శ్రీ ప్లవ నామ తెలుగు నూతన సంవత్సరాది చైత్ర శుద్ధ పాడ్యమి / యుగాది పర్వదిన శుభాభినందనలు....😊💐🍕
ఒక్కొక్క సంప్రదాయానికి చెందిన వారు వారి వారి నూతన సంవత్సరాదిని ఒక్కో పేరుతో ఒక్కోలా
జరుపుకోవడం ఎల్లరికి విదితమే....
యుగాది/ఉగాది, విషు, ఓణం, ఇలా ఒక్కో సంప్రదాయంలో ఒక్కోవిధంగా.....
మన తెలుగు నేలపై యుగాది / ఉగాది
గా తెలుగు నూతన సంవత్సరాది సంప్రదాయాన్ని ఎల్లరు అనాదిగా జరుపుకోవడంలో ఎన్నెన్నో అర్థపరమార్థాలు దాగుండడం గురించి ఎందరో ఆధ్యాత్మికవేత్తలు / సనాతన సంప్రదాయ వైభవాన్ని ఆకళింపుజేసుకున్న పెద్దలు మనకు టీవీల్లో / ప్రవచనాల్లో బోధించడం ఎల్లరికీ తెలిసిందే...
అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువులచే అందివ్వబడిన యుగాది పర్వదిన ప్రాభవాన్ని కొంతపరికిద్దాం...
సాక్షాత్ బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించుటకు ఎన్నుకున్న ముహూర్తం చైత్ర శుద్ధ పాడ్యమి....
కాలమే భగవద్ స్వరూపమని మన పెద్దలు మనకు నుడువినారు....
లిప్త కాలం మొదలుకొని...
క్షణాలు నిమిషాలు గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు/మాసాలు ఋతువులు అయనాలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు, ( కృత, త్రేత, ద్వాపర, కలి, అనబడే చతుర్ యుగాలు.... ) మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు..
ఇప్పుడు మనమున్నది
శ్రీ శ్వేతవరాహకల్పంలోని వైవస్వతమన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగ ప్రథమపాదంలో...
ప్రతీకల్పానికి ఒక బ్రహ్మ సృష్టికర్తగా ఉండడం అటువంటి ఎన్నో కల్పాలకు చెందిన ఎందరో బ్రహ్మలు, తమ యొక్క "బ్రహ్మ కల్పం" అనగా ఆ బ్రహ్మ యొక్క నూరుసంవత్సరాల ఆయుహ్ప్రమాణమైన కాలప్రమాణం పూర్తవ్వగానే గతించగా వారి పుర్రెలను కపాలమాలగా ధరించిన పరమేశ్వరుని గురించి శ్రీచాగంటి సద్గురువులు వివరించడం చాలామందికి తెలిసే ఉంటుంది....
శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం తదుపరి జలప్రళయంలో సముద్రం ద్వారకను తనలోకి లయించివేయడంతో ముగిసిన ద్వాపర యుగం తదుపరి మొదలైన కలియుగ ఆయుహ్ప్రమాణం 432000 సంవత్సరాలు... అందులో ఇప్పుడు మనమున్నది రమారమి 5000 సంవత్సరాల దెగ్గర అని పెద్దల ఉవాచ..
[
పాండుమహారాజు x కుంతీదేవి --> అర్జునుడు
( కుంతీదేవి తను దూర్వాస మహర్షికి చేసిన సపర్యలకు సంతసించిన మహర్షి అనుగ్రహించిన వరంతో
యమధర్మరాజు గారిని ప్రార్ధించి వారి అంశలో ధర్మరాజుని,
ఇంద్రణ్ణి ప్రార్ధించి వారి అంశలో అర్జునుడిని,
వాయుదేవుడిని ప్రార్ధించి వారి అంశలో భీముణ్ణి
పుత్రులుగా పొందడం...
( పాండురాజు యొక్క పట్టమహిషి కాకముందు కన్యగా ఉన్నప్పుడే, మంత్రాన్ని ఒకసారి టెస్ట్ చేద్దామని సూర్యదేవుడిని ప్రార్ధించగా లభించిన కర్ణుడు పంచపాండవులలోకి రాడు...)
అదే మంత్రం మాద్రికి కూడా ఉపదేశించడంతో,
మాద్రీదేవి అశ్వినీదేవతలను ప్రార్ధించి వారి అంశగా నకుల సహదేవులను పుత్రులుగా పొందడం...
(ఆ మాద్రి యొక్క పుట్టిల్లైన మద్రదేశమే ఇప్పటి స్పేయిన్ కాపిటల్ సిటి అయిన మ్యాడ్రిడ్....)
