మచ్చుకకు "నిత్యపూజలివివో" అనే సంకీర్తనలో....
"కనుగొను చూపులే ఘన దీపములట
తన లోపలి అంతర్యామికిని...."
అనే పదకవితల అల్లికల్లో....
మనుష్యుడి దేహన్నే దేవాలయంగా సామ్యము గావిస్తూ మన వివిధ దైహిక క్రియలనే దేవుడికి గావించే వివిధ ఉపచారాలుగా అన్నమాచార్యులవారు అత్యంత అద్భుతమైన రీతిలో కృతిపరిచిన శైలిలో,
"కనుగొను చూపులే ఘన దీపములట" అనే పదభాగం చాలా ఆశ్చర్యకరమైనది....
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించిన వారికి "సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అనే వ్యావహారిక నానుడి మరియు " నయతి ఇతి నాయకః" అనే వ్యుత్పత్తి ద్వారా మొత్తం మనిషి శరీరంలో కళ్ళ యొక్క ప్రాముఖ్యత బహుధా తెలియజేయబడినది....
చూడడం కళ్ళ యొక్క సహజ లక్షణం
కాబట్టి...
" చూసే చూపులే ఘన దీపములట"
అని అనకుండ ఆచార్యులు...
"కనుగొను చూపులే ఘన దీపములట"
అని అనడంలో ఆంతర్యమేమి...??
అంటే చూసే 'కళ్ళను కాకుండా' ' కనుగొనే కళ్ళను ' ఇక్కడ ఆచార్యులు ఉపమేయంగా ఉపయోగించడంలో
ఒక విశేషం ఉన్నది....
మీరు ఎన్నో సినిమాల్లో కూడా
చూసే ఉంటారు....
కళ్ళ పై కవుల కవనాల వెల్లువను....
కళ్ళలో వున్నదేదో కన్నులకే తెలుసు...
రాళ్ళలో వున్న నీరు కళ్ళకెలా తెలుసు...
నాలో వున్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు...
అని సాగిన ఆత్రేయ గారి ఆనాటి "అంతులేని కథ" సినిమాలోని పాటైనా సరే...
రీసెంట్ గా వచ్చిన "ఉప్పెన" సినిమాలో శ్రీమణి/రఖీబ్ గారి రచనలోని
నీ కళ్ళు నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
పాటైనా సరే...
ఇక మధ్యలో వచ్చిన ఎన్నో సినిమాల్లోని ఎన్నెన్నో పాటలు...
నా గుండెలో నీవుండిపోవా....
నా కళ్ళలో దాగుండిపోవా....
అనే 'నువ్వు నేను' సినిమాలోని పాటైనా సరే....
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
అనే 'ప్రేమాభిషేకం' పాటైనాసరే....
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అనే 'బాంబే' పాటైనాసరే....
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్దం
నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్దం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్దం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్దం అర్దం (2)
అనే 'దొంగ దొంగ' పాటైనాసరే....
ఇట్లా ఎన్నో ఎన్నెన్నో పాటలు కళ్ళపై, కళ్ళ కళలపై, కళ్ళు రంగరించే సకల కళాభావాలపై.....
ఉండడం ఎల్లరికీ తెలిసిందే.....
మానవ శరీరంలో ఉండే అన్ని అవయవాలోకెల్లా కళ్ళు చాలా కీలకమైనవి...ప్రశస్తమైనవి....
శక్తివంతమైనవి....
ఎందుకంటే....
కళ్ళు కేవలం వాటికి నిర్దేశించ్జబడిన పని అనగా చూడడమే కాకుండా....ఇంకా ఎన్నెన్నో పనులను చేయగలగడం అనేది కళ్ళకున్న ప్రత్యేకత....
కళ్ళతో మాట్లాడగలము....
కళ్ళతో వినగలము...
కళ్ళతో ప్రయాణించగలము...
కళ్ళతో కోరగలము
కళ్ళతో తెలుసుకోగలము....
కళ్ళు మొత్తం తెరిస్తే ఒక లోకంలో ఉండగలం.....
కళ్ళు మొత్తం మూసి నిద్రపోతే మరో లోకంలో ఉండగలం.....
కళ్ళు సగం మూసి సగం తెరుచి ఉండే ఆ అర్ధనిమీలిత నయనాల్లో దాగుండే తురీయావస్థ లో వేరో ఉన్నతమైన లోకం లో ఉండగలం.....
