☺☺☺☺☺☺
💐💐
*******
.....
భోగి / మకరసంక్రాంతి / కనుమ / ముక్కనుమ అని ముఖ్యంగా 4 రోజులపాటు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో సంక్రాంతి పండగను ప్రజలెల్లరు ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ఎల్లరికి విదితమే కద....
టీవీల్లో ఎందరో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు, పండితులు ఇత్యాది పెద్దలందరు మనకు సంక్రాంతి యొక్క విశేషం గురించి వివరించడం చాలామంది ఎప్పుడోకప్పుడు వినేఉంటారు కద...
శ్రీచాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాల్లో, ముఖ్యంగా అక్షయ అధ్యాత్మజ్ఞ్యానామృతభాండమైన శ్రీభక్తపోతనామాత్యులవారి శ్రీమద్భాగవత ప్రవచనాల్లో నాకు జ్యోతకమయ్యే మకర సంక్రాంతి
యొక్క ప్రాశస్త్యం కొంత పరికిద్దాం....
అసలు సంక్రమణం అంటే ఏంటి...
అందులో మకరసంక్రమణానికి ఎందుకంత ప్రత్యేకత...
అసలు మకరసంక్రమణానికి / సంక్రాంతికి పండగ కి ఏంటి సంబంధం....
భోగికి భోగిమంటలు, భోగి పళ్ళు / సంక్రాంతికి ముంగింట్లో రంగురంగుల రంగవల్లుల మధ్యన కొలువైఉండే దేశవాళి ఆవుపేడతో తయారుచేయబడే గొబ్బెమ్మలు / కనుమ నాటి గో/వృషభ పూజలు...
ఇవన్నీ సంక్రాంతి పండగకి ఆనవాళ్ళు గా మన సంప్రదాయంలో భాగమైన ఆచారాలు....
సూర్యుడిని ఆధారంగా చేసుకొని భూమి మరియు ఇతర గ్రహాల యొక్క భ్రమణం, భూమి చుట్టూ చంద్రుడి భ్రమణం, భూమిపై నుండి దర్శింపయోగ్యమైన 27 నక్షత్రమండలాలు మరియు వాటితో కూడుకొని సాగే చంద్రుడి గమనం,
ఈ సూర్యచంద్ర గమనాలను ఒక పద్ధతిగా లెక్కలుకట్టే చాంద్రమాన సౌరమాన కాలగణన విధానాన్ని మనకు అందించే పంచాంగ వ్యవస్థ, మరియు భూగతమైన మనుష్య జీవనం పై వాటి యొక్క ప్రభావం గురించి నేను ఇదివరకే పాత పోస్టుల్లో వివరించి ఉన్నాను....
కాబట్టి ఇప్పుడు వాటిని సంక్రాంతి పండగకు అపాదిస్తూ మన సనాతనధర్మశాస్త్రం యొక్క వైభవం
గూర్చి మాట్లాడుకుందాం...
మేషాది 12 రాశుల్లో సాగే సూర్యుడి గమనం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడమే సూర్య సంక్రమణం....
ఆ సూర్య సంక్రమణం ధనూరాశి నుండి మకరరాశిలోకి ఐనప్పుడు అది మకర సంక్రమణంగా పిలువబడి, మకర సంక్రాంతి పండగ గా జరుపబడడం అనేది ఎల్లరికి విదితమే కద...
అనగా...
Our Sun's regular transit from
one sun sign to the other amongst the 12 fixed sun signs is termed as a solar transit...
When that Transit happens from
Dhanu Raashi (symbolized by a Bow) to Makara Raashi, (symbolized by a Crocodile ) it is termed as "Makara SankramaNam" and is celebrated as the "MakaraSankraanti" festival...
మన సనాతనధర్మ ప్రతిపాదిత ప్రతీవిషయం కూడా లౌకికం, పారామార్ధికం అనే రెండు దృక్కోణాల్లో అధ్యయనం గావించబడి అందలి ఇహపర సంబంధమైన విజ్ఞ్యాన ప్రజ్ఞ్యాన సిరులను మానవాళి అందుకొని తరించబడేలా మన సహృదయులైన పెద్దలు / మహర్షులు / మనకు వివిధ ఆచార సంప్రదాయాలను ఏర్పాటుచేసి వాటిద్వారా జీవనసార్ధక్యం ఎల్లరికి లభించేలా గావించబడిన వ్యవస్థీకృత సత్సంప్రదాయం మనది...
