Tuesday, May 16, 2023

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 615వ జయంత్యుత్సవాంతర్భాగంగా "సుజనరంజని" వారిచే(శ్రీమహీధరసీతారామశర్మ గారు, శ్రీమతి వాడ్రేవు విద్యాభారతి గారు, శ్రీ గంధం బసవశంకర్ గారు, ఇత్యాది అన్నమయ్య పదసేవక మాన్యులు)నిర్వహింపబడిన అన్నమయ్యసంకీర్తనాగోష్ఠిగానం...

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 615వ జయంత్యుత్సవాంతర్భాగంగా "సుజనరంజని" వారిచే
(శ్రీమహీధరసీతారామశర్మ గారు, శ్రీమతి వాడ్రేవు విద్యాభారతి గారు, శ్రీ గంధం బసవశంకర్ గారు, ఇత్యాది అన్నమయ్య పదసేవక మాన్యులు)
నిర్వహింపబడిన అన్నమయ్యసంకీర్తనాగోష్ఠిగానం మరియు శ్రీ పొన్నాల వేంకటేష్ గారిచే సంకలనం గావింపబడిన "అన్నమయ్య నృసిమ్హ అష్టోత్తరశత సంకీర్తనలు" పుస్తకావిష్కరణ లో ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసిన, ఎంతో నిరాడంబరులు, వినమ్రులైన మాన్యులు, ప్రముఖ అన్నమయ్య పదవిశ్లేషక స్రష్టలు, శ్రీ తాడేపల్లి పతంజలి గారిని చాలా కాలం తరువాత ప్రత్యక్షంగా దర్శించిన భాగ్య విశేషం.....🙂🍕💐🥭🍊🍑🍎🍍🍓🇮🇳

ముఖే ముఖే సరస్వతి అన్నట్లుగా...
శ్రీవాణి కటాక్షాన్ని వారి పురాకృత భాగ్యవిశేషంగా సముపార్జించుకున్న వివిధ మహనీయుల దర్శన మాత్రం చేతనే ఎంతో పుణ్యప్రదమైన గీర్వాణి అనుగ్రహం అంతర్వాహిని గా లభ్యమై జీవితాలను తరింపజేస్తుంది అనేది మాన్యులైన పెద్దల మాట.....
మనిషి యొక్క సకలవిధమైన అభివృద్ధికి కారణం మనిషి యొక్క మేధోవైభవం....

బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగా....
మన యొక్క సత్కర్మలు మన మేధోవికసనకు కారణం అయ్యి మనకు పుణ్యాన్ని సంప్రాప్తింపజేసే సాధనములై అనుగ్రహిస్తాయి.....

కొన్ని సత్కర్మలు మనకు మనమే మన స్వాధ్యాయంతో గావించుకొని అందుకు తగిన పుణ్యసంచయం తో తరించవచ్చు...

ఫర్ ఎగ్సాంపుల్, మన ఇంట్లో నిత్యపూజ చేసుకొని తరించడానికి మనల్ని ఎవరూ ఆహ్వానించనవసరం లేదు కద...

కొన్ని సత్కర్మలు, వివిధ మాన్యుల సన్నిధిలో మనల్ని మనం చిత్తశుద్ధితో కొలువైఉండేలా గావించుకున్నప్పుడు, వారియందు పరిఢవిల్లే భగవద్విభూతుల కారణంగా, ఆయా ఉన్నతశ్రేణి కార్యాచరణవైపు మన బుద్ధి ప్రచోదనమై, చిత్తవృత్తులు తమకు తాముగా అటుగా పయనించి మన పుణ్యసంచయానికి కారణం అవుతాయి....

ఫర్ ఎగ్సాంపుల్, ఎప్పుడూ ఏదో ఒక లౌకిక పాటను వింటూ ఆనందించే శ్రవణేంద్రియం, ఒకనాడు ఒక మహాత్ముని సన్నిధిలో కొలువైఉండడంతో అన్నమాచార్య సంకీర్తనలోని అలౌకిక మధురిమను ఆస్వాదించి, అటుపిమ్మట చిత్తము వాటిని పరిశోధించే పనిలో నిమగ్నమై, అన్నమాచార్య సంకీర్తనాలాపన అనే పుణ్యక్రతువుల దిశగా జీవిత వ్యాపకం మలుపు తిరగడంతో,
ఆగామి కర్మలన్నీ కూడా భగవద్ అనుగ్రహంతో ఈశ్వరోణ్ముఖమైన చిత్తశుద్ధిభరిత సత్కర్మాచరణ కారణంగా పాపపుణ్య రహితమై, ఈశ్వర స్పృహతో కొనసాగుతున్న కర్మాచరణ కారణంగా ప్రారబ్ధం తేలికగా క్షయించిపోయి, విశేషభగవదనుగ్రహ కారణంగా సంచితం లుప్తమై... ఎల్లరి తుది మజిలి అయిన కైవల్యాన్నే సాధించి తరించగలడు మనిషి....!

