జగద్ప్రసిద్ధినొందిన సద్గురు శ్రీత్యాగరాజ సంగీత పెన్నిధి సంగీతప్రియులెల్లరికి సుపరిచితమే....
పంచరత్న కృతులుమొదలుకొని ఎందరో దేవీదేవతలను కీర్తించిన ఎంతో హృద్యమైన సరళమైన శుద్ధమైన సిద్ధమైన సంగీత సాహిత్య
సారస్వతాన్ని ఈ లోకానికి అందించిన ఆ మహనీయులు తెలుగు భాష చేసుకున్న పుణ్యపరిపాకమై మనకు లభించిన పుంభావసరస్వతీ స్వరూపులు.....
వారి అమూల్యమైన ఎన్నో సంకీర్తనాసుధాగుళికల్లో ఒక చక్కని సంకీర్తనలో శాస్త్రీయ కర్ణాటక సంగీత సప్తస్వరాల యొక్క మహత్తును ఈశ్వరుని పంచవక్త్రజనితములుగా వర్నిస్తూ,
వేదాల్లో ఉత్తమమైన సామవేదసారాన్ని సంగీత సప్తస్వర రససిద్ధిగా అందుకొని జీవితాన్ని తరింపజేసుకొని ఆనందించండని అందించిన ఒక కడురసరమ్యమైన సంకీర్తనలో
" నాద తనుమనిశం శంకరం...నమామిమే మనసా శిరసా..." అని ఈశ్వరుడిని కీర్తించిన వైనం నిజంగా అత్యత్భుతం....
( స్వరజతులతో సహా కావాలంటే
ఎం.ఎస్ గారి పాత రెకార్డింగ్ వినండి...
సింపుల్ ఆలాపనలో కావాలంటే ప్రియా సిస్టర్స్ రెకార్డింగ్ వినండి....రెండు కూడా అద్భుతమైన ఆలపనలు...)
" స : షడ్జమం "
సద్యోజాత పశ్చిమాభిముఖ వదనం / వరుణుడు దిగ్దేవత
( జంబుకేశ్వర జలలింగం )
" తత్త్ జలాన్ " అని శ్రీ చాగంటి సద్గురువులు నుడివిన పరమాత్మ తత్త్వం చాలామందికి ఎరుకలో ఉన్న విషయమే....
కాబట్టి జల సూచక వాచకంగా ఉన్న మొట్టమొదటి షడ్జమమే పరమాత్మ ప్రతీక...
వేదానాం సామ వేదోస్మి అని అంటాడు గీతాచార్యుడు... దేహాంతర్గతమైన నాదాన్ని స్వరంగా బహిర్గతం చేయాలంటే నాలుక యొక్క కొస / చిట్టచివరి భాగం పై దవడను గట్టిగా అదిమితే కాని స
అక్షరాన్ని తత్ జనిత sssssss అనే శబ్దాన్ని పలకలేము...
స.... దీర్ఘంగా ఉచ్చరించాలంటే నాభి నుండి వాయువును ఏకబిగిన వెలువరిస్తేనే అది సాధ్యమయ్యేది....
అనగా అత్యంత శక్తివంతంగా శరీరాంతర్గత ప్రాణశక్తి బహిర్గతమయ్యేది షడ్జమం పలికినప్పుడే....
కేవలం స అక్షరానికే ఉండే ప్రత్యేకత అది....
మిగతా అన్ని శివాలయాల్లోకెల్లా పశ్చిమాభి ముఖమైన సద్యోజాత శివలింగ క్షేత్రాలు అత్యంత శక్తివంతమైనవి అని శ్రీ చాగంటి సద్గురువులు నుడివిన అధ్యాత్మ విశేషం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....
ఇవ్విధంగా షడ్జమం అత్యంత శక్తివంతమైన స్వరం కాబట్టి అది పరమాత్మ ప్రతీక.....