అందుకే మనది భారత దేశం అయ్యింది.....
లౌకికంగా భరతుడు అనే గొప్ప మహారాజు పరిపాలించాడు కాబట్టి ఇది భారత దేశం అనేది ఎంతనిజమో...
ఇక్కడ జన్మించిన / జీవించే వారికి భా యందు రతి అనగా
కాంతి / వెలుగు / దీప్తి / ఉషస్సు / తేజస్సు / ఇత్యాది గా వర్నించబడే సకల చేతనాత్మకమైన జ్ఞ్యానశక్తిసంపదయందు జిజ్ఞ్యాస కలిగి ఉండేవారు అని దానర్ధం....
అందునా దక్షిణ భారత ప్రాంతంలో శాస్త్ర సంబంధమైన / ధర్మసంబంధమైన / జ్ఞ్యానసంబంధమైన జిజ్ఞ్యాసాపరులు ఎక్కువగా ఉండడమనేది అనాదిగా ఈ వేదభూమిపై పరిఢవిల్లిన సత్యం...
అందుకే...
సనాతనధర్మోక్త సదాచారాన్ని / కర్మకాండను ఎంతో శ్రద్ధగా శౌచమర్యాదలతో ఆచరించే పరశురామ క్షేత్రమైన కేరళ ను తన నివాసంగా చేసుకున్నాడు ఆ హరిహరసుతుడైన మహామహిన్వావిత కలియుగ దైవమైన శ్రీ ధర్మశాస్త, అయ్యప్పస్వామి....
తన సన్నిధి చేరే మార్గం, తన అర్చారాధనా విధానం కూడా అంత కట్టుదిట్టమైన శౌచమరియాదలతో / ఆచారనియమాలతో వ్యవస్థీకరించి
తద్వారా అయ్యప్పమాలధారణ గావించిన భక్తుల్లెల్లరికి కూడా కలికాల పీడలను భంజించి,
భవసముద్రములో బంధీలైఉండే వారందరినీ కూడా ఘనంగా కరుణించి అనుగ్రహిస్తున్నాడు..
ఈ కలికాలంలో కొలువైన మహోన్నత దైవికయోగి గా యోగపట్టవిరాజితుడై శబరిగిరిపై చిన్ముద్రధారియై ఉన్న తన సన్నిధిలోని 18 బంగారు మెట్లను అధిరోహించి తనను దర్శించే భక్తకోటికి ఎంతో ఘనమైన తన అనుగ్రహము ఎవ్విధంగా కలిగిస్తున్నాడో....
అదే విధంగా ఈనాటి శ్రీ చాగంటి సద్గురువులు అపర కలియుగ శ్రీశుకయోగీంద్రులై, కాకినాడ భానుగుడి జంక్షన్ లోని అయ్యప్పస్వామి ఆలయాన్నే శబరి క్షేత్రంగా మార్చి, ఎందరెందరో శిష్యభక్తులకు ఎంతో ఘనమైన అనుగ్రహాన్ని తమ ప్రవచనపెన్నిధితో అందిస్తూ అనుగ్రహిస్తున్నారనేది ఈనాడు జగద్విదితమైన సత్యం.....
అది ఈ భరతభూమి పైఉన్న తెలుగు నేల చేసుకున్న తరతరాల పుణ్యఫలం...!
అక్కడ స్వామి వారు మధురమైన సాటిలేని అరవణప్రసాదాన్ని అందిస్తూ అనుగ్రహిస్తూంటే....
ఇక్కడ శ్రీచాగంటి సద్గురువులు మధురాతిమధురమైన సాటిలేని భగవద్ కథాసుధామృతం అనే కమ్మనైన భక్తిజ్ఞ్యాన ప్రసాదాన్ని అందిస్తూ అనుగ్రహిస్తున్నారు......
అయ్యప్పస్వామి వారి అరవణప్రసాదం ఒక సంవత్సరకాలం అట్లే దాచుకొని అప్పుడప్పుడు కొంచెం కొంచెం సేవిస్తూ ఆనందించవచ్చు...
కాని శ్రీచాగంటి సద్గురువుల భగవద్ భక్తిజ్ఞ్యానప్రసాదం అనేది ఒక జన్మకు సరిపడా మాత్రమే కాక జన్మజన్మాంతరములందు మనల్ని తరింపజేసే అమోఘమైన దివ్యమైన దైవిక ప్రసాదం.....
