలేన్నప్పటినుండి ఉన్న ఆదిపరాశక్తి, ఆ ఆదిపరాశక్తి యొక్క విశ్వపరిపాలనావ్యవస్థ కొరకు సృజించబడిన త్రిమూర్తులు
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
మరియు వారి వారి శక్తి ఉద్దీపక స్త్రీసామ్యములు అనగా
సరస్వతి, లక్ష్మీ, సతీదేవి / పార్వతీ
గా నిత్యం త్రిమూర్తులతో ఉండే వారి శక్తికేంద్రములు....
అనగా వారి యొక్క శక్తి నిత్యం ప్రవర్ధమానమై ఉండడానికి కారణభూతులు గా ఉండే వారి వారి అర్ధాంగులు....
లౌకికంగా అర్ధాంగి అంటే జీవితభాగస్వామి అని అర్ధం...
దేవ పరిభాషలో వారి అర్ధాంగులు అనగా వారి వారి శక్తిప్రకటనకు కారణమై ఉండే వారు....
తన చతుర్వదనములపై ఆ సరస్వతి దేవిని ఆవహించుకొనే బ్రహ్మ గారు తన సృజన శక్తిని కొనసాగించేది....
తన వక్షస్థలమున లక్ష్మీ దేవిని కొలువైఉండేలా చేసుకొనే ఆ విష్ణుదేవుడు స్థితికర్తగా తన పరిపాలనను కొనసాగించేది....
తన వామభాగంలో శక్తిని కొలువైఉండేలా చేసి అర్థనారీశ్వరుడిగా ఉండి ఆ లయకారకుడు ప్రళయ ప్రక్రియను నిర్వహించేది...
వారి శక్తి స్థిరీకరణ లేనిచో ఆ స్థిరత్వం సంభవించదు....
అందుకే వారి వారి శక్తులు వారి నుండి దూరమైన సంఘటనల్లో వారు ఆల్మోస్ట్ పిచ్చివారిలా ఉగ్రులై, దశాదిశా తెలియని ఉన్మత్తులుగ అవ్వడం
మనం గమనించవచ్చు.....
దక్షప్రజాపతి అవమానం భరించలేక తనను తాను యోగాగ్నికి ఆహుతి చేసుకున్న సతీదేవి దేహన్ని భుజాన వేసుకొని ఉగ్రుడై, ఉన్మత్తుడై ఆ మహేశ్వరుడు సంచరించడం....
మరలా మేనకాహిమవత్ పుత్రికగా హైమవతిగా ప్రభవించి పార్వతీ కళ్యాణం తో
"శివవామభాగనిలయాం శ్రీచక్రసంచారిణీం..." గా శక్తిస్థిరీకరణ జరిగిన తదుపరి
శ్రీకంఠుడు సంతసించినాడు...
భృగుమహర్షి అవమానం భరించలేక తన నివాస స్థానమైన శ్రీహరివక్షసీమను వీడి భూలోకానికి పరిమితమైనప్పుడు, ఆ హరి పిచ్చివాడిలా కొండల్లో కోనల్లో తిరుగుతూ పుట్టలో తపస్సు గావిస్తు ఒక పసులకాపరి / గొల్ల చేతికర్రతో నెత్తికి గాయమై రక్తమోడే దయనీయ స్థితికి వచ్చి ఎన్నో కష్టాలు పడి, మళ్ళీ శ్రీపద్మావతీ దేవి / అలర్మేల్మంగై గా స్వర్ణకమలం నుండి ఉద్భవించి తన వక్షసీమను చేరగా, శ్రీవేంకటేశ్వరుడిగా స్వామి రూపాంతరం చెంది భూలోక వైకుంఠమైన తిరుమలలో కొలువైతే ఆవిడ వ్యూహలక్ష్మి గా శ్రీహరివక్షసీమను
అలంకరించి శ్రీశ్రీనివాసుడిగా స్వామి వారి శక్తిప్రకటనను అనుగ్రహాన్ని భక్తులకు అందించడం మనం గమనించే సత్యం...
ఇవ్విధంగా సాధారణ లౌకిక / పారలౌకిక చట్రం, అనగా భువరాది ఊర్ధ్వ లోకాల్లో నివసించే సదరు దేవతా ఉపాధికి ఆదిపరాశక్తిచే నిర్దేశించబడిన కర్తవ్యపాలన ఆ దేవతాస్థానంలో కొలువై ఉన్న ఉత్తమోత్తమ కేవల పుణ్యసంచయ జీవుడు నిర్వహించడం....
