Thursday, February 18, 2021

శ్రీవేంకటేశ్వరస్వామి వారి రథసప్తమీ పర్వదిన ప్రయుక్త సకలవాహన సేవ / ఏకాహ్నిక బ్రహ్మోత్సవం జరిగే మాఘ శుద్ధ సప్తమీ / రథసప్తమి 2021 పర్వదిన శుభాభినందనలు...💐🍕🍟🍨👏😊


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యూల వారి అత్యత్భుతమైన సంకీర్తనల్లో ఒకటైన 

" ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె || "

అనే సంకీర్తనలో ఆఖరిచరణంలో

" అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||
"
అని చమత్కరించడంలో శ్రీశ్రీనివాసుడి సర్వాంతర్యామిత్వాన్ని ఎంతో చక్కని రీతిలో శ్రీహరి దశావతారాలతో పోల్చి వర్నించిన శైలి ఎల్లరికి విదితమే.....

మరి ఈ సర్వాంతర్యామిత్వాన్ని అలా పాడుకొని పరవశించడంలో మాత్రమే ఆ ఆధ్యాత్మికతను 
స్వానుభవానంలోకి స్వాగతించి సప్రామాణికంగా తర్కించి తరించడమా...లేదా భౌతికవాదంతో కూడా జతపరిచి సైన్స్ అనే పేరుతో పిలువబడే సామాన్యశాస్త్రం ఉటంకించే 
సిద్ధాంతాలకనుగుణంగా సప్రామాణికంగా నిర్వచించి తర్కించి తద్ జనిత భౌతికమూలగుణకంగా కూడా భగవద్ తత్త్వాన్ని స్థిరీకరించి సమన్వయపరచగలమా....
అనే దృక్కోణంలో ఆధ్యాత్మికతను ఒడిసిపట్టడంలో మరింత మెండుగా ఆ భగవద్ తత్త్వాన్ని మన జీవితాలకు ఆపాదించుకొని తరించగలము అని నా భావన....

తెల్లని పొగలాంటి పదార్ధాన్ని చిన్న తోక లా కనిపించేలా ఎగజిమ్ముతూ నింగిలో కడు దూరంలో బహువేగవంతంగా దూసుకుపోతున్న ఒక సుపర్ సోనిక్ జెట్ గురించి క్షుణ్ణంగా అవగాహన లభించాలంటే...

1. మనం అదే ఉన్నతమైన స్థాయిలో ఆ జెట్ కి సమాంతరంగా ప్రయాణం గావిస్తూ దాని కథెంటో తెలుసుకోగలం...

2. మన స్థాయికి ఆ జెట్ దిగివచ్చి దాని కథెంటో తెలుపడం...

3. ఆ ఉన్నతమైన స్థాయిలో ఆ జెట్ కి సమాంతరంగా ఒక విశేషమైన వ్యవస్థాంతర్భాగంగా ప్రయాణం గావించే కోవిదులు, మన స్థాయికి దిగివచ్చి దాని కథెంటో తెలుపగా అది విశ్వసించి అప్పుడు ఆ జెట్ గురించిన సరైన అవగాహన లభింపజేసుకోవడం
...

అచ్చం అట్లే....

ఆధ్యాత్మికత అనే సముద్రమంత లోతైన తత్త్వశాస్త్రాన్ని ఆకళింపుచేసుకొని తన్మూలంగా భగవద్ తత్వాన్ని ఒడిసిపట్టడం అంటే
సముద్రమంతా పడవలో తిరుగుతూ ఎక్కడో ఒక్కచోట ఒక పెద్ద నిధిని మోసుకెళ్తున్న ఒక ఓడ మునిగిపోవడంతో ఆ ఓడలో ఉన్న ఒక రత్నఖచిత మంజూషలో భద్రంగా దాచిపెట్టిన ఒక అమూల్యమైన నాగమణిని వెతికి వెలికితీసి సొంతంచేసుకోవడం లా ఉండే ఒక గహనాతిగహనమైన ప్రక్రియ.....

కాబట్టి సముద్రమంతలోతైన, ఆకాశమంత అమేయమైన భగవద్ విభూతులను ఆకళింపుజేసుకొని ఆ తదుపరి భగవద్ తత్త్వాన్ని విశ్వసించడం అనేది ఒక అంతూదరిలేని ప్రయాసవంటిది.....

పైన ఉదహరించబడిన సూపర్ సానిక్ జెట్ కి సమాంతరంగా ప్రయాణించే వ్యవస్థ కి ఆధ్యాత్మిక సామ్యం సద్గురుబోధ.....

ఆ సద్గురుబోధలకు ఆలంబనగా ఉండే ఈశ్వరానుగ్రహమే వాటిని మన స్థాయికి దిగివచ్చి అందించే వారి సద్వాక్కులను మొక్కవోని విశ్వాసంతో
జీవితానికి ఆపాదించుకోవడంలో మాత్రమే భగవతత్త్వం అనుభవంలోకి వచ్చి జీవితం తరించడం అనేది సాధ్యమౌతుంది.....

నిజానికి సద్గురువులు అంత ఉన్నతమైన భగవద్ స్థాయికి చేరుకున్నప్పుడు వారికి మన స్థాయికి దిగివచ్చే అవసరం ఉండదు.....
కాని ఆ ఉన్నతమైన భగవద్ తత్త్వానికి ఉండే లక్షణం, అనగా నిర్హేతుక దయ, అనేది సద్గురువులకు కూడా ఒక గౌణమై ఉండడంతో వారు అలా మన స్థాయికి దిగివచ్చి ఆ భగవద్ విభూతివిశేషాలను అర్ధించిన ఎల్లరికి అందించి తరింపజేయడంలో ఆనందిస్తుంటారు.....

In other words there is absolutely no need for a sadguru to come down to our mere mortal strata to spend a lot of effort in order to bless the mankind with that otherwise unfathomable spiritual knowledge,
but for the fact that they too are just like God in being kind and graceful to elevate us to those higtened divine realms....

కమ్మని సున్నుండలు కళ్ళెదుట కనిపించినప్పుడు 

అవతలి వ్యక్తి యొక్క జ్ఞ్యాన స్థాయిని బట్టి...

1. ఒకరు అవి కేవలం ఏవో పిండిముద్దలు అని అనడం...

2. ఒకరు అవి మినప ఉండలు అని అనడం....

3. ఇంకొకరు అవి అమృతతుల్యమైన దేశవాళి గోఘృతంతో చక్కెర / బెల్లం యొక్క కలయికతో కట్టబడిన పోషకవిలువలు గల మినప సున్నుండలు అని అనడంలో...

సదరు వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఆ సున్నుండల వైభవం మారడం అనేది ఏమి ఉండదు....

కంటికి పిండి కనిపిస్తుంది కాబట్టి అవి ఏవో పిండిముద్దలు మాత్రమే అనడం ఒక జ్ఞ్యాన స్థాయి....

కేవలం చేత్తో వాటిని స్పృశించి ఇవి మినప పిండి ముద్దలు అనడం ఇంకొంచెం ఉన్నతమైన జ్ఞ్యాన స్థాయి....

వాటిని ఆరగించి ఆస్వాదించి,
అందులో అదృశ్యంగా తీపికి కారణమైన
చక్కెర / బెల్లం మరియు అన్ని నిరాకార ముడిపదార్ధాలను ఒక సాకార గోళాకార ఉండగా రూపాంతరం గావించడానికి ఉపయోగించబడిన ఆవు నెయ్యి అంతర్నిహితమై ఉన్నాయి అనడం అత్యున్నతమైన జ్ఞ్యాన స్థాయి....

మినప ఉండ మాత్రమే కనిపిస్తుంది కాని అందలి నెయ్యి కంటికి కనిపించడం లేదు కాబట్టి నెయ్యి ఉందనడానికి తగు సాక్ష్యం లేదు అనే మూర్ఖవాదానికి కేవల భౌతికవాదం అని పేరుపెట్టుకొని తర్కించడం సదరు వ్యక్తి యొక్క విజ్ఞ్యానానికి సంబంధించిన అత్యల్పస్థాయి.....

అసలు నెయ్యి లేకుండా ఆ గోళాకార సాకార మినప ఉండ యొక్క ఉనికి అసాధ్యం....కాబట్టి నెయ్యి కచ్చితంగా అంతర్నిహితమై ఉంది అనే రూఢమైన సత్యశ్రేష్ఠాన్ని విశ్వసించి ఆస్వాదించి తరించడం అనేది సదరు వ్యక్తి యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞ్యాన స్థాయి.....

ఇక ఇతరములైన మిగతా వాదప్రతివాదాలన్నీ కూడా వివిధ సామాన్య / మధ్య స్థాయికి సంబంధించిన అంశాలు....

అచ్చం ఇదే విధంగా కనిపించే నామరూపాత్మక జగత్తు కేవలం పాంచభౌతిక / కేవల భౌతిక సృష్టి అని వాదించడం సదరు వ్యక్తి యొక్క విజ్ఞ్యానానికి సంబంధించిన అత్యల్పస్థాయి.....

మరియు శ్రీ చాగంటి సద్గురువులు వివరించినట్టుగా, వేదం విజ్ఞ్యానం సైతం పరమాత్మను 

"న ఇతి...న ఇతి...న ఇతి...నేతి...నేతి..."

అని మాత్రమే చెప్పగలిగింది....

కాబట్టి

అసలు పరమాత్మ యొక్క ప్రత్యక్ష అనుగ్రహంతో మాత్రమే ఈ నామారూపాత్మక పాంచభౌతిక సృష్టి యొక్క ఉనికి సంభవమయ్యేది అని విశ్వసించి నిర్వచించడం అనేది సదరు వ్యక్తి యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞ్యాన స్థాయి.....

ఇక ఇతరములైన మిగతా వాదప్రతివాదాలన్నీ కూడా వివిధ సామాన్య / మధ్య స్థాయికి సంబంధించిన అంశాలు....

పంచ భూతాల సమ్మిళితమై ప్రభవించే పాంచభౌతిక ప్రపంచంలోనే ఆ పరతత్త్వం కూడా ఇమిడి ఉండడం అనేది చాల ఆశ్చర్యకరమైన సత్యం....

అయానిక్ మరియు కోవలెంట్ బాండింగ్ కి చెందని మరొక సూక్ష్మతరమైన ప్రత్యేక బాండింగ్ ఈ జగత్తులో కలదు... అని నిర్వచించి దానికి
" వాండర్ వాల్స్ ఫోర్స్ " అని సైంటిస్ట్ నామకరణం చేస్తే నమ్మే మనం....

పంచభూతాత్మకమైన ప్రపంచంలోనే పంచభూతాలకు అతీతమై ఉండే పరమాత్మతత్త్వం ఇమిడి ఉంటుంది అని మన అధ్యాత్మ తత్త్వవేత్తలు బోధిస్తే....
" ఏంటో...వీళ్ళు....వీళ్ళ చాదస్తం...." అని కొట్టిపారేసే చదువుకున్న మూర్ఖులే ఈ లోకంలో అధికంగా ఉన్నప్పుడు ఆ విశేష పరతత్త్వం ఎల్లరికి సామాన్యస్థాయిలో అందిరావడం అనేది 
అంతగా కుదిరేది కాదు అనడం అతిశయోక్తి కానేరదు.....

అంత మాత్రాన దాని ఉనికికి నిదర్శనం లేదు అని అనడం అత్యల్ప విజ్ఞ్యాన స్థాయి....
దాని ఉనికి వెతికి ఒడిసిపట్టడమే అత్యున్నతమైన ప్రజ్ఞ్యాన స్థాయి...

గహనమైన భాష్యాలు, వేదాంత సూక్ష్మాలు, ఇవన్నీ కాకుండా సామాన్య మానవుడు సైతం 
" ఔను..." అని అనేలా ఒక సాధారణ లౌకిక ఉదాహరణతో ఈ పాంచభౌతిక సృష్టిలో దాగుండే పరతత్త్వాన్ని నిరూపించే ప్రయత్నం గావిస్తాను.....

