Wednesday, February 10, 2021

శ్రీ శార్వరి మాఘ బహుళ చతుర్దశి నిశీధి మధ్యగత లింగోద్భవ ఘడియల అత్యంత మహత్త్వపూర్ణమైన కాలం / రాబోయే 2021 మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు....😊🍨🍕💐🍟


( ఇవ్వాళ పుష్య బహుళ చతుర్దశి మాస శివరాత్రి.....
కాబట్టి వచ్చే నెల మాఘ బహుళ చతుర్దశి మాహా శివరాత్రి మహోత్సవం....😊 )

శ్రీకంఠుడు / నీలకంఠుడు ,శివుడు, రుద్రుడు, హరుడు, భోలాశంకరుడు, చంద్రశేఖరుడు, చంద్రమౌళీశ్వరుడు, గంగాధరుడు, అర్ధనారీశ్వరుడు, శంభుడు, మల్లికార్జునుడు (మల్లన్న)....
ఇలా ఎన్నో ఎన్నెన్నో పేర్లతో ఆ మహేశ్వరుడు లయకారకుడిగా వివిధ క్షేత్రాల్లో వివిధ పేర్లతో వివిధ రీతుల అర్చారాధనలు అందుకుంటూ భక్తులను విశేషంగా అనుగ్రహించే శివతత్వం గురించి శ్రీ చాగంటి సద్గురువులు వారి  "శ్రీ ఉమామహేశ్వరవైభవం " ప్రవచనాల్లో కడు రసరమ్యంగా శిష్య భక్తులకు అందించినారు.....
మరియు శ్రీమహాశివరాత్రి వైభవం గురించిన విశేషాలు కూడా అందించినారు.....

శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనాల్లోని క్షీరసాగర మధనం / హాలాహలభక్షణం గురించి విన్నవారికి గుర్తున్నట్టుగా,
అప్పటివరకు ఉమాకాంతుడికి లేని పేరు 
ఒకటి కొత్తగా వచ్చి చేరింది...

అదే " నీలకంఠుడు " అనే నామం...

హరిహర తనయుడు మణికంఠుడిగా ప్రఖ్యాతి గడిస్తే తండ్రి నీలకంఠుడిగా వినుతికెక్కిన సంఘటనలు నిజంగా ఆశ్చర్యకరమైన లోకోపకార లీలావిశేషాలు.....

రైమింగ్ వర్డ్స్ లా నీలకంఠ , మణికంఠ వినడానికి చాలా బావున్నా మొదటి నామం మాత్రం 
రెండవనామానికి ఏ పోలిక లేనిది...

ఎందుకంటే అయ్యప్పస్వామి నిజంగానే కళ్ళుచెదిరే కాంతులీనే బాగా కాస్ట్లీ మణిని కంఠాభరణంగా ధరించాడు కాబట్టి మణికంఠ అనే నామం బాగ అమరింది....

మరి అలాంటి కాస్ట్లీ బ్లూ సఫైర్ లాంటి మణిని తన కంఠము నందు శివుడు ఏమి ధరించకుండానే అలా నీలకంఠుడిగా పేరొందడం ఆశ్చర్యమే కద.... 

కాబట్టి ఒకింత ఆశ్చర్యచకితమైన ఈ నీలకంఠుడి కథేంటో ఇప్పుడు చర్చిద్దాం.....

అమృతాన్ని సాధించడం కోసం దేవదానవులందరు కలిసి పాలకడలిని వేదికగా గావించి మందరగిరిని కవ్వంగా నిలిపి ఆ పర్వతకవ్వాన్ని ఇరువైపులా అటూ ఇటూ తిప్పుతూ క్షీరసాగరాన్ని మధించుటకు వాసుకిని తాడుగా గావించి, అది పాలసముద్రంలో మునిగిపోతుంటే స్థితికారకుడైన శ్రీమహావిష్ణువును 
ఆ మునిగిపోతున్న మందరగిరిని స్థిరంగా నిలుపుటకు శ్రీమహాకూర్మమై కడలి అడుగున కొలువై ఆ మహాకూర్మ వీపుపై ఉండే దృఢమైన డిప్ప లాంటి కవచంపై మందరగిరిని స్థిరంగా నిలిపి ఆ మధనాన్ని కొనసాగిస్తే అప్పుడు వివిధ వింతలు విశేషాలకు ఆలవాలమైన వివిధ దైవిక వస్తుజాలం పాలకడలినుండి ఉద్భవించడం గురించి ఎల్లరికీ విదితమే కద...