ఎందుకంటే జ్ఞ్యానం అనేది నిలవదోషం లేని చక్కని బెల్లం వంటిది...అది ఎల్లరికి ఎన్నోవిధాలా ఎప్పటికీ ఉపయుక్తమై ఉండే ప్రసాదం...
మనిషికి జ్ఞ్యానమే సర్వశ్రేష్ఠమైన ప్రసాదం....
అందుకే శ్రీఆదిశంకరాచార్యులవారు
"జ్ఞ్యానాత్ ఏవతుకైవల్యం..."
" మోక్షసాధనా సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి..."
అనే వాక్యాలకనుగుణంగా కాలడి నుండి కైలాస పర్వతం వరకు పాదచారిగా పర్యటించి ఈ దేశవాసులకు భక్తి జ్ఞ్యానములను శాశ్వతంగా అందించే సారస్వత యజ్ఞ్యం గావించి వారి వివిధ శక్తివంతమైన స్తోత్రాల ప్రసాదంతో ఎల్లరినీ అనుగ్రహించారు......
ఆనాటి ఆదిశంకరులనుండి ఈనాటి శ్రీచాగంటి సద్గురువులవరకు, ఎందరో మహనీయులు ఈ భారతదేశంలో గావించిన మహోన్నతమైన కార్యక్రమాలు భక్తిజ్ఞ్యానముల ప్రసాదాన్ని అనుగ్రహించడమే.....
ఎందుకంటే భక్తిజ్ఞ్యానములనేవి మనిషి యొక్క మేధను ఎంతగానో పదునునెక్కించి ఎంతటి కార్యాన్నైనా సాధించిపెట్టగల సమర్ధతను మనిషికి అనుగ్రహిస్తాయి.....
అయ్యప్ప స్వామి అరవణప్రసాద టిన్ లో చెయ్యి పెట్టి అడుగున ఉన్న ఆ కొద్ది ప్రసాదం కూడా చేతికిఊరేలా అందుకునే ప్రయత్నంలో, లేదా టిన్ మూతకు అంటుకొనిఉన్న కొద్దిపాటి అరవణప్రసాదాన్ని నాకేద్దామనే తొందర్లో, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే తృటిలో చేతి వేళ్ళను, నాలుక కొసలను కోసిపారెయ్యగల పదునుతో ఉండే ఆ ప్రసాదం టిన్స్ లా....
మన మేధను భక్తిజ్ఞ్యానములనేవి బాగా తేజ్ గా మార్చి మన జీవితాలను ఆ ప్రసాదం టిన్స్ లాగా
బాగా శార్ప్ గావించి అనుగ్రహిస్తుంటాయి....
ఇంకా సింపుల్ గా చెప్పలంటే జీవితంలో మనం ఆర్జించుకునే ధనకనకవస్తువాహనాదులు..
పేరుప్రఖ్యాతలు...అధికారగౌరవాలు
ఇత్యాదివన్నీ కూడా చదరంగం అనే ఆటలో ఉండే వివిధ శక్తులు అనగా, గజ తురగ ఉష్ట్ర శక్తులకు ఉదాహరణగా భావిస్తే,
భక్తిజ్ఞానములనేవి మంత్రి వంటి శక్తికి ఉదారహణ....
చదరంగం లోని మంత్రి, మిగతా ఇతర పావులన్నీ కూడా కలిసికట్టుగా రచించే వ్యూహాలెన్నైనా సరే ఆ ఒక్క మంత్రి రచించి ఆటను రక్తి కట్టించగలడు.....
అదే విధంగా జీవితంలోని ఇతరములన్నిటికీ కూడా సరితూగగల శక్తి ఏదైనా ఉందంటే అది కేవలం
భక్తిజ్ఞ్యానములనే అనుగ్రహం మాత్రమే...!
అందుకే జ్ఞ్యానదాతలైన గురువులకు మాత్రమే దైవం కన్నాకూడా ముందుగా నమస్కారం సమర్పించేది.....
