శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఏకత్రింశత్ (31 వ) వార్షిక శ్రీపాంచరాత్రాగమోక్త బ్రహ్మోత్సవ వైభవం...🙏😊🍕💐🍧🍨🍦🌸
[ శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 చైత్ర శుద్ధ పంచమి నుండి నవమి వరకు పాంచాహ్నిక మహోత్సవం.... ( శ్రీవారి ప్రతిష్ఠాపనామహోత్సవం / కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ సప్తమి నాడు ) ]
1. ఆలయానికి బ్రహ్మోత్సవం అంటే ఏమిటి....బ్రహ్మోత్సవం అని అనడం ఎందుకు.....?
2. ఏకాహ్నిక / త్రయాహ్నిక / పాంచాహ్నిక / సప్తాహ్నిక / నవాహ్నిక ఉత్సవంగా మాత్రమే బ్రహ్మోత్సవం జరపడంలోని ఆంతర్యమేమి....?
3. గరుడధ్వజం / గరుడపతాకం తో ధ్వజారోహణం / ధ్వజావరోహణం ( అనగా ఉత్సవం తొలి రోజున ఆరోహణం.....ఆఖరి రోజున అవరోహణం....) లోని ఆంతర్యమేమి.....?
4. ధ్వజస్తంభానికి కట్టిన గరుడధ్వజంతో దేవతలందరు దివినుండి ఆలయానికి ప్రత్యేకంగ ఆహ్వానింపబడగా దిగిరావడం ఏంటి...?
5. బ్రహ్మోత్సవాంతర్గతంగా భగవద్ కళ్యాణం ఆచరించడంలోని ప్రత్యేకత ఏంటి...?
ఇత్యాదిగా ఎంతో మంది అధ్యాత్మ జిజ్ఞ్యాసా పరులకు ఎన్నో రకాల సందేహాలు రాకమానవు....
కాబట్టి ఒక్కొక్కటి కూలంకశంగా పరిశీలిద్దాం....
1. ఆలయానికి బ్రహ్మోత్సవం అంటే ఏమిటి....బ్రహ్మోత్సవం అని అనడం ఎందుకు.....
"భోజనప్రసాదాలు ఎలా ఉన్నాయ్...?
అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాయ్......ఏ మహానుభావులు పెట్టించారో గాని వారు చల్లగా ఉండాలి....!"
ఇత్యాదిగా ఉండే కామన్ డైలాగ్స్ వినే ఉంటారు....
" బ్రహ్మాండంగా ఉన్నాయ్...." అని ఏదో అనేయడం వరకు బానే ఉంది కాని....
బ్రహ్మాండం అంటే ఏమిటి....?
బ్రహ్మా దేవునికి కి, అండానికి, బ్రహ్మాండానికి, చాలా బావుండడానికి ఏంటి సంబంధం....?
ఫస్ట్ ఒక చిన్న లౌకిక ఎగ్సాంపుల్ తో ఒక సామ్యమును అర్ధం చేసుకునే ప్రయత్నం కావిద్దాం.....
" గౌ || ముఖ్యమంత్రివర్యులు, శ్రీ కే.సీ.ఆర్ గారు ఫలాన మేధావులతో చర్చించి ఫలాన పథకంలో సామాన్య ప్రజానీకానికి ఉపయుక్తంగా ఉండేలా పలు మార్పులను సూచించి వాటి అమలు దిశగా రాష్ట్ర అధికారులకు తగు ఆదేశాలను జారి చేసారు....."
అనే వాక్యంలో గమనించగలిగితే...
1. ఇక్కడ ముఖ్యమంత్రివర్యుల స్థానంలో కే.సీ.ఆర్ గారు అనే వ్యక్తి ఇప్పుడు ఉన్నారు అనేది సత్యం...
2. ఆ " ముఖ్యమంత్రి " అనే పదవిలో ఇదివరకు ఎంతో మంది ఉన్నారనేది కూడా సత్యం....
3. సొ, ఇక్కడ ఒక పదవికి, అది అలంకరించిన వ్యక్తికి, ఆ వ్యక్తిని పరివేష్టించి ఉండే వ్యష్టికి గల వివిధ అర్ధాలు ఎట్లుండునో.....
అదే విధంగా....
