Tuesday, May 21, 2024

శ్రీఅరుణాచలరమణుల 74వ ఆరాధన సందర్భంగా, వారి శ్రీపాదపద్మములచెంత చిరు అక్షరాంజలి భరిత నమస్సుమాంజలి...🍀💐🪷🌷🌸🌟

ఒక్కొక్కరిది ఒక్కో మార్గం...
ఒక్కో సిద్ధాంతం...
ఒక్కో విశ్వాసం...
ఒక్కో తత్త్వం...

కాని జాగ్రత్తగా గమనిస్తే....,
ఏ మార్గమైనా...,
ఏ సిద్ధాంతమైనా...,
ఏ విశ్వాసమైనా...,
ఏ తత్త్వమైనా...,
మనిషి యొక్క జీవితం అనే రైలుబండిని ముందుకు నడిపించేది భక్తి జ్ఞ్యానం అనే రెండు సమాంతర కడ్డీలు పట్టాలుగా అమరిన పయనంలో మనిషి తను నిత్యనూతనంగా నిరంతరం సంతరించుకునే విజ్ఞ్యత వివేకం అనే అమేయమైన బౌద్ధిక సిరులు...

అట్టి విజ్ఞ్యత, వివేకం ఏ అంశంపట్ల ఎంతగా గ్రాహ్యమై బౌద్ధికబలంగా స్థిరీకరింపబడుతున్నదో అనే అంశమే సదరు మనిషిని ఆయా అంశాల్లో అసామాన్య ప్రతిభాపాటావాలతో అలరారే అందెవేసిన చెయ్యిగల ఆరితేరిన శిఖామణిగా అందలం ఎక్కించి ఎల్లరిచే సకలగౌరవమరియాదలను సమకూర్చిపెట్టి తరింపజేయును...

అట్టి వివేకానికి, విజ్ఞ్యతకు మూలాధారం విచారణ....
విచారణ అనేది సర్వసామాన్యంగా సదరు లౌకిక అంశం పట్ల ఎంతగా గావింపబడుతుంటే అంతగా ఆ అంశంలో నైపుణ్యం సంతరింపబడుతూ ఉంటుంది...

ఫర్ ఎగ్సాంపుల్, బైక్ డ్రైవింగ్ అనే ఒక జెనెరిక్ అంశంలో ఈ విచారణ గురించి చర్చించి తద్వరా శ్రీఅరుణాచలరమణ మహర్షి గారిచే నిరంతరం ఆశ్రితులెల్లరికీ 
సూచింపబడిన ఆత్మవిచారణ అనేది ఎందుకు సర్వోత్కృష్ఠమైన సాధనామార్గం గా విజ్ఞ్యులచే పరిగణింపబడుతోందో కొంత పరికిద్దాం...

"బజాజ్ చేతక్ బండి యొక్క కిక్కును సరిగ్గా కొట్టి స్టార్ట్ చేయడం ఎలా.." 
అనే అంశాన్ని ప్రవచనాంతర్గతంగా ఒకచోట ప్రస్తావిస్తూ అందులో వారికి తర్ఫీదునిచ్చిన స్నేహితుల సహాయం గురించి శ్రీచాగంటి సద్గురువులు ఉటంకించడం కొద్దిలో కొద్దిమందికైనా గుర్తుండే ఉంటుంది....

అనగా, ఒకప్పుడు వారు నడిపించే చేతక్ బండి సరిగ్గా ఎలా స్టార్ట్ చేయాలో అనే అంశం గురించి విచారణ సాగించి ఆ తరువాత అ అంశంలో నైపుణ్యాన్ని సాధించి,
ఇక ఎల్లప్పుడూ కూడా కిక్ సరిగ్గా కొట్టడం గురించి అంతగా అలోచించవలసిన అవసరం లేకుండా టకటకమని కిక్కు కొట్టి బండి స్టార్ట్ చేసి రైరై మని నడిపించుకుంటూ వెళ్ళడం అనేది ఒకనాడు ఒక స్నేహితుడి ద్వారా గావింపబడిన విచారణ, పరిశ్రమ యొక్క ఫలితంగా అబ్బిన నైపుణ్యం అనేది ఇక్కడ మనకు అర్ధమయ్యే అంశం.....కద...
అత్యంత సాధారణమైన ఇట్టి అంశం నుండి ఎట్టి అసాధారణమైన అంశమైనను కరతల ఆమలకంగా కైవసమై ఉండడానికి కారణం ఆయా అంశంపై గావింపబడే విచారణ....