అర్జునుడు x సుభద్ర --> అభిమన్యుడు
అభిమన్యుడు x ఉత్తర --> పరీక్షిత్
పరీక్షిత్ మహరాజు అసల్ పేరు విష్ణురాతుడు.....
ఉత్తరాగర్భస్థమై ఉన్నప్పుడు కౌరవపక్షం సంధించిన బ్రహ్మాస్త్రం సూక్ష్మరూపంలో తనపైకి విరుచుకుపడుతున్నప్పుడు
" నీ చెల్లెలి కోడలా..." అని ఉత్తర ప్రార్ధించగ ఆ పరమాత్మ కూడా అంతే సూక్ష్మరూపాన్ని దాల్చి ఆ బ్రహ్మాస్త్రశక్తిని తనలోకి లయించివేసి సమ్రక్షించగా జన్మించిన తదుపరి తనను రక్షించిన వారెవరు అని అందరిని పరీక్షించినట్టుగా పరికించడంతో
అతనికి పరీక్షిత్ అనే పేరు రావడం గురించి శ్రీచాగంటి సద్గురువుల వివరణ చాలా మందికి తెలిసినదే...]
ఇవ్విధంగా కాలాన్ని మన సనాతనద్రష్టలు విభాగించి
వివిధ పేర్లతో వాటిని సంబోధించి మనకు అందించి తరించమని దీవించినారు....
మరింత లోతైన అధ్యయనంతో కాలం యొక్క వివిధ విశేషాలు, విచిత్రాలు, మహత్తులు, మార్మికాలు, ఇత్యాదిగా ఉండే సప్రామాణిక కాలగణన శాస్త్రాన్ని
" పంచాంగ వ్యవస్థ " అనే ఒక దైవిక శాస్త్రంగా మన ప్రాచ్య ఋషులు మనకు అందించి దాని ఆధారంగా కాలానుగుణంగా ఎప్పుడు ఎక్కడ ఏది ఎందుకు ఎలా చేస్తే ఉత్తమ, మధ్యమ, అధమ ఫలితాలు ప్రాపిస్తాయి అనేది సామాన్యజనబాహుళ్యానికి సరళంగా విశదీకరించి అనుగ్రహించినారు...
ఆ వైదిక కాలగణన విజ్ఞ్యానాన్ని గౌరవమరియాదలతో, వినయవిధేయలతో, విశ్వాసంతో స్వీకరించిన వారికి అది ఎన్నో విధాలా మేలు చేసి జీవితాన్ని సఫలీకృతం గావించి తరింపజేస్తుంది.....
"ఇదంతా ఏదో సోదిలే.....సనాతన మహర్షులకు టైంపాస్ కాక ఏదో అలా ఆకాశంలోకి చూస్తు ఏవేవో రాసేస్తే దాన్ని విజ్ఞ్యానం అంటూ పాటించడం ఒక చాదస్తం....""
అనుకొని బ్రతికే మూర్ఖులకు పెద్దగా ఏ భేదం కనిపించకపోవచ్చు..."
గుంటనక్కకు ఏం తెలుసు గున్నమామిడి రుచి అన్నట్టుగా....ఎవరికి ఒకానొక శాస్త్రంపై అవగాహన గౌరవం విశ్వాసం ఉంటాయో వాళ్ళ దెగ్గర తద్ శాస్త్రం గురించిన విశేషాల గురించి చర్చించడం సబబుగ ఉంటుంది.......
ఎందుకంటే కాశినుండి తెచ్చిన గంగాజలాన్ని మరియు ఇంట్లో బోరింగ్లో వచ్చే నీటిని చూడ్డానికి ఒకేలా ఉన్నయని రెండూ ఒకటే అనుకునే వారికి అవి కేవలం నీళ్ళ బాటిల్లే అవుతాయ్....
అది కాశిలో ఉత్తరవాహినిగా మారి శ్రీఅన్నపూర్ణావిశాలాక్షిసమేత విశ్వనాథుడిని సేవించేందుకు తన అప్రతిహత వేగాన్ని తగ్గించుకొని భక్తుల కోసం అస్సి (80) కాశి ఘాట్ల ప్రాంతపర్యంతం చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ, కాశికి దూరం అవ్వగానే మళ్ళీ ఎవ్వరు ఎదురునిలిచినా క్షాణాల్లో ఈడ్చి పడేసేంతటి వేగంతో దూసుకెళ్ళే సురగంగా ప్రవాహశక్తిని ఒడిసిపట్టిన కాశిగంగా జలం అనే గౌరవంతో ఆ తీర్థాన్ని సేవించినవారికి గంగాతీర్థ ఫలితం లభించినట్టుగా...
12 నెలలకుండే రోజులను సూచించే 12 పేజీల రెగ్యులర్ క్యాలెండర్ మరియు 12 మాసాల్లోని ప్రతి నెల ప్రతి పక్షం ప్రతి వారం ప్రతి రోజు యొక్క విశేషాన్ని
తిథి వార నక్షత్ర యోగ కరణ మనబడే 5 ముఖ్య విభాగాల్లోకి క్రోడీకరించి వాటి సమ్మిళిత సమాహారంగా ఆ రోజు ఆకశాంలో దేదీప్యమానంగా వెలుగుతూ భూమికి దెగ్గరగా భాసించే నక్షత్రమండలం
మరియు అటువంటి అశ్విని భరణి కృత్తికాది 27 నక్షత్రమండలాల్లోని 4 పాదాల్లోకి సమన్వయపరచబడిన కాలంలో జన్మించిన యావద్ ప్రాణికోటిపై ఆనాటి కాలం యొక్క ప్రభావం ఎట్లుండునో వివరించే పంచాంగ వ్యవస్థ కూడా ఒకటే అనుకొనే వారికి ఆ దైవిక పంచాంగం పెద్దగా ఏ అనుగ్రహం ప్రసాదించదేమో కాని ఆ దైవిక పంచాంగ వ్యవస్థపై చక్కని అవగాహన గౌరవమరియాదలు విశ్వాసం గలవారికి లభించే దేవతానుగ్రహం
బహు మహిమాన్వితం....
ఫర్ ఎగ్సాంపుల్
"శ్రీ శార్వరి నామ సంవత్సర ఫాల్గుణ పౌర్ణమి రోజున తుంబురుతీర్థ ముక్కోటి..కాబట్టి ఆనాడు గావించే తీర్థస్నాన మహిమ అత్యంత విశేషమైనది..."
అని సంవత్సరంలోని ఏ పౌర్ణమికి ఎక్కడ ఎందుకు తీర్థస్నానం ఆచరిస్తే ఈశ్వరానుగ్రహం మెండుగా లభించి జీవితాలు తరిస్తాయో పంచాంగ వ్యవస్థ బోధించినప్పుడు...
" ఏదో ఒక రోజు ఏదో ఒక జలపాతంలో స్నానం చేసి ఒక టూరిస్ట్ లోకేషన్ లో పిక్స్ దిగడం..."
కోసం క్యాలెండర్లో ఏదో ఒక వీకెండ్ చూస్కొని టూర్ వెళ్ళడానికి పంచాంగం చూస్కొని మరీ వెళ్ళాలా అని మూతి తిప్పే మూర్ఖులకు ఆ పంచాంగ విజ్ఞ్యానం పెద్దగా ఏ ఫలితము ఇవ్వదు...
ఆ పంచాంగ వ్యవస్థపై గౌరవంతో అది తెలుసుకొని పాటించినవారికి ఆ పంచాంగానుగ్రహం లభించి వారి జీవితాలు తరించడం అనేది ఇందలి విశేషం....
అలా అని అడుగు తీసి అడుగు వేయడానికి
కూడా పంచాంగం పాటిస్తూ బ్రతకాలి అనడం ఇక్కడి ఉద్దేశ్యం కాదు...
ఎంత ఆధునిక యుగంలో మన జీవితాలు దూసుకుపోతున్నా,
మన తాత ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు తిని బ్రతికింది అన్నం పప్పు చారు స్వీట్లు చపాతీలు ఒడియాలే....
మరియు ఇప్పుడు మనము తింటూ బ్రతికేవి
కూడా అవే...
రేపు మన పిల్లలు తిని బ్రతికేవి కూడా అవే...
కొంచెం ఆధునికంగా కట్టెల పొయ్యికి బదులు గ్యాస్టవ్ ఇండక్షన్ స్టవ్,
రాగి ఇత్తడి ఇనుము స్టీల్ పాత్రలకు బదులు పింగాణి గాజు నాన్స్టిక్ పాత్రలు వచ్చయేమో కాని బ్రతుకు నిచ్చే తిండి మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ ఒక్కటే....
( బ్రతుకును హరించే విషపదార్థలతో ఉండే థంసప్లు కోలాలు, ఒళ్ళును గుల్ల చేసే కొవ్వుతో దట్టించిన పిజ్జాబర్గర్లు ఇత్యాది ఆధునిక తిండి గురించి పెద్దగా ఏ చర్చా అక్కర్లేదు...)
అదే విధంగా మన పెద్దల జీవితాలను పరిపూర్ణం గావించిన ఆనాటి సనాతన సంప్రదాయాలు / పండగలు / విజ్ఞ్యాన విశేషాలు అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో అంతర్భగామై ఉండే ఆర్ష జీవన ఆనందదాయక విశేషాలు....
అవి అందివ్వబడుతున్న మాధ్యమాలు మారినవేమోకాని అవి మాత్రం ఎప్పటికీ మారని శాశ్వత విజ్ఞ్యాన విశేషాలు....
శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా కొంతమంది డాక్టర్ల వైద్యం సరైనది కానంతమాత్రాన మొత్తం వైద్యశాస్త్రమే సరైనది కాదు అనడం ఎంత మూర్ఖత్వమో...
అట్లే కేవలం కొందరు వ్యాపార ధోరణిలో అందించే శాస్త్ర విజ్ఞ్యానం సరైనది కానంతమాత్రాన మొత్తం శాస్త్రమే సరైనది కాదు అనడం కూడా అంతే మూర్ఖత్వం....
అటువంటి శక్తివంతమైన కాలగణన విజ్ఞ్యానాన్ని తనలో నిక్షిప్తం గావించుకున్న పంచాంగ వ్యవస్థ యొక్క అత్యున్నతమైన కాల ప్రమాణాల్లో ఒకటైన యుగాన్ని ఆ యుగారంభానికి ఆలంబనగా గావించి యుగాది / ఉగాది గా కొత్త సంవత్సరాది పర్వదినాన్ని ఉత్సవం గా జరుపుకునే ఉగాదిరోజున పంచాంగ శ్రవణ పఠనం ఎంతో పుణ్యదాయకంగా మన పెద్దలు స్థిరీకరించి మనకు అందించినారు....
అసలు ఉగాది అంటే షడృచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ( కొత్త వేప పువ్వు, కొత్త చింతపండు పులుసు, కొత్త మామిడి ముక్కలు, బెల్లం, ఓమ/వామ,మిరియాలు ) మరియు ఆవు నెయ్యితో భక్షాలు తినడము అనేది సామాన్యము...
నిరంతర ప్రవాహమైన కాల చక్రం,
ప్రభవాది 60 తెలుగు సంవతారాల్లో
కొత్త పేరుతో వ్యవహరించబడే ఇంకో సంవత్సర కాలానికి ( ఫర్ ఎగ్సాంపుల్ శ్రీ ప్లవనామ సంవత్సరం ఫ్రం ఎప్రిల్-13-2021 ) ప్రపంచం స్వాగతం పలికే రోజున పంచాంగ శాస్త్ర విజ్ఞ్యానాన్ని విశేషంగా ఆకర్ణించి / ఆకళింపు చేసుకొని / చదివి / గౌరవించడమే ఉగాది పండగ ప్రత్యేకం....
మనం గుర్తించినా గుర్తించకున్నా
ఎవరో అడిగినట్టే వసంత ఋతువుకు స్వాగతం అన్నట్టుగా వేప చెట్టు పుష్పించడం, మామిడి చెట్టు పూత పిందెలు, పిందెలు కాయలుగా మారడం, కొత్త చింతపండు అందిరావడం, ఇత్యాదిగా కాలం తనకు తానే ఆహ్వానం పలుకుతూ ఆ లేత మామిడి చిగురుకై కొమ్మలపై వాలిన కోకిల కలకూజితమే సన్నాయి స్వరమై, మల్లియపుష్పములన్నీ పూర్ణకుంభ స్వాగతం పలుకగా వచ్చికొలువై 12 మాసాలా పర్యంతం అన్ని ఆలాయాల్లో, ఇళ్ళల్లో, జరిగే ప్రతి విశేషపూజాకార్యక్రమాల్లో తన పేరును దేశకాల సంకల్ప పఠనంలో పలకడంతో ఎంతో సంతోషిస్తూ ఉండే నూతన సంవత్సర దైవం ఎల్లరికీ
భోగభాగ్యాలను / సుఖసంతోషాలను / ఆయురారోగ్యైశ్వర్యాలను అనుగ్రహించి
కలియుగ ప్రత్యక్ష దైవమైన
శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి కరుణాకటాక్షవీక్షణములతో ఎల్లరి
జీవితాలు సార్ధక్యం చెంది పరిపూర్ణమై పరిఢవిల్లు గాక...😊💐🍨🍕👏
No comments:
Post a Comment