మరియు పుణ్యపాప సమ్మిళిత సంఘాతంతో భూలోకంలో జన్మమెత్తిన జీవులు తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఆగామిని కూడబెడుతూ మరలా మరలా సంచితాన్ని సవరిస్తూ తుది లేని జీవ చట్రంలో నిరంతర ప్రయాణం గావిస్తూ ఉండడం.....
ఇది సర్వసాధారణ వైశ్విక కర్మ వ్యవస్థ....
అది ఎవ్వరైనా సరే.....
రోడ్లను శుభ్రపరుస్తు జీవితాన్ని కొనసాగించే సదరు స్వీపర్ ఉపాధికైనా....
ఆ రోడ్డుపై రోల్స్ రాయిస్ కార్లో ప్రయాణించే ఒక సంపన్న వ్యక్తికైనా సరే.....
కర్మ సిద్ధాంతం అనేది ఎల్లరికీ ఒకేవిధంగా వర్తించే ప్రక్రియ....
మరి రంగులరాట్నంలా కర్మచక్రం తన పని తాను చేస్కుంటూ పోతే,
దేవుడు / ఈశ్వరుడు / దైవ కార్యాలు /
ఆధ్యాత్మికం, ఇవన్నీ ఏంటీ, ఎందుకు, అసలు ఎవరికోసం...?
ఇక్కడే ఉంది అసలైన కర్మసిద్ధాంత మౌళిక సూత్ర లోతుపాట్ల యొక్క ఉనికి పట్టు.....
దైవం / ఈశ్వరుడు / దేవతా సంబంధిత కార్యక్రమములు / ఆధ్యాత్మికత.....
ఇవన్నీ కూడా మనుష్యుల జీవితాలను తద్వారా ఆ మనుష్యోపాధి లో కొలువైన సదరు జీవుడి ఉత్తర జన్మ ప్రయాణాలను ఘనంగా ఉద్ధరించే పాసిటివ్ కెటలైటిక్ ఎలిమెంట్స్.....
చాలా సింపుల్ గా చెప్పాలంటే హైద్రబాద్ల మంచి పెద్ద పెద్ద యాపిల్లు కొనాలంటే 100 రూపాయలకు 5 వరకు బేరమాడి కొనుక్కొని తినొచ్చు....
అదే కశ్మీర్లోని యాపిల్ తోటలో ఐతే
అవే యాప్పిల్లు 100 రూపాయలకు కి 100 పండ్లు కొనుక్కొని తినొచ్చు....కద...
అట్లే ఎండాకాలంలో ఎన్నో రకాల మామిడిపండ్లు కొనుక్కొని తినొచ్చు....
అదే చలికాలంలో అయితే ఎక్కడో తిరుమల లాంటి ప్రదేశాల్లో మాత్రమే కొన్ని రకాల మామిడి పండ్లను మాత్రమే కొనుక్కొని తినొచ్చు....కద...
మరి ఇక్కడ భేదం ఎక్కడున్నట్టు...??
దేశము మరియు కాలము....కద.....
అచ్చం అట్లే దేశకాలానుగుణంగా ఆచరింపబడిన కర్మ,
ప్రత్యేకించి ఈశ్వరప్రీత్యర్ధమై
ఆచరింపబడిన కర్మ, ఈశ్వరానుగ్రహంగా కోటి రెట్ల మేటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది....
అన్యములైనవి సాధారణ కర్మసిద్ధాంతానుగుణంగా తమ ఫలితాలను తాము ఇవ్వడం కర్తవ్యం గా సాగిపోతుంటాయి.....
ఇది తిరుగులేని ఈశ్వర శాసనం....
తన అవతారాల ద్వారా,
తన ఉపాసకుల ద్వారా,
తన భక్తుల ద్వారా,
ఈశ్వరుడు వివిధ ఆధ్యాత్మిక విధివిధానాలను ఈ లోకానికి అందించాడు.....
వేదం...
ఉపనిషత్తు...
శాస్త్రం...
ఇతిహాసం....
పురాణం...
కావ్యం....