ఉత్తమోత్తమమైన ద్రావిడ తెనుగు సంగమ స్థానమైన తిరుపతి లో, సువర్ణముఖరీ నదికి సమీపంలో తన క్రీడాద్రిని శ్రీవేంకటాద్రిగా నెలకొల్పి తిరుమల తీర్థస్థలిలో కలియుగ ప్రత్యక్ష దైవమై వరదముద్రలో నెలకొన్న శ్రీశ్రీనివాసపరదైవం కూడా తనకంటే ఉన్నతంగా తన గురువులైన శ్రీభగవద్రామానుజాచార్యులను ఉత్తర ఈశాన్యభాగంలో దక్షిణాభిముఖంగా తన హృదయసీమకు సమంగా ఉన్నతంగా నెలకొల్పి, ఆనందనిలయంలోకి అడుగుపెట్టిన ప్రతిభక్తుడి నమస్కారం మొదట శ్రీభగవద్రామానుజులకు చెంది ఆతరువాత తనకు చెందేలా భక్తుల దర్శనం Q లైన్ ని ఏర్పాటు గావించడం గమనించే ఉంటారు.....
( మన కుడివైపుగా గరుడాళ్వారుల సన్నిధికి రాగానే ఉత్తరం వైపుగా నమస్కారం పెట్టినప్పుడు అది బయట ఉన్న శ్రీమద్రామానుజుల శ్రీభాష్యకారుల సన్నిధికి సమర్పించబడేలా ఉంటుంది....
ఆతరువాతనే కద పశ్చిమానికి తిరిగి స్వామివారి దివ్య అప్రాకృత శ్రీవైష్ణవ సజీవసాలిగ్రామావేశిత వరదకటిహస్త శోభిత శ్రీవ్యూహలక్ష్మీ సమేత శ్రీశ్రీనివాసుడి మూలమూర్తిని దర్శించి తన్మయత్వంతో మనం స్థాణువై అక్కడినుండి జరగలేక జరగలేక ముందుకు జరిగి జయవిజయుల సన్నిధికి రాగానే దక్షిణంవైపుగా బంగారుబావి వద్దకు వెళ్ళేది...😊
ఇక అమ్మలగన్న అమ్మ ఆ ముగురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి శ్రీకంచికామాక్షి దేవిగా వేంచేసి ఏకామేశ్వరుడి హృదయదేవేరిగా కొలువై కొలిచినవారి కొంగుబంగారమై తన క్రీగంటి చూపులతోనే ఎంతో ఘనమైన అనుగ్రహాన్ని వర్షిస్తూ
దక్షిణభారతంలో కొలువైన ఏకైక
మోక్షపురి గా కీర్తించబడే కాంచీపురం లో కొలువైఉంది....( పూర్ణాపుష్కలాంబా అనే శక్తి సహితుడైన అయ్యప్పస్వామి క్షేత్రపాలకుడై ఉండగా... ),
శ్రీవేంకటేశ్వరుడే తన కల్యాణంలోని
ప్రథమపూజానమస్కారాలు సమర్పించుకున్న ఘనదైవమైన ఆ కంచి కామాక్షమ్మ లీలలు ఏ మానవమాత్రుడికి అందనంత ఎత్తైన స్థాయిలో ఉండే వివిధ జ్ఞ్యాన భూమికలకు మాత్రమే గ్రాహ్యమయ్యే
శాక్తేయయోగమంజరులు....
అగ్ని తత్త్వానికి మరియు తత్ సంబంధమైన " భా " కు ఆలవామైన మహోన్నత పురాతనమైన అరుణాచల అగ్నిలింగ క్షేత్రం కూడా ద్రావిడ సీమలో భారత దేశ ఆగ్నేయ ప్రాంతంలోనే కొలువైఉండడం కూడా ఈశ్వరుడి అనుగ్రహ వైచిత్రికి తార్కాణం...!
ఇక ఆ శ్రీగిరి శ్రీమల్లికార్జునాభ్రమరాంబల వైభవం గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది....
మరియు ఆ పావనగౌతమీతట వరభద్రాచలేశ్వరుడైన
శ్రీసీతాలక్ష్మణసమేత శ్రీరామచంద్రుడి సన్నిధి దక్షిణ అయోధ్యగా విశేష సిద్ధిదాయక పుణ్యక్షేత్రమై విరాజిల్లడం ఎల్లరికీ విదితమే....
ఇలా దక్షిణభారతావని విశేష పుణ్యప్రదమైన ఎందరెందరో ఘనదైవముల పుణ్యక్షేత్రాలకు ఆలవాలమై ఒప్పారడం ఎల్లరికి విదితమే....
