ప్రతిసంవత్సరంలా ఉగాది పర్వదిన ప్రత్యేక పూజ,
షడ్రుచుల కలయికగా ఉండే ఉగాది పచ్చడి, నేతి భక్ష్యాలు, సాయంత్రం ఆలయంలో పంచాంగశ్రవణం, ఆదాయ వ్యయ ఫలాలు, జ్యోతిష శాస్త్రోక్త వివిధ సంభావిత పరిణామాల దృష్ట్యా ఈ సంవత్సరమంతా తీసుకోవలసిన జాగ్రత్తలు / పాటించవలసిన వ్యక్తిగత ఆచార వ్యవహారాలు ఇత్యాది గా ఈసారి కూడా యుగాది అనే పర్వోత్సవాన్ని జరుపుకోవడమా అనగా యుగాది / ఉగాది కి బ్రహ్మగారు వారి విహిత కర్మాచరణమైన సృష్టి ధర్మాన్ని నిర్వహించడానికి ఎన్నుకున్న చైత్ర శుద్ధ పాఢ్యమి ని కేవలం స్వీట్లు తినడానికి మాత్రమే ఇంకో కొత్త పండుగగా భావించి సరిపెట్టుకోవడమా లేదా యుగాది యొక్క ప్రాశస్త్యాన్ని మరింత విపులంగా అధ్యాత్మ దృష్ట్యా తర్కించి తరించడమా అనేది వారి వారి ఆధ్యాత్మిక జిజ్ఞ్యాస మరియు భక్తి ప్రపత్తులపై ఆధారపడి ఉండే అంశం.....
చైత్ర శుద్ధ పాఢ్యమికి బ్రహ్మ గారు సృష్టి రచన గావించడానికి మరియు మనం నేతి భక్ష్యాలు,
చేదుకు వేప పువ్వు + పులుపుకు కొత్త చింతపండు పులుసు + తీపికి బెల్లం + వగరుకు కొత్త మామిడికాయ్ ముక్కలు + కారానికి కాస్త శొంఠి + ఉప్పుకు సైంధవ లవణం కలగలిపిన జలతత్త్వ మిశ్రమాన్ని....
( కొందరు కొన్ని కారణాలకు ఉప్పును వినియోగించరు. కొత్త మట్టి కుండలోని మృత్తికా తత్త్వమే ఉప్పుకు ప్రతీకగా భావించి మట్టి కుండలో యుగాది పచ్చడి తయారు చేసి ) ....పరమాత్మకు నివేదించి ప్రసాదంగా స్వీకరించి యుగాది నైమిత్తిక తిథిని పాటించి తరించడానికి ఏంటి సంబంధం...
మనలోనే యావద్ విశ్వమున్నది.....
మనలోనే సకల దేవతాలోకములు కొలువై ఉన్నవి....
మనలోనే యావద్ వైశ్విక తేజస్సు నిత్యం బ్రహ్మాండ పిండాండ సమన్వయంతో నవనవోన్మేశ నిత్యనూతనత్వాన్ని సంతరించుకుంటూ
ఈ మృణ్మయాన్ని చిన్మయంగా తీర్చిదిద్దే ప్రక్రియ నిత్యం " సోహం " అనే జీవాత్మ పరమాత్మ అనుసంధానాత్మక చర్యగా కొనసాగుతూ,
" దేహో దేవాలయః ప్రోక్తో జీవోదేవః సనాతనః " అనే విధంగా ఆ పరమేష్టి యొక్క స్వానుభవైక ఉనికిని మనలోనే సృజింపజేయిస్తూ, ఒకానొక సాట్యురేటెడ్ యోగ స్థాయిలో సదరు ఉపాసకుడు అవలంబించిన యోగ ప్రక్రియకు అనుగుణంగా తన దేహంలోనే సకల దేవతా తత్త్వాన్ని దర్శిస్తూ, అనుభవిస్తూ,
ఎరుకలోకి వచ్చిన ఈశ్వరతత్త్వంగా, తన్మూలంగా
" తత్ త్వం అసి " అనే శృతివాక్యానుగుణంగా శ్రీ చాగంటి సద్గురువుల వంటి మహనీయులచే నుడవబడినట్టుగా "అది నీవై ఉన్నావు...." అనే సర్వోన్నత సాధికారిక శాస్త్రీయ యోగానుభవాన్ని
"అద్వైత భావన", "అద్వైత తత్త్వం" , "అద్వైతం" గా, మరియు ఆ తెలుసుకొనబడే / దర్శించబడే తత్త్వ దర్శనాన్ని " విశిష్టాద్వైత తత్త్వం" / "విశిష్టాద్వైతం" గా, ఆకళింపుజేసుకోవడంలో ఉన్నతి,
గొప్పదనం ఉండి మన జన్మలు గురువానుగ్రహంగా ఒనగూరే ఈశ్వరానుగ్రహంగా తరించడం అనేది సంభవమయ్యి మన జన్మ సార్ధక్యాన్ని బడయుట అనే మాట నిజమై పరిణమిస్తుంది.....
