శ్రీశోభకృత్ నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి ప్రయుక్త పూర్వాభాద్ర నక్షత్రం, శ్రీ హనుమద్ జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులు.....💐🙂🍿🍨🍏🍕🍓🥭🇮🇳
శ్రీవేదవ్యాసమహర్షి గారి తండ్రిగారైన శ్రీ పరాశర మహర్షి యొక్క పరాశరసమ్హిత, హనుమంతుడి ఐతిహ్యానికి సప్రామాణికమైన సనాతన సారస్వతంగా అనాదిగా భాసిల్లుతున్నది అని సద్గురువుల ఉవాచ....
పరాశర సమ్హిత ప్రకారంగా హనుమద్ జన్మోత్సవం, వైశాఖ బహూళ దశమి....
శ్లో|| వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే|
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే||
అంటే వైశాఖ బహుళ దశమీ, శనివారం, మంద/స్థిర వాసర పూర్వాభాద్ర నక్షత్రం లో హనుమ స్వామి జన్మించారు. కావున నేటి తిథి, అనగా శ్రీశోభకృత్ నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి ప్రయుక్త పూర్వాభాద్ర నక్షత్రం, శ్రీ హనుమద్ జన్మదినోత్సవం గా సంప్రాదాయ సనాతనధర్మావలంబకులందరూ జరుపుకునే మహోత్సవం....
భర్జనంభవబీజానాం
ఆర్జనంసుఖసంపదాం
తర్జనమ్యమదూతానాం
రామరామేతిగర్జనం
అని శ్రీరామరక్షాస్తోత్రం లో ఆర్ష విజ్ఞ్యాన ప్రాజ్ఞ్యులు తెలిపినట్టుగా,
ప్రత్యక్షపరమాత్మ అయిన శ్రీసూర్య భగవానుడి నుండి,
శ్రీచాగంటి సద్గురువులు తెలిపినట్టుగా...
ఈ విశ్వంలో మరెవ్వరికి సాధ్యం కాని రీతిలో, ఉదయాద్రి ని, అస్తాద్రి ని ఆలంబనగా గావించి, అప్రతిహత భానుడి చండప్రచండ గమనానికి అనుకూలంగా, సమాంతరంగా ఆకాశగమనం గావిస్తూ సకల విద్యలను, గడించిన వాయుసుతుడి ఆరాధన ఆనాటి త్రేతాయుగం నుండి ఈనాటి కలియుగ రోజుల వరకు....
ఆ శ్రీరామ తారక మంత్రాన్ని, నిత్యమూ జపిస్తూ లోకమంతటా ఎక్కడెక్కడ శ్రీరామ నామం యొక్క స్మరణ, మనన, జపము గావింపబడుతూ ఉండునో అక్కడక్కడ ఎన్నో ప్రచ్ఛన్న రూపాల్లో ప్రత్యక్షమయ్యే సప్తచిరంజీవుల్లో ఒకరైన శ్రీఆంజనేయుడు గావించే శ్రీరామ నామ స్మరణ, జపం, తపం మనలాంటి సామాన్య మానుష భక్తుల యొక్క శ్రీరామ నామ స్మరణ, జపం, తపం లా ఉండదు.....
ఎందుకంటే మన స్మరణ, జపం, తపం మనం లెక్కించుకుంటూ ఎన్ని 108 సార్లు జపం పూర్తయ్యిందో అని లెక్కలు వేసుకొని ఏదో ఒక కోరికను / ఈప్సితాన్ని ఈడేర్చుకునే ప్రయాసలో వాటి యొక్క ఫలితాన్ని ధారపోసి మళ్ళీ ఖాళీ కమండలంలోకి గంగా జలాన్ని నింపుకోవడానికి కాశి క్షేత్రానికి వెళ్ళే ప్రయాసలా....
శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో...