స్తోత్రం....
పద్యం....
శ్లోకం...
నామం...
అక్షరం...
ఇవ్విధంగా ఈశ్వరానుగ్రహంగా ఈ లోకంలోకి
వివిధ దేవతా ఉపాధుల ద్వారా....
మహర్షుల ద్వారా....
యతీంద్రుల / ఆచార్యుల / పీఠాధిపతుల / జగద్గురువుల ద్వారా....
కవుల ద్వారా...
ఎంతో గొప్ప ఆధ్యాత్మిక వస్తువిషయ సామాగ్రి అనుగ్రహింపబడింది....
అందలి ప్రతిపాదిత ముఖ్యమైనవి, అన్నివిధాల హితకరమైనవి, లోకక్షేమకరమైనవి....
జీవనోద్ధారకమైనవి.....
సద్వర్తన గల పెద్దల ద్వారా,
సహృదయులైన గురువుల ద్వారా...
సదాచారసంపన్నులైన
ఆచార్యశిఖామణులద్వారా...
మరియు స్వాధ్యాయం తో తెలుసుకొని
ఆకళింపుచేస్కొని ఆచరించి తరించడంలో మానుష జన్మ యొక్క గొప్పదనం దాగున్నది.....
అవ్విధంగా
రోడ్లు శుభ్రపరిచే సదరు వ్యక్తి మరుజన్మలో ఆలయ పరిసరాలు శుభ్రపరిచే వ్యక్తిగా జన్మించినప్పుడు, దేశకాలానుగుణంగా ఆచరింపబడిన విహితకర్మమైనా సరే అది ఈశ్వర సంబంధంగా, ఈశ్వర ప్రీతికరంగా సాగింది కాబట్టి ఆ వచ్చే జన్మలో అటువంటి ఒక 100 ఆలయాలకు అన్నదాతగా తను, తన తరతరాల వారు జీవించేంతటి సౌభాగ్యహేతువుతో జన్మించి అదే రోడ్డుపై రోల్స్ రాయ్స్ కార్లో ప్రయాణిస్తూ వెళ్ళగలడు......
ఇదే కర్మ సిద్ధాంతంలో ఆధ్యాత్మికతకు గల గొప్పదనం....
మరలా అదే వ్యక్తి లేదా అతని తరంలోని వారు ఈశ్వరుడిని విస్మరించి, ఈశ్వర ప్రసాదిత భోగాసక్తులై మాత్రమే జీవిస్తే ఆ పుణ్యాలన్నీ క్షయమై మళ్ళీ రోడ్లు శుభ్రపరిచే జన్మలోకి ఆ జీవ ప్రయాణం యొక్క గతి వెళ్ళగలదు.....
అట్లు కాక, ఈశ్వర ప్రసాదిత భోగములను విహితప్రాప్తములుగా అనుభవిస్తూనే, తామరాకుమీద కొలువైన నీటిబిందువువలె వాటినుండి
ఉత్తరక్షణం నివృత్తి చెందగల సమర్ధతతో, ఈశ్వర ప్రీత్యర్ధమై, చిత్తశుద్ధి తో కర్మాచరణ గావిస్తూ ఉంటే అది క్రమక్రమంగా ఉన్నతమైన జన్మలకు జీవుడి ప్రయాణాన్ని సువ్యవస్థీకరిస్తూ ఏదో ఒక జన్మలో, ఒక మహానుభావుడి ప్రత్యక్ష సాన్నిధ్యంలో / సాన్నిధ్యంతో జీవితం తరించి అది మోక్షార్హతకు ఎంపికై ఈశ్వరుడి లీలలో ఒక భాగమైన ఉపాధిని గైకొని ఉత్తర జన్మలో ఈశ్వరుడినే చేరుతుంది....!
శ్రీ చాగంటి సద్గురువుల అత్యత్భుతమైన ఉదాహరణల్లో చెప్పాలంటే,
ఒక వేదవేదాంగ ఉపాసకులైన విద్వణ్మూర్తులకో,
ఒక పీఠాధిపతులకో, ఒక యతీంద్రులకో ఒక సిద్ధపురుషులకో, ఒక జగద్గురువులకో,
ఒక నాదోపాసకులకో,
సన్నిహితమైన జీవనం లభించి వారి
సమక్షంలో జీవనం దేశకాల ఆశ్రమధర్మానుగుణంగా పరిపూర్ణతను సంతరించుకొని ఈశ్వరుడిని చేరుతుంది....
