Sunday, December 20, 2020

శ్రీభద్రకాళి అనుగ్రహమైన శాక్తేయ మంత్రబంధన వ్యవస్థీకృత రక్షణకవచం.....


లౌకికమైనవి మన లాకర్లు, బ్యాంకులు, ఇనప్పెట్టెలు మొదలైనవి...

అవి ఎల్లవేళలా బాగా పటిష్ఠమైనవని అని చెప్పడానికి కుదరదు....

కాని అలౌకిక దేవతా శక్తితో రక్షింపబడే ఏ వస్తువైనా, సొమ్మైనా, పదార్ధమైనా సరే, అది ఎప్పటికీ కూడా తిరుగులేని అభేద్యమైన రక్షణ వలయంలో మంత్రబంధనంతో కవచితమై ఉండే
వ్యవస్థ.....

పాస్వర్డ్లు, పిన్ కోడ్లు, తాళాలు, ఇతరులు అపహరించి లౌకిక వ్యవస్థల్లోని సొమ్మును తస్కరించి లాభించగలరేమో.....

కాని మంత్రశక్తిని, ఆ మంత్రశక్తితో 
అభిమంత్రితమైన వస్తువును, సొమ్మును, పదార్థాన్ని, ఆ మంత్రోపాసనపై ఎనలేని పట్టుగలవారు మాత్రమే హ్యాండిల్ చేయగలరు....అన్యులకు అది అసంభవం....

ఒకరి ఇంటిని మొత్తం వంకరటింకర చేసి,
ఇంటిసిమ్హద్వారాన్ని వంకరటింకర చేసి,
తద్వారా ఆ వికటద్వారవేధతో ఆ యజమాని ఆరోగ్యం కరాబయ్యేలా చేసి,
అతడి ఉన్నతిని ఓర్వలేనివారితో కలిసి అతడికి ప్రతికూలంగా ఎన్నో పన్నాగాలు పన్నిన దౌర్భాగ్యులకు, ఈశ్వరానుగ్రహంగా అతడికి లభించే  ప్రసాదం నొక్కడం ఎంతమాత్రము శ్రేయస్కరం కాదు...కాదు...కాదు...

"వారికితెలియకుండా పరోక్షంగా నొక్కేస్తున్నాం కదా..."
అని అనుకుంటారేమో....

అది

ఓం బీజావృతమై.....
ఐం బీజాలంకృతయై.....
హ్రీం బీజగర్భితమై... 
శ్రీం బీజోక్తమంత్రశక్తిపరివ్యాప్తమై....
ఉండే
ఎదురులేని శ్రీభద్రకాళి అనుగ్రహమైన 
క్షత్రియ గాయత్రి తపోశక్తి జనిత మంత్రాధిష్టాన దేవతచే నిత్యం పరివేష్టించబడి ఉండి రక్షించబడే సొమ్మైనప్పుడు...

అది ఎవరికి చెందాలో, శ్రేయోభిలాషులైన వారికి మాత్రమే చెందాలి....
ఇతరులకు అది తక్షకుడి విషంతో సమానమైన సొమ్ము....

"ఈ మంత్రశక్తి కాన్సెప్ట్ మాకు ఒక అర్ధంకాని సోదిలా ఉంటది..." అని మీరనుకుంటే, చాలా సింపుల్ గా చెప్తా.....

బాగా కాయలు కాసిన ఒక చెట్టుని చూసి ఫటాఫట్ ఆ చెట్టెక్కి అందినకాడికి ఇష్టమొచ్చినట్టు కొమ్మలపైకి ఎక్కి కాయలు కోస్కొని జోబ్లోవేస్కొని మెల్లగా తిందాంలే అనుకొని....

ఒక జాంచెట్టో, మామిడిచెట్టో ఎక్కడం
వేరు....
ఒక రేగు చెట్టెక్కడం వేరు....

రేగు చెట్టెక్కి రేక్కాయలు కోస్కోవాలంటే అందుకు తగు జాగ్రత్తలు కచ్చితంగా పాటించి తీరాలి.....ఆ చెట్టుని రక్షించే యజమాని చెప్తున్నా సరే వినకుండా ఇష్టమొచ్చినట్టు చెట్టెక్కి కాయాలు దుల్ప్కపోతాం అనే తలపొగరు తో ప్రవర్తించి చెట్టు కొమ్మలమీద చెయ్యేస్తే తర్వాత ఆ ముళ్ళ బాధ భరించలేక మీ కాయలు రాలిపోతాయ్.....
వద్దని వారిస్తున్నప్పుడు కాయలు నొక్కడమెందుకు తర్వాత లబోదిబోమని రోదించడమెందుకు...?

మంత్రపూతమై ఉండే ఏ పదార్థమైనా కూడా ఒక రేగు చెట్టుపై ఉండే రేగుపండ్లవంటిది....

అది ఎవరికి ఉద్దేశ్యించబడినదో వారు మాత్రమే అది స్వీకరించడానికి అర్హులు......
కానివారు కండకావరంతో ప్రవర్తించి మంత్రబంధనం తో రక్షింపబడే పదార్థంపై చెయ్యేస్తే,
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నా కూడా ఏమి ఒరగదు.....

కాబట్టి పరిధి తెలుసుకొని పద్ధతిగా ప్రవర్తించడంలో పరిణతి ఉంది....

ఇష్టమొచ్చినట్టు తలపొగరుతో మిడిసిపడితే ఆ తర్వాత భంగపాటు మాత్రమే మిగిలేది...

కాబట్టి తస్మాత్త్ జాగ్రత్త...

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు వారు పన్నిన పరబ్రహ్మ మంత్రమును గూర్చి వివరిస్తూ మనకు ఒక చక్కని సంకీర్తనను అందించినారు....

" ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము "

అంటూ ఎంతో అందంగా ఆ సౌమ్యలక్ష్మిని తమ నిలువెల్లా నింపుకున్న మూలవిరాట్టైన శ్రీవేంకటేశ్వర ధృవబేర సంబంధిత 
శ్రీవేంకటేశమంత్రమునుగూర్చి వివరించినారు...

అట్లే పంచబేర మూర్తుల్లో ఇతర 4 మూర్తులకు కూడా వారి వారి సంబంధిత మంత్రములు ఉన్నవి....

అందులో ఒకరైన శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి సంబంధించిన మంత్రమునకు సామ్యముగా ఉండేదే ఉగ్ర శ్రీభద్రకాళి అనుగ్రహమైన శాక్తేయ మంత్రం.... )

(
రామోలలితాంబికా...
కృష్ణశ్చశ్యామలాస్వయం....
అని కదా మన ఆర్యోక్తి....
)

http://annamacharya-lyrics.blogspot.com/2006/09/12anni-mantramulu.html?m=1

No comments:

Post a Comment