Friday, May 14, 2021

శ్రీ ప్లవనామసంవత్సర వైశాఖ శుద్ధ తదియ / అక్షయ తదియ / అక్షయ తృతీయ శుభాభినందనలు....🍟💐😊🍕👏🍨

🍟💐😊🍕👏🍨

శ్రీపరశురామ జయంతి, పాండవులకు శ్రీసూర్యభగవానుడు అక్షయపాత్రను అనుగ్రహించిన రోజు, ఇత్యాదిగా మన సనాతనపెద్దలు తెలిపే బహు విధ సంఘటనలకు అక్షతదియ అనగా వైశాఖ శుద్ధ తదియను ఒక పండగ గా జరుపుకోవడం అనాదిగా భారతావనిపై ఎల్లరూ గమనించే సత్యం....

టీవీల్లో ఊదరగోట్టే విధంగా అక్షయతదియ నాడు బంగారం ఆఫర్స్ అంటూ వ్యాపారుల వేసే అజ్ఞ్యాన వలలో పడి అక్షయమైన కలిప్రకోపాలను ఆర్జిస్తామా....
లేదా శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయులచే బోధించబడినట్టుగా శీతల సుగంధ జల భరిత కుంభదానం గావించి అక్షయమైన పుణ్యాన్ని ఆర్జించుకుంటామా అనేది వారి వారి విచక్షణకు / జ్ఞ్యానానికి సంబంధించిన విషయం....
(ఈసారి కూడా కరోన కారణంగా వీలుపడదేమో...కాబట్టి మానసిక కర్మాచరణ గావించి తరించడమే ఈ కష్టకాలంలో జీవుడికి గల ఉద్ధరణ హేతువు...)

అక్షయతదియ నాటి వస్తుసముపార్జన లేదా వస్తు క్రయవిక్రయం, తద్వస్తువులను లేదా తద్వస్తు తత్త్వాన్ని అక్షయంగా సంవృద్ధి గావిస్తుంది అనేదే విశ్వాసం అయితే....

ఈ అక్షయతృతీయ నైమిత్తిక తిథిని ఆలంబనగా గావించి మనిషి నిజంగా ప్రోది గావించుకొని తరించవలసింది శాశ్వతంగా సంచితమై ఉండే పుణ్యాన్ని మరియు ఈశ్వరానుగ్రహాన్ని....

ఎందుకంటే 

1. పుణ్యం అనేది సుఖజీవనానికి / సంపదకు / చిత్తశుద్దికి మూలకారణమై అనుగ్రహిస్తుంది...

2. ఈశ్వరానుగ్రహం అనేది సకల ఇహరపర ఐశ్వర్యాలకు హేతువై అనుగ్రహిస్తుంది....

కాని ఇక్కడ మనం గమనించగలిగితే
ఈశ్వరానుగ్రహం అనేది అయాచితంగానే పాపక్షయాన్ని పుణ్యసంచయాన్ని కలిగించి జీవోద్ధరణకు ఉపయుక్తమైన సకల ఇహపర వస్తుసముదాయాన్ని అనుగ్రహిస్తుంది....

పుణ్యం అనేది కేవలం ఐహిక సుఖజీవన దాయకం....

కాబట్టి ఈశ్వరానుగ్రహ సంచయమే అక్షయతృతీయ నాడు కూడా జీవుడికి విహిత ధర్మం...

ఈశ్వర స్మరణకు / భక్తికి స్థానంలేని జీవితంలో

పుణ్యం బాగా ఆర్జించినా సరే,
( అనగా సంచితం లో బాగా ఉన్న పుణ్యం బ్యాలన్స్)

బాగా తిని ఒళ్ళు పెంచి ఒక స్టేటస్ సింబల్ మేంటేన్ చేసేలా జీవించామా అనేదాంట్లోనే ఆ పుణ్యమంతా ఖర్చై పోతుంది....

జీవిత పర్యంతంలో కొన్ని వేల సిగరెట్లు కాల్చుతూ
పొగను గాల్లోకి రింగులు రింగులు గా వదులుతూ...
బూడిదను స్టైల్ గా వేలితో విదిల్చే వ్యక్తి...

జీవితంలో ఎన్ని సార్లు ఒక్క రెండు అగర్బత్తీలైనను మనస్పూర్తిగా దేవుడికి చూపించి ఆ అగరు ధూప పరిమళ తన్మయత్వంలో ఈశ్వరుడి మూర్తిని / పటాన్ని దర్శించి ఆనందిస్తూ, ఆ బూడిదను వేలితో విదిల్చాడు అనే

ప్రశ్న ఒక వ్యక్తి తనకు తాను వేసుకోగలిగితే.....

