ఫలానా ***** సినిమా కి కొన్ని సందర్భాలను సందర్భోచితంగా వచించాలంటే ఒక్కొక్క పాత్రను పోషించే నటుడికి ఒక్కొక్క రీతిలో డైలాగ్లను రాయడం గమనించే ఉంటారు.....
" పెళ్ళికి ఆహ్వానించగా దేవతలకు ప్రతిరూపాలుగా వచ్చిన బంధువులకు పశువుల కొట్టంలో పారేసే కుళ్ళిన సోరకాయలు మురిగిన కూరగాయలు తెచ్చి పడేసి వండిపడెయ్యండని కనీస ఇంగితము, మరియాద కూడా లేకుండా ప్రవర్తించి...
ఇప్పుడు నాక్కూడా 3 కేజీల కంటే ఎక్కువ ప్రసాదం కావాలని ఏవిధంగా సిగ్గు ఎగ్గు లేకుండా చెయ్యిచాచి అడుగుతావ్....నువ్వూ నీ లజ్జారహితమైన వేషాలు...ఛి ఛి. "
అని....కోట శ్రీనివాస్ రావ్ గారి పాత్రలకు ఒకలా రాయొచ్చు......
" సమాజంలో ఒకరి గౌరవానికి ఎంతో ఇబ్బంది కలిగే వేషాలన్నీ వేసి....
యాక్సిడెంట్లు చేసి కార్ డోర్ తో కొట్టించి....పెట్రోల్ బంక్లో రాంగ్రూట్లో గుద్దించి.....వారి ఉన్నతిని ఓర్వలేని వారితో కలిసి వారిని, వారి ఇంటివారిని ఇన్నాళ్ళు ఎంతగానో ఇబ్బందిపెట్టేలా నానా రచ్చ చేసి...
ఇప్పుడు నాక్కూడా 3 కేజీల కంటే ఇంకా ఎక్కువ ప్రసాదం కావాలని కండకావరంతో ఎగిరెగిరి పడుతున్నావే...
ఎవరి జీవితంలో ఎంతవరకు కలగజేసుకోవాలో, ఎవ్విధంగా ఒకరి గౌరవానికి భంగం కలగని రీతిలో
పనులను చక్కబెట్టాలో తెలియని మూర్ఖుడివి....
చేసిన రచ్చ చాలదన్నట్టుగా ఇప్పుడు మళ్ళి ఇంకో కొత్త రచ్చనా....
ఛి...ఛి....నువ్వు అసలు మనిషివేనా....."
అని విరుచుకుపడే తనికెళ్ళ భరణి గారి పాత్రలకు ఒక విధంగా రాయొచ్చు....
" ఇంట్లోని ఏ ఒక్క అడపిల్లకీ ధర్మబద్ధంగా బాగోగులు చూడవు కాని ఇప్పుడు ఇంకొకరి జీవితాన్ని ఏదో ఉద్ధరించేద్దామని నీ జోబులు నిండడానికి వాళ్ళ జోబులు ఖాళి చేసి వాళ్ళ జీవితాలను వాళ్ళ
ఇష్టానికి వదిలేయకుండా నువ్వనుకున్నట్టే ఉండాలనే మూర్ఖత్వంతో పావులు కదుపుదామని చూస్తున్నవా....
హుమ్మ్....నువ్వు....నీ వేషాలు....మూస్కొని నీ జీవితం నువ్వు సరిగ్గా జీవించు..."
అని రఘువరన్ గారి పాత్రలకైతే ఒకలా రాయొచ్చు....
" ఎవరు ఈ ప్రసాద లబ్ధికి మూలకారణమో వారు మరియు వారు ఎంచుకున్న ఇతర మితృలు తీసుకుంటారు....మధ్యలో ఏదో కొద్దిసేపు పెద్దమనిషిగా ఉండేలా చేసినంత మాత్రానా పెద్దరికాన్ని నిలబెట్టుకునేలా ఉండాలి కాని నేనే అన్నిటికీ అందరికీ పెద్ద అని ఎగిరెగిరి పడడం సబబు కాదు నాయనా...."
అంటూ సౌమ్యంగా పలికే అన్నపూర్ణమ్మ గారి పాత్రలకైతే ఒకలా రాయొచ్చు....
"ఆహహహహ....ఒహోహోహోహో....చెయ్యాల్సిందతా చేసి....'నాకేం తెలియదు...
మరెవరో ఎందుకో చేసుంటారు....
నాకేం అవసరం అన్ని అనర్ధాలు కలగజేయడానికి....' అని ఎంత బాగా
సెప్తున్నారో......హుమ్మ్....."
అని సెటైరికల్ గా పలికే కొవైసరళ గారి పాత్రలకైతే ఒకలా రాయొచ్చు....
" అబ్బబ్బబ్బబ్బా......
ఏమి సెప్తిరి...
ఏమి సెప్తిరి....
ఇప్పుడిప్పుడే ఇట్ల సెప్తున్నర...
లేక ఎప్పనుండో ఇట్లే సెప్తున్నర...."
అని తనదైన స్టైల్లో చెప్పే పవన్ కల్యాణ్ గారి పాత్రలకైతే ఒకలా రాయొచ్చు.....
ఇలా ఒక్కొక్క పాత్రకు మరియు ఆ పాత్రను పోషించే సదరు వ్యక్తి యొక్క భావవ్యక్తీకరణకు తగు విధంగా ఉండేలా సినిమా డైలాగులను రాయడం మనం గమనించవచ్చు.....
అదే విధంగా ఈశ్వరుడు కూడా కర్మసిద్ధాంతమనే తన వ్యవస్థీకృత జీవాత్మ మార్గనిర్దేశనానుగుణంగా ఒక్కొక్క జీవుడికి....అనగా ఒక్కొక్క ప్రాణికి...ఒక్కొక్క రీతిలో తన ఈశ్వరత్వాన్ని ఎరుకపరిచి వారి వారి కర్మలకు తగు కర్మఫలాలను ఒసగుతూ ఉంటాడు....
సాధారణ లౌకిక తర్కానికి అందే సామాన్య వ్యవస్థే ఐతే అది ఈశ్వరుడి అధీనంలో ఉండే వైశ్విక వ్యవస్థ ఎందుకౌతుంది....?
కాబట్టి కనిపించేవే నమ్ముతాము అనడం మూర్ఖత్వం...
కనిపించనంత మాత్రాన నమ్మకూడదని ఏంలేదు కద అని అనడం విజ్ఞ్యానం.....
సాధారణంగా కనిపించనివి, ఈశ్వరుడి అనుగ్రహంతో మాత్రమే కనిపించేవి కూడా ఉంటాయి అని విశ్వసించడం ప్రజ్ఞ్యానం....
ఈశావాస్యమిదగుం సర్వం....
అనే ఉపనిషద్ వాక్యాన్ని
"మొత్తం ఈశ్వరుడే..." అని వచించడం సాధారణం....
'ఈశ్వరుడిని సర్వత్రా చూడగలిగేలా ఉండి అప్పుడు ఈ మొత్తమూ ఈశ్వరుడే... '
అని నిర్వచించడమే విశేషం....!
No comments:
Post a Comment