Thursday, December 24, 2020

శ్రీ పాములపర్తి వేంకట నరసిమ్హారావ్ ( భారత 9వ మాజి ప్రధానమంత్రి వర్యులు ) గారి 16వ వర్ధంతి సంస్మరణ సందర్భంగా వారి గౌరవార్ధమై పోస్టల్ స్టాంపును ఆవిష్కరించడం....

శ్రీ పాములపర్తి వేంకట నరసిమ్హారావ్ ( భారత 9వ మాజి ప్రధానమంత్రి వర్యులు ) గారి 16వ వర్ధంతి సంస్మరణ సందర్భంగా వారి గౌరవార్ధమై పోస్టల్ స్టాంపును ఆవిష్కరించడం నిజంగా దేశం మొత్తం, ప్రత్యేకించి మన రాష్ట్రం మొత్తం ఎంతో హర్శించవలసిన విషయం....!

తెలంగాణ జాతిపితగా ఇప్పుడు 
గౌ|ముఖ్యమంత్రివర్యులు, శ్రీ కే.సీ.ఆర్ గారు ఏ విధంగా అయితే నుతింపబడుతున్నారో, భారత బహుళార్ధసాధక ఆర్ధికసంస్కరణపితామహులుగా అప్పుడు మరియు ఎప్పటికీ నుతింపబడే మాన్యులు శ్రీ పీ.వీ.ఎన్.ఆర్ గారు...

ఇప్పుడు ఈ తరంవారు కాలుకిందపెట్టకుండ కావలసిన వస్తువు ఒక్క మౌస్ క్లిక్ తో వివిధ ఆన్లైన్ కామర్స్ పోర్టల్లనుండి కొనుగోలు చేయగలిగేలా జీవించినా సరే, కేంద్రప్రభుత్వ సంపూర్ణ అజమాయిషీలో ఉండే బ్యాంకుల ద్వార మాత్రమే నిర్ణయించబడే ఆర్ధికవిధివిధానాలకు అనుగుణంగా మాత్రమే సగటు సామాన్య పౌరుడు తన జీవితపు పైసా చట్రాన్ని నిర్ణయించుకోవడం కాకుండా, ఎన్నో ఇతర ప్రభుత్వేతర బ్యాంకులు మరియు వారి విదేశి అనుబంధ సంస్థాగత కార్యకలాపాలకు అనుగుణంగా వినియోగదారుడికి ఎన్నో రకాలుగా ఉపయుక్తంగా ఉండే బ్యాంకింగ్ వ్యవస్థ మరియు తత్సంబంధిత విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలమైన ఆలంబన అందించి దేశం నలుచెరగుల ప్రభుత్వసంస్థలకు ధీటుగా ప్రభుత్వేతర సంస్థలు కూడా సామాన్య జనబాహుళ్యానికి అన్నిరకాలా మెరుగైన సేవలను పోటాపోటీగా నేడు అందివ్వబడి, ప్రతి భారత పౌరుడు లాభించడం వెనక పీ.వీ గారి అపరామైన మేధో మథనాంతర్గతంగా ప్రభవించిన కీలకమైన సంస్కరణలే నాంది....

ఒక విత్తు సుక్షేత్రంలో నాటుకొని మొలకెత్తి మొక్కై పెరిగి చెట్టై నిలిచి ఎన్నెన్నో మధురఫలాలను అందించాలంటే అందుకు ఎంతో సమయం పట్టొచ్చు.....

అంత సమయంవరకు వేచి చూసేందుకు అవకాశంలేని తరుణంలో ఒకవైపు హైబ్రీడ్ వంగడాలతో సద్యోసేద్యఫలితాలను సృజించి, మరో వైపు దీర్ఘకాల పంటగా నాటు వంగడాలను కూడా పెంచి పోషించి, ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో సదరు వ్యక్తి యొక్క ముందుచూపుతో పాటుగా తన సవ్యసాచిత్వం కూడా తేటతెల్లమౌతుంది.....

అచ్చం అదే రీతిలో ...