అనగా సాధారణంగా ఇంద్రియాలకు అగ్రాహ్యమై ఉండే ఆ పాంచభౌతిక ప్రకృత్యాంతర్గత పరతత్త్వం ఇంద్రియ
గ్రాహ్యమై "ఔరా..." అనిపించుట....

మన రోజువారి పనుల్లో ఒకటైన భగవంతుడుకి అగర్బత్తి వెలిగించి ధూపం సమర్పించడం అనే ప్రక్రియను ఇక్కడ చాల సింపుల్ గా ఉండే ఉదాహరణగా తీసుకుందాం....

ఆకాశం
గాలి
అగ్ని
జలం
పృథ్వి

అనే పాంచభౌతిక తత్త్వాల కలయికగా ఉండే ఒక అగర్బత్తిలో ( అగరొత్తులు / ధూప్ స్టిక్స్ )
ఆ ఈశ్వర తత్త్వాన్ని ఇంద్రియగ్రాహ్యం కావించుట.....

1. ఆకాశం - 

సర్వే సర్వత్రా పరివ్యాప్తమై ఉండే అమేయ పాంచభౌతిక మూలకం...
అంటే వినా ఆకాశం క్రింది మిగతా 4 భూతాలు / వాటి కలయిక ఒక సాకార రూపాన్ని దాల్చడం కుదరని పని...

కాబట్టి అగర్బత్తిలో ఆకాశం ఉన్నది...

2. గాలి

గాలి ద్వారా మాత్రమే ధూపం మన చుట్టూ ఉండే ప్రదేశంలో అనగా సమీపాకాశంలో పరివ్యాప్తమై తన వాయు తత్త్వాన్ని ప్రదర్శించగలదు...
 
కాబట్టి అగర్బత్తిలో వాయువు ఉన్నది....

3. అగ్ని 

అగ్ని సంపర్కం లేనిదే అసలు అగర్బత్తిని వెలిగించి అందులో నిక్షిప్తమై ఉండే ధూపాన్ని / వాయు తత్వాన్ని వ్యక్తపరచలేము కాబట్టి
వెలిగించిన అగర్బత్తిలో కంటికి కనిపించేలా అగ్ని తత్త్వము ఉన్నది...

కాబట్టి అగర్బత్తిలో అగ్ని ఉన్నది....

4. నీరు

ఒక చెక్కపుల్లను ఆధారంగా చేసుకొని అగర్బత్తి యొక్క ముడిపదార్థం దాని చుట్టూ అలదబడడానికి ఉపయోగించే రసాయనాలు / సెంట్లు / జిగురు / అత్తర్ ఇత్యాది సకల జల సంబంధమైన పదార్ధాలు ఉపయోగించడం వల్ల అగర్బత్తిలో పరోక్షంగా జలతత్త్వం కూడా ఉన్నది....

కాబట్టి అగర్బత్తిలో నీరు ఉన్నది....

5. పృథ్వి

అగర్బత్తి వెలిగేటప్పుడు సువాసన రావడం / ఆ సువాసన ముడిపదార్థాంతర్గతంగా కొలువైఉండడం వల్ల అగర్బత్తిలో ప్రత్యక్షంగా పృథ్వి కూడా ఉన్నది....
వెలిగించబడకున్నా అగర్బత్తి యొక్క పరిమళం ఆఘ్రానించబడ యోగ్యమైనది...

కాబట్టి అగర్బత్తిలో పృథ్వి ఉన్నది....

సో, పంచభూతాలు కూడా ఒక అగర్బత్తిలో మనం సమన్వయపరుచుకున్నాం కద....

సొ ఇప్పుడు ఈశ్వరుడి చే జనించబడినది...
కాబట్టి ఈశ్వరుడికి అభేదమైనది....
కాబట్టి ఈశ్వరుడే అయిన పరతత్వం ఎట్లు ఈ పాంచభౌతిక అగర్బత్తి అనే సృష్టి నుండి బయల్వడి ఇంద్రియగ్రాహ్యమయ్యేది....

అనేకద మన ప్రయత్నం....