సముద్రపు నీటి నుండి ప్రభవించి,
ఒక సముద్రం యొక్క లోతును కనిపెట్టాలని ప్రయాణం మొదలుపెట్టిన ఒక ఉప్పుబొమ్మ సముద్రంలో కరిగి సముద్రమే అయినట్టుగా...
ఈశ్వరానుగ్రహంగా జన్మించిన ఒకానొక జీవుడు, ఈశ్వర సంబంధంగా జీవిస్తూ, ఈశ్వర తత్త్వచింతనతో సాగే సుదీర్ఘజీవప్రయాణంలో ఒకానొక జన్మలో ఈశ్వరుడిలోకే లయించిపోయే అనుగ్రహం పొందడమే
ఆధ్యాత్మికత యొక్క గొప్పదనం....
ఆదిపరాశక్తి అమేయమైన సృజనలో...
నారాయణం ( శ్రీ మహావిష్ణువు )
పద్మభువం ( వారి నాభికమలజులైన బ్రహ్మగారు )
వశిష్ఠ మహర్షి
శక్తిమహర్షి
పరాశరమహర్షి
వ్యాసమహర్షి
శుకమహర్షి
గౌడపాదులు
గోవిందభగవద్పాదులు
శంకరభగవద్పాదులు మరియు వారి నలుగురి శిష్యులచే మొదలై కొనసాగే చతురామ్నాయ పీఠాధిపతుల వ్యవస్థ ద్వారా కొలువైఉండే జగద్గురువులు...
( అనగా ఇప్పటి శ్రీ దక్షిణామ్నాయ గురుపీఠాలంకృత శ్రీశృంగగిరి జగద్గురువరేణ్యులైన శ్రీ భారతీతీర్థమహాస్వామి వారు మరియు శ్రీ విదుశేఖరభారతీస్వామి వారి వరకు గల గురుపరంపర...)
మరియు
దక్షిణామూర్తి గా గురుస్వరూపమై కొలువైన సదాశివుని నలుగురు శిష్యులుగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుల వరకు గల గురుపరంపర....
మరియు
శ్రీ అత్రి అనసూయాల కుమారులై త్రిమూర్త్యాత్మకంగా శ్రీదత్తాత్రేయ స్వామిగా ప్రభవించి
వారి పరంపరగా ఇప్పటి షిరిడీ సాయిబాబా వరకు గల గురుపరంపర....
( శ్రీపాదశ్రీవల్లభ స్వామిగా ఈ కలియుగంలో జన్మించి పిఠాపుర శ్రీక్షేత్రంలో కొలువైన వారి సన్నిధిలో ఇప్పటికీ శ్రీదత్తమహిమ ఈ లోకానికి అనుగ్రహన్ని ప్రసాదిస్తూనే ఉన్నది....)
ఇవ్విధంగా ఎందరో మహానుభావుల ద్వారా అనాదిగా ఆదిమధ్యాంతరహితమైన ఆ భగవద్ తత్త్వాన్ని, సందేశాన్ని, అనుగ్రహన్ని, ఈ మర్త్యలోకానికి అందించి జీవులను అమరత్వంవైపునకు మార్గనిర్దేశనం గావిస్తు సదా ఉద్ధరించే ఆ పరతత్త్వపు ప్రాపంచిక ప్రాశస్త్యం అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ తన ప్రాభవాన్ని ప్రదర్శిస్తూ భక్తులను పరిపరివిధాల పరిరక్షిస్తూ అనుగ్రహించడమే ఆ దైవానికి గల గొప్పదనం...
అలనాటి త్రిమూర్త్యాత్మక
శ్రీదత్తాత్రేయస్వామి వారే ఈనాటి శ్రీవేంకటేశ్వరస్వామి వారు కూడా....
అంటూ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు, వారు కృతిపరిచిన ఒక చక్కని సంకీర్తనలో మనకు తెలిపి
అనుగ్రహించినారు కద.....😊
http://annamacharya-lyrics.blogspot.com/2007/09/306tane-tane-yimdari-gurudu.html?m=1
ప|| తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి|
తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి ||
ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||