రాబోవు సమీప భవిష్యత్తులోని తీవ్ర ఆర్ధిక క్షామాన్ని తమ అపారానుభవదృష్టితో ఆర్ధికద్రష్టలై పరికించి అందుకు తగు రీతిలో తక్షణ నివారణాచర్యలు మరియు శాశ్వత దీర్ఘకాలిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్ధిక వ్యవస్థ గాడిన పడేలా అతి తక్కువ సమయంలో అత్యున్నతమైన రీతిలో పావులు కదిపి, రాజనీతిని రాజకీయమునుండి క్షీరనీరన్యాయమున గ్రహించి రాజనీతి స్రష్టలై తమ సుదీర్ఘానుభవాన్ని దేశభక్తికై నూటికినూరుపాళ్ళు వెచ్చించి రంగరించి రచించిన ప్రణాళికలే నేటి ఆధునిక ఆర్ధిక సుసంపన్నమైన భారతావనికి కారణమై నిలిచింది అనే సత్యం ఎందరో దేశభక్తులకు, అర్ధశాస్త్ర
మేధావులకు ఎరుకలో ఉన్న విషయమే....

ఒక ఆరితేరిన బహుభాషాకోవిదుడు,
ఒక చక్కని కవి, 
ఒక గొప్ప దేశభక్తుడు,
ఒక తలపండిన రాజనీతిదురంధరుడు, 
ఒక తలనెరిసిన అనుభవజ్ఞ్యుడు,
ఒక అసామాన్య ఆర్ధికశాస్త్రతత్త్వవేత్త,
ఒక అనన్యసామాన్యమైన రాజాకీయనాయకుడు,
ఒక నిరుపామనమైన ప్రధానమంత్రి

గా ఒక వ్యక్తి తన జీవితంలో నెలకొల్పిన ఎన్నెన్నో మైలురాళ్ళను ఈ ప్రపంచం శాశ్వతంగా గుర్తించి గౌరవించబడేలా చరిత్రలో లిఖించబడిన సువర్ణాక్షరాలు కోకొల్లలు.....

అత్త తిట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు.....
అన్నట్టుగా,

దక్షిణభారతప్రాంతవాసి అయినందుకు కాదు మాతో అంతగా సఖ్యత లేనందుకు అన్నట్టుగా.... 

వారి ఖ్యాతిని ఓర్వలేక సొంతకుంపటివారే వారికి వ్యతిరేకంగా ఎన్నో గోతులు తీసినాసరే వాటన్నిటిని తమదైన సాటిలేని మేటైన ధీటైన చాణక్యంతో పూడ్చి వాటిపైనే తమ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించిన
ఒక రాటుదేలిన ఱౌతుగా ఈ దేశపగ్గాలను చేబూని ఎంతో ఘనమైన రీతిలో భారతమాతకు తమ జీవితంలో ఎనలేని సేవలందించిన మహానుభావులు శ్రీ పీ.వీ గారు.....!!

వారు సలిపిన కృషిలో వందోవంతుకు కూడా సరితూగని రీతిలో ఉన్న వారి కుంపటివారికే అత్యున్నతమైన భారతరత్న పౌరపురస్కారం లభించగా, వారికి ఇంకా లభించకపోవడం ఎంతో విచారకరం.....!!!

ఈనాటి శ్రీ చాగంటి సద్గురువుల వైభవాన్ని ఆనాడే గుర్తించిన మహానీయులకు ఏనాటికైనా భారతరత్న పురస్కారం ప్రసాదించబడుతుందని ఆశిస్తూ శ్రీ  పీ.వీ నరసిమ్హారావ్ గారి 16వ వర్ధంతి సందర్భంగా వారి శ్రీచరణాలకు ఒక దేశభక్తుడి చిరుకవనకుసుమాంజలి....🙏💐

https://www.newspointapp.com/telugu-news/publisher-tv5news-telugu/top-news/articleshow/14504820dd3a2aecaa1e59e54f4ba24d68a895c9?utm_source=vivo&utm_medium=browser&utm_campaign=np

No comments:

Post a Comment