Sunday, February 28, 2021

శ్రీచాగంటి సద్గురువుల సుందరకాండ చింతామణి వంటిది...😊

శ్రీ చాగంటి సద్గురువుల వందలాది ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో శిష్య భక్తుల హృదయడోలికల్లో నిత్యం అజరామరమై కొలువైఉండి, వాటి సారాన్ని అందుకున్న వారికి అందుకున్నంత అనే రీతిలో, అవి ఎల్లరిని తరింపజేయడం అనే స్వానుభవపూర్వక సత్యం ఎందరెందరికో గత దశాబ్దకాలంగా బాగా రూఢమైన సత్యం.....

శ్రీచాగంటి.నెట్ అనే వెబ్సైట్ లో వారి అమూల్యమైన ప్రవచనా పెన్నిధి ఆడియో ఫైల్స్ రూపంలో యావద్ ప్రపంచానికి ఉచితంగా అందివ్వబడిన రోజుల్లో వాటన్నిటిని డౌన్లోడ్ చేస్కొని భద్రపరుచుకొని శ్రద్ధగా ఆలకించి జీవితానికి అన్వయించుకొని అనుగ్రహాన్ని బడసిన ఎందరో శిష్య భక్తుల్లో నేనుకూడా ఒకడిని....

వాటన్నిట్లో నా జీవితానికి, మరియు నాకు తెలిసి మరెందరో జీవితాలకు కూడా, ఒక అమూల్యమైన ప్రవచనారత్నాలహారం వంటిది శ్రీ చాగంటి సద్గురువుల శ్రీసంపూర్ణరామాయణం....

అందులోని " సుందరకాండ " ఆ ప్రవచనారత్నహారానికి చింతామణి వంటిది......

శ్రోతలు ఎవరు...
వారి జ్ఞ్యాన స్థాయి ఎట్టిది....
వారి గుణగణాలు ఏమి...
వారి విద్యార్హతలు ఏమి....

ఇత్యాది వేటితో కూడా సంబంధంలేకుండా ఎంతటి అనుగ్రహాన్నైనను వర్శించే శ్రీమద్రామాయణ ప్రవచనంలోని సుందరకాండ నిజంగా జీవితాలను ఎంతో ఘనంగా ఉద్ధరించే దైవిక ఆపన్న హస్తం.....

కేవలం శ్రీచాగంటి సద్గురువుల సుందరకాండ ప్రవచనాల అండతో ఎన్నో రాత్రుల భయంకరమైన దుఖపూరిత ఒంటరితనాన్ని దిగమింగి జీవిత ప్రయాణంలో అలిసి సొలసి ఉన్న వ్యక్తిని బాగా రాటుదేలిన వ్యక్తిత్వం గా, నన్ను మలిచింది మాత్రం కేవలం సద్గురువుల శ్రీమద్రామాయణమే...

ఈ లోక రీతి ఎట్టిది....
ఈ లోకుల తో లౌక్యాన్ని నెరపి మనగలగడం ఎట్లా....
ఈ ప్రపంచంలో మంచితనం అనే ముసుగులో ఉండే వారెవరు...నిజమైన మంచివారెవరు....
ఈ కలియుగం మొత్తం ధనప్రధాన యుగమై లోకులను ఎట్లు బాధిస్తున్నది.....
ఈ ఆధునిక కాలంలో ఉండే మన దైనందిన జీవితానికి ఆధ్యాత్మికతను ఎట్లు ఆపాదించుకొని తరించవలె.....

ఇత్యాదిగా ఉండే ఎన్నో ఎన్నెన్నో సుజ్ఞానగులికల సమాహారం శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణం....

వారు ఎంతటి దీక్షాదక్షులై ఆనాడు మండల దీక్షగా సంపూర్ణశ్రీమద్రామాయణ ఆదికావ్యాన్ని అనన్యసామాన్యమైన రీతిలో శిష్యభక్తులకు అందించినారో, అంతటి దక్షతను శ్రీమద్రామాయణం శ్రోతల జీవితానికి ఆపాదించి అనుగ్రహించడం అనేది నాతో పాటుగా ఎందరో స్వానుభవపూర్వకంగా రూఢపరచుకున్న సత్యం.....

శ్రీ చాగంటి సద్గురువులు నుడువినట్టుగా,
శ్రీరాముడి కథను కేవల నరుడి కథగా విన్నా సరే అది జీవితాలను ఉద్ధరించి తీరుతుంది.....

భగవద్ అనుగ్రహం కొలది..
వారి వారి జ్ఞ్యాన స్థాయిని బట్టి...
శ్రీమద్రామాయణం

ఒక కథగా...
ఒక కావ్యంగా....
ఒక అధ్యాత్మ భాష్యంగా...
ఒక ఉపనిషద్ బోధగా....
ఒక వేదమంత్రంగా.....
ఒక సిద్ధసారస్వతంగా.....

భాసించి వారి వారి ఉపాసనకు అనుగుణంగా అనుగ్రహన్ని వర్షిస్తుంది.....

శ్రీమద్రామాయణ సారస్వతం అంతటి శక్తివంతమైనది కనుకే.,

అళిపుళి అనే మెట్లత్రోవ దెగ్గర,
అనగా ఇప్పటి అలిపిరి శ్రీవారి పాదాలమండపం లో, ఆనాడు శ్రీమద్రామానుజాచార్యుల శ్రీరామాయణగోష్ఠి కారణంగా దుర్లభమైన ఆనందనిలయ స్థిత శ్రీవేంకటపరబ్రహ్మం యొక్క శ్రీపాదపద్మములు స్వయంవ్యక్తమై భక్తులను అనుగ్రహించి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలిపిరి నుండి తిరుమల మెట్ల మార్గాన్ని అధిరోహించే భక్తులకు లభించే సౌభాగ్యమై వర్ధిల్లింది....

SreemadRaamaayanam is like an immeasurable sugarcane orchard....
Once we gain access to it's assimilation after being blessed by an eminent sadguruji like SreechaaganTi gaaru,
we can make sugarcane juice out of it...
And from it Jaggery / Sugar, and use them to prepare hundreds of varieties of sweets / dishes for a life time and beyond.....

The sugar cane juice obtained is the raw intelligence...
Out of which the jaggery called wisdom is extracted and executional intelligence called sugar is obtained as a refined form of that generic wisdom.....

We can combine this jaggery called wisdom and executional intelligence called sugar in the required quantities to all other raw materials called 'all sorts of situations' in our lives to turn them in to yummy dishes that we would want to savor as per our choice....

అందుకే నాకు శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణం మరియు ప్రత్యేకించి
వారి సుందరకాండ ప్రవచనం అంటే ఏదో ఒక అవ్యక్తమైన అనిర్వచనీయమైన అవ్యాజమైన ఆనందసంధాయక అనుగ్రహకారకం....

శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే
సహస్రనామతత్తుల్యం రామనామవరాననే...

గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం
రామాయణమహామాలారత్నం వందే అనిలాత్మజం....

దూరికృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్పూర్తిః
దారితదశముఖకీర్తిః పురతోమమభాతుహనుమతో మూర్తిః..

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి...

శ్రీరామచంద్రంశ్రితపారిజాతం
సీతాముఖాంభోరుహచంచరీకః
సమస్తకళ్యాణగుణాభిరామం
నిరంతరం శుభామాతనోతు....
😊
🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment