Saturday, April 23, 2022

శ్రీజానకమ్మ గారికి సవినయ జన్మదిన శుభాభినందనా నమస్సులు....🍧🍕💐🎂🍦😊🙏

శ్రీ ఎస్.జానకి గారి పేరు దక్షిణభారత సంగీత , గాయక సామ్ర్యాజనికి ఒక మణికిరీటంలా, గత 6 దశాబ్దాలుగా వారి సుదీర్ఘ గానప్రస్థానంలో వెలుగొందుతూ, 84 వ పడిలోకి వారు అడుగుడితున్న శుభసమయంలో, శ్రీజానకమ్మ గారికి సవినయ జన్మదిన శుభాభినందనా నమస్సులు.... 

శ్రీ చాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో తెలిపినట్టుగా, ఏ జన్మలో ఈశ్వరుడికి స్వచ్ఛమైన

తేనెతో అభిషేకం చేసి తరించారో ఈ జన్మలో యావద్ భారతదేశం గర్వించే అమృతగాయనిగా వారు ఎనలేని ఖ్యాతిని గడించారు.... 

సుశీలమ్మ గారు, జానకమ్మగారు, వాణీజయరాం గారు, శోభారాజు గారు, బాలు గారు, శైలజమ్మ గారు, ఇత్యాది పుణ్యజీవులంతా కూడా గత జన్మల్లో శ్రీశైలాది తీర్థ స్థలిలో ఏదో ఒక ప్రదోషవేళ ఈశ్వరుడి సభతీర్చి ఉండగా ఒక గంధర్వ సమూహంగా వచ్చి పరమేశ్వరుణ్ణి అమితంగా స్తుతించి అనుగ్రహాన్ని బడసి తరించిన పుణ్యజీవులై ఉంటారు....అందుకే ఈ జన్మలో తెలుగునేలపై ఇంతటి గంధర్వామృతాన్ని వెదజల్లే వరిష్ఠ గాయకులై ఎల్లరినీ అలరించే సౌభాగ్యహేతువుతో కొలువైనారు...... 

పరమేశ్వరుడి ఈ పాంచభౌతిక సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో అత్యంత ఉత్కృష్టమైన బుద్ధిగత ప్రాణిగా జన్మించే మనుష్యుడికి గల ఎన్నో అద్భుతమైన వరాల్లో ముఖ్యమైనది స్వరం...

మామూలుగా ఉండే అవి ఇవి దైనందిన ముచ్చట్లు మాట్లాడడం మొదలుకొని...

ఒక మహర్షిలా మాట్లాడిన మాట కాలక్రమంలో నిజమై పరిణమించేంతటి స్థాయికి మనుష్యుడిని ఒక మహానుభావుడిగా తీర్చిదిద్దగల మహత్తు మాటకు కలదు.....

అటువంటి మహత్తరమైన మాటకు సదరు వ్యక్తి యొక్క ఉపాసనకు / పరిశ్రమకు తగ్గట్టుగా తగు విధమైన గాయత్రి శక్తి జతైనప్పుడు అది..

వాక్యమై, స్తోత్రమై, గానమై, మంత్రమై, భగవంతుడిని తన అధీనంగావించే సామవేదసారమైన సంకీర్తనమై పరిణమిస్తుంది.....

అగ్నికి ఆజ్యంతోడైతే ఆ శక్తి అమితంగా ప్రభావాన్ని చూపే మహాశక్తిగా పరిణమిస్తుంది....

అదే విధంగా మాటలకు, పదాలకు సశాస్త్రీయ కర్ణాటక సంప్రదాయ సంగీత సంబంధిత మేళకర్త రాగాలు జతైనప్పుడు ఇక వాటి శక్తి అనంతమై, అమేయమై, అప్రాకృతమైన పరతత్త్వ నాద శక్తిగా పరిణమిస్తుంది....

నాదమే ముఖ్యమైన పదార్థంగా గల సామవేదానికి ఈశ్వరుణ్ణి అత్యంత శీఘ్రంగా ప్రసన్నం గావించుకునే శక్తికలదు...

మనుష్యుడి స్వరపేటికకు ఆ సుస్వరనాదశక్తి అనేది కేవలం ఈశ్వరానుగ్రహంగా మాత్రమే తప్ప ఏ షాపులోను కొనుక్కొని పెట్టుకోవడానికి లభించని దైవిక ప్రసాదం...

శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఒక చోట శ్రీశైలంలోని ఒక సుస్వర సామవేద ఘనాపాటి గారి వైభవం గురించి ప్రత్యేకంగా వివరించడం కొందరికైనా గుర్తుండి ఉండాలి....

అంతటి విశేషమైన దైవానుగ్రహసంపాకభరిత జన్మలు ఎంతో అధ్యాత్మ సాధనా భరిత జీవితంతో ఆర్జించుకున్న పుణ్యబలం గలవారికి తప్ప అన్యులకు లభించడం దుర్లభం.....

అంతటి విశేషమైన స్వరశక్తితో అలరారే గాయనీమణిగా జానకమ్మ గారు యావద్ ప్రపంచంలో పాతతరం, కొత్తతరం అనే భేదంలేకుండా ఎల్లరినీ అలరించే అమరగాయకులుగా కీర్తిని గడించడం మన తెలుగు నేల యొక్క పురాకృత సుకృతం....

చిత్రగారి లాంటి వారు ఇండస్ట్రీలో నేడు ఒక ప్రముఖమైన గాయనిగా ఎదగడానికి కారణం ఆనాడు జానకమ్మ గారు వారి ప్రతిభను గుర్తించి గౌరవించి ఆదరించినందువల్లే అని చిత్రగారే ఒక రియాలిటి షోలో చెప్పడం కొందరికైనా తెలిసేఉంటుంది.....

సీ.ఏ ఆఫీస్లో ( 2010-13 రోజుల్లో ) తరచు అనీల్ బ్రో తో పూల్ / బిలియర్డ్స్ ఆడేరోజుల్లో, 

( శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారి చిన్న కుమారులు శ్రీ గరిమెళ్ళ అనీలకుమార్ గారు )

ఆరితేరిన రీతిలో పూల్ ఆటను ఏవిధంగా ఆడాలో నేర్పుతూనే,

ఆనాటి వారి " హరి సంకీర్తనం " అనే అన్నమాచార్య సంకీర్తనా అధ్యాత్మ కార్యక్రమం గురించి వివరించే రోజుల్లో ఒకరోజు బ్రో వారికి జానకమ్మ గారు బంధువు అవుతారు అని చెప్పడం బాగా గుర్తు...

కాబట్టి జానకమ్మ గారి జన్మదినం నాకు మరింతగా సంతోషదాయకమైన విషయం..... 

"అనిశము తలచరో అహో బలం.."

అనే అన్నమాచార్యుల సంకీర్తన,

"సప్తపది " సినిమాలోని లోని వారి " నెమలికి నేర్పిన నడకలివే..." మరియు 

" సాగరసంగమం " లోని " ఓం నమః శివాయ " సాంగ్స్ నా ఫేవరేట్స్....

ఈశ్వరానుగ్రహంగా మీరు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ,  S Janaki Net  S. Janaki  గారికి మీ 84 వ పుట్టినరోజు సందర్భంగా సవినయ శుభాభినందనా నమస్సుమాంజలులు....

🙏😊🍦🎂🎆💐🍕🍧🎇


No comments:

Post a Comment