Tuesday, February 23, 2021

" సికింద్రాబాద్ " అనే ప్రదేశానికి గల పేరు స్కందర్ --> సికందర్ --> సికందరాబాద్ / సికింద్రాబాద్ గా కాలానుగుణంగా రూపాంతరం చెందిన స్కంద నామవాచకమే అని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యమే కదు....! 😊

శ్రీకంచికామకోటి వారి స్కందగిరి లోని సుబ్రహ్మణ్యాలయం, శ్రీమహాస్వామి వారి అనుగ్రహంగా జంటనగరాలకు లభించిన అమూల్యమైన ఆలయ సంపద....!

ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల ఒక పదార్థానికి / ఒక వస్తువుకి / ఒక ప్రదేశానికి / ఒక అత్యత్భుతమైన దైవిక శక్తి సమకూరి, ఆ మహానుభావుల కారణంగా ఆ పదార్థం / ఆ వస్తువు / ఆ ప్రదేశం నిరంతర దైవిక శక్తిసంచయంతో దిన దిన ప్రవర్ధమానమై యావద్ ప్రపంచం నమస్కరించేంతటి మహోన్నతమైన సంపదగా పరిణమిస్తుంది.....

నదిలో చాలా కాలం నానిన కేవల వస్తువు ఒక చక్కని శిల... ఒక మహానుభావుడి ఉలి స్పర్శతో ఒక ఆగమోక్త దేవతా మూర్తిగా రూపాంతరం చెంది మరొక మహానుభావుడి వేదోక్త మంత్ర శక్తితో జీవంపోసుకొని ఆలయంలో దేవత గా కొలువై కోరినవరాలనొసగే కల్పతరువై పరిణమించడంలో....

"కేవల రాయి.." అనే వస్తువు ఇద్దరు మహానుభావుల కృషితో " కనిపించే దైవం" గా రూపాంతరంచెంది ఎల్లరి ఉన్నతికి కారణమయ్యింది...

ఆ శిలను శిల్పంగా మార్చే ప్రక్రియలో లభించిన రాయిపొడి ఒక మహానుభావుడి వద్దకు ముగ్గు గా చేరుకొని కేవల ముగ్గు అనే ఒక పదార్థం నుండి సకల సంపదలను తనవద్దకు ఆకర్షించే శ్రీచక్రం లోని వివిధ రేఖలుగా రూపాంతరం చెంది దైవత్వాన్ని ఆపాదించుకుని నమస్కరించబడుతుంది.....

మిగతా ఇతర ప్రదేశాలా ఒక సామాన్య ప్రదేశం, ఒక్కొక్క మహానుభావుల మంత్రశక్తి తో పరిపుష్టమైన ఆగమోక్త ఆలయాంతర్గత దేవతా మూర్తిలో పరివ్యాప్తమై ఉండే షోడశకళాత్మక దేవతా శక్తి కి స్థావరమై రూపాంతరం చెందడంతో ఆ ప్రదేశానికి శాశ్వత వైభవం, మహిమ్నత గౌరవం, ఆపాదించబడి చిరంతనకీర్తిని గడిస్తుంది....

అవ్విధంగా భాగ్యనగరానికి శ్రీకంచిమహాస్వామి వారి ప్రత్యక్షానుగ్రహంగా వారి అనన్యసామాన్య మంత్రశక్తితో పరిపుష్టమైన ఆలయం, సికింద్రాబాద్ లోని శ్రీస్కందగిరిసుబ్రహ్మణ్యాలయం అనుగ్రహించబడడం ఎల్లరికి విదితమే కద....

ఆ " సికింద్రాబాద్ " అనే ప్రదేశానికి గల పేరు కూడా

స్కందర్ --> సికందర్ --> సికందరాబాద్ / సికింద్రాబాద్ గా కాలానుగుణంగా రూపాంతరం చెందిన స్కంద 
నామవాచకమే అని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యమే కదు....! 😊

"ఎంతో దైవానుగ్రహం / పూర్వజన్మార్జిత పుణ్యబలం ఉంటేనే జీవితానికి స్కంద / సుబ్రహ్మణ్యానుగ్రహం అనేది లభిస్తుంది... అంతటి విశేషమైనది స్కందారాధన..." 
అని శ్రీచాగంటి సద్గురువులు నుడివినట్టుగా....

అటువంటి శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారు కొలువైన స్కందగిరి నిజంగా ఈ భాగ్యనగరి యొక్క నిజ భాగ్యం...😊

చిన్నప్పటి నుండి వెళ్ళే వేములవాడ / కొండగట్టు / భద్రాచలం...
ఆ తరువాత 2009 నుండి ప్రవేశించిన షిరిడి / తిరుపతి / తర్వాత నా జీవితంలోకి కేవలం శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల అనుగ్రహంతో ప్రవేశించిన ఆరో ఆలయం మోపిదేవి సుబ్రహ్మణ్య ఆలయం కావడం నిజంగా ఆ షణ్ముఖుడి అనుగ్రహవిశేషమే...!