నేను ఇదివరకే నా పాత పోస్టుల్లో ఒక దెగ్గర చెప్పినట్టుగా....,
ఒక జెట్ప్లేన్లో దూసుకెళ్ళే వారి యొక్క ఉన్నతమైన భౌతిక స్థాయిని అదే స్థాయిలో ఉండే మరొక వ్యక్తి లేదా ఆ స్థాయిపై క్షుణ్ణంగా అవగాహన గలిగిన వ్యక్తి మాత్రమే సాధికారికంగా నిర్వచించి మాట్లాడగలడు....
సేం అదే విధంగా, వివిధ ఆంతరమైన యోగస్థాయిల గురించి మాట్లాడాలంటే......
వాటిపై అవగాహన కలిగిన వారు,
లేదా ఆ స్థితికి చేరుకొని పరబ్రహ్మాన్ని దర్శించగల యోగులు, వీరిరువురికి మాత్రమే అది సాధ్యం....
ఒక సామాన్య వ్యక్తి దెగ్గర ఉన్నప్పుడు.....
" రెయ్....బా ఎట్లున్నవ్ రా.....ఎన్ని రోజులైందిర నిన్ను కలిసి....ఎక్కడుంటున్నవ్ ఎన్ల పని జేస్తున్నవ్....ఏం కత.....ఏవో 6 కొత్త సినిమాలు రిలీస్ అయినయంటకద....చూసినవ....
వెళ్ళే ముందు మాస్క్ తీయగానే నువ్వెవరో అర్ధమైంది బా...😊👍..."
అంటూ ఏదో క్యాజువల్ గా మాట్లాడితే వారు సమాధానం ఇవ్వగలరు కాని.....
"హే బ్రహ్మన్....మీరు నిత్యం దర్శిస్తూ ఓలలాడే....
అన్నమయ....
ప్రాణమయ....
మనోమయ...
విజ్ఞ్యానమయ....
ఆనందమయ....మనే పంచకోశాల ఆంతరమున కొలువై ఉండే పరమాత్మ తత్త్వానుభూతి గురించి కొంచెం వివరించగలరా...."
అని అడిగితే.....
" ఏం రా.....ఎర్రగడ్డ హాస్పటల్ నుండి వచ్చినవ ఏంది.....ఎట్లున్నవ్ రా...ఏం కత....అని అడుగుతవ్ అనుకుంటే.....
అన్నం....ప్రాణం....మానం....యిజ్ఞ్యానం...ఆనందం.....అంటూ ఏందో సోది గొడుతున్నవ్....ఏమైందిర నీకు....పాగల్గాడిలా మాట్లాడుతున్నవ్....."
అని మాత్రమే ఎదురు ప్రశ్నలు ఉంటాయ్....
ఎందుకంటే ఇక్కడ ఆంతర మనో స్థాయీ భేదాన్ని అవతలి వ్యక్తి దర్శించలేడు కాబట్టి....
ఇదే ప్రశ్న అరుణాచల, హిమాలయాది పర్వత సానువుల్లో కొలువైఉండే యోగీశ్వరులను అడిగితే....
తస్యమధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః |
నీలతో’-యద మధ్యస్థాద విధ్యుల్లే ఖేవ భాస్వరా |
నీవారశూక వత్తన్వీ పీతా భాస్వత్యణూపమా |
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
అనే నారాయణసూక్తానికి వారిచ్చే సమాధానం ఎంతటి ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుందో వర్ణించడం బహు దుస్సాధ్యం.....
ఏనాడూ ఒక నార్మల్ ప్లేన్ కూడా
( ఫర్ ఎగ్సాంపుల్, ఒక హైదరబాద్ టు తిరుపతి ఇండీజొ ఫ్లైట్ ) ఎక్కని వ్యక్తిని, జెట్ప్లేన్ లో స్ట్రాటోస్పియర్ ని దాటి అయినోస్పియర్ ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యేంతటి ఆల్టిట్యూడ్లో భూమి మరియు ఇతర విశ్వం ఎలా కనిపిస్తుందో తెలుసా అని అడిగితే.....ఏం చెప్తారు.....
"నీకు మెంటల్ ఆ ఏంటి...." అని మాత్రమే అంటారు.....
క్వైట్ సిమిలర్లి, యోగస్థాయి కూడా అంతే.....
అది కేవలం స్వానుభవ సత్యం గా మాత్రమే దర్శింపబడే సత్యశ్రేష్టం కాని ఏవేవో వ్యాఖ్యానాలకు అందే కేవల వర్ణన కాదు......