ఎన్నో విషయాల్లో ఎన్నెన్నో ప్రాణులు సాగించే ఈ విచారణ అనే ప్రక్రియకు శిఖరాయమానమైనది
కేవలం మనిషికి మాత్రమే సాధ్యమయ్యే ఆత్మవిచారణ....

సాక్షాత్తు ప్రత్యక్ష సకలదేవతా స్వరూపంగా, 
మనిషి కంటే కూడా ఎంతో ఎక్కువ గౌరవాన్ని పొందే ఒక గోవు కూడా ఈ ఆత్మవిచారణ సాగించలేదు అంటే మనిషికి భగవంతుడి ప్రసాదితమైన బుద్దిబలం ఎంతటి ఘనమైన అనుగ్రహమో ఆలోచించండి....

అందుకే మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో, నిత్యాగ్ని ఆరాధనకు, నిత్యసూర్యచంద్రతారారాధనకు,
ఎనలేని ప్రాముఖ్యత, వైభవం, మహిమ్నత....
ఎందుకంటే కుశాగ్రబుద్ధివైభవానికి మూలకారణం అగ్ని ఆరాధన....

భారతదేశంలో బ్రాహ్మణవర్ణానికి అనాదిగా ఎందుకంతటి గౌరవం, అగ్రతాంబూలం అని అంటే దానికి కారణం వారు ఒక సో కాల్డ్ కులంలో జన్మించినందుకో, లేకపోతే వారి ఆహార్యశైలి గురించో, కాదు....

వారు నిత్యాగ్నిహోత్రీకులై ఉండడమే వారి గౌరవానికి మూలకారణం.....
సనాతనధర్మానికి ఉనికిపట్టైన అగ్ని ఆరాధన ఎంతటి ఘనమైనదో, ఎంతటి మేధోశక్తిప్రదమైనదో, గుర్తించారు కాబట్టే ఆంగ్లేయులు భారతదేశాన్ని పూర్తిగా కైవసం చేసుకొని మొత్తం దోచుకోవాలంటే, ఇక్కడి అగ్ని ఆరాధన అనే సంస్కృతిని, అందుకు అనుబంధమైన అంశాల పట్ల భారతీయులను పెడద్రోవపట్టించడమే ఏకైక ఉపాయంగా భావించి, ఎన్నోవిధాలా మన మహిమోపేతమైన సంస్కృతిని మనకు దూరం గావించేందుకు యత్నించారు...
ఆవునెయ్యితో గావించే దీపారధన, యజ్ఞ్య అగ్ని అరాధన, సద్యో దేవతాశక్తిని ప్రసరింపజేస్తుందని గుర్తించి, భారతీయులకు ఆవు నెయ్యి యొక్క లభ్యత ప్రియమయ్యేలా ఎందుకూపనికిరాని "టీ" / తేయాకుపానీయం / తేనీరు అనే పేరుతో ఒకవిధమైన మత్తుపదార్ధాన్ని నిత్యం తాగడం అనే సంస్కృతిని అలవాటుచేసారు....తద్వారా పాల లభ్యత తగ్గి, మరియు పెరుగు, వెన్న, నెయ్యి లభ్యత కూడా తగ్గి, ఆ ప్రభావం భారతీయుల అగ్ని ఆరాధన మీదపడి, మెల్లమెల్లగా భారతీయులు నిత్యాగ్ని ఆరాధనకు దూరమై బుద్ధిహీనులైతే, ఏదో ఒక కథచెబుతూ ఈ దేశాన్ని మొత్తం ఆక్రమించుకోవచ్చు అనే వారి వలలో మరో ముఖ్యమైన పన్నాగం ఆదివారం భారతీయులకు సెలవుదినంగా ప్రకటింపబడి, విందులు, వినోదాల్లో మునిగితేలే విధంగా వారిని సూర్యారాధనకు దూరంగావిస్తే ఆరోగ్యపరంగా కూడా భారతీయులను ఇబ్బందులకు గురిచేసి వారిని బానిసలుగా మార్చుకునేందుకు తేలికౌను అనే వారి పన్నాగంలో చిక్కుకున్న తరతరాలు ఇప్పటికీ ఆదివార సూర్యారాధన యొక్క ప్రాముఖ్యతను, మహిమ్నతను గుర్తించలేక దైన్యంలోనే ఉండిపోతున్నారు అని అనడం అతిశయోక్తి కానేరదు సుమి....

