శ్రీవేంకటగిరినారసిమ్హుడిలా జ్ఞ్యాన యోగముద్రలో ( తిరుమల ఆలయ ఈశాన్య భాగాన కొలువైన మహామహిమాన్విత యోగనృసిమ్హుడు )
సద్గురువాక్కు అనే అంకుశం అనునయించగా స్వయంస్వీకృత కట్టడిలో గత 40 నెలల నుండి సాగుతున్న అజ్ఞ్యాతవాసానికి తెరతొలిగే సమయం ఆసన్నమవ్వనుంది....
నరసిమ్హ సినిమాలో నీలాంబరి నరసిమ్హల పంతానికి 18 ఏళ్ళు పట్టిందేమో....నన్ను ఈ 40 నెలల్లో అంతకంటే ఎక్కువే మానసిక క్షోభకు గురిచేసారు కొందరు మదించిన కౌరవ సేన....
నా అనుకున్న నావారందరిని నాకు కానివారిగా, వైరిసమూహంగా మార్చి నన్ను ఎన్ని రకాలుగా వేధించినా ఓపిక పట్టింది ఎందుకోసం అనుకున్నారు...?
పిచ్చివాడినై మిగిలిపోడానికా....
కాదు....
అర్జునుడు చెట్టుపై ఉన్న పిట్ట కళ్ళకు గురిపెట్టిన చందంగా, పెట్టిన గురిని అట్లే నిలిపి..
సరైన సమయం రాగానే నా ధార్మిక క్రోధం అనే వింటి నారికి ఎక్కుపెట్టబడి ఉన్న నా భవిష్య కర్తృత్వం అనే శ్రీరామ బాణానికి మీరు సమూలంగా సమసిపోయేలా
శరాన్ని సంధించడానికి..!
ఆనాటి శివాజిమహారాజ్ ఎదురుగా ఎగదూకి ఎంతమంది శతృవులను సమ్హరించాడో...
స్నేహము / ఆత్మీయ చర్చలు / అంటూ నాటకాలాడి వెనకనుండి వెన్నుపోటు పొడిచి అంతమొందిద్దాం అనుకున్న కౄరులకు అంతే తెలివిగా సైడు నుండి జవాబు ఇచ్చాడు....
నేను కూడా అట్లనే మిమ్మల్ని సైడ్ నుండి సఫా కావించేందుకు త్వరలోనే బరిలోకి దిగి శ్రీకారం చుట్టబోతున్నా....
ఒక క్షత్రియుడికి అవమానకరమైన రీతిలో నన్ను ఎన్నెన్ని నిందలకు, అభియోగాలకు, అవమానాలకు గురిచేసి వేధించారో....
ఆ క్షత్రియుడు మీసాన్ని మెలేసి బరిలోకి దూకి, స్మాల్ బ్రేక్ తర్వాత కంటిన్యూ అయ్యే సినిమా ఎట్లుంటదో ఎంతటి చాణక్యంతో రాబోవు కార్పొరేట్ చదరంగం ఉండబోతోందో చూద్దురు గాక....
నేను ఎప్పుడో చెప్పిన...
ఇదం క్షాత్రం...ఇదం బ్రాహ్మం....
అని....
ఆ జ్ఞ్యాన బ్రాహ్మణం + కర్మ క్షాత్రం సమ్మిళితమైన చిత్తం ఎంతటి పదునైన కొసలతో శతృవులకు సమాధానం ఇవ్వనుందో కేవలం ఆ ఉగ్రభద్రకాళికే ఎరుక....!
💐
No comments:
Post a Comment