మరియు కేవలం శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల అనుగ్రహంతో నా జీవితానికి లభించిన 
" శ్రీమద్భాగవతాంతర్గత క్షీరసాగరమథన ఘట్టాంతర్గత సర్వదేవకృత లక్ష్మీస్తోత్రం యొక్క
అనుగ్రహంతో లభించిన నా భార్యామణి ఇల్లు / అత్తగారిల్లు కూడా స్కందగిరికి దెగ్గర్లోనే కావడం కూడా ఆ స్కందుడి అనుగ్రహవిశేషమే కాబోలు...! 😊

మరియు ఆశ్చర్యకరంగా జీవితంలో అస్మద్గురుదేవులను మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా దర్శించి రెండు దానిమ్మ పళ్ళు సమర్పించుకొని వారి పాదపద్మాలకు సాగిలపడి నమస్కరించుకున్న ప్రదేశం, "షణ్ముఖోత్పత్తి" మరియు "గంగావతరనం"
ప్రవచనాలు జరిగిన సికింద్రాబాద్ లోని ఒక సుబ్రహ్మణ్యసేవాసమితి కావడం మరింత విశేషం..!!😊

ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం వరకు అసలు స్కందగిరి అనే ఒక ప్రదేశం ఉన్నట్టుగాని అక్కడ శ్రీకంచికామకోటి వారి సుబ్రహ్మణ్యాలయం ఉందనే విషయమే నాకు తెలియదు కాబట్టి...😊

సకల రోగబాధా శత్రుబాధా ఈతిబాధా నాశక..
సకల సుజ్ఞ్యాన దాయక....
సకల సంపత్కారక....
సకల శక్తియుక్తిదాయక....
శ్రీవల్లీదేవసేనాసమేతసుబ్రహ్మణ్యస్వామికి
హరోం హర హర...

ఓం శరవణభవాయ నమః...! 🙏😊

******
కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (182)

స్కందనామ మహిమ

స్కందుడనగా శత్రువులను శోషింపచేయువాడని; దేవస్త్రీ దర్శనం వల్ల వదలిన ఈశ్వర రేతస్సు వల్ల పుట్టినవాడని నిర్వచనం. పరమేశ్వరుని జ్యోతిస్సువల్ల ఆవిర్భవించినాడు. ఇతనికి సుబ్రహ్మణ్య, కార్తికేయ, కుమార, శరవణభవ మొదలైన అనేక పదాలున్నా ఇతనికి సంబంధించిన పురాణం పేరు స్కంద పురాణమే. ఇతని నుద్దేశించి చేయబడు వ్రతము స్కంద షష్టియే. పరమేశ్వరుడు, అమ్మవారితో కుమారస్వామితో అతని పేరు సోమ స్కందుడే. 
ఏదైనా విషయం వేదమంత్రాలలో కన్పిస్తే దానికి గొప్పదనం, గౌరవం కల్గుతుంది. స్కంద పదానికి అట్టి విలువ వచ్చింది. వల్లికి గురువు నారదుడని స్కంద పురాణంలో రాగా, ఛాందోగ్యోపనిషత్తులో సుబ్రహ్మణ్యుని పూర్వావతారమైన సనత్కుమారుడు, నారదునకు ఉపదేశించినట్లుంది. సనత్ అని బ్రహ్మకు ఒక పేరు. సృష్టికి పూర్వం బ్రహ్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా సనత్యునారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇతడు సనక, సనందన, సనాతన, సనత్కుమారులలో ఒకడు. ఈ నల్గురు బ్రహ్మజ్ఞానులు. పుట్టుకనుండీ నివృత్తి మార్గంలో ఉన్నవారు. జ్ఞానులకు మార్గదర్శకులు. వీరు నిత్య యౌవనులు. కామవాసన అణుమాత్రం లేనివారు. ఛాందోగ్యంలో సనత్కుమారుడు సుబ్రహ్మణ్యునిగా వచ్చినట్లుంది. ఇట్లా వచ్చినట్లు స్కంద పదం రెండుమార్లు ఉచ్చరింపబడింది. 

స్కందుడు, ప్రపంచ వ్యాప్తమైన దేవత. కొందరు స్కూల్ ని ఇ స్కూల్ అన్నట్లు స్కంద పదాన్ని ఇ స్కంద గా విదేశాలలో ఉచ్చరిస్తారు. సెమెటిక్ భాషలలో AL అనేది ఇంగ్లీషులోని The వంటి Definite Article. (A. An, The) అది ఒక వస్తువును నిర్దిష్టంగానే చెప్పేది. స్పష్టంగా AL పదం, ఒక పదానికి ముందు చేరిస్తే ఇస్కందర్, అల్ ఇస్కందర్ అవుతుంది. ఇది గ్రీసుదేశం వెళ్ళి అలెగ్జాండర్ గా అయింది. 

సికిందర్ అనేమాట కూడా స్కందర్ పదం నుండే వచ్చింది. ఇటీవల సికింద్రాబాద్ లో స్కందగిరి ఆలయం వచ్చింది. అసలు సికింద్రాబాద్ యే సిక్కందరాబాద్.

స్కాండినేవియా, అనేక దేశాలతో అనగా స్వీడన్, నార్వే, డెన్మార్కులతో కూడింది. అది స్కాండియా ప్రాంతం. హిందూ - ఇండియా మాదిరిగా స్కంద - స్కాండియాగా మారింది.
******

No comments:

Post a Comment