సనాతనధర్మభూమి పై పరిఢవిల్లే సంస్కృతికి ఆయువుపట్టైన గంగానది మరియు గంగమ్మ పరీవాహక ప్రాంత ఆలయాలతో ఉత్తరభారతపుణ్యక్షేత్రాలు విశేషమైన ఖ్యాతిని గడించడం ఎల్లరికి విదితమే....
సరే ఇక అసలు విషయానికి వస్తే, అనగా ఈ వివిధ దైవిక శక్తులు, వారి ఆలయాలు మరియు తత్ సంబంధిత ఆగమోక్త మూర్తుల్లో కొలువైఉండే ఆ వివిధ దైవశక్తులకు మరియు పెద్ద పండగ గా జరుపుకునే ఈ మకర సంక్రాంతికి పండగకి ఏంటి సంబంధం...
నా వివిధ పాత పోస్టుల్లో వివరించినట్టుగా, సూర్యుడు ఆత్మశక్తి కారకుడు, మరియు సూర్యుణ్ణి ఆధారంగా చేసుకొని భ్రమణం గావించే చంద్రుడు మనోశక్తి కారకుడు....
అది భూగతమైన కేవలం మనుష్యులు మరియు ఇతర ప్రాణులకు మాత్రమే కాదు, ఆలయాల్లోని దైవిక మూర్తులకు ఆ మూర్తుల్లో కొలువైఉండే దేవతాశక్తులకు కూడా వర్తించే అంశం....
అందుకే సూర్య చంద్ర శక్తులు తాత్కాలికంగా మలినపడి లుప్తమై ఉండే గ్రహణసమయాల్లో ఆలయాలను కూడా మూసివేసి ఆ కలుషిత గ్రహణకిరణాల ప్రభావం ఆలయాల్లో కొలువైన దేవతామూర్తుల దైవికశక్తిసంతులతను ప్రభావితం
చెయ్యకుండా మనపెద్దలు ఏర్పరిచిన సదాచార వ్యవస్థ...
It means in order to protect the Aural magnitude of the corresponding celestial beings residing in the so called idol
( which is essentially a ' deavataamoorthi ' sculpted out strictly according to a mighty science known as "ShilpaSaastram", that has the ability to induce in to it the requisite form of divine power upon getting activated with the recital of the corresponding spiritual hymns.. )
from losing their balance due to the disruptive radiative energies emanated by the eclipse waves, the temples are closed during those eclipse times.....
ఇక్కడ చెప్పబడిన ఆ ఆరల్ మాగ్నిట్యూడ్ అనేది చంద్రుడి షోడశ కళల మీద ఆధారపడి ఉండే అంశం....
ఆ చంద్రుడి షోడశ కళల యొక్క శక్తిసాంద్రత అనేది తను సూర్యుడి నుండి గ్రహించే వివిధ శక్తుల సమ్మేళనం....
కాబట్టి ఆన్ని ఆలయాల్లోని దేవతామూర్తుల్లో కొలువైఉండే దైవికశక్తిసాంద్రత అనేది సూర్యుడి నుండి చంద్రుడికి ఆ తదుపరి చంద్రుడి నుండి భూమికి తద్వారా భూగత సకల జీవకోటికి అందే ఆ షోడశ కళల యొక్క శక్తిసాంద్రత పై ఆధారపడి ఉండే అంశం....
అది చాలా సున్నితమైన విశేష బౌద్ధిక గ్రాహ్యకాంశం....
బాగా సింపుల్ గా చెప్పలంటే
" టచ్ మీ నాట్ " అని పిలువబడే మొక్కలను ఎప్పుడైనా చూసారో లేదో...
చిన్నప్పుడు భద్రాద్రి కొత్తగూడెం రామవరం లోని మా అమ్మమ్మ వాళ్ళ ఇరుగుపొరుగు ఇళ్ళలో ( చోటక్క, వాజిద, దుర్గమ్మ ఇలా అందరి ఇళ్ళలో....)
చాలా ఉండేవి...
ఆ మొక్కల ఆకులను చాల లైట్ గా ముట్టుకున్నా సరే వెంటనే మొత్తం ముడుచుకుపోతాయ్....
మళ్ళి కాసేపటికి వాటంతట అవే మెల్లమెల్లగా విచ్చుకుంటాయి....
