" విందువలె మాకును శ్రీవేంకటనాథుని ఇచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య || "
అనే అత్యత్భుతమైన ముగింపుతో ఉండే " అప్పని వరప్రసాది అన్నమయ్య " అనే సంకీర్తనలో అన్నమాచార్యుల పౌత్రులైన శ్రీచినతిరుమలాచార్యుల వారు....
వారి తాతగారి వైభవాన్ని, ఆచార్యత్వాన్ని, శ్రీవేంకటేశ్వరస్వామి వారి నిత్యసంకీర్తనా కైకర్యంలో తరించిన జీవితవైభవాన్ని, ఎంతో రసరమ్యంగా
తెలియచెప్పినారు కద...
క్రింద ఉన్న రెండవ చరణాన్ని గమనిస్తే....
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
"విరివిగలినట్టి వేదముల అర్ధములను అరసి తెలిపినాడు అన్నమయ్య....."
అంటూ వారి అనితరసాధ్యమైన హరిభక్తి విశేషాన్ని, వారిచే లోకానికి అందివ్వబడిన శ్రీవేంకటహరి అనుగ్రహ విశేషాన్ని,
శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో వివరించిన విధంగా, వేదాలన్ని కూడా
" న ఇతి...న ఇతి....న ఇతి....నేతి" అంటూ ఏ పరతత్త్వాన్నైతే దేవభాష అయిన సంస్కృతంలో నిర్వచిస్తూ, స్తుతిస్తూ, సూచిస్తూ, ఘోషిస్తూ,
ఉన్నాయో.....
బౌద్ధిక పరిణతి రీత్యా ఎంతో ఉన్నతమైన సత్బ్రాహ్మణ కోవిదులకు, విజ్ఞ్యులకు, పండితులకు, మాత్రమే అర్ధమయ్యేలా ఉండే ఆ గహనమైన వేదసారస్వత ప్రతిపాదిత పరతత్త్వ ప్రాభవాన్ని,
ఎంతో సులభమైన రీతిలో,
సరళమైన శైలిలో,
సర్వజనశ్రేయోదాయక రీతిలో,
ఎంతగా పరిశోధిస్తే అంతగా వివిధ రీతుల శ్రీహరి విభూతులను భక్తులకు ఎరుకపరుస్తూ అవన్నీ కూడా
ప్రత్యక్ష సాకార పరమాత్మగా శ్రీవేంకటాచలముపై నెలకొన్న శ్రీవేంకటేశ్వరస్వామిలో దర్శింపజేయిస్తూ ఉండేలా రచింపబడిన సంకీర్తనల మహత్తు అంతా ఇంతా కాదు...
ఈ కలియుగంలో ఎన్నో రీతుల జనజీవనం అనేది శౌచలేమితో, జ్ఞ్యానలేమితో, శ్రద్ధాలేమితో,
ఆరోగ్యలేమితో, ఐశ్వర్యలేమితో, ఇత్యాదిగా అన్నివిధాలా పతనదిశగా పయనించేదై ఉండడంతో,
భవిష్యోత్తర పురాణంలో ఉటంకింపబడిన రీతిలో ప్రజలకు దేవుడు, భక్తి, ప్రపత్తి, శాస్త్రం, ఉపాసన, సాధన, పద్ధతి, సంస్కారం, ఇత్యాది వాటికి కనీసం అర్ధంకూడా తెలియకుండానే జీవితం అనేది గడిచిపోతుంది....
వీటిగురించి సరైన రీతిలో తెలిపే సద్గురువులు లేకపోవడం....
ఉన్నాసరే ఆచరించేందుకు వీలుపడని ఆధునిక ఉపాధులు / జీవనవిధానాలు కావడం,
అన్నింటిని మించి స్వచ్ఛమైన / శుభ్రమైన / సత్త్వగుణకారకమైన / బలవర్ధకమైన ఆహార లభ్యత అనేది లుప్తమైపోతున్న ఈ కలియుగ జీవనంలో జనులు ఆధ్యాత్మిక మార్గంపై మనసు కలిగిఉండడం అనేది అంతగా సంభవం కానిది......
కాబట్టి గానానికి అత్యంత తొందరగా ఆకర్షింపబడే మనిషి యొక్క మనోలక్షణాన్ని ఆధారంగా గావించి, ఆ గానం ఈశ్వర గుణగానమై, పరమాత్మ గౌణములను స్తుతించే కీర్తనమై, శాశ్వతమైన సత్ చిత్ ఆనంద స్వరూపమైన పరతత్త్వాన్ని గానంతో గ్రాహ్య పరిచే సంకీర్తనమై ఉండే సారస్వతమే ఈ కలియుగ రుగ్మతలకు దివ్యమైన ఔషధంగా సాక్షాత్తు ఆ శ్రీహరియే తన నందక ఖడ్గామ్షతో అన్నమాచార్యులవారిని భువిపై ప్రభవింపజేసి భక్తజనోద్ధరణ గావించాడు అనేది మన పెద్దలు సెలవిచ్చిన మాట.....
1. మనం తినే ఆహారంలో ఆరోవంతు మనసవ్వడంతో....శరీర దారుఢ్యం తో పాటుగా మనోవికసన / బుద్ధి వికసన కలిగించని ఆహారం కేవలం పశువులకు పెట్టిన గడ్డితో సమానమైనది.....
2. శుద్ధమైన దేశవాళి ఆవునెయ్యితో రంగరింపబడని, ఈశ్వర స్మరణతో ప్రార్ధింపబడని ఆహారానికి ఆంతర శౌచం ఉండదు....
కాబట్టి బాహ్య శౌచం లుప్తమై, ఆంతర శౌచం కూడా లుప్తమై, మనో బుద్ధి వికసన లుప్తమై, జ్ఞ్యాన సముపార్జన లుప్తమై, భక్తి శ్రద్ధలు లుప్తమై,
ఉండే జీవితానికి ఇక ఎవ్విధంగ ఈశ్వరస్పృహ అనేది లభిస్తుంది...?
3. " అన్నమాచార్యుల సంకీర్తనౌషధం " అనేది ఈశ్వర నామ గుణ గౌణ సంఘాతములతో కూడిన చక్కని తెనుగు పదసుమాల మాల కావడంతో విన్నంతమాత్రాన / పాడినంతమాత్రాన ఆంతర శౌచాన్ని అట్టే కలిగించి మనిషిని శ్రేయోమార్గం వైపునకు నడిపించే దృఢమైన అధ్యాత్మ సాధనమై ఒప్పారుతుంది....
తద్వారా జీవనోద్ధరణకు / ఆత్మోద్ధరణకు కావలసిన అధ్యాత్మ వస్తు విషయ సామాగ్రి గురించి మనిషి తనకు తాను స్వాధ్యాయం గావించే దిశగా తన జీవితగమనాన్ని చక్కదిద్దుకుంటాడు....తద్వారా ఇహపర ఉన్నతిని బడసి జీవితం తరించడంతో సార్ధక్యం చెందుతాడు....
4. చక్కని ఆహారానికి అమోఘమైన ఘుమఘుమలు తోడైనప్పుడు మనిషి శీఘ్రంగా ఆకర్షింపబడతాడు...
రసేంద్రియం తిను తిను అని ఆ ఆహారం వైపునకు మనసుని పరుగులుపెట్టిస్తుంది......
అచ్చం అదే విధంగా చక్కని దైవిక సారస్వతానికి అమోఘమైన శాస్త్రీయ రాగసౌకుమార్యం తోడైనప్పుడు మనిషి శీఘ్రంగా ఆకర్షింపబడతాడు...
కర్ణేంద్రియం విను విను అని ఆ సారస్వతం వైపునకు మనసుని పరుగులుపెట్టిస్తుంది......
ఇదే సూత్రాన్ని అన్నమాచార్యుల వారు వారి సంకీర్తనలకు ఆపాదించినారు...తద్వరా హరిభక్తి సౌలభ్యాన్ని / అనుగ్రహాన్ని మరింతగా చేరువగావించి మనలను అనుగ్రహించినారు......
5. కిలో అన్నం వేడివేడిగా సిద్ధంగా ఉన్నా సరే.....
పావుకిలోయినా చక్కని కూర / చారు / పెరుగు / మజ్జిగ లాంటివి ఉన్నప్పుడు మాత్రమే అది మనిషిని భోజనం వైపునకు ఉద్యుక్తుణ్ణి గావిస్తుంది.....
అట్లే 2+12=14 లైన్లు గల ఒక్కో చక్కని సంకీర్తనా సారస్వతానికి ఒక్కో రాగాన్ని అలది అన్నమాచార్యులవారు వారి సంకీర్తనలను మనకు ఎంతగానో ప్రియమైమ భోగ్య సామాగ్రిగా అనుగ్రహించినారు...
ఎన్ని చెప్పినా, ఎంత చెప్పిన.....తినే వారికి మాత్రమే....వాటిలోని రుచి, మధురిమ, ఆనందం, అనేవి అనుభవగ్రాహ్యమైనట్టుగా,
అన్నమాచార్యుల సంకీర్తనలను వినే వారికి మాత్రమే వాటిలో ప్రతిపాదింపబడి / దర్శింపబడే
పరతత్త్వ 'రుచి' , ఈశ్వర నామస్మరణంలోని మధురిమ, మననం లోని ఆనందం అనేవి అనుభవగ్రాహ్యమై అవధరించిన వారిని అమితంగా అనుగ్రహిస్తాయి...
శ్రీహరిసంకీర్తనం సాక్షాత్తు పరతత్త్వ పదార్ధమే అంటూ హరిసంకీర్తనా వైభవాన్ని వివరిస్తూ ఆచార్యులు అనుగ్రహించిన " చాలదా బ్రహ్మమిది సంకీర్తనం..."
అనే సంకీర్తన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు వారి కుమారులు శ్రీ గరిమెళ్ళ అనీల కుమార్ బ్రొ ఎంతో రసరమ్యంగా ఆలాపించి భక్తలోకం
" అహా...ఇది కదా సంకీర్తనం లోని గొప్పదనం...." అని మైమరచేలా, ఎవరికి వారే అనుభవగ్రాహ్యంగా తెలుసుకొనేలా ఉండే ఈ సంకీర్తన ఒకసారి వింటే విష్ణు సంకీర్తనం యొక్క మహత్తు ఎంతటి అనన్యసామాన్యమైనదో అర్ధమవుతుంది.....
( సామాన్యంగా ఉండే 3 చరణాలు కాకుండా 5 చరణాలు ఉండేలా ఆచార్యులు ఈ సంకీర్తనను రచించడం మరింత విశేషం.... )
http://annamacharya-lyrics.blogspot.com/2007/03/145chalada-brahmamidi.html?m=1
145.chAladA brahmamidi-చాలదా బ్రహ్మమిది
Audio :G.BalaKrishnaPrasad gaaru
ప|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం ||
చ|| సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
చ|| సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
చ|| జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
చ|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చ|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
in english:
pa|| cAladA brahmamidi saMkIrtanaM mIku | jAlella naDagiMcu saMkIrtanaM ||
ca|| saMtOSha karamaina saMkIrtanaM | saMtApa maNagiMcu saMkIrtanaM |
jaMtuvula rakShiMcu saMkIrtanaM | saMtatamu dalacuDI saMkIrtanaM ||
ca|| sAmajamu gAMcinadi saMkIrtanaM | sAmamuna kekkuDI saMkIrtanaM |
sAmIpya miMdariki saMkIrtanaM | sAmAnyamA viShNu saMkIrtanaM ||
ca|| jamubAri viDipiMcu saMkIrtanaM | sama buddhi voDamiMcu saMkIrtanaM |
jamaLi sauKyamuliccu saMkIrtanaM | SamadamAdula jEyu saMkIrtanaM ||
ca|| jalajAsanuni nOri saMkIrtanaM | caligoMDa sutadalacu saMkIrtanaM |
caluva gaDu nAlukaku saMkIrtanaM | calapaTTi talacuDI saMkIrtanaM ||
ca|| saravi saMpadaliccu saMkIrtanaM | sarilEni didiyapO saMkIrtanaM |
sarusa vEMkaTa viBuni saMkIrtanaM | sarugananu dalacuDI saMkIrtanaM ||
http://www.youtube.com/watch?v=SAEGduWIVvo&feature=em-uploademail
(
అన్నమాచార్యుల వైభవం గురించిన నా పాత పోస్ట్లు ఈ క్రింది లింకుల్లో లభ్యమౌను....
https://shreeguravenamah-aithavk.blogspot.com/2020/04/blog-post_22.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2018/09/610.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/05/annamaachaaryula-aavirbhaavaaniki.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/01/blog-post_18.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2020/05/612.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2022/03/shree-taallapaaka-annamaachaaryas-519th.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2021/05/shree-taallapaaka-annamaachaarya-613th.html?m=1
)
No comments:
Post a Comment