ఏ షాపులోకూడా ఎన్ని పైసలు పెట్టినా కూడా కొనుక్కోలేని ఊపిరితిత్తులను పనికట్టుకొని పాడుచేసినా సరే ఇంకా ఊపిరి పీల్చుతూ బ్రతికేలా ఈశ్వరుడు నిర్హేతుక దయాస్వరూపుడై అనుగ్రహించే తీరుకి ఈశ్వరుడికి రోజుకొక్కసారైనను రెండుచేతులు ఎత్తి నమస్కరించాలనే తలపు కలగకుండానే జీవితంలో చాలా భాగం ఒక పశువులా కేవలం తిన్నామా పన్నామా గోలీలు మింగామా
మళ్ళీ అదే దైనందిన చక్రంలో బ్రతుకీడేచేస్తున్నామ.....

అనేలా ఉన్నప్పుడు...
ఆ పుణ్యం ఎంత ఉంటే ఎందుకు....
ఎన్ని రోజులు బ్రతికితే ఎందుకు....

ఎంత కాస్ట్లీ సిగరెట్ అయినా చివరకు
ఆ చివరి ముక్కను కిందపడేసి నలపడమే దానికి లభించే ఆఖరి దశ అన్నట్టుగా....

అలాంటి కృతఘ్నతా భరిత జీవితంలో ఎంత పుణ్యం ఉన్నా సరే అది ఎందుకు పనికిరానిది....
అది కేవలం ఏడారిలో లభించిన ఒక ఉప్పునీటి కయ్య వంటిది...తప్పక ఆ నీళ్ళు తాగి దప్పిక తీరుతుందనే భ్రమలో బ్రతకడమే తప్ప....అది మరింత దప్పికకు కారణమై ఉండే వృధా ప్రయాస వంటిది...

కనీసం ఇటువంటి విశేష పుణ్య 
తిథుల్లోనైనా సరే ఈశ్వరుడి కారుణ్యానికి తలొగ్గి నమస్కరించేలా జీవితంలో మిగిలి ఉన్న సమయాన్నైనను ఈశ్వర ప్రసాదంగా జీవించగలిగితే 
ఆ జీవితానికి ఎంతో కొంత ధన్యత....

మనుష్య జీవితం ఎప్పటికైనా క్షయమయ్యేదే....
ఎందుకంటే ఇది మర్త్య లోకం కాబట్టి...
తనువు తుదకు మన్నులోకి మాయమైపోవడమే ఇక్కడి రివాజ్ కాబట్టి....

దేహం దహ్యం కాకముందే, ఆర్జించుకున్న పుణ్యాలన్నీ క్షయమై వైకుంఠపాళి లో పైవరకు ప్రయాణించి పెద్ద పాము మ్రింగడంతో ఆట మళ్ళీ మొదటికి వచ్చిన చందంగా, జీవితాన్ని వృధాగా కాకుండా ఒక పద్ధతిగా ఈశ్వరానుగ్రహ సముపార్జనకు శరీరం సాధనంగా గావించి  సంకల్పించి తరించుటకు
ఈ అక్షయతదియ పర్వదినం ఒక చక్కని సమయం...

అక్షయ తృతీయ నాడే సిమ్హాద్రి అప్పన్నకు చందనోత్సవం, గావించడం అనగా సిమ్హాచలేశ్వరుడి గర్భాలయ మూలమూర్తికి గల పాత చందన లేపనం ఒలుపు మరియు కొత్త చందనపు తొడుగు...,
కావించడం ఎల్లరికి తెలిసిందే....

శాస్త్రోక్త ఆగమోక్త సంప్రదాయ చందనోత్సవ విశేషాల గురించి ఎల్లరికి తెలిసిందే...

అనంతమైనది అక్షయమైనది భగవద్ తత్వం....

ఆ భగవద్ తత్త్వాన్ని అమూలాగ్రం ఒడిసిపట్టిన శ్రీపోతనామాత్యులంతటి వారే  

" విబుధ జనుల వలన విన్నంత కన్నంత..తెలియవచ్చిన్నంత....తేటపరతు....."

అని ఎంతో వినమ్రంగా తమ శ్రీమద్భగవతం పద్యంలో విశదీకరించగా....
ఇక సామాన్యులమైన మనవంటి వారు
ఏమని తెలపగలరు ఆ ఈశ్వరతత్త్వవైభవాన్ని...