సగం విచ్చుకున్న ఆకులను ముట్టుకున్నాసరే మళ్ళీ మొత్తం ముడుచుకుపోతాయ్....
అది ఈశ్వరుడి విశేషమైన ఈ సృష్టిలో కేవలం ఆ మొక్కలకు గల ప్రత్యేకత...
అచ్చం అదే విధంగా ఈ సెన్సిటివ్ కాస్మిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ అనే అంశం కూడా ఈశ్వరుడి విశేషమైన ఈ సృష్టిలో ఒక భాగం...
ఆ కాస్మిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ అనేది దేవతామూర్తులు క్రమక్రమంగా క్రమక్రమంగా అర్చనాభిషేకాలతో సంతరించుకునే సున్నితమైన అంశం...
సూర్యుడి మకర సంక్రమణం తో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంతో సూర్యుడి రథగమనం తన రథసారధి అనూరుడు ఉత్తమమైన ఉత్తరదిశకు మళ్ళించడం అనే పారామార్ధిక అంశం, మరియు లౌకికంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు భూమికి దెగ్గరగా ఉండడం అంటే నిజానికి భూమి సూర్యుడికి దెగ్గరగా తన భ్రమణం సాగించడం అనే సత్యంలో,
ఈ కాస్మిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ అనేది బాగా బలపడుతూ విశేషమైన దైవికశక్తిని పుంజుకుంటుంది....
అందుకే కద సాధారణంగా ఈ ఉత్తరాయణపుణ్యకాలంలో ఉండే మాఘపంచక సమయంలోని 5 నెలలు కూడా పెళ్ళిళ్ళ హడావడితో ఉండే సీసన్ తో ఆలయాలు కూడా విశేషంగా భక్తజనసంద్రమై ఉండడం మనం గమనించే అంశం...
ఇప్పుడంటే ఫంక్షన్ హాళ్ళ కాన్సెప్ట్ బాగ పెరిగి అందరూ అక్కడికెళ్ళి పెళ్ళిళ్ళు ఇతర ఫంక్షన్లు చేస్కుంటున్నారు కాని మన పూర్వుల కాలంలో ఎక్కువగా పెళ్ళిళ్ళన్నీ కూడా పుణ్యక్షేత్ర సమీపంలోనే జరిగి దైవదర్శనం తో, దైవానుగ్రహమే ప్రధానమనే రీతిలో జరిగేవి కాబట్టి ఆలయాల్లో ఎక్కువగా భక్తజనసందోహం ఉండేది...
"మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన..."
అన్న చందంగా ఎందరెందరో భక్తులను
నిరంతరం అనుగ్రహిస్తూ ఉండాలంటే వచ్చిన ఆ భక్తులందరికీ కూడా నిరంతరం అర్చన గావిస్తూ ఈశ్వరుడికి హారతి సమర్పిస్తూ,
ఆ ఈశ్వరమూర్తిలో కొలువైఉండే దైవిక శక్తిని షోడశకళల రూపంలో ఆ మూర్తి వెదజల్లుతూ ఉంటే వాటిని భక్తులకు కర్పూరహారతి ద్వారా నిరంతరం అందిస్తూ ఉండడంలో, ఆ కాస్మిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ అనేది మార్పుకు గురౌతూ ఉంటుంది...
అది కనిపించీకనిపించనట్టుగా ఉండే
సున్నితమైన అంశం....
హారతి పళ్ళెంలోని కర్పూరం వెలిగించగానే వెంటనే ఘనస్థితి నుండి వాయుస్థితికి కరిగే ప్రక్రియలో
మధ్యన ఉండే ఆ కనిపించీకనిపించని ద్రవ స్థితిలా అన్నమాట...!
ఇంతకీ గుడిలో ఉండే దేవతామూర్తికి మరియు ఆ మూర్తిలోని దైవిక / షోడశకళల శక్తి అనగా ఆ కాస్మిక్
ఆరల్ మ్యాగ్నిట్యూడ్ కి మరియు అక్కడెక్కడో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యమండల శక్తికి /
ఆ సూర్యుడి కాస్మిక్ ఆరల్ మ్యాగ్నిట్యూడ్ కి ఏంటబ్బా సంబంధం అనే కదా మీ సందేహం...
దానికి సమాధనం " నాదం "...!