ఈశ్వరుడి హస్తంలో ఉండే త్రిశూలానికి 
అమరిఉండే ఢమరుకం నుండి జనించినదే నాదం అనే విషయం గురించి....
మరియు ప్రత్యక్ష పరమాత్మ అయిన సూర్యుడినుండి ఆ త్రిశూలం విశ్వకర్మచే తయారుకావించబడడం గురించి మనకు శ్రీచాగంటి సద్గురువులు తెలిపియున్నారు కద....

కాబట్టి ఇక్కడ నాదమే మనం వెతుకుతున్న పంచభూతాలకు ఆతీతమైన,
పంచభూతాంతర్గతమైన
పరతత్త్వ పదార్ధం....

ఒక పదార్ధం తత్ భిన్న తత్త్వ పదార్ధం తో రాపిడి చెందినప్పుడు "లా ఆఫ్ ఎనర్జి ట్రాన్స్ఫర్ " కి అనుగుణంగా శక్తి రూపాంతరం చెందుతుంది కాబట్టి మన సైన్స్ సూత్రానికి సరిపడేలా ఉండే అనగా రెండు విభిన్న పార్శ్వములు గల అగ్నితత్త్వం / జలతత్వం యొక్క సమ్యోగం చేత ఆ అంతర్నిహితమైన పరతత్త్వ శక్తిని అందునుండి ఉద్గమించేలా చేసి అవ్విధంగా అంతర్నిహితమైన ఆ పాంచభౌతికాంతర్గత పరతత్త్వాన్ని ఇంద్రియగ్రాహ్యం కావిద్దాం...

మామూలుగ అగ్నితో రగల్చబడిన ఒక అగర్బత్తిని అనగా కొసకు నిప్పు ఉండి పొగను / ధూపాన్ని విడుదలచేసే స్థితిలో ఉన్న అగర్బత్తిని,

ఆ నిప్పు ఎంత పరిమాణంలో ఉన్నదో అంతే పరిమాణంగల నీటిచుక్కను ఒక ప్లేట్లో పోసి,
ఆ రగులుతున్న అగర్బత్తి కొసను ఆ నీటి బిందువుకు దెగ్గరగా జరపండి....

సమపరిమాణం లేదా కొంచెం అటు ఇటు గా ఉండే ఆ నిప్పు నీరు సమ్యోగం చెందిన వెంటనే ఒకదాన్లోకి ఇంకోటి లయించి అందునుండి నాదం
( స్ స్ స్ స్ స్ క్ అనే సౌండ్ ) ఎంతో వేగంగా మన సాధారణ చెవులకు వినిపించేలా ధ్వనిస్తుంది )

ఇప్పుడు చెప్పండి....
కేవలం అయానిక్ / కోవలెంట్ బాండింగ్ తో పంచభూత తత్త్వాల కలయికతో ఏరపడిన ఒక సాధారణ అగర్బత్తిలోకి,

పంచభూతాలకు అతీతమైన ఆ నాదశక్తి అనబడే పరతత్త్వ పదార్ధం ఎక్కడినుండి వచ్చి చేరింది...

మనం ప్రత్యేకంగా నాదాన్ని సృజించి అగర్బత్తిలోకి ప్రవేశపెట్టలేదు కద....
 
అత్యంత సామాన్యమైన స్థాయిలో ఉండే ఈ చిన్న ఉదాహరణ మొదలుకొని,
భగ భగ మండే అగ్నిగోళమైన సూర్యుడి నుండి వెలువడే నాదశక్తి వరకు యావద్ విశ్వంలో ఈ పాంచభౌతిక ప్రకృతిలోనే పరతత్త్వం కూడా దాగున్నది....

అది ఎవరు ఏ ఏ మాధ్యమాలతో ఎవ్విధంగా ఒడిసిపట్టుకుంటారనే అంశంపై ఆ పరతత్త్వ గ్రాహ్యత అనేది వివిధ స్థాయుల్లో వివిధ రీతుల్లో ఉండడం అనేది వాస్తవిక అధ్యాత్మ సత్యం....

