💐🙂🍿🍏🍧🍍🍓🍕🥭🍦🍨🇮🇳
మహిమాన్వితమైన కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఆపోసన పట్టిన అగ్రశ్రేణి భారతగాయనీమణుల్లో
ఒకరిగా, ఎంచుకున్న భాష ఏదైనా, పాట ఏదైనా, నూటికి నూరుపాళ్ళు ఎంతో వైభవభరితమైన గాత్రధర్మంతో
సినీసంగీతకళామతల్లికి ఒక మణిపూస వంటి వర్సటైల్ సింగర్ గా కల్పన గారిది సంగీతప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానం మరియు విశేషమైన ప్రస్థానం....
చుట్టూ ఉండే మనవారు అని అనుకున్న వారందరూ ప్రోత్సహించే వాతావరణంలో నుండి గొప్ప గొప్ప కళాకారులు ఆవిర్భవించడం వేరు....
మనవారిగా చుట్టూ ఉండే వారే ఎన్నో ప్రతికూల పరిస్థితులను కల్పించినా సరే...వాటన్నిటి త్రోసిరాజని ఈశ్వరానుగ్రహమైన ప్రతిభకు పట్టంకట్టే వారే మన అసలైన శ్రేయోభిలాషులు అని భావించి మొక్కవోని పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ఒక మేటి కళాకారులుగా రాణించడం వేరు.....
ఈకోవకు చెందిన కల్పన గారి గాత్రవైభవం ఎన్నో పాటల్లో ఎందరో తెలుగు శ్రోతలకు సుపరిచితమే....
"సఖి" మూవి లో వారు ఆలపించిన "అలై పొంగెరా... కన్నా...." అనే ఆల్ టైం గొల్డెన్ హిట్ తెలియని సంగీతాభిమానులు ఉండరని నా అభిప్రాయం...🙂
"నమ్మిన నామది మంత్రాలయమేగా...." అనే
"రాఘవేంద్ర" మూవిలోని వారి గొప్ప ఆలాపన కూడ నేను చాల సార్లు విన్న పాటల్లో ఒకటి...
"శ్రీఆంజనేయం" మూవిలోని "శ్రీఆంజనేయం" అనే వారి ఆలాపన ఆ మూవికి ఒక గొప్ప ఆడియో సక్సెస్ ని అందించిన ఆలాపన....
కల్పన గారి గాత్రప్రస్థానం మరెన్నో మేటిశిఖరాలను అధిరోహించే దిశగా సాగాలని అభిలషిస్తూ, వారికి ఒక సంగీతాభిమాని యొక్క హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులు...
Many happy returns of the day to you Kalpana ma'am...Stay blessed and keep singing....
🙂🍨🍦🥭🍕🍓🍧🍏🍿💐🍨🙏
No comments:
Post a Comment