1. " ప్రజల సంక్షేమం గురించి పాటుపడవలసిన వారే ప్రజలను బాధిస్తుంటే వారు తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలి...?
ఒక కార్పొరేటర్ వి ఒక విధమైన రాజకీయాలు.....
ఒక ఎం.ఎల్.ఏ వి ఇంకొక విధమైన రాజకీయాలు.....
ఒక మంత్రి వి మరో విధమైన రాజకీయాలు.....
ఇలా ఒకే పార్టీకి చెందినవారై ఉండి కూడా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రజలను బాధిస్తుంటే వారు వెళ్ళి
' ' మంచి పెద్దమనుషులుగా భావించి మీ పై గల గౌరవం తో మీ పార్టీకి వోటేసి గెలిపిస్తే ...
మీ పార్టీలోనే ఇంత మంది ఇన్ని అంతర్గత రాజకీయాలతో వారి వారి స్వప్రయోజనాలకై సామాన్య ప్రజలను బాధిస్తుంటే మీరు మా బాధలను పట్టించుకోరా....'
అని గౌ || సీ.ఎం గారికే వెళ్ళి చెప్పుకోవాలా....? '
అని ఒక పాత్రికేయుడు అడిగే ప్రశ్నకు సదరు రాజకీయవేత్త దెగ్గర సమాధానం ఉండదు......
2. ' హైదరాబాద్ లో జరిగే సంఘటనలకు
కరీంనగర్ లో ఉండే తమిళనాడుకు చెందిన ప్రభుత్వాధికారికి ఏంటి సంబంధం...?
ప్రజలను రక్షించవలసిన అధికారులే భక్షించే రాక్షసులలా అర్ధరాత్రి అగంతకులలా అవతారాలు ఎత్తితే. తమ బాధను ప్రజలు ఎవరికి విన్నవించుకోవాలి.....? '
అని ఒక పాత్రికేయుడు అడిగే ప్రశ్నకు సదరు ప్రభుత్వాధికారి దెగ్గర సమాధానం ఉండదు......
3 ' నీ కుటుంబ సభ్యుడికి అన్యాయం జరుగుతుంటే, అడ్డుపడాల్సిన నువ్వే,బయటి వారితో కలిసి ఓర్వలేని విధంగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నావ్.... ?'
అని ఒక పాత్రికేయుడు అడిగే ప్రశ్నకు సదరు కుటుంబ సభ్యుడి దెగ్గర సమాధానం ఉండదు......
4 ' అందరిలా నువ్వు కేవలం ఒక బంధువు వి మాత్రమే ....
నీ కన్నంతా వాడి సొమ్మును మింగడం / నీ వారికి దోచిపెట్టడం పైనే కాని వాడి శ్రేయస్సు గురించి కాదు....
అందరిలా నీ పరిధిలో నువ్వు ఉండకుండా, వాడి జీవితంలో నీ అనవసరమైన ప్రమేయం ఎందుకు ఉంటుంది....?
వాడు వద్దన్నాసరే వాడిని ముంచుదామని చూసే వారితో కుమ్మక్కవ్వడంలో నీ ఉద్దేశ్యమేంటి......? ఎవరి కోసం ఇన్ని రాజకీయాలను చేసి నీ బంధువులను బాధిస్తున్నావు....??
నీ భార్య కు అన్నగాడైన నీ కుళ్ళుబోతు బామ్మర్ది కోసమా....?
లేదా వాడి తమ్ముడి కోసమా...?? '
అని ఒక పాత్రికేయుడు అడిగే ప్రశ్నకు సదరు బంధువు దెగ్గర సమాధానం ఉండదు......
ఇలా మనం నిత్యం టీ.వీల్లో చూసే విధంగా,.....
వివిధ ప్రశ్నలకు సమాధానాల కోసం ఒకరి యత్నం......
వాటికి సమాధానాలు ఇవ్వలేక ఇంకొకరి పైత్యం......
ఇదే నిత్యజీవితం అనే దైనందిన సీరియల్....
అచ్చం ఇదే విధంగా ఆధ్యాత్మికత కూడా ఒక నిత్య ప్రశ్నోత్తరమంజరి...
కాకపోతే ఇక్కడ ప్రశ్న అడిగే వారు.....
సమాధానం ఇచ్చే / కనుగొనే వారు కూడా ఒక్కరే అయ్యి ఉంటారు.....
దానినే అధ్యాత్మ జిగ్ఞ్యాస అని అంటారు.....
శ్రీఆదిశంకరులచే ఈ లోకానికి అందివ్వబడిన అత్యత్భుతమైన సారస్వతం
" వివేకచూడామణి " లో ఈ క్రింది విభాగాల్లో, ప్రశ్నించడం యొక్క గొప్పదనం బహుబాగా ఉటంకింపబడినది......
(250-266)
Meditation, its purpose, the method, questions to ponder and reflect on
(407-425) Atma-vichar: self-inquiry
ఇతరులను ప్రశ్నించడంలో లౌకిక విషయాలకు సంబంధించిన సమాధానాలు లభ్యమౌతాయి.....
మనల్ని మనమే ప్రశ్నించుకోవడంలో అలౌకిక విషయాలకు సంబంధించిన సమాధానాలు లభ్యమౌతాయి.....
ఇక్కడే మనిషి యొక్క అసలైన ఉన్నతి అనేది ప్రారంభమవుతుంది.....
2022 శ్రీశంకర జయంతి ఉత్సవాల సందర్భంగా...
నా అధ్యాత్మ ప్రపంచానికి ఆదిశంకరులైన శ్రీ చాగంటి సద్గురువుల శ్రీచరణాలకు నమస్సుమాంజలి....
🙏🙏🙏🙏🙏 🙏🙏🙏
No comments:
Post a Comment