అది ఎల్లవేళలా సైన్స్ కి అంది తీరాలని ఏంలేదు...

ఎందుకంటే

Science relies on the physical, tangible, always measurably receptive entities where as Spirituality spreads beyond these and many other meta-physical limits as well....

ఎక్కడెక్కడో పరమాత్మను వెతుకుతూ కళ్ళెదుటే నిత్యం దేదీప్యమానంగా వెలిగే ప్రత్యక్ష నారాయణుడైన శ్రీసూర్య భగవానుడిని మర్చిపోతుంటాం....

"ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్..." అని కదా ఆర్యోక్తి....

అటువంటి మహాభాగ్యమైన ఆరోగ్యం మొదలుకొని...

కేవలం మనస్పూర్తిగా సమర్పించే నమస్కారాలకు వివిధ వర్ణాశ్రమయుక్తమైన మంత్రములను జతపరిచి ఆరాధిస్తే ఫ్రీ గా సూర్యభగవానుడి నుండి ఎన్నెన్ని సంపదలను పొందొచ్చో మన ఆర్షవాంజ్ఞ్మయం తరతరాలనుండి బోధించి అనుగ్రహిస్తూనే ఉంది....

సూర్యభగవానుడిని సర్వదేవతాత్మకంగా, త్రిమూర్త్యాత్మకంగా వివిధ దైవిక స్తోత్రాలు కొనియాడుతున్నాయి... 

" సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ‖ 7 ‖ "

అని శ్రీఆదిత్యహృదయం లో స్తుతించబడడం....

" బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరహః
అస్తకాలే స్వయంవిష్ణుః త్రయీమూర్తిర్దివాకరః.... "

అని శ్రీ శివప్రోక్త సూర్యస్తోత్రం లో 
స్తుతించబడడం....

( తిరుచానూర్ శ్రీపద్మవతీదేవి అమ్మవారి ఆలయ పుష్కరిణికి అభిముఖంగా సాక్షాత్ శ్రీవేంకటేశ్వర స్వామి ప్రార్ధించగా ఆ కొలనులో దేవలోకం నుండి తీసుకురాబడిన స్వర్ణ కమలాలు సదా వికసితమై ఉండడానికి సౌరమండలం నుండి దిగివచ్చి సాకార
శ్రీసూర్యనారాయణమూర్తిగా కొలువైన
ఆలయంలో ఈ స్తోత్రం అక్కడి బోర్డ్ పై
రాసి ఉంటుంది... )

అటువంటి శ్రీసూర్యనారాయణుడికి సంబంధించిన మాసంగా,
విశేషమైన పుణ్యప్రదాయక / పాపనాశక మాఘ మాసంగా, 
ఏడుకొండల ఎంకన్న ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా వినుతికెక్కిన
శ్రీవేంకటేశ్వరస్వామి వారి రథసప్తమీ పర్వదిన ప్రయుక్త సకల వాహన సేవ / ఏకాహ్నిక బ్రహ్మోత్సవం జరిగే మాఘ శుద్ధ సప్తమీ / రథసప్తమి పర్వదిన ప్రాభవంతో వెలిగే ఆ శ్రీవేంకటనారయణుడిని శ్రీసూర్యనారాయణుడిలో దర్శిస్తూ
ఎల్లరూ విశేషానుగ్రహాన్ని బడసి తరించెదరు గాక....😊👏🍨🍟🍕💐

అర్క బదరీపత్రములు / పళ్ళు
( జిల్లేడు ఆకు + రేగు పళ్ళు లేదా రేగు ఆకులు) శిరస్సుపై ధరించి సంకల్ప సహిత రథసప్తమి పర్వదినస్నానం గావించడం విశేషపుణ్యదాయకం అని మన పెద్దలు నుడివినారు కాన ఈ పోస్ట్ కు జతచేయబడిన శ్లోకం తో ఆ శ్రీసూర్యనారాయణుడిని ప్రార్ధించి సేవించి తరించండి...😊

ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||

మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||

పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||

http://annamacharya-lyrics.blogspot.com/2007/09/301itanikamte-maridaivamu.html?m=1

No comments:

Post a Comment