శ్రీ విశ్వామిత్ర మహర్షి వారు రాజర్షి నుండి మహర్షి నుండి బ్రహ్మర్షి స్థాయికి చేరుకోవడానికి కష్టపడి ఆర్జించిన తపః శక్తి, వాణ్ణి వీణ్ణి తిట్టిపోయడంలో ఖర్చైపోవడంతో మళ్ళీ తపస్సు మొదటి నుండి మొదలు పెట్టిన రీతిలో ఉండే లౌకిక తపస్సు......
త్రిపురాసురవధ వృత్తాంతంలో భాగంగా శ్రీమన్నారాయణుడికి రుద్రుడు ఇచ్చిన వరం కారణంగా,
సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడిగా ప్రభవించిన హనుమంతులవారు గావించే శ్రీరామ జపం అనేది
శ్రీభువనేశ్వరి బీజాక్షరమైన హ్రీం బీజగర్భితమైన తపస్సు కారణంగా హనుమంతుడి శ్రీరామ నామ జప తపో శక్తి అనేది ఎవ్వరూ అధిరోహించనలవి కాని కైలాసపర్వత సదృశమైన ఒక అమేయమైన, అవ్యక్తమైన, అనిర్వచనీయమైన అనితరసాధ్యమైన మహా తపః శక్తి...
అది చతుర్వేదాల సారాన్ని సోమరసంగా గ్రహించి ఒక నిష్ణాతుడైన సోమయాజి నిత్యం నిర్వహించే ఒక మహామహిమాన్వితమైన వజ్రలింగం యొక్క నిత్య రుద్రాభిషేక ప్రయుక్త నిత్య శ్రీరుద్రయాగ సమమైన తపోబల శక్తి....
నిత్య నిర్మల ప్రవాహమైన గంగా నది నుండి ఒక కమండలం లోకి నీళ్ళు తీసుకొని ఇతరుల మీద జల్లిన తర్వాత గంగా నదిలో ఎంత గంగా నదీ జలం మిగిలి ప్రవహిస్తూ ఉంటుందో...
అవ్విధమైన సామ్యము కలది శ్రీహనుమంతుల వారి
" శ్రీరామజయరామజయజయరామ "
అనే త్రయోదశాక్షరి యొక్క
శ్రీరామ నామ జప తపో శక్తి.....
ఈ టపాకు ఆఖరున జతపరిచిన 2020 లో రాసుకున్న నా పాతపోస్ట్లో శ్రీరామ త్రయోదశాక్షరి తారక మంత్ర వైభవంలో దాగున్న శాక్తేయ బీజాక్షర వైభవం గురించి ఎక్కడా పరిధి దాటకుండా కొంత వివరించాను...
కాబట్టి మన లాంటి మామూలు మనుషులు గావించే శ్రీరామ నామస్మరణ కు శ్రీహనుమంతుల వారి యొక్క శ్రీరామ నామస్మరణకు భూమ్యాకాశముల భేదం ఉంటుంది....
అవి కేవలం ఒక సద్గురువుల అనుగ్రహమైన వాక్కు మనసులో మహామంత్రంగా విస్తృతమైన అధ్యాత్మ సాధకులకు మాత్రమే అవగతమయ్యే దైవికాంశాలు....
శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఒక చోట వివరించిన విధంగా, కదలీఫలవనంలో
(అనగా శ్రీశైలం లోని కదలీవనం అని కాదు నా ఉద్దేశ్యం...మామూలుగా ఎన్నో చోట్ల ఉండే అరటి తోటలు)
ధవళ వస్త్రాలను శ్రీ హనుమంతుల వారికి ప్రతీకగా ఒక సత్బ్రాహ్మణోత్తములకు ప్రసాదించడం ఎంతో శీఘ్రగతిన వాయుసుతుడి అనుగ్రహానికి, ప్రీతికి కారణం అవుతుంది...
ఆంజనేయుడికి అరటితోటలంటే ఎందుకంత ప్రీతి అని కొందరు అధ్యాత్మికవేత్తలైనా ఎప్పుడో ఒకప్పుడు వివేచన సాగించి ఉంటారు....
" ఓం కదలీవనసంవృతాయ నమః "
అనే సుందరహనుమద్ మంత్రంలోని నామాల్లో కూడా అరటితోటలో ఆంజనేయస్తుతి గురించి
విజ్ఞ్యులు గమనించవచ్చు...
మరియు ఆంజనేయాష్టోత్తరశతనామావళి లోని
"ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః " అనే 20 వ నామం తో హనుమకు పారిజాతవనం అంటే చాలాప్రీతి అని తెలియవస్తున్నది కద...
"ఒక్కో ప్రయోజనార్ధమై ఒక్కో రీతిలో ఆయన ధరించేవి ఎన్నెన్నో కామరూపాలు...
కాని వారు సహజంగానే
"ఓం హరిమర్కటమర్కటాయ నమః" కనుక అరటి పళ్ళు అనేవి మర్కటాలకు సహజంగానే ఇష్టం కాబట్టి...."
" ఓం కదలీవనసంవృతాయ నమః " అనే నామం కావొచ్చు.....
మరియు
పూలమాలలను ఏదో సరదాకు మెడలో వేసుకోవడం మర్కటాలకు సరదా అనో లేక ఎన్నో పువ్వుల మాదిరి పారిజాతపుష్పమాలలు కూడా హనుమంతుల వారికి ఇష్టమే కాబట్టి
" ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః " అనే నామం కావొచ్చు.....
అని అనేయడం ఒకింత సహజమే అయినా....
ఇక్కడ ప్రశ్న కదలీ ఫలాల గురించి, పారిజాతపుష్పాల గురించి కాదు....
కదలీవనం గురించి....మరియు
పారిజాత వృక్షం గురించి.....
కాబట్టి ఈ కదలీవనం సంగతేంటో...
పారిజాతవృక్షం సంగతేంటో...
వీటి తత్త్వసమన్వయం ఏంటో....
అనేది " ఓం తత్త్వజ్ఞ్యానప్రదాయకాయ నమః " గా ఆరాధింపబడే హనుమంతుల వారి అనుగ్రహంగా కొంత తర్కిద్దాం.....
పారిజాత వంగడాలు అనేకం కలవు....
సాధారణంగా మన చుట్టూ ఉండే కొందరి ఇళ్ళలో కనిపించే నారింజ / ఆరెంజ్ కలర్ కాడ కలిగిఉండే తెల్లని పరిమళభరిత పుష్పాలను అందించే సాధారణ పారిజాతం చెట్ల వంగడాలు మొదలుకొని, అడవి పారిజాతం అనే అరుదైన పుష్పాలను అందించే పారిజాతం చెట్లు మరియు మర్త్యులకు దుర్లభమైన స్వర్గలోకం లో క్షీరసాగరమథనంలో ఉద్భవించి కొలువుతీరిన దేవపారిజాతం అనే దైవిక వృక్షం...
అట్లే అరటి చెట్లు కూడా అనేక వంగడాలు కలవు.....
సాధారణంగ మన చుట్టూ ఉండే
సంతలో విక్రయింపబడే కూర గా వండడానికి యోగ్యమయ్యే ఆకుపచ్చని అరటి కాయ వంగడాలు,
సాధారణంగా అందరూ తినే పసుప్పచ్చ అరటి పండ్ల వంగడాలు, చక్కెరకేలి అరటి పండ్ల వంగడాలు, మరియు పెద్దగా ఎర్ర రంగులో ఉండే అరటి పండ్లు, (ఈ ఎర్ర అరటి వంగడాలను, తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్ వెళ్ళినప్పుడు అక్కడి దుకాణాల్లో దర్శించవచ్చు...)
మరియు ఏనుగులు ఆరగించడానికి కూడా టైం పట్టే, సౌత్ అమెరికా అడవుల్లో పెరిగే జంబో సైజ్ అరటి పండ్ల వంగడాలు....
అరటి పండును రంభాఫలం అని సంబోధించడం / రంభ అనే దేవలోక అప్సరస ఒకానొక సందర్భంలో శాపవశాత్తు అరటి చెట్టుగా భూలోకంలో జన్మించడం ఇత్యాదిగా కూడా అరటి చెట్ల గురించి వినే ఉంటారు.....
బిల్వం,పనస,నేరేడు,మామిడి, ఇత్యాదిగా ఉండే వివిధ దేవతా వృక్షాలుగా పరిగణింపబడే
జాతులకు సంబంధించిన చెట్లు కాబట్టి.....
ఒక దేవతాంశ / రుద్రాంశ సంభూతుడిగా, భువిపై ప్రభవించిన భాగవతోత్తముడు కాబట్టి హనుమంతులవారికి కూడా దేవతా వృక్షాలైన అరటి, పారిజాతం అనేవి ప్రీతికరమైనవి....
అని అనడం సాధారణం....
తత్త్వతః అరటి చెట్టు యొక్క వైభవాన్ని గమనిస్తే అది శాఖారహితమైన వృక్షం...
ఎంత చిన్న అరటి చెట్టైనా...పెద్ద అరటి చెట్టైనా....
వాటికి కొమ్మలు ఉండవు....
అనగా ఆకులు రాలడం మళ్ళీ వాటి స్థానంలో కొత్త ఆకులు చిగురించడం అనేవి ఉండవు....
అరటి పండ్లు కూడా అరటి చెట్టు కొమ్మలకు కాయవు...
అరటి చెట్టుకు ఒక నిర్ణీత వయసురాగానే
ఒక అరటి పువ్వులా మొదలైన గెలకు చిన్న చిన్న కాయలుగా ఒక క్రమంలో / ప్యాటర్న్ లో మొదలైన అరటి పూత క్రమక్రమంగా పెరిగి పెద్దదై ఒక పరిపూర్ణమైన అరటి గెలగా రూపాంతరం చెంది...
అరటి గెలకు కాసిన ఎన్నో అరటి కాయల్లో ఏ ఒక్క అరటి పండు పండినా చాలు ఇక ఆ గెలమొత్తం తనకుతానుగా అన్ని కాయలను పండించేయగలదు....
అరటి చెట్టునుండి విడివడినాసరే....!
సాధారణంగా పెరిగి పెద్దదైన ఒక్కో అరటి చెట్టు ఒక్క గెల మాత్రమే తొడిగి, అరటి ఆకులు భోజనం వడ్డించడానికి పాత్రగా ఉపయోగింపబడి, అరటి కాండం దీపారాధనకు, ఇతర ఆయుర్వేద ఔషధాలకు ఉపయోగింపబడిన తదుపరి లయించే అరటి చెట్టు మొదట్లో పెరిగే చిన్నచిన్న అరటి పిలకలు అరటి చెట్లుగా పెరగడం అనేది అరటి చెట్ల వికసన శైలి....
అరటి చెట్టు యొక్క ఈ వికసన శైలి అనేది అధ్యాత్మ సాధకులు భగవద్ అనుగ్రహసిద్ధి గడించే శైలికి అద్దంపట్టే ఒక యోగ సాధన ప్రక్రియ....
ఒక భగవద్ స్వరూపం యొక్క అనుగ్రహాన్ని అపేక్షించే సాధకుడు, ఒక సంకల్పంతో మొదలుపెట్టి తదేక ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, సదరు భగవద్ స్వరూప అనుగ్రహసిద్ధికై ప్రార్ధిస్తుంటాడు.....
ఆ కాయిక, వాచిక, మానసిక, సంఘటిత త్రికరణాత్మక నిర్ణీతకాల తపస్సు అనేది ఒక త్రితల అరటి చెట్టుకు ప్రతీక.....
ఒక త్రితల అరటి చెట్టు అనగా భూమిలో వేర్లు, మధ్యమున కాండము, అంత్యమున అరటి ఆకులు అనే మూడు స్థాయిలలో కొలువై ఉండే ఒక దైవిక కదలీ భూజము....
ఆ నిర్ణీతకాల తపస్సుకు ఫలితంగా గా జనించే ఒక విశేషమైన గ్రాహ్యమైన భగవద్ స్పృహ అనేది.....