"బ్రహ్మ" అనే ఉన్నతమైన పదవికి, ఆ పదవిని అలంకరించి ఉండే ఒక ఉన్నతోన్నతమైన పుణ్యజీవుడికి,
ఆ బ్రహ్మ గారిని పరివేష్టించి ఉండే వ్యష్టికి గల వివిధ అర్ధాలు అట్లుండును...
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో, గురువుగారు ఒక దెగ్గర వివరించినట్టుగా...
పరమశివుడు బ్రహ్మకపాలముల మాలను ధరించి ఉండడానికి గల కారణాన్ని వివరిస్తూ, " బ్రహ్మ కల్పం" అనే కాల విభాగం గురించి వివరించడం కొందరికైనా గుర్తుండి ఉండాలి.....
100 దివ్యసంవత్సరముల కాలానికి అధిపతిగా ఉండే బ్రహ్మ పదవి లో ఉండే వారి అధీనంలో ఉండే యావద్ ప్రపంచ సృష్టి లోని అన్ని జీవులకు ఆ బ్రహ్మ గారి శాసనం సర్వోన్నతమై ఉంటుంది....
కాబట్టి "బ్రహ్మ " అనే శబ్దం కేవలం ఒక పదవిని లేదా ఆ పదవిని అలంకరించిన వారినే కాకుండా వారి సర్వోన్నతకు సూచికయైన తత్త్వానికి వారి సృష్టికి ప్రతీకగా ఉండే విశాల వైశ్విక పరిణామక్రమానికి పర్యాయపదంగా కూడా ఉపయోగింపబడుతుంది...
కాబట్టి " బ్రహ్మాండం " అంటే ఇక ఈ సృష్టిలో అంతకు మించిన ఉపమానం లభించని వైనాన్ని తెలియజేసే తత్త్వం.....
కాబట్టి ఒక ఆలయానికి, ఈ కల్పాన్ని శాసించే బ్రహ్మగారి పేరు మీదుగా నిర్వహింపబడే సర్వోన్నతమైన ఉత్సవం
" బ్రహ్మోత్సవం " అని అర్ధం...
మరియు భృగు మహర్షి శాపకారణంగా బ్రహ్మ పదవిని అలంకరించి ఉండే వారికి భూలోకంలో సమూర్త్యారాధన లేని కారణంగా వారిని కేవలం తత్త్వ ప్రకారంగా స్తుతించడం, మరియు శ్రీవేంకటాచలాది సంపన్నమైన క్షేత్రాల్లో అయితే బ్రహ్మోత్సవాల్లో ఒక ప్రత్యేక రథాన్ని అన్నిటికంటే ముందుగా ఉండేలా చేసి, "బ్రహ్మ రథం" అనే పేరుతో అత్యంత ఉన్నతమైన గౌరవం ఇవ్వడం గమనించే ఉంటారు.....
అందుకే లోకంలో ఎవరికైనా అందరికన్నా ఎక్కువగా ముందుగా బాగా గౌరవం ఇస్తే, " అబ్బో ఆ ఫంక్షన్లో వారికైతే బ్రహ్మరథం పట్టారండి..." అని అంటుంటారు.....
ఏకాహ్నిక / త్రయాహ్నిక / పాంచాహ్నిక / సప్తాహ్నిక / నవాహ్నిక ఉత్సవంగా మాత్రమే బ్రహ్మోత్సవం జరపడంలోని ఆంతర్యమేమి...
బేసి సంఖ్యలో ఉత్సవం జరపడంలో, 2 తో భాగించబడినప్పుడు శేషం ఎల్లప్పుడూ 1 గా ఉంటుంది...
"ఏకం సత్విప్రాహ్ బహుదా వదంతి..."
ఎల్లప్పుడూ ఉండే ఒకే పరతత్త్వం వివిధ రీతుల ఆరాధింపబడుతోంది....ఎందరిచే ఎన్ని రకాలుగా అర్చింపబడినా ఆ పరతత్త్వ వైభవం
"సంపూర్ణంగా తెలుసుకొనబడినది" అని ఎవ్వరివల్లకూడా నిర్వచింపబడని విధంగా శేషం ఎల్లప్పుడూ 1 మిగిలే ఉంటుంది...
