" నువ్వొస్తానంటే నేనొద్దాంటానా..(2005) " చిత్రంలోని "ఘల్ ఘల్..." అనే పాటకు సిరివెన్నెల గారు అందించిన ఈ క్రింద పేర్కొనబడిన సాహితీ సౌరభం....
మరే కవికి కూడా సాధ్యం కాదేమో అనేంతటి రీతిలో వారు అందిచడం సాహితీ లోకానికి విదితమైన సత్యం.....
*****
ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎదిగే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
*****
శ్రీ సిరివెన్నెల గారు రచించిన కొన్ని వందలాది అత్యత్భుతమైన సాహితీ ఝరులు కోకొల్లలు గా ఉన్నా....పర్టిక్యులర్ గా ఈ పాటనే వారి కవన ప్రత్యేకతను వర్నించడానికి ఎందుకు ఉటంకిస్తున్నానంటే....
ఒక భావాన్ని భావయుక్తంగా ఆవిష్కరించడం అనే కవనప్రక్రియలో...
ఆ భావంలోని గాంభీర్యాన్ని ఎంతో వైభవోపేతంగా
ప్రకటిస్తూనే ఆ భావం యొక్క సరళ గ్రాహ్యత్వాన్ని కవనంలోనే పొందుపరచి రచించడం అనేది కేవలం ఉత్కృష్టమైన ఉన్నతశ్రేణి కళాకారులకు, ఆ కళామతల్లి అనుగ్రహాన్ని సంపూర్ణంగా గైకొన్న వాగ్దేవి వరపుత్రులకు మాత్రమే సాధ్యమయ్యే కవన ప్రక్రియ....
ప్రేమ అనే ఒక భావనను ప్రేమ అనే మాట ద్వారా ఎల్లరూ ఎప్పుడోఒకప్పుడు వ్యక్తపరచడం అనేది సాధారణంగా లోకంలో మనం ఎప్పుడూ చదువుతూ / చూస్తూ / వింటూనే ఉంటాం...
ఒక సినిమా యొక్క ఆడియో / ప్రి-రిలీస్ ఫంక్షన్లో, లేక మరో ఇతర ఫంక్షన్లో.... అక్కడికి విచ్చేసిన ముఖ్యాహ్వానితులను సంబోధిస్తూ...
" వారంటే వీరికి ఎంతో ప్రేమాభిమానం....అందుకే ఎంత బిజిగా ఉన్నా సరే ఈ వేడుకకు పిలవగానే వచ్చారు....
అది...ఇది...."
అంటూ ఉండే ప్రముఖుల స్పీచెస్ దెగ్గరినుండి.....
"రెయ్..నీకు నిజంగా నాపై ప్రేమాభిమానం ఉంటే ఓ 500 ఇవ్వురా...తర్వాత ఉన్నప్పుడు తిరిగిచ్చేస్తాలే..."
అని ఒక ఫ్రెండ్ కి బిస్కెట్ వేసే మరో ఫ్రెండ్ యొక్క క్యాజువల్ డైలాగ్స్ వరకు.....
ప్రేమ అనేది ఎల్లరిచే ఎంతో ఈజీ గా వాడబడే పదం గా ఈ లోకంలో ప్రాచుర్యం పొందడం అనేది ఎల్లరికీ విదితమే.....
ప్రేమ అని పిలవబడే అంతటి క్యాజువల్ పదానికి ఎంతో గొప్ప స్థాయిని ఆపాదిస్తూ ఎంతో సరళంగా వర్నిస్తూ...
అది చరితలకు, కవితలకు, సప్తస్వరాలకు కూడా అందని మధురమ అని నిర్వచించడం అంత తేలికైన కవనం మాత్రం కాదు...
(పాట విన్న వారికి తెలిసినట్టుగా ఆ పదాలు ఎంతో సోయగంతో సంగీతంలో ఇమిడినవి...)
ఎంతో గంభీరంగా గర్జిస్తూ ఆకాశంలోని మేఘమండలం వర్షించే గొప్ప జలరాశిని ఎంతో గుంభనంగా తనలో ఒడిసిపట్టి ఉప్పొంగే ఉత్తుంగతరంగమై ప్రవహిస్తున్న ఒక నదీప్రవాహం యొక్క ఒరవడికి కారణం ఏ తొలి చినుకు అని ప్రశ్నిస్తూ.....
ఒక ప్రశాంత ప్రవాహం విజృంభించే జలతరంగం గా పరిణమించడం అనే ప్రక్రియను వివరించే క్రమంలో...
మనిషి యొక్క జీవన గతి కూడా నిర్వచింపబడి ఉన్నది.....
పంటకొచ్చిన సిరిపైరు ఎంత పద్ధతిగా వంగి నమస్కరించిన విధంగా ఉంటుందో...
శ్రీచాగంటి సద్గురువులు ఒక ప్రవచనంలో, సభకు విచ్చేసి నమస్కరిస్తున్న ఆహ్వానితులందరిని సస్యలక్ష్మీ స్వరూపంగా వర్నిస్తూ, సిరిపైరును ఉటంకిస్తూ, గౌరవ వచనాలను పలకడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది....
శ్రీఆంజనేయం (2004) మూవిలో...
ఒక అమాయక పల్లె కుర్రాడు హనుమతో సాగించే సంభాషణలా....ఉండే పాటలో కూడా ఒక వైపు ఎంతో అమాయక పదాలతో హనుమను సంబోధించడం.....
మరో వైపు హనుమంతుని భవుష్యద్ బ్రహ్మత్వాన్ని కూడా సంబోధించేంతటి కవనప్రౌఢిమను కనబరచడం సిరివెన్నెల గారికే చెల్లింది.....
*****
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా....
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ...
ప్రసన్నాంజనేయం అనే నామధేయం...
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం...
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
*****
ఇక వన్ ఆఫ్ ది రీసెంట్ మూవీస్
"లైఫ్ ఆఫ్ రాం..." లోని " ఏ దారేదురైనా
ఎటువెలుతుందో అడిగానా " అనే పాటలో
నా హృదయాన్ని ఎంతగానో ఆకట్టుకున్న కవనం...
*****
ఉదయం కాగానే
తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా
ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా
*****
ఈ పాట యొక్క
లిరిక్స్ సిరివెన్నెల గారికి ఎన్నో జాతీయ అవార్డులు అందించేంతటి ఘనమైన కవనం అని నా భావన....
*****
ఏ దారేదురైనా
ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై
ప్రవాహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా
నీ వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో
కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా
త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట
నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా
ఓ ప్రశ్నై ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చెరపొద్దని
కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు
దయుంచి ఎవరు..!
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాల్లుగా తన వెన్నంటి
నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుసగుస కబురుల గుమగుమ లెవరివి
ఉదయం కాగానే
తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా
ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా
గాలి వాటం లాగా… ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏ చోటా
నిలకడగ ఏ చిరునామా లేక
ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక, మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు
దయుంచి ఎవరు..!
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాల్లుగా తన వెన్నంటి
నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుశలము అడిగిన
గుసగుస కబురుల ఘుమఘుమ లెవరివి
లోలో ఏకాంతం… నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా, విన్నారా
నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిల్లి అంత దూరానున్నా
వెన్నెలెగా చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది, జోలాలి
తానే నానే నానినే… తానే నానే నానినే
*****
వారి " విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..." అనే పాట వరకు....
కాల చక్రంలో వెనక్కి ప్రయాణిస్తే ఇటువంటి ఎన్నో ఎన్నెన్నో అత్యత్భుత సృజనాత్మక సాహితీ కాళాకృతులు సిరివెన్నెల గారి సాహిత్యలోని గాంభీర్యం యొక్క లోతును కనుక్కోలేని ఎప్పటికీ పూర్తవని కథలా మనకు తారసపడుతూనే ఉంటాయ్.....
ఆ వాగ్దేవి వరపుత్రులకు, వారి జయంతి సందర్భంగా
ఒక సాహిత్యాభిమాని యొక్క చిరు సాక్షర సవినయనివాళి భరిత నమస్సుమాంజలి....💐🙏
No comments:
Post a Comment