ఆదివారం నాటి ఆరాధన యొక్క వైభవాన్ని వారిదిగా స్వీకరించి కొందరు కళకళలాడుతున్నారు...
శుక్రవారం నాటి ఆరాధన యొక్క వైభవాన్ని వారిదిగా స్వీకరించి ఇంకొందరు కళకళలాడుతున్నారు...
చాలావరకు మన దీనులు మాత్రమే ఏవారం కూడా దేవాలయనికి వెళ్ళి ఈశ్వరుడికి ప్రదక్షిణ నమస్కారములు ఒనరించి తరించడానికి, పుణ్యాన్ని, బుద్ధిని, ప్రశాంతతను, సార్ధకజీవితాన్ని సాధించుకునేందుకు తగిన వారంగా గుర్తించలేక సతమతమౌతున్నారు...
విచారణ యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత, మహిమ్నత తెలిసిన వారు మాత్రం ఏవారమైనా సరే నీవారము స్వామి అని ఆ పరమాత్మను ప్రార్ధిస్తూ తరిస్తున్నారు....

ఈశ్వరానుగ్రహం మెండుగా సంప్రాప్తమైన నాడు, సర్వోన్నతమైన విచారణ, అనగా ఆత్మవిచారణ దిశగా మనిషి యొక్క ప్రస్థానం సాగుతూ, ఆ అంశంలో అసామాన్యమైన నైపుణ్యాన్ని సాధించిననాడు,
జీవుడు, దేవుడు అనే అనివార్య ప్రాకృతిక స్థాయిభేదం లయింపబడి " తత్ త్వం అసి " / "అది నీవై ఉన్నావు" అనే సర్వోన్నతమైన సాక్షిత్వస్థాయి అనుగ్రహింపబడి మనిషి మహర్షి గా రూపాంతరంచెంది తరించడం అనే సర్వోన్నతమైన యోగప్రక్రియకు ప్రత్యక్ష తార్కాణం శ్రీఅరుణాచల రమణమహర్షి గారి జీవితవైభవం...

"అతి సర్వత్ర వర్జయేత్" అనేది పెద్దలు చెప్పే ఒక ముఖ్యమైన మాట....
అది ఆత్మవిచారణలో కూడా వర్తించును....
గృహస్థాశ్రమధర్మంలో ఉన్న వ్యక్తికి అట్టి తీవ్రమైన ఆత్మవిచారణ / తద్వారా సర్వకాల సాక్షిత్వ మనోలయస్థితి అనేది తగదు కాబట్టి, ఆత్మవిచారణ అనేది ఒకరు బోధించే అభ్యాసంగా స్వీకరింపబడడం కుదరని ప్రక్రియ....

కేవలం, ఈశ్వరానుగ్రహంగా మాత్రమే ఎన్నో జన్మల సాధనయొక్క ఫలితంగా అంకురించే జిజ్ఞ్యాస ఆత్మవిచారణ...
అది ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండే మహానుభావులకు మాత్రమే అర్ధమయ్యే యోగిక స్థాయి...
అట్టి సర్వోన్నతమైన యోగస్థాయి మాక్కూడా అనుగ్రహింపబడాలి అని ఎందరో విదేశీయులు కూడా ఇప్పటికీ దర్శించే మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అరుణాచలం...
శ్రీచాగంటి సద్గురువులు వారి 
"శ్రీఅరుణాచల వైభవం" ప్రవచనాల్లో వివరించిన విధంగా...

ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మౌనవీక్షణమే నాయొక్క అనుగ్రహం అన్నట్టుగా ఉండే శ్రీరమణమహర్షులు కూడా, 
"మీరు గిరిప్రదక్షిణ గావించారా...?"
అని అడిగిన సందర్భాలు ఎన్నో అంటే, అరుణాచల గిరిప్రదక్షిణం ఎంతటి మహిమోపేతమైనదో గ్రాహ్యమౌతున్నది.....

ఇక తత్వతః మాట్లాడితే....
పంచభూత అగ్నిలింగక్షేత్రమైన అరుణాచలానికి
("ర" అనే అగ్నిబీజసంబంధమైన) "రమణులు" అనే పేరుతో,
శ్రీరమణమహర్షి గా వచ్చి కొలువైనది, కుమారస్వామి అంశలో ప్రభవించిన యోగీశ్వరేశ్వరులని, ఆనాటి కోవిదులనుండి ఈనాటి విజ్ఞ్యులవరకు ఎందరికో విదితమే...

అట్టి శ్రీఅరుణాచలరమణుల 74వ ఆరాధన సందర్భంగా, వారి శ్రీపాదపద్మములచెంత చిరు అక్షరాంజలి భరిత నమస్సుమాంజలి...🍀💐🪷🌷🌸🌟


No comments:

Post a Comment