(శ్రీ చాగంటి సద్గురువులు శ్రీరామకృష్ణపరమహంస గారి చిత్తరువులో దర్శించిన ఆ మహాయోగీశ్వరుల తురీయావస్థ గురించి వర్ణించిన విషయం కొందరికైనా గుర్తుండే ఉంటుంది...
సద్గురువులకు, వారి పూర్వజన్మ లోని తురీయావస్థ గురించి వారికంటే ఇంకెవరికి
( ఆనాటి శ్రీశారదామాయి, ఈనాటి వారి శ్రీమతి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరి గారికి కాకుండా) బాగ తెలుస్తుందిలే...😊🙏 )
మనుష్యులను, మనస్తత్త్వాలను, ప్రపంచాన్ని, ప్రాపంచిక పోకడలను, లోకుల తీరుని, లోకం జోరుని,
కళ్ళతో పసిగట్టగలిగినంత వేగంగా మరే ఇతరములతోను సాధ్యము కాదు...
ఎందుకంటే ఇవన్నీ అందరికి కనిపించేలా ఎవ్వరు బోర్డ్లు రాసి పెట్టుకొని ఉండరు కద....
మనమే ఇతరులను కేవలం చూడడం మాత్రమే కాకుండా వాళ్ళను అమూలాగ్రం చదివేసేలా చూడాలి....
"జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే..."
అనే 'శ్రీమంతుడు' సినిమా సాంగ్లో
"ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ..."
అన్నట్టుగా ఒక పుస్తకాన్ని టకటకమని చదివేసి ఆ పుస్తకంలో ఉన్నదంతా మన మెదడులో కొలువై ఉండేలా చేసుకున్నట్టుగా....
ఇతరుల వదనమే వారి మనోపుస్తకమై ఉండగా అది టకటకమని మన కళ్ళు చదివేస్తే వాళ్ళు ఎవరు ఏంటి ఇత్యాదిగా వాళ్ళ సకల సారం మొత్తం మన మస్తిష్కంలోని సీ.పీ.యు మొత్తం
గిర గిర తిరుగుతూ చెబుతుంటే అది మన రాం RAM నుండి రోం ROM లోకి ట్రాస్ఫర్ చేస్కొని
" శృతం మే గోపాయా..."
అన్నట్టుగా భద్రపరుచుకొని అవసరమైనప్పుడు రీరిఫర్ చేయ్యగలగడంలో మన కళ్ళవే కీలక పాత్ర..."
"Don't judge a book by it's cover...
అనేది ఎంత ముఖ్యమో.....
"Face is the Index of the mind......"
అనేది కూడా అంతే ముఖ్యం....
వీటిని సమతూకంతో తూచ గలిగే
కౌశలంతో లోకాన్ని చదవగలగడంలోనే కళ్ళకు సార్థకత కలదు కద.....
సరే...ఇదంతా నాణేనికి ఒక పార్శ్వం...
ఒకానొక స్థాయికి వచ్చాక, ఈ లోకాన్ని, లోకులను చదివి చదివి విసుగెత్తినప్పుడైనా సరే లోకేశ్వరుడి గురించి కళ్ళు వెతకడం ప్రారంభిస్తాయి....
మొదట, ఎక్కడ ఆ పరమేశ్వరుడిని వెతకాలి అనే తలపుతో వెతికే ఆ చూపు ఈ లోకంలోని లోకేశ్వరుడి ఉనికిని కోవెలలో కొలువైన దేవతా మూర్తితో మొదలుపెట్టి క్రమక్రమంగా క్రమక్రమంగా యావద్ లోకంలో ఎక్కడైనా సరే ఆ లోకేశ్వరుడి ఉనికిని దర్శించగల స్థాయికి మనుష్యుడిని ఉన్నతంగా తీర్చిదిద్దగల ఘనత కేవలం కళ్ళకే సొంతం.....
అవ్విధంగా కళ్ళతో యావద్ లోకాన్ని చూస్తూ సమ్రక్షించే ఆ పరతత్త్వ ప్రాభవం గురించి శ్రీ చాగంటి సద్గురువులు ఎంతో ఘనంగా వివరించిన వైనం చాలామందికి విదితమే....
కా : బ్రహ్మ శక్తికి...
మా : విష్ణు శక్తికి...
క్షి : శివ శక్తికి...
సంకేతంగా
కంచి కామాక్షి లో త్రిశక్తులు సమ్మిళితమై ఉండడం....