ఎన్నో శ్రీచందనం కర్రలను ఎంతో శౌచంతో ఆచార నియమ నిబంధనలతో అరగదీసిన తదుపరి లభించే ఆ శ్రీగంధలేపనాన్ని స్వామివారికి సమర్పించి , నిజస్వరూపం దర్శనం కేవలం ఒక్కరోజు మాత్రమే అనుగ్రహించబడి, సంవత్సరంలో మిగతా సమయమంతా కూడా ఆ చందనతిరుమేని దర్శనమే లభింపజేయడంలో గల ఆంతర్యం...

అనంతమైన అక్షయమైన ఆ భగవద్ తత్త్వాన్ని, ఎంతో ప్రయాసతో లభించిన ఈ స్థూల శరీరాంతర్గతంగా కొలువైన సూక్ష్మ శరీరంలోనే కొలువైఉండే పరమాత్మ నిజ తత్త్వాన్ని గుర్తించి ఒక్కనాటికైనా సరే ఆ పరమాత్మను మానసికంగా దర్శించి తరించడంలోనే అక్షయమైన సంచిత ప్రారబ్ధ ఆగామి లెక్కల కర్మ చట్రం నుండి జీవుడికి విముక్తి లభించి జీవ జీవేశ్వర అభేదమైన స్వస్వరూపానుసంధానం తో ఈశ్వరసన్నిధికి జేరి జీవితం తరించడం అనేది సంభమయ్యేది...

అనంతమైన, అక్షయమైన ఆ భగవద్ తత్త్వాన్ని ఎంతో రసరమ్యంగా భక్తులకు భోగ్యంగా అందించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు

"నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు..." అనే సంకీర్తనలో...

యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు

అంటూ ఆ అక్షయమైన ఆనందనిలయుడి అమేయత్వాన్ని ఎంతో ఘనంగా కీర్తించినారు ఆచార్యులు...

ఈశ్వరుడి అమేయత్వానికి అక్షయత్వానికి అమృతత్వానికి ప్రతీకగా ఆరాధింపబడే ఇవ్వాళ్టి తదియ నాటి చంద్రరేఖ అనగా
వైశాఖ శుద్ధ తదియ / అక్షయ తదియ / రంజాన్ నాటి తదియ చంద్రరేఖ యొక్క పిక్...😊💐

http://annamacharya-lyrics.blogspot.com/2010/05/700nityatmumdai-yumdi-nityumdai.html?m=1

ప : నిత్యాత్ముఁడై యుండి నిత్యుఁడై వెలుఁగొందు - సత్యాత్ముఁడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం- స్తుత్యుఁ డీతిరువేంకటాద్రివిభుఁడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁ- డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁ- డేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁ గాఁడు - యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాతుఁ డేమూర్తి పరమాత్ముఁ- డామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు

చ : యేదేవుదేహమున నిన్ని యును జన్మించె - నేదేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును - యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁ డీజీవులిన్నింటిలో నుండు - నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుంఁ- డాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు - యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము - యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁ- డేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము - ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు

pa : nityAtmu@mDai yumDi nityu@mDai velu@Mgomdu - satyAtmu@mDai yumDi satyamai tAnumDu
pratyakShamai yumDi brahmamai yumDu sam- stutyu@M DItiruvEmkaTAdrivibhu@MDu

cha : EmUrti lOkambulella nEleDunAta@M- DEmUrti brahmAdulella vedakeDunAta@M-
DEmUrti nijamOkShamiyya@M jAleDunAta@M- DEmUrti lOkaikahitu@MDu
yEmUrti nijamUrti yEmUrtiyunu@M gA@mDu - yEmUrti traimUrtu lEkamainayAta@M-
DEmUrti sarwAtu@M DEmUrti paramAtmu@M- DAmUrti tiruvEmkaTAdrivibhu@MDu

cha : yEdEvudEhamuna ninni yunu janminche - nEdEvudEhamuna ninniyunu naNa@Mge mari
yEdEvuvigraham bIsakala mimtayunu - yEdEvunEtrambu linachamdrulu
yEdEvu@M DIjIvulinnimTilO numDu - nEdEvuchaitanya minniTiki nAdhAra-
mEdEvu@M Davyaktu@M DEdEvu@M Dadwamdwum@M- DAdEvu@M DIvEmkaTAdrivibhu@MDu

cha : yEvElpupAdayuga milayunAkASambu - yEvElpupAdakESAmtam banamtambu
yEvElpuniSwAsa mImahAmArutamu - yEvElpunijadAsu lIpuNyulu
yEvElpu sarwESu@M DEvElpu paramESu@M- DEvElpu bhuvanaikahitamanObhAvaku@MDu
yEvElpu kaDusUkShma mEvElpu kaDughanamu - AvElpu tiruvEmkaTAdrivibhu@MDu

No comments:

Post a Comment