ఒకానొక అరటి చెట్టుకు నిర్ణీతసమయంలో వికసించన ఒక అరటి పువ్వుకు ప్రతీక.....
ఆ విశేషమైన గ్రాహ్యమైన భగవద్ స్పృహ నుండి ఆవిర్భవించి క్రమక్రమంగా వృద్ధిచెందే భగవద్ భక్తి భరిత సంకల్ప జనిత భగవదనుగ్రహమే సదరు ఈప్సితాన్ని ఈదేర్చే సాధనం....
క్రమక్రమంగా వృద్ధిచెందే సదరు అరటి గెల ఆ భగవదనుగ్రహానికి ప్రతీక....
ఒకానొక ఆగామి కర్మయొక్క ఫలితంగా ఒకనాటికి తప్పకుండా పండే సదరు వృద్ధిచెందిన అరటి గెల అనేది మన ఈడేరే ఈప్సితానికి ప్రతీక.....
సదరు ఈప్సితము ఈడేరడంతో పూర్తైన ఆ నిర్ణీతకాల తపస్సు అనేది ఒక EJB లాంటిది...Java software beans లో Java bean object persistence duration గురించి తెలిసినవారికి తెలిసినట్టుగా...అది ఒక సెషన్ వరకు మాత్రమే అప్ప్లికబుల్ అయ్యే తపస్సు...
Automatic Java GC తో క్లియర్ అయిన పాత Java bean object కి సంబంధించిన class ని మళ్ళీ re-instantiate చేస్తే మళ్ళీ ఒక కొత్త EJB session మొదలై మనకు కావలసిన Enterprise Java Business logic ని execute చేసే ఒక కొత్త persisted time duration java object చిగురించడం అనేది ఒక అనుబంధ అరటి పిలక అరటి చెట్టై పరిణమించి అరటి గెలను తొడిగే ప్రక్రియకు ప్రతీక.....
ఇలా ఎన్నో అరటి చెట్లు ఎన్నో అరటి గెలలను తొడిగి అవి పండ్లై ఆరగించి తరించిన మనిషికి,
అనగా ఎన్నో కోరికలతో భగవంతుణ్ణి ఆరాధించిన భక్తుడుకి....,
ఒకనాడు కేవల భగవద్ అనుగ్రహంగా, ఎప్పుడూ చూసినా మనం ఆరగించడానికి మాత్రమేనా లేక భగవంతుడి అనుగ్రహ ఫలం అనేది భగవంతుడికే నైవేద్యం గా సమర్పింపబడి చిత్తశుద్ధితో గావింపబడిన ఫలాపేక్ష రహితమైన ఆగామికర్మలఫలితంగా ముక్తిని బడసి తరించడం అనే ప్రక్రియ గురించి కూడ ఏమైనా తెలుసుకొని తరించడం అనే ప్రక్రియ కూడా ఉంటుందా.....
అనే దిశగా మనిషి రీసర్చ్ చేయడం స్టార్ట్ అవ్వగా, ఒక నాడు ఆ ముక్తి కూడా భగవద్ అనుగ్రహంగా
సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య ముక్తిగా కైవల్య సిద్ధి కరతల ఆమలకమై మనిషి తన మానుష జన్మప్రయోజనాన్ని సాధించి తరించగలడు అనేది...
భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా వర్ధిల్లే ఆచార్య స్వరూపులకు ప్రతీకగా అధ్యాత్మ ప్రపంచంలో ఆంజనేయుడిని ఆరాధించడం అనే సంప్రదాయంలో భాగంగా ఒక సత్సంప్రదాయ తత్త్వ వైభవం....
ఇదన్నమాట అరటి చెట్లు / అరటి తోటలు అనేవి ఆంజనేయుడికి ప్రీతిపాత్రమైనవిగా చెప్పబడే తత్త్వ్తం.....
అందుకే అన్నమాచార్యుల వారు....
" ఒక్కడే ఏకాంగవీరుడుర్వికీ దైవమౌనా..." అనే సంకీర్తనలో....
ఏ సంకీర్తనలోనూ ఎవ్వరినీ స్తుతించని రీతిలో శ్రీహనుమంతుల వారిని సకలదేవతాస్వరూపంగా కీర్తించినారు.....
జీవాత్మకు ప్రతీకగా సీతమ్మను,
పరమాత్మకు ప్రతీకగా శ్రీరాముడిని,
వీరివురిని వారివారి స్వస్వరూపానుసంధతలో ఏకం చేసే ఆచార్యులకు ప్రతిరూపంగా శ్రీఆంజనేయులవారిని..
సూచిస్తూ.....
శ్రీచాగంటి సద్గురువులు,
మువ్వురు సుందరుల ముచ్చటైన కథనంగా
వారి శ్రీమద్రామాయణ ప్రవచనాల్లో ఎంతో సుందరంగా వర్నించిన గాథలో, తెలిపినట్టుగా భవిష్యద్ బ్రహ్మత్వాన్ని వరముగా గైకొని అలరారే ఎల్లరి ఆరాధ్యదైవము హనుమంతులవారు అనే సత్యాన్ని....
" ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు "
అనే అచ్చతెనుగు పదాల సోయగంలో ఆంజనేయభవిష్యద్ బ్రహ్మత్త్వ భావాన్ని సంకీర్తనాచార్యులు వ్యక్తపరచడం విజ్ఞ్యులు గమనించవచ్చు....
**************** ****************
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
in English:
okkaDE EkAMga viiruDurviki daivamaunaa
yekkaDA hanumaMtuni keduraa lOkamu
muMdaTa nEleDi paTTamunaku brahmayinaaDu
aMdaru daityulachaMpi haripErainaaDu
aMdi rudraviiryamu taanai haruDainaaDu
yeMdunaa hanumaMtuni keduraa lOkamu
chukkalu mOva perigi suuryuDu taanainaaDu
chikku paataaLamu duuri SEshuDainaaDu
gakkana vaayujuDai jagatpraaNuDainaaDu
ekkuva hanumaMtuni keduraa lOkamu
jaladhi puTamegasi chaMdruDu taanainaaDu
malasi mErupupoMta siMhamainaaDu
balimi SriivEMkaTESu baMTai maMgaaMbudhi
ila ii hanumaMtuni keduraa lOkamu
meaning by GB Sankar Rao garu in sujanaranjani
ఆంజనేయుని ప్రతాపానికి ఈ ఇలలో తిరుగులేదు! బ్రహ్మపట్టాన్ని పొందిన ధీరుడితడు!
రాక్షసులను సంహరించి హరి పేరుకు మారుగా నిలిచాడు. శివుని ఆత్మజుడు ఈ హనుమంతుడు! ఆకాశాన్ని ఆక్రమించి సూర్యుణ్ణి అందుకున్నవాడు! పాతాళము చొచ్చి శేషుడైనాడు! వాయురూపంలో జగతికి ప్రాణమైనాడు! ఇన్ని విశిష్టతలు కల ఈ హనుమంతుడు కలియుగంలో బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరునికి దాసుడైనాడు అని అన్నమాచార్యులవారు ఆంజనేయుని శౌర్య పరాక్రమాన్ని తెలియజేస్తున్నాడు.
ఉర్వి = భూమి;
దైత్యులు = రాక్షసులు;
మేరువు పొంత = మేరు పర్వతం దగ్గర;
ఏకాంగ వీరుడు = విష్ణుముర్తి;
మంగాంబుధి = ఒక ఊరు
@
http://annamacharya-lyrics.blogspot.com/2006/12/108okkade-ekamga-viirudurviki.html?m=1
**************** ****************
నా పాత పోస్టుల్లో మరిన్ని హనుమద్ వైభవ విశేషాలు ఈ క్రింది అంతర్జాల పుటల్లో పేర్కొనబడినవి....
https://www.sblbhakthi.in/sundara-hanuman-mantra/
https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/04/2019-april-19.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2020/02/blog-post_17.html
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
No comments:
Post a Comment