మేయిన్ ప్రొడక్ట్ గురుంచి చర్నింగ్ స్టార్ట్ చేస్తే వివిధ బైప్రొడక్ట్స్ లభించడం, అనగా 

ఐరావతం, కామధేనువు, కల్పతరువు, ఉఛ్చైశ్రవం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మీ, ఇత్యాదివన్నీ కూడా 
అమృతకలశం అనే మేయిన్ ప్రొడక్ట్ కి బైప్రొడక్ట్స్ గా లభించడం వరకు బాగానే ఉంది కాని వీటితో పాటుగా లోకభీకరమైన హాలాహలం కూడా అందునుండి ఉద్భవించి అక్కడున్నవారందరిని హాహాకారాలు పెట్టించి పరుగెత్తేలా చేయడమే అక్కడ అంతగా ఎవ్వరూ ఊహించని ఆహ్వానించని సంఘటన....

అన్నిటినీ తనలోకి లయించివేసే లయకారకుడే ఇక దిక్కని తలచి అందరూ ఆ హరుడి వద్దకు పరుగిడి అర్ధించగా, ఆ భోళాశంకరుడు భక్తులమొరలను ఆలకించి ఆ అత్యంత విషపూరిత గరళాన్ని తన యోగశక్తితో ఒక చిన్నసైజ్ బ్లూకలర్ చాక్లేట్లా అణిమా సిద్ధిని ఉపయోగించి సంక్షిప్తం గావించి దాన్ని మింగేసి తన గొంతులోని కంఠభాగంలో అటు పూర్తిగా కడుపులోకి మింగకుండా ఇటు బయటికి కనిపించకుండా కట్టడి గావించి, ఆ గరళగులిక జనిత నీలవర్ణం తన కంఠసీమయందు వ్యాప్తిచెందగా అప్పటినుండి గరళకంఠుడిగా / నీలకంఠుడిగా / శ్రీకంఠుడిగా పేరొందడం అనే వృత్తాంతం ఒకింత సంభ్రమాశ్చర్యజనితమైనదే కదు....

బయటికి కనపడేలా అదిమిపెడితే అది ఎవరిని ఎప్పుడు ఎలా బాధిస్తుందో తెలియదు.....

"
దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||
"

గా ఆ ఆదిపరాశక్తి తన వామార్ధభాగమై కొలువైఉంది కద....

కాబట్టి లోపలికి మింగెస్తే తన ఉదరంలో కొలువైఉండే బ్రహ్మాండసమూహం ఆ హాలాహల ప్రభావానికి మాడిమసై పోతుంది....

ఇక బయటకి కాకుండా లోపలికి కాకుండా మరెక్కడ బంధించడం కుదిరేది..?

కంఠసీమ నందు మాత్రమే అది కుదిరేది.....

ఎందుకంటే కంఠసీమ అనునది ఊర్ధ్వకూటమైన ముఖమండలానికి మధ్యకూటమైన నాభి ఉపరితల కంఠ అధో భాగానికి అనుసంధాయక ప్రదేశం....

కాబట్టి దుస్సహమైన భగ భగ మండుతున్న ఆ హాలాహలాన్ని తియ్యని కమ్మని గర్మాగరం రంజాన్ నాటి షీర్ కూర్మా పాయసంలా స్వీకరించి 
దాన్ని ముద్దగా మార్చి కంఠం లోపల నీలమణిగా దాచి నీలకంఠుడిగా పేరొందడం ఆ హరునకే చెల్లింది..!!

సరే ఇక్కడివరకు అప్పడు జరిగిన అనుకోని బాధాకర సంఘటనను సర్వప్రాణి హితకరంగా పరిష్కరించే దిశగా ఆ హరుడు అలా ఆ లోకభీకర హాలాహలాన్ని తనలోకి లయించివేయడం అనేది భౌతిక అధ్యాత్మ విశేషం....