" రి : రిషభం "
అఘోర దక్షిణాభిముఖ వదనం / యమధర్మరాజు దిగ్దేవత
( దక్షిణం పక్కనే ఉండే నైరుతి పృథ్వీ సూచకం)
( కంచి ఏకామ్రేశ్వర పృథ్వీలింగం )
" ద : దైవతం "
వామదేవ ఉత్తరాభిముఖ వదనం / కుబేరుడు దిగ్దేవత
( ఉత్తరానికి పక్కనే ఉండే వాయవ్యం గాలికి సూచకం )
( శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం )
" గ : గాంధారం "
తత్పురుష ప్రాగ్/తూర్పు అభిముఖ వదనం / ఇంద్రుడు దిగ్దేవత
( తూర్పుకి పక్కనే ఉండే ఆగ్నేయం అగ్నికి సూచకం )
( అరుణాచల అగ్ని లింగ క్షేత్రం )
( తత్పురుషాయ విద్మహే మహదేవాయ ధీమహి
తన్నః రుద్రః ప్రచోదయాత్... )
నిజానికి గ వాచకానికి చాలా సూచకంగా ఉంటాయి. ఇక్కడ రుద్రుడి అధీనంలో ఉండే సకల భూత గణములకు గ వాచకం సూచకం. )
" ని : నిషాదం "
ఈశాన ఊర్ధ్వాభిముఖ / పర్జన్యుడు మేఘమండలాధిదేవత
( ఊర్ధ్వముఖ 5వ వదనం చూసేది ఆకాశం... ఆకాశానికి మేఘాలకు సామ్యము కలదు....
(చిదంబర ఆకాశలింగం )
మ : మధ్యమం
ప : పంచమం
మ, ప జీవాత్మ మరియు తద్ వినియోగిత శక్తి సముపార్జక మాధ్యమ సూచకములు
( సూర్య & చంద్ర లింగ క్షేత్రాలు @
కోనార్క్ & సీతాకుండ్...
నేపాల ఖాట్మండు పశుపతినాథ్ ఆలయం / యజమానలింగక్షేత్రం)
మ అనగా విష్ణు శక్తికి / సర్వపరివ్యాపక శక్తికి / అమృత శక్తికి ప్రతీక...
ప అనగా జీవాత్మ / ప్రాణి దేహాంతర్గత యజమాని కి ప్రతీక )
దేహాంతర్గత జీవుడికి జీవశక్తి లభించేది సూర్యచంద్రుల నుండి...
( సూర్యజనిత ఆత్మశక్తి + చంద్రజనిత మనోశక్తి = జీవశక్తి )
స రి గ మ ప ద ని
స్వరోచ్ఛారణ ను
మీరు సరిగ్గా గమనిస్తే
సప్తస్వరాల్లో మ : మధ్యమం మరియు ప : పంచమం మాత్రమే బాహ్యావయవమైన పెదవుల సహాయం లేకుండా పలకలేము....
మిగతా ఐదింటికి అనగా
స రి గ - - ద ని
స్వరాలను పలకడానికి పెదాల అవసరం లేదు..
అనగా యావద్ విశ్వంలో కూడా పరివ్యాప్తమై ఉండేవి పంచభూతాలే అయినా,
బాహ్య ప్రపంచంలో సూర్య చంద్ర శక్తిని ఆధారంగా గావించి నామరూపాత్మక శరీరధారులుగా ఉన్న ఇరు జీవధారుల మూలంగా మాత్రమే ప్రభవించేది మరో పాంచభౌతిక ప్రాణి...
దానికి సంకేతంగానే
మ మధ్యమ , ప పంచమ స్వరాలను
బాహ్య అవయవములైన అధరమండల సహాయం వినా పలకలేము....
సరిగా గమనిస్తే ధనూరాశికి సంకేతంగా ఉండే , వింటినారిని ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు లా, మనుష్యుల అధరమండలం అనగా రెండు పెదవులు మూయబడి ఉన్నప్పుడు ఉండే ఆకారం....
ధనస్సు యొక్క ఇరుకొనలు సూర్యచంద్రులకు ప్రతీకైతే వాటిని అనుసంధానిస్తూ ఉండే ఆ వింటి నారి జీవుడికి ప్రతీక....
ఆ ధనస్సు యొక్క ఇరుకొనలు ధృఢంగా లేనినాడు
వింటినారికి శక్తిలేదు...
అట్లే సూర్య చంద్రులు లేని నాడు జీవుడికి శక్తిలేదు....
యావద్ పాంచభౌతిక చరాచర విశ్వంలో పరివ్యాప్తమై ఉండే ఆ పరమాత్మ తన యావద్ శక్తిని సప్తస్వరాత్మక సమ్మిళితమైన సంగీతశాస్త్రంలో నిక్షిప్తం గావించి స్వరపేటిక గల ఉత్క్రుష్టప్రాణిగా జన్మించినందుకు తరించమని మనుష్యుడికి అందించినాడు....
గాలి అంతటా ఉంటుంది....కాని అది ప్రస్ఫుటంగా మనకు ఎరుకలోకి వచ్చి ఆస్వాదించబడి అభినందించబడాలంటే ఫాన్ / కూలర్ ఆన్ చేసి, ఎంత స్పీడ్ పెంచుకుంటూ పోతూంటే అంతగా గాలి ఉధృతి పెరుగడంలో మనం సేదతీరినట్టుగా...
సశాస్త్రీయ రాగరంజితమైన ఆలాపనలోని సప్తస్వరాల ఆరోహణ అవరీహణలో మన తనువులోని అణువణువు పులకరించి ముఖ్యమైన నవనాడిమండలాంతర్గత కణజాలం ఆ స్వరాలాపనకు సంతసించి మేధోమండలం ఒక అనిర్వచనీయ అవ్యక్త ఆనందానుభూతి కి గురవ్వడంలో ఆ పరమాత్మ తత్త్వం అనుభవంలోకి రావడంతో,
ఇంద్రియాలకు అలభ్యమైన పరతత్త్వం ఇంద్రియగ్రాహ్యమై మనుజునకు మహిమ్నతను కలిగించి తరింపజేస్తుంది....
మన పెద్దలు అందుకే అన్నారు...
రాగాలకు నయం కాని రోగాలు లేవు...అని....
అంతటి స్వరసిద్ధితో ఆలపించే గాత్రముంటే మనుజుడు ప్రత్యక్ష గంధర్వానుభూతికి లోనై గంధర్వులతో సమంగా దైవిక సిద్ధిని అందుకొని తరిస్తాడు....
నాదోపాసన అంత గొప్పదికనుకనే,
"రాగసుధారసపానముజేసి రంజిల్లవే ఓమనసా...."
అంటూ మనుష్యుడికి నిజమైన మితృడు సంగీతం మాత్రమే అని....
ఆ సంగీత సాధన సకల యాగయోగఫలమొసగె అమేయ దైవిక అనుగ్రహమని తెలియజేస్తూ మనల్ని అనుగ్రహించిన శ్రీ సద్గురు త్యాగరాయుల సంగీత స్ఫూర్తిని ఆలంబనగా గావించి ఎల్లరు తమ తమ జీవితాలను సార్ధకం గావించుకొని ఆనందించెదరుగాక....
సర్వే జనాః సుజనాః భవంతు....
సర్వే సుజనాః సుఖినోభవంతు....
సమస్త సన్మంగళానిసంతు..... 🙏😊
ప. నాద తనుమనిశం శంకరం
నమామి మే మనసా శిరసా
అ. మోదకర నిగమోత్తమ సామ
వేద సారం వారం వారం (నా)
చ. సద్యోజాతాది పంచ వక్త్రజ
స-రి-గ-మ-ప-ద-ని వర సప్త-స్వర
విద్యా లోలం విదళిత కాలం
విమల హృదయ త్యాగరాజ పాలం (నా)
nAda tanumaniSam-cittaranjani
In the kRti ‘nAda tanumaniSam’ – rAga cittaranjani SrI tyAgarAja states that Siva is the embodiment of nAda.
P nAda tanum-aniSam Sankaram
namAmi mE manasA SirasA
A mOdakara 1nigam(O)ttama sAma
vEda sAram vAram vAram (nAda)
C sadyOjAt(A)di 2panca vaktraja
sa-ri-ga-ma-pa-dha-ni vara 3sapta svara
vidyA lOlam vidaLita 4kAlam
5vimala hRdaya tyAgarAja pAlam (nAda)
thyagaraja-vaibhavam.blogspot.com/2007/09/thyagaraja-kriti-naada-tanumanisam-raga.html?m=1
No comments:
Post a Comment