కలియుగ వరదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి తిరుమల ఆలయంలో స్వామివారి ఆలయ ఉత్తర ఈశాన్య భాగాన దక్షిణాభిముఖంగా శ్రీభగవద్రామానుజాచార్యులవారు
శ్రీభాష్యకార్లసన్నిధిలో స్వామివారికి గురుస్థానంలో కొలువైఉండడం భక్తులకు ఎరుకలో ఉన్న విషయమే....
శ్రీఆదిశంకరాచార్యుల వారి ప్రార్ధనమేరకు స్వామివారు తిరుమలలో ఇప్పుడున్న కలియుగ ప్రత్యక్ష దైవమై కొలువైనట్టుగా
" శంకర ధ్యాత మూర్తయే....."
అని తిరుమల ఆలయ ప్రధానార్చకులు శ్రీరమణదీక్షితులు గారు మీడియాకి తెలిపిన సందర్భం చాలా మందికి గుర్తుండేఉంటుంది...
అలా కొలువైన శ్రీవేంకటాద్రి పరదైవమునకే శంఖ చక్ర ధారణ గావించి శ్రీవైఖానసాగమోక్తంగా తిరుమల ఆలయ అర్చారాధనా అచారవ్యవహారాలను సువ్యవస్థీకరించి ఒక కట్టుదిట్టమైన ఆధ్యాత్మిక వ్యవస్థను నెలకొల్పి అది ఇవ్వాళ్టికి కూడా అట్లే కొనసాగుతూ, ఈనాటి కలియుగ భక్తికోటికి దైవానుగ్రహం మెండుగా లభించే విధంగా శ్రీశ్రీనివాస పరివారాన్ని శ్రీవారి వైభవ సమ్రక్షకులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీభగవద్రామానుజాచార్యులదే....
జగద్గురువులైన శ్రీఆదిశంకరాచార్యుల వారిచే వ్యాప్తిగావించబడిన " అద్వైత " తత్త్వప్రతిపాదన ఈ కలియుగవాసులు సులువుగా అందుకొని తరించడం కష్టం అనే అధ్యాత్మ సత్యాన్ని దర్శించిన మహర్షులై,
అదే పరతత్త్వ ప్రతిపాదనను
" విశిష్టాద్వైతం " గా మెరుగుపరిచి మరింత ప్రస్ఫుటంగా భగవద్ తత్త్వం సామాన్య భక్తకోటికి అందివచ్చేలా కృషి సలిపిన సహృదయులు శ్రీభగవద్రామానుజాచార్యులు.....
నిర్గుణ నిరంజన నిరాకార పరబ్రహ్మము గాలి వలె సర్వే సర్వత్రా పరివ్యాప్తమై ఉన్నది అనే సత్యాన్ని శ్రీఆదిశంకరాచార్యులవారు
" అద్వైత " సిద్ధాంత ప్రచారకులుగా
పరతత్త్వ ప్రమాణ్యమును స్థిరీకరించగా....
సగుణ సారస సాకార స్వరూపాత్మకంగా అదే పరతత్త్వాన్ని " విశిష్టాద్వైతం " అనే సైద్ధాంతిక
విధానంలో భక్తులకు మరింత సులభగ్రాహ్యం గావించిన సాధువరేణ్యులు శ్రీభగవద్రామానుజులు......
అనగా
ఒక ఫాన్, ఒక కూలర్, ఒక ఏ.సి....ఇత్యాది మాధ్యామాల ద్వారా సర్వే సర్వత్రా పరివ్యాప్తమై ఉండే గాలి అనే అగోచర వైశ్విక శక్తిని,
ప్రస్ఫుటంగా ఇంద్రియ గ్రాహ్యంగా భక్త భోగ్యంగా అందివచ్చేలా చేసి,
ఆధ్యాత్మికత అనే తత్త్వాన్ని సార్వకాలిక సార్వజనీన శ్రేయోదాయకంగా మెరుగుపరిచి ఈ కలియుగానికి అందించిన అసామాన్య యతీశ్వరులు శ్రీభగవద్రామానుజుచార్యులు....
త్రేతా యుగంలో లక్ష్మణ స్వామిగా,
ద్వాపరంలో బలరాముడిగా,
ఈ కలియుగంలో శ్రీభగవద్రామానుజులుగా
ఆదిశేషుడి అవతార స్వీకారం గురించి శ్రీ చాగంటి సద్గురువులు శ్రీమద్భాగవత ప్రవచనాల్లో మనకు బోధించి ఉన్నారు.....
ఆచార్యుల వారు శ్రీపాంచరాత్రాగమోక్త విధానంలో
ఉండే పరంపరకి చెందినవారైనను....