" నన్ను నమ్మండి...కామాక్షి కళ్ళు తిప్పుతుంది....ఆవిడ అనుగ్రహించే ఎందరో భక్తులకు అది నిజంగా ప్రత్యక్ష సాక్షాత్కార సత్యం....,"
అనే విధంగా శ్రీచాగంటి సద్గురువులు ఆ కంచి కామాక్షి పరదేవత కళ్ళ యొక్క వైభవం గురించి వివరించడం ఎందరో శిష్యభక్తులకు ఎరుకలో ఉన్న సత్యమే...
ఎక్కడెక్కడో ఉండే పరతత్వ ప్రాభవం గురించి చర్చించడం బాగ కాంప్లెక్స్ గా ఉందనుకుంటే....
ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించబడే సూర్యదేవుడినే ఎగ్సాంపుల్ గా తీస్కుందాం......
పొద్దున్నే తూర్పున ఉదయాద్రిపై బాలభానుడిగా ఉండే ఆదిత్యుడి అపురూప బింబవైభవం కళ్ళారా దర్శించ గలిగే మన కళ్ళు....
కొన్ని గంటలకి మధ్యాహ్నమయ్యే సరికి నడినెత్తిమీద తాండవించే మార్తండుడిని సూటిగా కన్నెత్తి చూడలేకపోవడం ఎంత విచిత్రమో కదు.....
మరల అదే భానుడు ఇంకొన్ని గంటలకు
సాయంత్రమయ్యేసరికి పడమటి నింగిన
సంధ్యాసుందరి నుదుటన రంగరించబడిన నిండు ముత్తైదువ నొసటి గుండ్రని ఎర్రని నాగసిందూరంలా నిగనిగలాడుతూ ఉన్నప్పుడూ దర్శించి తరించగలగడం మరో విచిత్రం....
(ఉత్తర సంధ్యా సూర్యుడి దర్శనం సకల ఆరోగ్య కారకం అని కదా సద్గురువుల ఉవాచ...)
ఒక్క రోజులోని 12 గంటల్లోని 3 సంధ్యల్లో సాగే సూర్యుడి గమనంలోనే...
ఒకసంధ్యలో సూరుడిని నేరుగా దర్శించగలగడం మరోసంధ్యలో దర్శించలేకపోవడం
అనేది మనం నిత్యం గమనించే దైనందిన సత్యమైనప్పుడు.....
అందరు ఇదే లోకంలో ఒకే భౌతిక తలంలో జీవించే మనుష్యులైనా సరే...
ఒక స్థాయిలో ఉన్న సాధకుడికి పరమాత్మ తత్త్వం కేవలం లీలగా.....
మరొక స్థాయిలో ఉన్న సాధకుడికి పరమాత్మ తత్త్వం బాగా ప్రకటంగా.....
దర్శింపబడడం గురించి మాన్యులు వచించినప్పుడు అది విశ్వసించడానికి ఎందుకో కొందరు మనుష్యులకు ఒక విధమైన వెర్రి ....
ఎవరిని ఆదర్శంగా స్వీకరించి అభిమానించి ఆరాధిస్తున్నామో....
అనగా
ఎవరిని సద్గురువులుగా...
ఎవరిని సర్వేశ్వరుడిగా...
భావించి ఆరాధిస్తున్నామో....
వారి యొక్క అనుగ్రహవీచికలకు అనుగుణంగా ఆ దైవం పరతత్త్వ ప్రాభవాన్ని దర్శింపజేసి జీవితాలను తరింపజేస్తుంది.....
ఒక చిన్న సందర్భం తో ఒక మనిషి
ఏ విధంగా ఇతరులను, వారి కష్టాన్ని, వారి కృషిని, వారి విశ్వాసాన్ని, వారి శ్రమను, తద్వారా వారి జీవితాన్ని ప్రభావితం చేయ్యగలడో వివరిస్తా....
"నీకు కార్ డ్రైవింగ్ అవసరమా....
నాలాంటి వాళ్ళకే అది కష్టం....
ఇక నీలాంటి వారికి ఎందుకు అవన్నీ..
"
అనే నిష్టూర ధోరణిలో ఒకరు ఎంతో పెడసరిగా, ఏడుపుగొట్టు వైఖరితో, ఒక వ్యక్తిని చిన్నచూపు చూసి కించపరిస్తే....
మరొకరు....
"సైకిల్, బైక్, నేర్చుకోవడం ఎట్లాగో.....
కారు కూడా అట్లాగే.....
అదేమన్న విమానమా ఏంటి....
30 రోజుల్లో కష్టపడితే వచ్చి తీరుతుంది......
