Thursday, April 8, 2021

శ్రీ తాళ్ళపాక అన్ననాచార్యుల వారి 518 వ తిథి సందర్భంగా వారికి అన్నమయ్య పదపాదారాధకుడి చిరు అక్షరసుమాంజలి...🙏💐

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ కలియుగానికి శ్రీవేంకటేశ్వరసంకీర్తనావేదంగా

32 వేల సంకీర్తనలను రచించి ఆ శ్రీనివాసుడి శ్రీకైంకర్యంగా వాటిని సేవించి తరించమని అందించినారు....

వాటిలో చాలా భాగం కాలగర్భంలో కలిసిపోయినా, లభ్యమైన వందలకొలది సంకీర్తనలను వివిధ ప్రముఖ అన్నమయ్యసాహితీస్రష్టలు ఆధ్యాత్మిక ద్రష్టలు పరిశోధించి అందించిన సుస్వర సంగీత భరిత సాహిత్య గులికలు సంకీర్తనా ఔషధంగా ఎందరెందరికో భవరుగ్మతలను బాపే భవ్య ప్రసాదమై ఒప్పారడం ఎల్లరికీ విదితమే......

"కలౌ సంకీర్త్య కేశవం..."

అని ఎందరో సనాతన సత్సంప్రదాయావలంబిత పెద్దలు బోధించడం ఎల్లరికీ ఎరుకలో ఉన్న విషయమే....

శ్రీ చాగంటి సద్గురువులు బోధించినట్టుగా యుగధర్మం అనే అంశం పై అవగాహన కలిగిన పెద్దలకు తెలిసినట్టుగా.....

ఈ కలియుగం మొత్తం ధనప్రధానమైన యుగం....

కూటి కోసమే కోటి విద్యలు అనే నానుడి ఈ కలియుగానికి నూటికి తొంభైతొమ్మిది శాతం వర్తించే అంశం...

ధనార్జన కోసమే జీవితంలోని సిమ్హభాగం మొత్తం వ్యయమై...
జీవిత చరమాంకంలో ఉన్న వారికి కూడా ధనదాహం తీరకుండా ఉండేలా పరిస్థితులను ధనంచుట్టూ పరిభ్రమించేలా చేసే ఈ కలియుగం ఎల్లరినీ ధనలాలస లో బంధీలను గావించే కర్కశకాలం ...

ఎందుకంటే ఈ కలియుగంలో

ధర్మం అనేది "సత్యం" అనే ఒకేఒక పాదంపై నిలిచిన వృత్తాంతం గురించి శ్రీ చాగంటి సద్గురువులు మహాభారతంలోని

పృథ్వి గోవుగా, ధర్మం వృషభంగా
మారి చర్చించుకునే సందర్భం లో కలి ఉద్ధతితో మొదలైన పరీక్షిత్ మహారాజు కలిపురుష సంవాదంలో ఎల్లరికి విదితమే.....

పరమాత్మయే ఆ ఎకైక శాశ్వతమైన సత్యం కాబట్టి ఈ కలియుగంలో పరమాత్మ యొక్క నామగుణగౌణగానం వినా తరించుటకు ఇతర ఉపాయములు దుర్లభం.

ఈ కలియుగంలోని సిమ్హభాగ ప్రజానీకానికి..

శౌచము, దైవ / గురు భక్తి, సదాచారము, శాస్త్రము, స్వాధ్యాయము, శమము, దమము, మనఃశాంతి, ఇత్యాది వాటికి
అర్ధంతెలియకుండానే వారి మొత్తం జీవితం గడిచిపోవడం అనేది ఎంతో శోచనీయమైన అంశం......

దానికి కారణాలు....

పేదరికం.. తద్వారా జనించే ఇతర అన్ని రకాల కష్టాలు, ఈతి బాధలు...
సద్గురువుల సద్వాక్కులపై మనోలగ్నత సాధించలేని చపలచిత్తతతో బ్రతికే జీవనవిధానం.....

ఎన్ని ఉన్నతమైన చదువులు / డిగ్రీలు
ఆర్జించుకున్నా ఎంత ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నా / అరిషడ్వర్గంపై అదుపు సాధించలేని అశక్తతతో బ్రతికే వారే అధికంగా ఉండడం....
తన్మూలంగా ప్రశాంతత లేని జీవితంతో సతమతమౌతూ బ్రతుకీడ్వడమే దైనందిన జీవనమై ఉండడం....

ఇవ్విధంగా ఈ కలియుగం, అందలి ప్రజల దైనందిన ఆధునిక జీవనవిధానం అసలు మనఃశాంతికి ఆస్కారం లేనివిధంగా జనుల జీవితాలను కలిప్రకోపానికి ఆహుతి గావిస్తుంటే.....