కైవల్య సిద్ధిని గడించేంతటి మహత్వపూర్ణమైన పుణ్యార్జనకు కారణం ఏంటి...?
మూలం ఎక్కడ...?
నిజకర్తృత్వం ఎవరిది..?
అని అంటే....
ఒకానొక విశేషమైన భగవదనుగ్రహ సంపాక భరిత మహాత్ముడి దర్శనం, వారి యొక్క మహత్వపూర్ణమైన సద్వచనాల శ్రవణమననం....!

మహాత్ములు విచ్చేసే ప్రాంగణానికి వెళ్ళగలగడమే ఒక పెద్ద వరతుల్యమైన సౌభాగ్యం....
ఎందుకంటే ఒక మహాత్ముడితో మమేకమై ఉండే సదరు భగవద్ శక్తి ఎవరికిపడితే వారికి లభ్యమయ్యే విధంగా స్థిరీకరింపబడజలాదు....దర్శనీయమై ఉండజాలదు....

అంతటి పరిశ్రమతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న యోగ్యులకు మాత్రమే ఆ యోగమాయ అనే అదృశ్యరూప స్థిత భగవద్ శక్తి, "ఈశ్వర మాయ" అనే లౌకిక తెరను తొలగించి అసలైన భగవద్ శక్తిని గ్రాహ్యపరుస్తుంది...

సంస్కృతంలోని అనులోమవిలోమ విశేషంతో నిర్వచింపబడే

" ' మాయ ' అనగా ' యా మా '....
అనగా ఉన్నది లేనట్టుగా....లేనిది ఉన్నట్టుగా.....
అనిపించడం.... "

అనే వివరణను శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో అనుగ్రహించడం కొంతమంది ఆధ్యాత్మికవేత్తలకైనా గుర్తుండే ఉంటుంది.....

" బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య " అనే అద్వైత వచనవ్యాఖ్యానంలో....
" జాయతే గచ్ఛతే ఇతి జగత్.. " అనే వ్యుత్పత్తి ప్రకారంగా...
వస్తూపోతూ ఉండేది జగత్తు...

మాయ యొక్క సాపేక్ష ఉనికిలో... 

ఉన్నది ఏంటి..?
లేనిది ఏంటి...?
ఉండికూడా లేనట్టుగా ఉండేది ఏంటి..?
లేకున్నా కూడా ఉన్నట్టుగా అనిపించేది ఏంటి..?

అనే గహనమైన తాత్త్వికతవైపుగా మనిషి అలోచించగలిగినప్పుడు ఆ ఈశ్వరమాయ యొక్క లక్షణం గురించి అవగతమై....
సద్గురువుల మాటల్లోని ఆ
" మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మమహిషీ..."
గా స్తుతింపబడే ఆ యోగమాయ తన పగ్గాలను మనిషికి అందించి ఆ మాయకు ఆవల ఉండే భగవద్ దర్శనాన్ని అనగా సర్వేసర్వత్రా వ్యాపించి ఉండే శాశ్వతమైన ఈశ్వరత్వం యొక్క ప్రస్ఫుటగ్రాహ్యస్థితిని మనిషికి ఎరుకపరిచి తరింపజేస్తుంది....

హాల్ రూం నుండి కిచెన్ రూం కి మధ్యలో ఉండే తెరను తొలగించి, కిచెన్ లో ఉన్న అమోఘమైన క్యారెట్ హల్వా ను ఆరగించడం.... అనేలా.. అలా అనేయడం చాలా సింపుల్ గా అనిపించినా ఆ యోగమాయ యొక్క తెర తొలగి ఈశ్వరచైతన్యగ్రాహ్యస్థితిలో చిత్తము స్థిరీకరింపబడడం అనేది అంత తేలికైన విషయం మాత్రం కాదు....
ఎందుకంటే అందుకోసం ఎంతో కఠోర అధ్యాత్మ పరిశ్రమ అనేది అనివార్యమై ఉంటుంది కాబట్టి.....

అంతటి కఠోర అధ్యాత్మ పరిశ్రమను సలిపే తీరిక, ఓపిక, మేధోసంపత్తి, శౌచసంపత్తి, మనోలగ్నత, ఈ కలియుగమానవులకు ఉండజాలవు కాబట్టి శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు నిర్హేతుక దయాస్వరూపులై శ్రీవేంకటహరి సంకీర్తనం అనే మహిమాన్వితమైన సరళమైన అధ్యాత్మ పరిశ్రమ అనే మార్గంలో ఆ యోగమాయ యొక్క తెర గురించి చక్కగా అవగతమయ్యేలా చేసి, హరిభక్తి అనే సాధనంతో సదరు భక్తుడికి ఆ మాయ స్వప్రకాశక తత్త్వంగా గోచరమయ్యే విధంగా శ్రీవేంకటహరిసంకీర్తనాసారస్వతంగా ఆ విశేషభగవద్ అనుగ్రహాన్ని భక్తుకెల్లరికి తరించమని అందించినారు.....

ఫర్ ఎగ్సాంపుల్, "నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు..." అనే మహత్తరమైన సంకీర్తనలోని 2వ చరణంలో గమనించగలిగితే.....