స్టీరింగ్ మీద చెయ్యి వేసేంతవరకే
కార్ డ్రైవింగ్ అంటే ఏదో కాంప్లెక్స్ తింగ్ లా ఉంటది..."
అనేలా
ఎంతో సుహృద్భావవైఖరితో ఒక వ్యక్తిని ప్రోత్సహించేలా వచించినప్పుడు,
ఆ వ్యక్తి 30 డ్రైనింగ్ క్లాసుల్లోనే కారు నడపడం వచ్చి డ్రైవింగ్ టెస్ట్లో ఒక్కడే ఎక్కడా కారు ఆగకుండా, టెస్ట్ ట్రాక్ లో ఎప్పుడు ఎక్కడ ఎలా నడపాలో అలా నడిపి సింగిల్ అటెంప్ట్ లోనే కార్ డ్రైవింగ్ లైసెన్స్
సాధించడం అనే ఎగ్సాంపుల్ లో....
మనం గమనించ గలిగితే.....
మొదటి వ్యక్తి ముళ్ళకంప వంటి వాడు....
సుఖంగా ఉండడు...సుఖంగా ఉండనివ్వడు...
ఎప్పుడూ ఇతరులను కించపరుస్తూ
వాడెంత....వీడెంత...
నేనే తోప్...తొక్క...తోలు...
అంటూ ఎప్పుడూ అవతలి వ్యక్తిని అవమానపరిచే శైలిలోనే మాట్లాడడం....జీవించడం....తో
ఒక ధూర్తుడిగా ముద్రపడిపోతాడు....
ఇతరుల్లో ఉండే గొప్పదనాన్ని గుర్తించి నమస్కరించి గౌరవించేంతటి మనోసంస్కారం వీరికి అస్సలు ఉండదు....
మాట్లాడడం ఒక కళ....
జీవించడం ఒక కళ....
మంచిగా మాట్లాడి జీవితాన్ని ఉద్ధరించుకోవడం ఒక కళ....
మంచిమాటలతో జీవితాన్ని తరింపజేసుకోవడం ఒక కళ.....
ఇలాంటి ఏ కళల్లోనూ వీరు కృషి సలపరు.....
ఇతరుల కృషిని ఓర్వరు సరికద....
ఎప్పుడూ ఇతరులకు గోతులు తీస్తుబ్రతకడంలోనే జీవించేస్తు జీవితాన్ని వ్యర్ధం గావిస్తారు.....
రెండవ వ్యక్తి మంచి వెదురు బొంగు వంటి వాడు....
సుఖంగా ఉంటాడు...సుఖంగా ఉండనిస్తాడు...
ఎప్పుడూ ఇతరులను గౌరవించే శైలిలో మాట్లాడడం....జీవించడం....తో
ఒక ధన్యుడిగా ముద్రపడిపోతాడు....
ఇతరుల్లో ఉండే గొప్పదనాన్ని గుర్తించి నమస్కరించి గౌరవించేంతటి మనోసంస్కారం వీరికి బాగా ఉంటుంది..
మాట్లాడడం ఒక కళ....
జీవించడం ఒక కళ....
మంచిగా మాట్లాడి జీవితాన్ని ఉద్ధరించుకోవడం ఒక కళ....
మంచిమాటలతో జీవితాన్ని తరింపజేసుకోవడం ఒక కళ.....
ఇలాంటి కళల్లో వీరు కృషి సలిపి....
ఇతరుల కృషిని కూడా గౌరవించి....
ఇతరుల ఉన్నతికై కూడా జీవిస్తూ జీవితాన్ని ధన్యం గావించుకుంటారు.....
మూర్ఖుడైన మొదటి వ్యక్తి మాటలను
విని జీవితంలో ఎప్పటికీ కార్ డ్రైవింగ్ నేర్చుకోకుండానే ఉంటామా....
లేదా
రెండవ వ్యక్తి మాటలను విని వారి ప్రోత్సాహానికి తగ్గట్టుగా తెలివితో మెలిగి ఒక్క నెలలోనే కార్ డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ సాధిస్తామా అనేది మనం ఎవరి మాటలను విని ముందడుగు వేస్తామనేదానిపై ఆధారపడి ఉండే అంశం....
అచ్చం అదే విధంగా....
మూర్ఖుడైన మొదటి వ్యక్తి మాటలను
విని జీవితంలో ఎప్పటికీ ఉన్నతమైన శిఖరాలను అధిరోహించకుండా ఉంటామా....
లేదా
రెండవ వ్యక్తి మాటలను విని వారి ప్రోత్సాహానికి తగ్గట్టుగా తెలివితో మెలిగి అనతికాలంలోనే ఉన్నతిని సాధిస్తామా అనేది మనం ఎవరి మాటలను విని
ముందడుగు వేస్తామనేదానిపై ఆధారపడి ఉండే అంశం....
మొదటి కోవకు చెందిన వ్యక్తులు మాట్లాడెటప్పుడు వారి కళ్ళలోకి చూడగలిగితే వారి కుళ్ళంతా కొట్టొచ్చినట్టుగా అగపడి వారి మనోమాలిన్యాన్ని, హృదయ సంకుచితత్త్వాన్ని మనకు అవగతమయ్యేలా చేస్తాయి....
రెండవ కోవకు చెందిన వ్యక్తులు మాట్లాడెటప్పుడు వారి కళ్ళలోకి చూడగలిగితే వారి మంచితనమంతా
కొట్టొచ్చినట్టుగా అగపడి వారి మనోస్వచ్ఛత, హృదయవైశాల్యం మనకు అవగతమయ్యేలా చేస్తాయి...
అవి కళ్ళకుండే ప్రత్యేకత....
అట్లే ఈశ్వరానుగ్రహం మెండుగా ఉన్నవారికి ఈ లోకంలోనే ఆ లోకేశ్వరుడి వైభవం కొట్టొచ్చినట్టుగా కనపడి విశ్వంలోనే విశ్వనాథుడిని దర్శిస్తూ
తరించేస్తారు.....
అనగా ఎక్కడెక్కడో ఉండే ఈశ్వరుడినే
ఎక్కడైనా దర్శించేంతటి ప్రాజ్ఞ్యతతో జీవితాన్ని తీర్చిదిద్దుకొని తరించగలగడం అన్నమాట ...
శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే....
చీకటిని రూపుమాపడానికి ఒక చిన్న
దివ్వే వెలిగించడంలో విజ్ఞ్యత ఉంటుంది కాని....
వామ్మో చీకటి...వాయ్యో చీకటి....
అని చీకటి గురించి రచ్చ చేసినంతమాత్రాన ఒరిగేదేమి ఉండదు...
చీకట్లోనే మిగిలిపోవడం తప్ప...
అట్లే సహజాతి సహజమైన అజ్ఞ్యానం అనే జీవాంతర్గత అంధకారానికి
భగవద్ నామస్మరణం అనే దివిటీని విరుగుడుగా వాడి ఈ లోకాన్ని చూస్తూనే లోకంలోనే ఉండే లోకేశ్వరుడిని కనుగొనే చూపులతో
మనలోనే ఉండే ఆ అంతర్యామిని భగవన్నామస్మరణ జనిత దేదీప్య ప్రభలలో దర్శించగలిగిన నాడు....
మన బాహ్య నిత్య పూజలన్నీ కూడా ఫలించి...
మన చూపులే ఆ పరమాత్మకు మనం వెలిగించే నిత్యదీపారాధనై వర్ధిల్లి మనం తరించగలగడం కద్దు....😊
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/43nityapoojalivigo.html?m=1
నిత్య పూజలివిగో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి
పరమాత్మునికి నిత్య పూజలివిగో
తనువే గుడియట తలయె శిఖరమట
పెను హృదయమే హరి పీఠమట
కనుగొన చూపులే ఘన దీపములట
తన లోపలి అంతర్యామికినినిత్య ౨
పలుకే మంత్రమట పాదయిన నాలుకే
కలకల మను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలపులోపలనున్న దైవమునకునిత్య ౨
గమన చేష్టలే అంగరంగ గతియట
తమి గల జీవుడే దాసుడట
అమరిన ఊర్పులే ఆలవట్టములట
క్రమముతో శ్రీ వెంకటరాయునికి
nitya poojalivigO nerichina nOhO pratyakshamainaTTi
paramaatmuniki nitya poojalivigO
tanuvae guDiyaTa talaye SikharamaTa
penu hRdayamae hari peeThamaTa
kanugona choopulae ghana deepamulaTa
tana lOpali aMtaryaamikininitya ~2
palukae maMtramaTa paadayina naalukae
kalakala manu piDi ghaMTayaTa
naluvaina ruchulae naivaedyamulaTa
talapulOpalanunna daivamunakunitya ~2
gamana chaeshTalae aMgaraMga gatiyaTa
tami gala jeevuDae daasuDaTa
amarina oorpulae aalavaTTamulaTa
kramamutO Sree veMkaTaraayuniki
No comments:
Post a Comment