విశ్వపరిరక్షణార్ధమై ఈ కలియుగంలో బహుధా వ్యాప్తిచెందిన భౌతికవాదానికి కూడా సరిపడేలా
ఉండే అర్చారాధనా వ్యవస్థైన శ్రీవైఖానసాగమోక్త అర్చారాధనను పటిష్ఠంగా నెలకొల్పిన విశాలహృదయులైన శ్రీభగవద్రామానుజులు తిరుమల కొండను సజీవ శ్రీవైష్ణవ సాలిగ్రామంగా దర్శించి పాదములతో కొండను ఎక్కడం సమ్మతించక తమ మోకాళ్ళతో ఎక్కి శ్రీనివాసుడిపై తమ భక్తిప్రపత్తులను చాటిన ఘనతకు నిదర్శనంగా మోకాళ్ళపర్వతం / మోకాలిమెట్టు అనే పేరుతో తిరుమల అలిపిరి మెట్లబాటలో వారి కీర్తి శాశ్వతత్వాన్ని సంతరించుకోవడం,
అక్కడే త్రోవభాష్యకార్ల సన్నిధి పేరుతో వారి ఆలయం నెలకొల్పబడి తిరుమలేశుడి దర్శనార్ధమై ఏతెంచే భక్తకోటికి స్వామి వారి గురువుగారిగా స్థిరీకరింపబడిన
శ్రీభగవద్రామానుజుల దర్శనం లభించడం ఇప్పటికీ భక్తులెల్లరు గమనించే సత్యాలు......
ఆచార్యులది అంత పెద్ద మనసు కాబట్టే
శ్రీవేంకటేశ్వర పరదైవమే ప్రధానంగా మరియు వివిధ ఇతర శాస్త్రోక్త దేవతాస్వారూపాల మీద మాత్రమే సంకీర్తనలను రచించిన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు, శ్రీభగవద్రామానుజాచార్యలపై
" గతులన్ని ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపె ఘన గురుదైవము....."
అనే సంకీర్తనను రచించి భక్తకోటికి అందించి తరించమని దీవించినారు....
భాగవతులది, భాగవతోత్తములది,
ఆచార్యులది, విశాలమైన మనోసంస్కారభరిత భక్తవత్సలత.....
అందుకే భాగవతుల సంతోషమే భగవద్ సంతోషం అని మన పెద్దల ఉవాచ....
ఫర్ ఎగ్సాంపుల్,
ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం భగవద్ సన్నిధిలో....
" ఏంటోయ్...జుబ్బాలు వేస్కొస్తున్నావ్....విష్ణు సహస్రం బాగా కంఠస్థమై చదువుతున్నావ్...
ఎక్కడుంటావేంటి...."
అని ఒక భక్తుడిని కొంచెం ఇబ్బందికరంగా / పెడసరిగా /ముక్తసరిగా పలకరించినందుకు ఆ భక్తుడు నొచ్చుకున్నాడో ఏమో అని ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆ భక్తుడికి ఆనాటి తమ వైఖరికి ఏమనుకోకండి అనే విధంగా ఉండేలా నేలపై ఆసీనులై మౌనంగా సమాధానపరిచేంతటి గొప్ప మనోసంస్కారం భాగవతులది / ఆచార్యులది....🙏😊
ఆచార్య దివ్య తిరువడిగళే శరణం....🙏😊🍟🍨🍕👏💐
గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి ఈతడే చూపె ఘన గురుదైవము
ఈతని కరుణనేకా ఇలవైష్ణవుల మైతి
మీతని వల్లనే కంటి మీ తిరుమణి
ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము
ఈతడే రామానుజులు ఇహపర దైవము
వెలయించె నీతడేకా వేదపు రహస్యములు
చలిమి నీతడే చూపె శరణాగతి
నిలిపినాడీతడే కా నిజముద్రా ధారణము
మలసి రామానుజులు మాటలాడే దైవము
నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు
దయతో మోక్షము చూపె తగనీతడు
నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను
దయచూచి మమ్మునిట్టే తల్లిదండ్రి దైవము
gatulanni khilamaina kaliyugamaMdunu
kati iitaDE chuupe ghana gurudaivamu
iitani karuNanEkaa ilavaishNavula maiti
miitani vallanE kaMTi mii tirumaNi
iitaDE upadESamichchenu ashTAkshari maMtramu
iitaDE raamaanujulu ihapara daivamu
velayiMche niitaDEkaa vEdapu rahasyamulu
chalimi niitadE chuupe Saranaagati
nilipinaaDiitaDE kaa nijamudraa dhaaraNamu
malasi raamaanujulu maaTalADE daivamu
niyamamulu iitaDEkaa nilipe prapannulaku
dayatO mOkShamu chUpe taganiitaDu
nayamai SriiVEMkaTESu nagamekke vaakiTanu
dayachuuchi mammuniTTE tallidaMDri daivamu
http://annamacharya-lyrics.blogspot.com/2006/12/in-english-gatulanni-khilamaina.html?m=1
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhCkyU8f9Sq4Zr0OKk3FkakR_O0YRbtK-PSFifXQx4gItySky8mRuY0wwAxKqAKS2HO-YDYY-KJ244lfO-2vZ0omPVyLua0wobB2JjtB4K4oc46q9b4jzStDE_4HQgSguq4e_CHv_ZenInK/s1600/1618749945886545-0.png)
No comments:
Post a Comment