అవును నాదమే అక్కడి సవితృమండల కాస్మిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ ని మరియు ఇక్కడి భూమిపై గల ఆలయంలోని కాస్మిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ ని ఒక సంతులనాత్మక స్థితిలో అనుసంధానిస్తూ నిత్యం దైవిక అనుగ్రహాన్ని భూమిపైకి ప్రసరిస్తూ ఉండేది....!
అందుకే ఒక ఆలయంలోని 8 శక్తి స్థానాల్లో ఆ ఆలయ శిఖరం ఒకటి...
అనగా శ్రీ చాగంటి సద్గురువులు వివరించినట్టుగా ఆలయ శిఖర దర్శనం 1/8 పుణ్యసంచయకారకం....
ఎలెక్ట్రాన్లు, ఫోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఇతర కాంతి సంబంధిత సూక్ష్మ పదార్ధములు ఎట్లు నిత్యం విడుదలౌతూ ఉంటాయో అదే విధంగా
సూర్య చంద్రుల నుండి నిత్యం
ఆల్ఫ బీటా గామా స్థాయిలలో కూడా వివిధ కిరణాల సంబంధిత నాదం అనేది ప్రసరించబడుతూ ఉంటుంది...
వాటి పౌనహ్పున్యమెంత మరియు ఎట్లు వాటిని అందుకునేది అనే విషయం పక్కనపెడితే, ఆ నాద తరంగాలు భూమండలం మొత్తం ఆవరించబడి వివిధ కాస్మిక్ ఆరల్ మ్యాగ్నిట్యూడ్లను తమదైన శైలిలో ప్రభావితం గావిస్తాయి అనేది ఎందరో
ఉన్నత శ్రేణి సైంటిస్ట్ల మేధోమండలాలకు అందిన అంశం....
సదరు ఆలయాన్ని శాసించే నిర్ణీతాగమోక్త సదాచార వ్యవస్థలో భాగంగా ఆ ఆలయంలోని దేవతామూర్తి నిత్యం ఆ సవితృమండల నాదశక్తిని ఆ ఆలయ శిఖరం ద్వారా అందుకొంటూ తన కాస్మిక్ ఆరల్ మ్యాగ్నిట్యూడ్ని నిరంతరం స్థిరీకరించుకుంటుంది....
ఆ కాస్మిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ యొక్క స్థిరీకరణకు ఈ ఉత్తరాయణపుణ్యకాలం మొత్తం ఒక చక్కని పంటకాలం లాంటిది...
అనగా ఆషాఢంలో దక్షిణాయనం వచ్చే వరకు "Make hay while Sun shines..." అన్నట్టుగా ఆ ద్విగుణీకృత సూర్యమండల జనిత నాదశక్తి
ద్వారా తన కాస్మిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ యొక్క సాంద్రతను బాగా పటిష్ఠం గావించుకుకునే ప్రక్రియకు ఈ మకర సంక్రమణం నాంది...!
అందుకే ఇది అందరికీ పెద్ద పండగ....
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సిద్ధహస్తం నుండి జాలువారిన ఈ క్రింది ఒక చక్కని సాహిత్య గుళికలో తెలుపబడిన సంక్రాంతి యొక్క వైభవం లా...
సద్గురోక్త భగవద్ కథాసుధలను శ్రద్ధతో ఆలకించి, ధ్యానసిద్ధిగా ఒడిసిపట్టి, చిత్తంలో న్యాసం గావించి, మననంతో మధించి సాధించబడే సాధకుల ప్రజ్ఞ్యాన సిరికి ఆ సవితృమండల నాదశక్తి, యోగశక్తిగా భాసించి అనుగ్రహించడంలో సదరు ఉపాసకుడికి
నిజమైన సంక్రాంతి సమ్రంభం లభిస్తుందనేది నా ఫీలింగ్ అన్నమాట...😊🍟🍨🍕
( ఈ ఎన్.వి.ఎన్.టి. సినిమాలోని "ఘల్ ఘల్" పాట వన్ ఆఫ్ మై ఫేవరట్ సాంగ్ కూడా...)
"జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా...
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవద...
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం
ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం...!"
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhPUq4XLO-4V0-QR-i6QpAR7uTuRGmCg9N-xekHIg4jZPA53ot2L28x_aC5Bsw5PPchyOWHbstGriu1gnPqtplNZkFGx836bq43Yxz00ZROELORhvoWszkslfPT2sFKFswjcMws2uwvTg1H/s1600/1610803934831605-0.png)
No comments:
Post a Comment