మరి ఈ సంఘటనలోని భౌతిక అధ్యాత్మ విశేషం తో పాటుగా మరేదైనా దైవిక, తాత్త్విక, సైద్ధాంతిక, యోగ విశేషం కూడా ఎమైనా ఉన్నదా అనే దిశగా అధ్యాత్మ తత్త్వ చింతనాపరులు / జిగ్ఞ్యాసాపరులు మేధోమధనం గావించడం సహజం.....

వారి వారి గురుబోధలకు అనుగుణంగా అధ్యాత్మ వస్తువిషయ సామాగ్రి న్యాసంగావించబడి,
మననంగావించబడి, ధ్యానించబడి
దైవానుగ్రహంగా అందుకోవడంలో,
ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఆ యోగవిశేషాలు భాసించడం అనేది సహజం....

ఈశ్వరానుగ్రహంగా అస్మద్గురుబోధాంతర్గతంగా సాగిన ధ్యానమంజరులను ఆలంబనగా గావించి కొంతమేర ఈ శ్రీకంఠుడి / నీలకంఠుడి విశేషం ఏంటో ఇప్పుడు చూద్దాం....

84 లక్షల జీవరాశుల్లో స్వరపేటిక గల ఎకైక ప్రాణిగా జన్మించే అదృష్టం కేవలం మనుష్యునకు మాత్రమే కలదు.....

ఆ విశేషం వల్లే మనిషి ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగి మేధోమధనం అనే కృషితో ఋషిగా మారి, మరే ఇతరప్రాణి తరించలేని విధంగా తను తరించి ఇతరులను తరింపజేయగలడు...!

అంతటి ఉత్కృష్టమైనది మనుజుడి కంఠసీమ యొక్క వైభవం....!

కాబట్టే మన పెద్దలు మనిషికి సకల మహత్తును ఆపాదించే దైనందిన పూజ అనే దైవిక క్రతువులో, మొట్టమొదటి పనిగా అత్యంత ముఖ్యమైన పనిగా కంఠసీమ యందు కొలువై ఉండే స్వరపేటిక శుద్ధికొరకై కందకంలా ఉండేలా జలాన్ని ముమ్మారు,
అనగా మినప గుండు మునిగేంతటి పరిమాణంలో ఉండే స్వఛ్చమైన బుడగలు లేని నీటి చుక్కను కుడిచేతి మధ్యలో ఉద్ధరిణతో 
( అదే..మన భాషలో స్పూన్ తో ) పోసి..

ఓం కేశవాయ స్వాహా...
ఓం నారాయణాయ స్వాహా...
ఓం మాధవాయ స్వాహా...

అని మూడు సార్లు విడి విడి గా పెదవులకు, పళ్ళకు తగలకుండా కుడిచేతి మధ్య నుండి అమృతమార్గం గుండా అనగా ఒక గీతలా ఉండే కుడి అరచేతి మార్గం ద్వారా డైరెక్ట్ గా నోట్లో నుండి గింతులోకి చేరుకునేలా స్వీకరించడం అనగా " ఆచమనం " గావించడం అనే ప్రక్రియను మన పెద్దలు వ్యవస్థీరకించారు.....

అంతటి ఉత్కృష్టమైనది మనుజుడి కంఠసీమ యొక్క వైభవం....!

పై నామాల్లోని

క కార
న కార
మ కారాలతో

క్రమంగా కంఠం / నాలుక / పెదవులు ఈ మూడు కూడా ఉత్తేజితమై ఇక ఆ తదుపరి పూజా కృతువులో కంఠం కంచు ఘంఠారావం లా పనిచేస్తు ఈశ్వరుడుని వివిధ నామ / స్తోత్ర / సంకల్ప / అర్చన ఇత్యాది వాటితో ఆరాధించి అనుగ్రహం పొందే ఏర్పాటును మన సనాతన పెద్దలు సువ్యవస్థీకరించారు...

మనుష్యుడి స్వరపేటిక / అది కొలువైన కంఠసీమ అంత గొప్పవి మరి....
( సరిగ్గా ఉపయోగించుకునప్పుడు మాత్రమే...)

లేకపోతే వరమైన స్వరపేటికే శోక కారణమై ఒక్కోసారి రణమై పరిణమిస్తుంది....

అది మన మాట తీరుతో, అనగా మాట యొక్క గొప్పదనంతో / గట్టిదనంతో, స్వర మాధుర్యంతో / స్వర గాంభీర్యంతో / ఆర్జించబడే ఫలితం...

