Wednesday, May 11, 2022

శ్రీ శుభకృత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్టి 2022 సంవత్సర శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి జయంత్యుత్సవం...😊🎂💐🍦🙏


ఈ లోకంలో ఒక్కొక్కరిది ఒక్కో వృత్తి / ఒక్కో వ్యాపకం / ఒక్కో అభిరుచి / ఒక్కో కళాత్మక కృషి....

ఎవరి తీరు వారిది......
ఏది / ఎవరు ఎక్కువ కాదు..... తక్కువ కాదు....పెద్ద కాదు....చిన్న కాదు... 
వారి వారి జ్ఞ్యాన స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో తమదైన కృషితో సాగిపోతూంటారు...

మిగతా వృత్తులు / వ్యాపకాలు / అభిరుచులు ముఖ్యంగా వారి వారి స్వప్రయోజనానికై / జీవనోద్ధరణానికై / సంతోషానికై / ఉంటే...... 
ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వృత్తులు / వ్యాపకాలు / అభిరుచులు ఇతరులకు కూడా నిర్హేతుక ఉద్దరణహేతువులై పరిణమిస్తాయి.....

ఎందుకంటే అనాదిగా వాటికి గల శక్తి / సమర్ధత అటువంటిది......

ఒక సినిమా పాట పాడే గాయక వృత్తిలో ఉండే వ్యక్తి కొన్ని నెలల / సంవత్సరాల పాటు కొందరిని అలరించే రీతిలో తమ స్వరశక్తిని వినియోగిస్తారు......

అదే స్వరశక్తిని ఆధ్యాత్మిక వేత్తలు శ్రీరుద్ర నమక చమకం, శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం, లలితాపారాయణం, అన్నమాచాయ సంకీర్తనం ఇత్యాది వాటిని ఆలపించడానికి వినియోగిస్తారు.....

వీరి ఆలాపనలు నిరంతరం లోకంలో తమ వైభవాన్ని / మహిమ్నతను ప్రదర్శిస్తూనే ఉంటాయి......

సొ ఇక్కడ గమనిస్తే, ఒక ఆలాపన కొన్ని సంవత్సరాలకు మరుగయ్యింది.....
మరొకటి ఎన్ని సంవత్సరాలైనా సరే నిత్యనూతనంగా....సార్వకాలిక సర్వజనోద్ధరణ హేతువై కాలగతిలో శాశ్వతత్త్వాన్ని గడించింది......

ఇదే ఆధ్యాత్మిక వృత్తి / ప్రవృత్తులకు  మరియు ఇతర లౌకిక వృత్తి / ప్రవృత్తులకు గల ముఖ్యమైన భేదం...... 

ఒకనాడు సమాజంలో పాతుకుపోయిన అసమానతలను / అసంబద్ధమైన ఆధ్యాత్మిక అవలంబనను చక్కదిద్దడానికి 
శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే అప్పటికే సువ్యవస్థీకరింపబడిన అద్వైత తత్త్వ సారాన్ని సార్వజనీన సర్వశ్రేయోదాయక మార్గంలో 
" విశిష్టాద్వైత సంప్రదాయం " పేర ఎల్లరి జీవితాలు దైవానికి / దైవిక మార్గప్రవర్తక జీవనానికి మరింత దెగ్గరగా ఉంటూ మరింత మెండుగా అనుగ్రహదాయకంగా తత్త్వానుసంధానం ఉండేలా వివిధ రీతుల కృషి సలిపిన మహనీయులుగా శ్రీవైష్ణవాచార్య శిరోమణిగా వినుతికెక్కిన శ్రీభగవద్ రామానుజుల వారి జయంతిని వైశాఖ శుద్ధ షష్ఠి గా పెద్దలు సెలవిచ్చినారు... 

వారి ఆధ్యాత్మిక జీవన మార్గంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయ అర్చారాధనలను శ్రీవైఖానస ఆగమోక్తంగా సువ్యవస్థీకరించి స్వామి వారికి తద్వారా భక్త లోకానికి మరింత మెండుగా దైవిక తేజస్సు సమకూరే విధంగా  విశేష కృషి సలిపిన మహనీయులుగా లోకారాధ్యులైన వారి పై శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు 
" గతులన్నీ ఖిలమైన " అనే సంకీర్తనను రచించడం గురించి మరియు వారి వైభవం గురించి నా ఈ క్రింది పాత పోస్టుల్లో గలదు.......

https://shreeguravenamah-aithavk.blogspot.com/2021/04/1004.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2022/02/the-swarna-moorthy-prathishthaapaana.html?m=1

ఓం నమో నారాయణాయ....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment