ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, లేక మరో మాన్యులను దేశంలోని ప్రతీఒక్కరు ప్రత్యక్షంగా కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగడం కుదరనిపని...
ఎందుకంటే వారి బిజిలో వారుంటారు....అంతమాత్రాన ఒక
ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, లేక మరో మాన్యుల అనుగ్రహం వారిని ప్రత్యక్షంగా కలిసేకొందరికే అని అనడం తగదు కాబట్టి ఒక వ్యవస్థద్వారా వారి అనుగ్రహం ప్రతిఒక్కరికి అందేలా ఉండే లౌకిక ఏర్పాటు మనం సామాన్యంగా గమనించేదే...
ఉత్తరోత్తరా రాబోయే కలియుగ రోజుల్లో, శౌచలేమి, ఆచారలేమి, జ్ఞ్యానలేమి, భక్తిలేమి, ఎక్కువగా ఉండే కాలం కాబట్టి, శ్రీఆదిశంకరభగవద్పాదుల వారు స్థిరీకరించిన అద్వైతసంప్రదాయ వైభవం సామాన్య ప్రజలెల్లరూ అందుకొని తరించడం కష్టంగా ఉంటుంది కాబట్టి...
ఒకానొక విశిష్టమైన పద్ధతిలో పరతత్త్వాన్ని ప్రత్యేకమైన తత్త్వంగా ఉపాసిస్తూ, తద్వారా క్రమక్రమంగా మనలోనే గుప్తంగా కొలువైఉండే పరమాత్మ తత్త్వాన్ని గ్రాహ్యపరుచుకునేందుకు తగిన భక్తి జ్ఞ్యాన శౌచ సంపత్తి సమకూరే విధంగా అద్వైత తత్త్వానికి "విశిష్టాద్వైత తత్త్వం" గా సంప్రదాయ మెరుగులు అలదిన ఆదిశేషావతార మహానుభావులు శ్రీభగవద్రామానుజాచార్యులు...
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రధానాలయంలో వెండివాకిలి లోపల ఉండే ఒకేఒక్క మానుష మూర్తి ఉపాలయం/సన్నిధి శ్రీభగవద్రామానుజుల వారిది అని అంటే వారికి ఈ కలియుగ ప్రత్యక్ష పరమాత్మ కల్పించిన మరియాద ఎంతటి ఘనమైనదో ఆలోచించండి....
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో శ్రద్ధగా విన్నవారికి గుర్తున్నట్టుగా, గర్భాలయ సాలగ్రామమూలమూర్తి గా ఉండే స్వామివారి వక్షసీమకు సమాంతరంగా వారి గురువుగారి స్థానంలో ఆలయ ఈశాన్యభాగంలో దక్షిణాభిముఖంగా శ్రీభగవద్రామానుజులవారు కొలువైఉండడం భక్తులు గమనించవచ్చు...
అనగా భక్తులు హుండీల్లో కానుకలు / మొక్కులు సమర్పించుకుంటుంటే....వారిని మందస్మితులై పరికించేది / అనుగ్రహించేది కేవలం అక్కడ కుడ్యమూర్తిగా గా కొలువైన శ్రీవరమహాలక్ష్మి అమ్మవారు మాత్రమేకాదు...
శ్రీభగవద్రామానుజులు మరియు శ్రీయోగనారసిమ్హస్వామి వారు కూడా....
అనగా, తిరుమల ఆలయంలో మొక్కుబడులను సమర్పించే వారికి గురువానుగ్రహం, దురితభంజనం, శ్రీలక్ష్మీకటాక్షం ఏకకాలంలో అనుగ్రహింపబడుతున్నది అని అర్ధం....
"ఆచారో వర్ధతాం సంపదాం" అనే శ్రీకరమైన వాక్కును పెద్దలు అనుగ్రహించేది ఎందుకంటే....
అందలి ఆచార్యానుగ్రహవైభవం అట్టిది కాబట్టి...
ఒక సామాన్య వ్యక్తికి సదాచార వైభవం ఎక్కడినుండి అబ్బుతుంది..?
మార్కెట్లో డబ్బులు పెడితే దొరుకుతుందా..?
ఎదైనా కాలేజ్ లో కోర్స్ గా లభ్యమౌతుందా...?
కేవలం, ఆలయంలో ఆచార్యుల అనుగ్రహంగా అలవడుతుంది...
ఆ గ్రాహ్యమైన సదాచారవైభవమే పరమాత్మను, అనగా పరమాత్మయొక్క అనుగ్రహాన్ని మరింతగా మనకు చేరువజేయును.....
అందుకే, శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు వారి అన్ని సంకీర్తనలు కూడా కేవలం శ్రీవేంకటేశ్వరసంబంధంగా
భగవద్ తత్త్వము, అవతారాలు, ఆలయాలు, భక్తి, జ్ఞ్యానము, గురించి మాత్రమే రచింపగా..
వారు రచించిన ఒకేఒక్క మానుషసంబంధమైన సంకీర్తన
శ్రీభగవద్రామానుజుల వారిది అని అనడంలో, శ్రీరామానుజుల ఆచార్యవైభవం యొక్క గొప్పదనం మనకు విశదీకరింపబడుతున్నది....
ఆ సంకీర్తనలోని సదాచారవైభవం యొక్క విశేషాన్ని, శ్రీభగవద్రామానుజుల అపారావాత్సల్యాన్ని వీలైనంతగా భక్తులెల్లరూ అందుకొని తరించెదరుగాక...
ఆచార్య తిరువడిగలే శరణం.....🙏🙂💐🎉🍊
గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి ఈతడే చూపె ఘన గురుదైవము
ఈతని కరుణనేకా ఇలవైష్ణవుల మైతి
మీతని వల్లనే కంటి మీ తిరుమణి
ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము
ఈతడే రామానుజులు ఇహపర దైవము
వెలయించె నీతడేకా వేదపు రహస్యములు
చలిమి నీతడే చూపె శరణాగతి
నిలిపినాడీతడే కా నిజముద్రా ధారణము
మలసి రామానుజులు మాటలాడే దైవము
నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు
దయతో మోక్షము చూపె తగనీతడు
నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను
దయచూచి మమ్మునిట్టే తల్లితండ్రి దైవమూ
https://annamacharya-lyrics.blogspot.com/2006/12/in-english-gatulanni-khilamaina.html?m=1
No comments:
Post a Comment