ఇక తిన్నామా, ఉద్యోగానికి పరుగులు పెట్టి సంపాదించామా, విచిత్రమైన వాహం ( బరువు ) గా వివాహం అనే పేరుతో నెత్తినేసుకున్న సంసారాన్ని నెట్టుకొస్తున్నామా, కలతనిద్రతో కాస్త కుదుటపడ్డామా, మళ్ళీ అదే చక్రంలో రంగులరాట్నంలా గిరగిర తిరుగుతూనే ఉన్నామా......

అనే రొటీన్ లోనే దాదాపుగా యావద్ జీవితంలోని సిమ్హభాగం స్వాహా అయిపోవడమే ఈ కలికాల జీవిత జాఢ్యంగా కొలువైఉండడం ఎల్లరూ గమనించే విషయమే.....

ఈ కలికాలంలో కల్తీలమయమైనవి కేవలం తిండి, పంచభూతాలు, మాత్రమే కాదు....

సదాచారాలు సత్సంప్రదాయాలు....
మనుష్యుల సుహృద్భావ శాంతమయ చిత్తవృత్తులు....
కళలు కళాకారులు....

ఇలా ప్రతీ అంశం మరియు వాటికి సంబంధించిన వస్తువిషయజాలం కూడా మొత్తం కలుషితమై పరిశుద్ధమైన పదార్ధము / ప్రాంతము / వస్తువు / విషయము / తత్త్వము / లభించడమనేది బహు దుర్లభమై ఉండే ఈ కలికాలంలో సకల శ్రేయస్సులకు మూలం భగవద్ భక్తి మాత్రమే....

సాధారణంగా కనిపించని ఆ భగవంతుడు శ్రీశ్రీనివాస పరదైవమై శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మమై కలియుగ ప్రత్యక్ష దైవమై తిరుమలేశుడై శ్రీవేంకటాద్రిపై ఆనందనిలయంలో కొలువైఉన్నాడు కాన,

ఆ శ్రీవేంకట పరతత్త్వమే సకల శ్రేయోదాయక భగవద్ తత్త్వంగా ఈ కలియుగ వరదైవంగా అనాదిగా కొలువైఉండగా, ఆ కొనేటిరాయుడిని కడు రసరమ్యమైన సంకీర్తనలతో సేవించి తరించిన శ్రీహరి నందక ఖడ్గాంశ సంభూతులైన శ్రీఅన్నమాచార్యుల వారు ఆ దైవిక పదపెన్నిధిని భక్తులెల్లరికి అందించి తరించమని దీవించినారు.....

అవి కేవల అచ్చతెనుగు పదాల ప్రౌఢ సాహితీ కావ్యమంజరులే కాక,

శబ్దమయి, రాగమయి, అక్షరమయి గా
ఉండే ఆ వాగ్దేవి యొక్క విభిన్న విభూతుల సమగ్ర సమాహారమైన వేదమయి యొక్క అనుగ్రహన్ని తమలో ఎంతో గుప్తంగ నిక్షిప్తం గావించుకున్న దైవిక సారస్వతం శ్రీవేంకటేశ్వరుడి సంకీర్తనాభాండాగారం....

వాటిని ఆలపించిన, ఆలకించిన, అవధరించిన, ఆకళింపుజేసుకున్న వారికి

శ్రీశ్రీనివాసుడి సద్యోఅనుగ్రహంగా సకల ఇహరపరవిభూతులు అలదబడి

భక్తి,
శౌచము,
తపస్సు,
మేధ,
జ్ఞ్యానము, ( విజ్ఞ్యానము, సుజ్ఞ్యానము, ప్రజ్ఞ్యానము )
సంపద,
కీర్తి, యశస్సు
మనఃశాంతి,
సుఖజీవనము, ప్రశాంతత

సిద్ధించి మనుష్యుడి జీవితాన్ని పరిపూర్ణం గావించి తరింపజేస్తాయి....

అందుకే అన్నమాచార్యులవారు ఎంతో గగనగంభీరంగా ఈ కలికాలంలో భక్తులు భగవంతుడి దరిజేరుటకు ఎంతగా అశక్తులైఉంటారో చెప్పకనే చెబుతూ, అన్ని రుగ్మతలకి శ్రీవేంకటేశ్వరుడి సంకీర్తనవేదమే దివ్యౌషధమని

" కలియుగంబునకు కలదిదియే....
వెలసిన పంచమవేదమే గలిగే..."

అనే సంకీర్తనలో....

సంకీర్తనమే సకలలోకముల వేంకటేశ్వరుని వేదమై కలిగే..."

అని నొక్కివక్కాణించారు....

శ్రీ తాళ్ళపాక అన్ననాచార్యుల వారి 518 వ తిథి సందర్భంగా వారికి అన్నమయ్య పదపాదారాధకుడి చిరు అక్షరసుమాంజలి...🙏💐

https://archive.org/details/KaliyugambunakuKaladidiyeAnnamacharya

No comments:

Post a Comment