పైన పేర్కొనబడిన శృతివాక్యం గురించి శ్రీ చాగంటి సద్గురువుల వివరణ విన్న భాగ్యశీలురకు.....
ఔరా ఎంతటి ఘనమైన రీతిలో శృతి మన హృదయకోశంలోనే గుప్తంగా కొలువై ఉండే పరమాత్మను ఎంత ఘనంగా వర్ణించింది.....అని అనిపించక మానదు.....
ఏ విధంగా ఐతే ఒక ముద్దమందారం మొగ్గ మెల్లమెల్లగా మెల్లమెల్లగా సూర్యకాంతికి విచ్చుకునే పరిణామక్రమంలో పూర్తిగా అరవిరిసిన రుధిర వర్ణం లోని ముద్దమందారం పువ్వు యొక్క పసుపచ్చని కేసరముల పుప్పొడి పై వాలి మకరందాన్ని గ్రోలే తుమ్మెదలా......
( చిన్నపుడు మా ఇంట్లోని వాయవ్య భాగాన ఉండే పెద్ద ముద్దమందారం చెట్టు, ఆపక్కనే ఉండే దానిమ్మ చెట్టు, చెరుకు మొక్కలు, మల్లికా పుష్పాల మొక్కలు ఇత్యాది సకల దేవతా మొక్కలు/ చెట్లతో ఉండే రోజుల్లో నేను గమనించిన విషయాలన్నీ,
2008 తర్వాత శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో నేను విన్న.....
ముద్దమందార తత్త్వం.....
"దాడిమీకుసుమప్రభ".....తత్త్వం.....
ఇత్యాదిగా నాకు అన్నీ స్వానుభవ జీవితసత్యాలుగా భాసించడం నా జన్మాంతర సుకృతం.....)
మన నిత్య చైతన్యాత్మక ఇంద్రియ శక్తితో సదా వికసితమై ఉండే పంచకోశాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విచ్చుకుంటూ పూర్తిగా అరవిరిసిన తైజసిక పంచకోశాత్మక హృదయపుష్పం యొక్క మానసిక కేసరముల యోగిక పుప్పొడి పై వాలి భగవద్ భక్తి అనే మకరందాన్ని గ్రోలే తుమ్మెదలా ఉండే పరమాత్మ తత్త్వాన్ని మనలో మనమే దర్శించుకునేంతటి స్థాయికి మన అధ్యాత్మ సాధన నిరంతర అవిచ్ఛిన్న తైలధారవోలే సాగుతూ ఉండి ఎప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహం లభించి ఆ అద్వైతానుభవ ఇంద్రియాతీత స్థితి అనుభవగ్రాహ్యమై లభిస్తుందో అప్పుడు ఆ నిమిషంలో జీవాత్మ పరమాత్మ యొక్క అనుసంధీకృత అద్వైత స్థితిలో మనిషికి అప్రయత్నంగా కన్నీరు ఆనందభాష్పముల రూపంలో జల జల రాలుతూ, ఒక అనిర్వచనీయమైన అద్భుత స్థితికి లోనయ్యే భావనే "అద్వైతానుభవ స్థితి...."
సరే ఇంతకి ఈ అద్వైత తత్త్వానుభూతికి.....
యుగాది నాడు ఎల్లరూ లొట్టలేసుకుంటూ తినే నేతి భక్ష్యాలు + షడ్రుచుల ఉగాది పచ్చడి కి ఏంటి నాయన నీ సామ్యము అనే కదా మీ ప్రశ్న....
అక్కడికే వస్తున్న.....
ధ్యానంలో నిమగ్నమై ఉండే ఒక యోగికి తెలిసినట్టుగా......ఒక్కో స్థాయిలో ఒక్కో సువాసన / ఒక్కో భావన లభిస్తుంటాయి....
ఉప్పు+కారం+వగరు+పులుపు+చేదు+తీపి
ఏవిధంగా అయితే అన్నీ కలిసి ఒక అనిర్వచనీయమైన రుచిని ఉగాది పచ్చడికి ఆపాదించి మనల్ని తరింపజేస్తాయో.....
అదే విధంగా ...,
స్వచ్ఛమైన పసుపుకొమ్ముల నుండి తయారు కావించబడిన పసుపు, ముద్దమందారం రంగులో ఉండే స్వచ్ఛమైన హరిద్రా కుంకుమ, స్వచ్ఛమైన శ్రీగంధం, స్వచ్ఛమైన పరిమళపు విభూతి, సహజమైన కస్తూరి, అనే 5 దివ్య దైవిక పదార్ధాల పరిమళాలు ఒక యోగికి ఒకానిక ఉన్నతమైన ధ్యానావస్థలో ఆంతరజనితంగా లభించి, తుదకు వీటిసమ్మిళిత సమాహార పరిమళంగా పరతత్త్వ పరిమళం గోరోచన పరిమళంలా లభించి ఒక
విధమైన అవ్యక్తానూభూతికి లోనై ఆనందిస్తూంటాడు....