విష్ణ్వాలయాల్లో గరుడధ్వజం / గరుడపతాకం తో ధ్వజారోహణం / ధ్వజావరోహణం ( అనగా ఉత్సవం తొలి రోజున ఆరోహణం.....ఆఖరి రోజున అవరోహణం....) లోని ఆంతర్యం....
లౌకికంగా వాహనమై, ఆసనమై, పతాకమై, నిత్యసూరులలో ఒకరై, పరమదాసుడై, అమృతాన్ని కూడా కాదని మాతృదాస్య విముక్తి తో శ్రీమహావిష్ణువు యొక్క హృదయాన్ని గెలుచుకున్న భక్తభాగవతోత్తముడైన గరుత్మంతుడు, గరుడాళ్వార్ గా స్తుతింపబడుతూ, శ్రీహరికి పరమ ప్రీతిపాత్రుడైన పరివార సభ్యుడిగా ఉండే ధన్యజీవి.....
పారలౌకికంగా సకల వేదసారస్వత శక్తికి,
సకల విధ విషహర శక్తికి,
సకల అశుభాపహారక శక్తికి,
సకల ఉన్నతమైన బుద్ధికుశలతదాయక శక్తికి,
సకల దోషనివారక / శుభకారక శక్తికి,
ప్రతీక...
అందుకే గరుడధ్వజం / గరుడపతాకం తో గావించే ధ్వజారోహణంతో సకల దేవతలకు / సూక్ష్మరూప దేవతాశక్తులకు ఆహ్వానం పలికి ఆలయ పరిసరాలను బహురీతుల శక్తివంతం గావించడం ఇందలి ఆంతర్యం....
శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనాంతర్గత "గరుడ అమృతాపహరణ ఘట్టం" విన్నవారికి గుర్తున్నట్టుగా, అమృతకలశాన్ని కైవసం గావించుకొని లాస్ట్ కి వెళ్ళే ముందు దేవేంద్రుడికి తన బంగారు ఈకను ఒకటి విదిల్చిన సంఘటనతో వజ్రాయుధం కూడా గరుత్మంతులవారి ముందు ఎంతటి అల్పమైనదో మనకు చెప్పకనే చెప్పబడుతున్నది....
బ్రహ్మోత్సవాంతర్గతంగా భగవద్ కళ్యాణం ఆచరించడంలోని ప్రత్యేకత....
ఒక మంచి బంగినపల్లి మామిడి పండు సాధారణంగానే చాల శ్రేష్ఠమైనది, ఆరోగ్యకరమైనది......
ఇక తేనేలో రంగరించబడి ఎండు ఖర్జూరలు / ద్రాక్షలు (కిస్మిస్) / బాదంపప్పు / జీడిపప్పు / పాలు / ఇత్యాది వాటితో సమ్మిళితం గావింపబడితే ఇక అది పోషకాల మహత్తరగని వంటిదై పరిణమిస్తుంది....
అట్లే...
సాధారణంగానే భగవద్కళ్యాణం బహు అనుగ్రహదాయకమైనది......
ఇక బ్రహ్మోత్సవాంతర్గతంగా భగవద్ కళ్యాణం ఆచరింపబడితే ఆ విశేష దైవానుగ్రహం బహు శక్తివంతమై పరిణమిస్తుంది.....
గత 31 సంవత్సరాలుగా కూకట్పల్లి వివేకానందనగర్ పరిసర ప్రాంతాల్లో కొలిచినవారి కొంగుబంగారమై ఎనలేని అనుగ్రహదాయక దైవంగా అలరారుతున్న శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఏకత్రింశత్ (31 వ) వార్షిక శ్రీపాంచరాత్రాగమోక్త పాంచాహ్నిక బ్రహ్మోత్సవంలో తరించిన ఎందరో భక్తుల్లో ఒకడిగా శ్రీవారి శ్రీచరణాలవద్ద చిరుకవనసుమాంజలితో నమస్సులను అర్పిస్తూ....
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి మాటల్లో / సంకీర్తనలో స్వామివారి వైభవాన్ని కీర్తించాలంటే.....
*****
ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||
మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు
తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||
పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||
*****
http://annamacharya-lyrics.blogspot.com/2007/09/301itanikamte-maridaivamu.html?m=1
🙏😊🍕💐🍧🍨🍦🌸
No comments:
Post a Comment