ఒక సందర్భంలో

ఒకరేమో...

" అబ్బో వచ్చారండి విచిత్ర సోదరులు....ఎవరి కోసం వచ్చారో మరి...." అని ఎంతో పెడసరిగా మొహం మీదే వాకిట్లోనే పొగరుతో నోరుపారేసుకొని మర్యాదనుకోల్పోతే....

మరొకరేమో

" ఓహ్ చాల రోజులకు కనిపించారే.....మొత్తానికి వచ్చారు....చాలా సంతోషం....అంతా 
బాగేనా...."

అంటూ ఆప్యాయతతో పలకరించడంలో మర్యాదను పెద్దరికాన్ని గౌరవాన్ని ప్రదర్శించి ఆప్తులుగా అనిపిస్తారు...

మరో సందర్భంలో...

ఒకరేమో 

"
ఈ జోక్ ఇన్నవ మామ...ఇగ నెక్స్ట్ వీడికంట...పెళ్ళంట....హహహహహ..."

అని గుమ్మం దెగ్గరే నలుగురు నవ్వేలా 
ఎంతో వెకిలిగా మాట్లాడి అవమానం గావిస్తే....

మరొకరు....

" ఎం రా పెళ్ళెప్పుడు...ఇగ నెక్స్ట్ నీదే...దావత్ ఎప్పుడు మరి..."

అని నలుగురు అభినందించే రీతిలో మాట్లాడగలరు....

ఇక్కడ సందర్భం ఒక్కటే....
స్వరాలు వేరు.....
స్వరం యొక్క తీరుతెన్నులు వేరు....
మాటల యొక్క కూర్పు వేరు...
మాట్లాడిన వైనం వేరు.....

తన్మూలంగా ఒకరు ధూర్తులుగా ఒకరు స్నేహితులుగా ఉత్తరక్షణం మన మదిలో ముద్రపడడం అనే సత్యంలో....
మనుష్యుడి స్వరపేటిక / కంఠసీమ ఎంత గొప్పవో అనే విషయం చెప్పకనే చెప్పబడుతుంది....

ఇటువంటి సాధారణ ఉదాహరణలు మొదలుకొని,
మాటలు, వాక్యాలు, చర్చలు, ప్రకటనలు, తర్కాలు, భాష్యాలు, ఇలా మనుష్యుడు తన మాటల ద్వారా
ఎందరెందరో జీవితాల్లో తనదైన ముద్రతో ప్రభావం చూపగలడు.....

అది మాట / స్వరపేటిక యొక్క గొప్పదనం...

ఎన్ని గుర్తున్నా మర్చిపోయినా మనుష్యుల మాటలు మాత్రం చాలా తీవ్రమైన ప్రభావం చూపే సాధనాలు....

శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే
" రంపపు కోత కన్ననూ ఒక కఠినమైన మాట కలిగించే వ్యధ అధికమైనది..."

పదేళ్ళ క్రితం జరిగిన ఫంక్షన్లో
ఎవరు ఎంత గొప్ప డ్రెస్ వేస్కున్నారో...
ఎన్నెన్ని రకాల ఫుడ్ ఐటెంస్ పెట్టారో...
మరే ఇతరమైనవన్నీ కూడా అంతగా గుర్తుపెట్టుకోరు కాని....

ఒక్క కఠినమైన మాటతో గావించబడిన అవమానం మాత్రం జీవితాంతం దహిస్తూనే ఉంటుంది....

మాటకు గల గొప్పదనం అటువంటిది...
మాటకు గల శక్తి అటువంటిది...
మాటకు గల ప్రాముఖ్యత అటువంటిది....
మాటకు గల విలువ అటువంటిది...
మాటకు గల మన్నిక అటువంటిది...

" ఆ పెద్దయాన్ని మాట హామి ఇవ్వమనండి...
మీకు ఇప్పటికిప్పుడే డబ్బిస్తా...
ఆయన మాటంటే అంత నమ్మకం నాకు...."

" వారి ఒక రెండు మంచి మాటలు విన్నా చాలండి....మనసు ఎంతో తేలిక పడి హాయిగా ఉంటుంది...."

" వాడి పొగరు ఏతులు ఎచ్చులు నీకెం తెలుసు...
వాడి మాటలు విన్నావో ఇక అంతే సంగతులు...
నువ్వు నిలువునా మోసపోతావు...జాగ్రత్త..."

"ఆవిడ చెప్పింది చెప్పినట్టు చేయండి...అన్నీ అవే చక్కబడతాయ్....

ఇవ్విధంగా ఒక మనుష్యుడి స్వరపేటికను / కంఠసీమను ఆధారంగా చేసుకుని వెలువడే మాట మనిషి యొక్క స్థాయిని స్థిరీకరించి నిర్వచించేంతవరకు వెళ్ళగలదు అంటే కంఠసీమ నిజంగా ఎంత గొప్పదో కద..!

ఇక ఆంతరమున, ఊర్ధ్వకూటమి గా ఉండే తలకాయ్

( అనగా కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మెదడు, కపాలం, తత్ సంబంధ జ్ఞానేంద్రియ 
క్రియాకలాపానికి ఆలవాలమైన తల భాగానికి )

మరియు మధ్య కూటమి గా ఉండే శరీరానికి

( అనగా ఊపిరితిత్తులు, గుండే, బొజ్జ, ప్రేవులు, లివర్, పాంక్రియాస్, కిడ్నీలు, ఇత్యాది సకల జీవక్రియానిర్వాహక ఆంతరావయవ సంఘాతమై ఉండే భాగానికి )

కంఠసీమ అనేది అనుసంధాయక వ్యవస్థ.....

అధో కూటమి కి చెందిన కాళ్ళు లేని వారిని,
మధ్యకూటమికి చెందిన చేతులు లేని వారిని మరియు ఇతర వివిధ ముఖ్య అవయవాలు లుప్తమైన వారిని 
( కళ్ళు, చెవులు, కిడ్నీలు, ఇత్యాదిగా ) 
చూసుంటారు కాని 

ఎప్పుడైనా ఎక్కడైనా పైన పేర్కొన్న ఊర్ధ్వ కూటమి, మధ్యకూటమిని అనుసంధానపరిచే
కంఠసీమ లేని మనుషులను చూసారా...?

అది అసంభవం....ఎందుకంటే....
మనుష్యుడి ప్రాణశక్తి ఊపిరిని ఆధారంగా గావించి కంఠసీమనందు కేంద్రీకృతమై తనువెల్లా వ్యాప్తిగావించి ఉంటుంది కాబట్టి....

ఇన్ అదర్ వర్డ్స్ వితౌట్ ఫిసికల్ త్రోట్ దేర్ ఇస్ నో లైఫ్ ఫర్ దట్ లివిన్ బీయింగ్...

అందుకే ఏ సినిమా డైలాగ్స్ విన్నా సరే....

" వాడు బాగా ఉషార్...పైకి అలా అమాయకుడిలా కనిపిస్తాడు కాని...వామ్మో వాడి మాటలు వింటే తెలుస్తుంది..వాడు ఎంత శార్పో...."

"మాటే మంత్రము... మనసే బంధము...." అనే ఫేమస్ పాట ఒకటి వినే ఉంటారు....

బయోమెట్రిక్ యునీక్ ఐడెంటిటీస్ లో
ఫింగర్ప్రింట్స్, ఐరిస్ తో పాటుగా వోకల్/ వాయిస్ రెకొగ్నిషన్ కూడా ఒకభాగమై ఉండడం తెలిసిందే....

ఒక మనిషి ఎంత గొప్ప వ్యక్తైనా సరే, ఎంతటి ఆరితేరిన మేధావి అయినాసరే, ఎంతటి తలనెరిసిన పండితుడైనా సరే అవన్నీ కూడా సదరు వ్యక్తిచే నుడువబడే మాటలు / పదాలు / వాక్యాలు / భాష్యాలు గా మాత్రమే తమ గొప్పదనాన్ని స్థిరీకరించుకుంటాయ్....

సదరు వ్యక్తిచే వెలువడే అక్షరాలు / మాటలు / పదాలు వినా వారి గొప్పదనాన్ని తెలియపరిచే సాధానాలు మృగ్యం.....

వాటన్నిటికి కారణం సదరు వ్యక్తి యొక్క స్వరపేటిక మరియు మేధోమండలాంతర్గతంగా తనలో జనించే అసంఖ్యాక భావాలు 

"అక్షరమయి నాదమయి యోగమయి వేదమయి శబ్దమయి...."

ఇత్యాదిగా మనుజుడి హృత్కుహరంలో కొలువైఉండే ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహంగా వివిధ భావలహరులుగా బహిర్గతమై లోకానికి అంది అంతటి అనుగ్రహసముపార్జితంతో జీవించే ఇతర మాన్యులచే తర్కించబడినప్పుడు సదరు వ్యక్తిలో అంతర్నిహితమై ఉండే వాగ్దేవి వైభవం ప్రపంచంలో ప్రస్ఫుటంగా పరివ్యాప్తమై పరిఢవిల్లుతుంది...

కాబట్టి స్వరపేటిక కొలువైఉండే కంఠసీమయే మనుజుడిలో ఆదిపరాశక్తి యొక్క కేంద్రస్థానమై అక్కడినుండి యావద్ శరీరం మొత్తానికి ప్రాణశక్తిని స్థిరీకరిస్తూ ఉంటుంది...

సవైదిక సనాతన సంప్రదాయంలోని వివాహ క్రతువులో మీరు గమనించిఉండిఉంటే శివశివా కళను సంతరించుకునే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇరువురిని ఒకటిచేసే గుడజీరకధారణ మరియు మాంగళ్యధారణ అనేవి అత్యంత ముఖ్యమైన ఘట్టాలుగా చెప్తారు...

అటువంటి మాంగళ్యధారణ సమయంలో 
ఆ సర్వామంగళాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కొలువైఉండేందుకు వరుడు వధువు కంఠసీమకి అలంకరణగా ఉండేలా వేసే మూడుముళ్ళ మాంగళ్యధారణకు ముందు ఆ సూత్రాన్ని / శతమానములను పెళ్ళికి తరలివచ్చిన పెద్దముత్తైదువుల కంఠసీమలకు అలా కొద్ది సేపు అలంకరణగా ఉండేలా అక్కడి సువాసినులందరి కంఠసీమల్లో కొలువైన మాంగళ్యంలోని సర్వమంగళాదేవి అనుగ్రహం ఆ కొత్త సూత్రానికి / శతమానములను తద్వార ఆ నవవధువు యొక్క కంఠసీమకు కూడా సమకూరేలా ఉండే ఆచారాన్ని మన పెద్దలు పాటించడం గమనించే ఉంటారు.... 

అసలు ఒక మనిషి యొక్క జీవితపు ఆయువుపట్టు మొత్తం పెళ్ళైన తదుపరి తన భార్య యొక్క కంఠసీమలో కొలువైన సౌమాంగళ్య వైభవంలోనే స్థిరీకరించబడి ఉంటుంది....

వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది సనాతన శాస్త్ర వైభవం....

ఎన్నో సినిమాల్లో కూడా చూసే ఉంటారు..

" భార్య తాళి మహత్తు...అందుకే అంతటి ఆపదనుండి కూడా బ్రతికాడు..."

అనేలా ఉండే ఎన్నో డైలాగ్స్ ని....

ఒక సువాసిని పతివ్రతగా పూజలు నోములు వ్రతాలు గుళ్ళు అంటూ ఆధ్యాత్మిక జీవన పరిపుష్టితో ఉన్నప్పుడు.....
తన భర్త అంతగా ఆధ్యాత్మిక వ్యక్తి కాకపోయిన ఆ సర్వమంగళాదేవి అనుగ్రహంతో సకల వైభవాలతో జీవిస్తుంటాడు....

ఒక సువాసిని పెద్దగా ఏ ఆధ్యాత్మిక జీవనం లేకుండా, జీవితపర్యంతంలో ఎడమచేత్తోనైనా ఒక్క పదిరూపాయల దానధర్మాలు కూడా చేయకుండా, కనీసం ఒక్క శ్రావణశుక్రవారం కూడా నిండు మనసుతో ఒక ఐదుగురు ముత్తైదువులకైనను ఎర్రపూలు, తమలపాకులు, మొలకెత్తిన పచ్చి శనగలు, ఒక పండు వాయనంగా ఇచ్చి వారి దీవెనలు అందుకోకుండా, కేవలం తిన్నామా, కూడబెట్టామా, అని మాత్రామే ఉండేలా జీవించినప్పుడు ఆ జీవితానికి సర్వమంగళాదేవి అనుగ్రహం లుప్తమై...,
తన భర్త ఎంతటి ధార్మిక జీవితంగడిపే వ్యక్తైనను, చక్కని జీవనశైలి గల మనిషైనను, కాలగతిలో గండం గా పరిణమించే ఘడియల్లో ప్రమాదాలకు లోనైనప్పుడు తనువుచాలించడం లాంటి విపత్కర పరిస్థితులను మనం సినిమాల్లో / సమాజంలో గమనించవచ్చు....

సర్వమంగళాదేవి అనుగ్రహం అంతటి ఘనమైనది కనుకనే ఆదిపరాశక్తిగా ఉన్నాసరే,
తన పతి కామేశ్వరుడిచే అలంకరించబడిన మంగళసూత్రంతో శోభిల్లే కంఠసీమ గల శివకామసుందరి గా ఆ లలితాపరాంబికను వాగ్దేవతలు స్తుతించినారు....

గహనమైన శ్రీలలితా భాష్యాలు కాకుండా, ఈ క్రింది లలిత శ్లోకాల్లో కంఠసీమయొక్క వైభవం ఎల్లరికీ సరళగ్రాహ్యమే కద...

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా ‖ 12 ‖

పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా |
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ‖ 81 ‖

అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,ఽక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ‖ 100

విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ‖ 98 ‖

" విశుద్ధిచక్రనిలయా, రక్తవర్ణా " గా అభివర్ణించబడిన ఆదిపరాశక్తి మన రక్తంలో అంతర్లీనంగా కొలువై శరీరం అన్నిదిక్కులా ఎంత అవసరమో అంతే వేగంతో రక్తాన్ని ఎగజిమ్మడం వల్లే మనం జీవించడం సంభవమయ్యేది....

ఆవిడ అనుగ్రహం లుప్తమై ఒక్క చోట రక్తం నిలిచిపోతే అది ఎంతో తీవ్రమైన సమస్యగా పరిణమిస్తుంది..

అది రక్తశుద్ధిని గావించే గుండెలో అయితే ఉత్తరక్షణం సడెన్ స్ట్రోక్ తో మనిషి అక్కడికక్కడే కుప్పకూలి గతించిపోవడం అనేది ఎల్లరికి తెలిసిన విషయమే....

మనిషి యొక్క మేధోమండలం అత్యంత చురుగ్గా పనిచేసేలా ఊర్ధ్వకూటానికి ఎంత వేగంగా రక్తాన్ని మన కంఠనాళం ఎగజిమ్ముతుందో సినిమాల్లో అయినా చూసుంటారు కద.....

( చంద్రముఖి సినిమాలో రజినికాంత్ వినీత్ తల తరిగినప్పుడు....
బాహుబలి సినిమాలో ప్రభాస్, అనుష్కను అవమానించిన వ్యక్తి తలను ఒక్క దెబ్బకు తరిగినప్పుడు రక్తం ఎగజిమ్మిన సీన్లో... ఇలా వివిధ సిమిమాల్లో వివిధ సీన్లల్లో చూసేఉంటారు కద....
ఒకానొక సమయంలో శ్రీశైల శ్రీభ్రమరాంబామల్లికార్జున సన్నిధిలోని శ్రీవీరశైవమండపంలో ఎంత మంది వీరశైవయోగుల కంఠాలు తెగిపడ్డాయో లెక్కేలేదు....
)

ఇవ్విధంగా కంఠం యొక్క ప్రాముఖ్యత
బహుధా లోకవిదితం...

అంతటి ఉత్కృష్టమైనది కనుకే తన కంఠసీమలో ఆ గరళాన్ని బంధించి నీలకంఠుడైనాడు ఆ నిగమవంద్యుడు...

ఎందుకంటే తన సతి యొక్క కంఠసీమలో కొలువైన సర్వమంగళాదేవి యొక్క అనుగ్రహంతో అది తనను ఏమాత్రం ప్రభావితం చెయ్యదు కనుక....

కాబట్టి అటు బయటికి కనిపించకుండా....ఇటు లోపలికి మ్రింగకుండా...సరాసరి కంఠమునందు కాఠిన్యాన్ని బంధించి లోకాలను సమ్రక్షించి అనుగ్రహించాడు ఆ భోలాశంకరుడు....😊

No comments:

Post a Comment