ఈశ్వరుడి విశ్వరూపాన్ని వర్నిస్తూ,
అవ్యక్తుడు, అద్వందుడు, అనే నిర్వచనాలతో శ్రీవేంకటహరిని అన్నమాచార్యులు
స్తుతించినారు....

*****
చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు
*****

ఈశ్వర తత్త్వం అవ్యక్త తత్త్వం అయితే,
మరి తెలిపేదేలా...తెలిసేదెలా....?

ఈశ్వర తత్త్వం అద్వంద్వ తత్త్వం అయితే,
ఇక తెలపడానికి వేరే ఏముంటుంది...తెలిపేది ఏముంటుంది...?

కాబట్టే అణువుకన్ననూ సూక్ష్మమైన, ఆకాశం కన్ననూ ఘనమైన, ఆ అవ్యక్త, అద్వంద్వ, ఈశ్వరత్వాన్ని
తిరువేంకటాద్రి విభుడి రూపంలో ఆరాధించి తెలుసుకోవే ఓ మనసా అంటూ అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనకు కొసమెరుపును రంగరించినారు....

" యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు "..... 

ఎంతో ఘనంగా ఆ శ్రీవేంకటహరి శ్రీపాదయుగళాన్ని 

"బ్రహ్మ కడిగిన పాదము...
బ్రహ్మముతానైన పాదము..."

అంటూ కీర్తించిన అన్నమాచార్యుల వారు...

ఆ అమితాశ్చర్యకరమైన పరమాత్మ తత్త్వం గ్రాహ్యమవ్వడానికి కేవలం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే సాధనం కాబట్టి....
స్వామివారి శ్రీపాదాల్లో దాగిఉండే బ్రహ్మాండవ్యాప్తమైన పరబ్రహ్మతత్త్వాన్ని
" ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది "
అంటూ ఇవ్విధంగా కీర్తించారు...

@
http://annamacharya-lyrics.blogspot.com/2007/02/130i-padamekada.html?m=1

ప|| ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |
ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||

చ|| ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది |
యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |
యీపాదమే కదా యెలమి బొంపొందినది |
యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||

చ|| ఈ పదమే కదా యిభరాజు దలచినది |
యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |
యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||

చ|| ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది |
యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది |
యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||

[ 2012 లో మొట్టమొదటి సారి శ్రీవారి సేవలో పాల్గొన్నప్పుడు లభించిన నా జీవితంలోని మొట్టమొదటి తిరుమల ఆర్జితసేవాటికెట్ " శుక్రవార నిజపాదదర్శనం సేవ ".
అప్పుడు CRO దెగ్గర రాత్రంతా లైన్లో వేచిఉండి ఢిల్లి నుండి శ్రీవారిసేవకు వచ్చిన అప్పటి TBP బృంద సభ్యులు భోళా గారు, IIT నరేష్ సర్ గారు, చెప్పడంతో వాళ్ళతో పాటు వెళ్ళగా ఇంకొందరు భక్తులందరికీ కూడా లభించిన సేవా టికెట్...
ఆ " శుక్రవార నిజపాదదర్శనం సేవ " నా జీవితాన్ని సమూలంగా శ్రీవేంకటహరికి ఎంతో దెగ్గరగా చేసిన సంఘటన... ఆ తరువాత కూడా ఎన్నో సార్లు 
" శుక్రవార నిజపాదదర్శనం సేవ " టికెట్ లభించినా సరే..,ఆనాటి తొట్టతొలి నిజపాదదర్శనం అనుగ్రహించిన భగవద్ స్మృతులు ఎన్నో ఎన్నెన్నో.....

ఆతరువాత 2013 జనవరిలో మొట్టమొదటి సారి TTD వారు కాకినాడ పట్టణంలోని భానుగుడి జంక్షన్లో నిర్వహించిన శ్రీవేంకటేశ్వరవైభవోత్సవాల్లో, శ్రీచాగంటి సద్గురువుల పర్యవేక్షణలో, శ్రీ సుబ్రహ్మణ్యశర్మ గారి బ్రహ్మత్వంలో నిర్వహింపబడిన శ్రీమదలర్మేల్మంగాపద్మావతి శ్రీనివాసకళ్యాణోత్సవంలో...,  కంఠస్థమైన శ్రీనివాసగద్యాన్ని గుక్కతిప్పుకోకుండా ఆలపించగల వరిష్ఠులైన ఒక TTD స్మార్త సంప్రదాయ సత్బ్రాహ్మణోత్తమ అర్చకుల ఆశీస్సులు / అనుగ్రహం నా జీవితానికి ఎంతో విశేషమైన శ్రీవేంకటేశ్వరానుగ్రహాన్ని ప్రసాదించి తరింపజేసిన విశేషం.... ]

అన్నమాచార్య తిరువడిగలే శరణం.....
ఓం నమో అన్నమార్యవందితాయ....
ఓం నమో వేంకటేశాయ.....
🙏🙏🙏🙏🙏🙏🙏
🙂🍕💐🍓🍍🍧🍿🍏

No comments:

Post a Comment