ఏ విధంగా అయితే ఒక మామూలు రొట్టే ముక్క లా / చెపాతీ లా పైకి కనిపించే భక్ష్యాల్లో, ఆంతరమున
చాటెడు శనగపప్పును ఉడకబెట్టి అందులో దోసెడు బెల్లం వేసి కాస్త సోంపు వేసి తయారుగావించిన మిశ్రమాన్ని సమకూర్చి చెంచాడు
నెయ్యి వేసి చిన్న సెగపై వేయించి అమృతతుల్యమైన భక్ష్యంగా మలిచి భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి తరిస్తామో......
అదే విధంగా కేవలం ఒక నార్మల్ మానవ శరీరం లా పైకి కనబడే మన సాధారణ దేహంలోనే అసాధారణమైన యోగ తత్త్వాన్ని ఆంతర సాధనతో సృజింపజేసుకొని జీవితానికి ఆపాదించుకొని తరించాలనే సందేశం ఇమిడి ఉన్నది....
పైకి ఒక కేవల రొట్టె ముక్కలా కనిపించినందుకు ఒక మధుర భక్ష్యాన్ని తక్కువ చేసి మాట్లాడితే అది సదరు వ్యక్తి యొక్క అవగాహనా రాహిత్యానికి కొలమానమే అవుతుంది తప్ప భక్ష్యం యొక్క గొప్పదనానికి కొలమానం కానేరదు......
పైకి ఒక సాధారణ మనిషిలా కనిపించినందుకు ఒక యోగి ని తక్కువ చేసి మాట్లాడితే అది సదరు వ్యక్తి యొక్క అవగాహనా రాహిత్యానికి కొలమానమే అవుతుంది తప్ప యోగి యొక్క గొప్పదనానికి కొలమానం కానేరదు......
పైకి ఒక సాధారణ శుద్ధ పాఢ్యమి తిథి లా కనిపించినందుకు ఒక చైత్ర శుద్ధ పాఢ్యమి తిథి కేవలం ఇతర అన్ని శుద్ధ పాఢ్యమి తిథులలా ఇంకో తిథి మాత్రమే అని అనుకుంటే అది సదరు వ్యక్తి యొక్క అవగాహనా రాహిత్యానికి కొలమానమే అవుతుంది తప్ప విజ్ఞ్యులు గడించిన శాస్త్రవైభవానికి కొలమానం కానేరదు......
చైత్ర మాస వసంత ఋతు అగమనానికి పరవశించి కమ్మని సువాసన తో లైట్ చాక్లేట్ కలర్లో ఉండే కొత్త చిగురును భక్ష్యించేందుకై మామిడి కొమ్మలపైకి వచ్చి వాలి గొంతు విప్పే కోయిల కలకూజితమే ఆలయ ఘంటానాదమై....
ఎల్లరిజీవితాల్లో ఈశ్వరానుగ్రహ వీచికలు తరంగితమై యుగాది పర్వం ఎల్లరికీ నవనూతన ఆశయాల సాధన దిశగా వారి వారి జీవితం అనే నిత్యనూతన మధుకావ్యం ఎల్లప్పుడూ సరికొత్తగా రచింపజేసుకునేందుకు ఎల్లరికీ యుగాది పండుగ ఆది కావాలని ఆకాంక్షిస్తూ.....
కలియుగ ప్రత్యక్ష వరదైవమైన
శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి శ్రీకరమైన నిత్యనూతన అనుగ్రహవీచికలు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఈ క్రింది మధురమైన సంకీర్తనలో వర్ణించబడినట్టుగా భక్తుల్లెల్లరి జీవితాలకు ఈ యుగాది పర్వం ఆ పరమపదనాథుడి అనుగ్రహంగా అందజేయుగాక అని ఆకాంక్షిస్తూ.....
ప్రతీక్షణం నా ఎదలోగిళ్ళలో ఊయలలూగే శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరపరబ్రహ్మం, శుభకృత్ నామ ఉగాది పర్వసమయ అనుగ్రహన్ని భక్తులెల్లరికి వర్షించు గాక అని ఆకాంక్షిస్తూ ...
అందరికి ఉగాది 2022 తెలుగు నూతన సంవత్సరాది పండుగ శుభాభినందనలు....💐🍕🎂🍨🍦🍧😊🙏🎇
http://annamayya-u.blogspot.com/2010/05/nityatmudai-yumdi-toppopularannamayyaan.html?m=1
ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు
చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు
చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు
చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు,