Wednesday, April 7, 2021

"తా నొవ్వక ఇతరుల నొప్పింపక..."అనే రీతిలో మనగలిగిననాడే జీవితానికి సార్ధకత, పరిపూర్ణత...."


"ఇంకొద్ది సేపట్లో వస్తది....నాకు అందులో అల్రడి సీట్ కనుఫర్ముడ్....ట్రైన్ రాగానే ఎక్కి నాకు అనుగ్రహించబడే సీట్లో కూర్చొని ప్రయాణం సాగించడం తథ్యం..."అని ఎప్పటినుండో కరాఖండీగా ఎంతగా చెప్తున్నాసరే .....

ఒకవైపు ఆకలితో కడుపు రగిలి పోతున్నాసరే ఒపిక పట్టి ట్రైనెక్కినంక ఏదో ఒకటి కొనుక్కొని తినొచ్చుచని అనుకుంటూ, ట్రైన్ ఎందుకు లేట్ అవుతొందో ఏమో అని వాడి బాధలో వాడుంటే.....

ఒకడేమో...
"ఆ ట్రైన్ అసల్ లేనేలేదు ...ఎందుకట్ల వేటింగ్ చేయడం...మూస్కొని వేరే ఏదో ఒక  ట్రైన్ చూస్కొని పోరాదు.." అని పీక్కతింటడు....

ఒకడేమో...
"ఏ ట్రైన్ ఐతే ఏముంది..ఏదో ఒక ట్రైన్ చూస్కొని పోరాదు.." అని పీక్కతింటడు....

ఒకడేమో...
"ఆ ట్రైన్ ఎప్పుడొస్తదో తెల్వదు... వచ్చినంక అన్ని సీట్లు మేమే గుంజుకుంటం.... మా లాంటి వారి మధ్యలో నలిగిపోతు నువ్వు ఏం ప్రయాణం చేస్తవ్లే....మూస్కొని వేరే ట్రైన్ చూస్కొపొ" అని పీక్కతింటడు....

ఓర్వలేని బయటి బద్మాష్ బాడ్కావ్లు
అట్లా పీక్కతినడం ఒకెత్తైతే...వారికి వత్తాసు పలుకుతూ సొంతవారినే పీక్కతినే బుద్ధిలేని బద్మాష్లు ఒకెత్తు......

అదే రైల్వే స్టేషన్లో ఏళ్ళతరబడి పనిచేస్తూ గవర్నమెంట్ లాంటి సంస్థ యొక్క సొమ్మును పందికొక్కుల్లా మెక్కుతూ బ్రతికే బాడ్కావ్లు.....మరొకరికి కూడా ఎదిగే అవకాశం ఇవ్వడానికి ఎందుకంత ఒళ్ళు బలుపో ఏమో....
మీ జోబ్లో ఉన్న సొమ్మును, మీ ఇంట్ల కూడేసుకున్న సొమ్మును, మీకొచ్చే సొమ్మును మీరేమి పంచిపెట్టట్లేదు కద....

మీ సంస్థలోని కొందరు మంచి పై అధికారుల కృషి వల్ల ఇంకొకడు కూడా బాగుపడితే మీకెందుకు అంత అసూయ....అక్కసు...

తా చెడ్డకోతి వనమెల్ల చెరిచెన్...
అన్న చందంగా.....ప్రవర్తించిన వారందరికి, మీరు ఉసిగొల్పగా వాడిపైకి నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్టు అరిచి మర్యాదను కోల్పోయిన సొ కాల్డ్ సొంతవారికి రాబోయే రోజుల్లో వాడి సమాధానాలు మొహం పగలగొట్టినట్టుగా ఎట్లుండనున్నాయో చూద్దురుకాని..,

అతి తొందర్లో ఆ ట్రైన్ ప్లాట్ఫాం పైకి రావడం తథ్యం....
వాడు ఎక్కడం తథ్యం....
తన గమ్యాలను మొక్కవోని పట్టుదలతో సాధించి తీరడం తథ్యం....

ఇవన్నీ తెలిసి కూడా మీకు ఏ సంబంధం లేనటువంటి 
వాడి ప్రయాణానికి ఎన్నో రకాలుగా అడ్డుపడి వేధించారే.....
ఆ ట్రైన్ వచ్చి అది ఎక్కి ప్రయాణం రీస్టార్ట్ ఐనంక ఇన్నాళ్ళు మీరు పెట్టిన మానసిక వేదనకు.....
మీ అందరిని బజార్లకీడ్చి చెప్పందుకొని నాలుగు పీకి కేసులు పెట్టించి బొక్కలోతోస్తె అప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు ...?

వాడు ఏనాడో వార్నింగ్ ఇచ్చాడు..
మీకు బాగా ** బలుపుఎక్కువైతే ఇంకెక్కడికైనా వెళ్ళి
ఎగరండి కాని తన జోలికి మాత్రం
రావద్దు రావద్దు రావద్దు....అని....

ఆవలిస్తే పేగులు లెక్కించడమే కాదు....
అవసరమైతే పంచప్రాణాలను సైతం ఉగ్గడించివేయగల ఆరితేరిన ఉద్దండుడు అని తెలిసి కూడా వాడితో పెట్టుకోవడం మీ మూర్ఖత్వం....

ఇప్పటికైనా ఒళ్ళు దెగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మసులుకోండి....
వయసులో పెద్దైనంత మాత్రాన....
వ్యక్తిత్వంలో ఉన్నతమైనట్టు కాదుకద...
మర్యాద ఇవ్వడం అంటే ఏంటో తెలియకుండా ఊరిమీద పడితిరిగే దున్నపోతులకు కూడా వయసు ఉంటది....అట్లాగని వాటికి పెద్దరికాన్ని ఆపాదించలేము కద....

అట్లే...ఇవ్వాళ ఏం కూర...ఏం పచ్చడి...ఏం చేస్తున్నారు..
అనే దైనందిన ముచ్చట్లు కాకుండా...
ఇతరమైన ముఖ్య వ్యవహారాల్లో సందర్భోచితంగా ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎందుకు ఎట్ల వ్యవహరించాలి...

తూటాల వంటి మాటలను జాగ్రత్తగా ఎవరిపైకి ఎప్పుడు ఎక్కడ ఎంత స్వరంతో ఉపయోగించాలి అనే లౌక్యం / ఇంగితం లేనివారికి ఎవ్వరైనా గౌరవం ఇవ్వడం సత్యదూరమే కద...

కేవలం తలనెరిసిన వయసుతోనే కాక....
తలపండిన చాణక్యంతో జీవితాన్ని 360 డిగ్రీల కోణంలో విహంగ వీక్షణం గావిస్తూ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ పావు ఎందుకు కదుపుతున్నారో ఆంతర చక్షువులతో పరికిస్తూ అందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతూ, 
"తా నొవ్వక ఇతరుల నొప్పింపక..."
అనే రీతిలో మనగలిగిననాడే
ఆ జీవితానికి సార్ధకత, పరిపూర్ణత....
"

అని...
ఒక సినిమా కథలోని హీరో తన రోల్ కి తానే వ్యాఖ్యానం చెప్పుకునే సందర్భంలో ప్రత్ర్యర్ధులపైకి విరుచుకుపడదామని అనుకుంటుండగా...

" శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామి
ఆలయంలో గావించే వృషభ పూజకు తరలివచ్చి మనోహరగుండం దెగ్గర ఎంతో గంభీరంగా సర్వాలంకారశోభితమై ఉట్టిపడే దైవత్వంతో అలరారే శ్వేతవృషభం లా ఉండరా అంటే.....

జల్లికట్టులో ఎవరో ఎర్రజెండా ఊపగా రంకెలేస్తూ దుమ్ము రేపుతూ అందరిపైకి దూకే ఉగ్రవృషభంలా ఉంటావేరా...."

అంటూ ఔదల దాల్చిన గురువాక్యం సుతిమెత్తని అంకుశమై శాంతి శాంతి అంటూ మనసును సముదాయించగా ఇక ఆ కథానాయకుడు 

తన కథలన్నీ కంచికి...
తను యథావిధిగ తన పాత ట్రైన్ లో ఒక కొత్త జర్నీలోకి....

అన్నట్టుగా శాంతపడి యథావిధిగా తన ప్రయాణానికి సంసిద్ధమై ఉండగా ఆ భావవీచిక అక్కడితో పరిపూర్ణమైయ్యింది...

No comments:

Post a Comment