Tuesday, May 24, 2022

శ్రీ శుభకృత్ నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి / పూర్వాభాద్ర నక్షత్ర ప్రయుక్త శ్రీ హనుమద్ జన్మదినోత్సవ శుభాభినందనలు..... 🎂🍕🍦🍧😊🙏

శ్రీ శుభకృత్ నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి / పూర్వాభాద్ర నక్షత్ర ప్రయుక్త శ్రీ హనుమద్ జన్మదినోత్సవ శుభాభినందనలు..... 🎂🍕🍦🍧😊🙏

శ్రీరామరామరామేతిరమేరామేమనోరమే....
సహస్రనామతత్తుల్యం రామనామవరాననే.... 

అంటూ సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులే శ్రీరామనామ వైభవాన్ని చర్చిస్తూ లోకానికి అందివ్వడంలో ఆ తారకమంత్ర మహిమ్నతను ఎల్లరికీ విశదపరిచినారు అని కదా మనం నిత్యం శ్రీవిష్ణుసహస్రనామంలో  వింటుంటాము.....

అటువంటి పరమేశ్వరుడి రుద్ర తేజస్సే ఆంజనేయుడిగా / వాయుసుతుడిగా / కేసరి నందనుడిగా / భువిపై అవతరించి..

( పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవిగా భువిపైకి రావడం, వాయుదేవుడు ఫలాన్ని వరప్రసాదంగా ఇవ్వడం, తత్ అనుగ్రహంగా ఆంజనేయుడిగా జన్మించి, సూర్యుణ్ణి మధురఫలం గా భావించి ఆరగించే ప్రయత్నంలో దేవేంద్రుడి వజ్రాయుధ ప్రహారంతో హనుమ గా రూపాంతరం చెందిన ఆ వృత్తాంతం ఎల్లరికీ విదితమే కద...)

కిష్కింధ కాండలో ప్రత్యక్షమై అప్పటి నుండి శ్రీరాముడికి మరో లక్ష్మణుడిలా వెన్నంటే ఉండి సేవిస్తూ, యావద్ శ్రీరామ భక్త సామ్రాజ్యానికి కూడా ఆరాధ్య దైవమై వెలిగే హనుమంతుల వారి వైభవం చతుర్దశ భువనాల్లోను ఎవ్వరికీ అందని అమరవైభవం.......

వానరుడిగా జన్మించి నరులతో సఖ్యం గావించి అమరుడిగా మారిన భాగవతోత్తముడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమై, భక్తులను అన్ని విధాలా అనుగ్రహించే వరదైవంగా నెలకొన్న వైనం లోకోత్తరమైన మహిమ్నతతో అలరారే ఆంజనేయ అమరత్వ గాథను పరాశరసమ్హిత బహు సాధికారతతో తెలియజేస్తుంది అని కదా శ్రీచాగంటి సద్గురువుల ఉవాచ.....

హర తేజోవిరాజితుడిగా ప్రభవించి,
హరి తేజోవిరాజితుడిగా మానవ రూపంలో తిరుగాడిన శ్రీరాముణ్ణి ఆసాంతం సేవించి వారి సాన్నిధ్యంలో తత్ సామ్యమును బడసి, భవిష్యద్ బ్రహ్మగా అలరారే వరాన్ని గైకొని, హరిహరవిరించ్యాత్మక త్రిమూర్తి తత్త్వంతో అలరారే ప్రత్యక్ష పరతత్త్వ స్వరూపంగా అనుగ్రహించే దైవం శ్రీ ఆంజనేయస్వామి వారు......

ఉదయాద్రి, అస్తాద్రిని ఆలంబనగా గావించి సూర్యభగవానుడి దెగ్గర సకల విద్యలను గడించి, సూర్య పుత్రిక సువర్చలాదేవిని భవిష్యద్ బ్రహ్మత్త్వానికై ధర్మపత్ని గా స్వీకరించి, దేదీప్య ప్రభలతో వెలుగొందే శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామి వారిని, 
మరియు కపికుంజరులిరువురు ఏకశిలామూర్తులుగా వెలసిన వైనాన్ని, తాడుబందు వీరాంజనేయస్వామి వారి ఆలయంలో మనం దర్శించవచ్చును....

ప్రార్ధన అనే వ్యవస్థలో మనుష్యుడి సంకల్పానికి భగవద్ అనుగ్రహం ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఉన్నతమైన రీతిలో జీవితాలను తరింపజేస్తుంది....

భగవద్ భక్తి భరిత జీవితం అనేది ఒక స్థిరమైన, ప్రశాంతమైన ప్రవాహంలో సాగే దిగువ నదీప్రయాణం లాంటిది....
అది ఏదో ఒకనాడు కచ్చితంగా కైవల్య తీరానికి చేర్చే సఫలీకృత పయనం.....

భగవద్ భక్తి లుప్తమైన జీవితం అనేది ఒక అస్థిరమైన, అశాంతియుతమైన ప్రవాహంలో సాగే ఎగువ నదీప్రయాణం లాంటిది....
అది ఎప్పుడు నౌకను నిలువునా ముంచుతుందో తెలియని ప్రయాస....

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం 
అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మనివేదనం.... 
అని పిలువబడే నవవిధ భక్తి మార్గాల్లో, దాస్య భక్తికి ప్రతీకగా హనుమంతుల వారిని ఉదహరించడం శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినే ఉంటారు కద.....

ఇందులో దాస్య భక్తి అనే అత్యంత ఉన్నతమైన భక్తి మార్గంలో హనుమ యొక్క వ్యక్తిత్త్వ వైభవం లోని గొప్పదనం ఒకసారి పరికిద్దాం...... 

లౌకికంగా దాస్యం / దాసుడు / అనే పదాల వాడుక గురించి లోకంలో ఈ క్రింది విధంగా వినే ఉంటారు......

" అబ్బో...ఆయన ఈయనకు ఎంత గొప్ప దాసుడో తెలుసా....అవసరమైతే భార్యా పిల్లలను కూడా నమ్మడేమో కాని....తన దాసుడంటే ఆయనకు అంతగా తిరుగులేని నమ్మకం....."

" ఏరా...ఎవరికి దాసుడవైపోయావేంటి...
ఈ మధ్యలో అస్సలు నీ మనసు మనసులో లేదు...'

ఇవ్విధంగా ఉండేలా ఎగ్సాంపుల్స్ వినే ఉంటారు.....

అంటే  జీవితాన్ని ఇంకొకరికి అంకితం గావించిన భావనతో / గౌరవంతో ఒకరిని సదా అనుగమిస్తూ ఆరాధించడమే దాస్యం లోని ప్రత్యేకత......
తద్వారా ఆ దాసుడు ఉన్నతిని గడించి తరించడమనేది అవశ్యమైన పరిణామం.....

ఇది మనం హనుమంతుల వారి జీవితంలో ప్రస్ఫుటంగా గమనించవచ్చు......
త్రిపురాసుర వధ వృత్తాంతంలో శ్రీమహావిష్ణువుకు మాట ఇచ్చిన సందర్భం మొదలుకొని, అపర రుద్రాంశ సంభూతుడిగా భువిపై అవతరించి, హనుమంతుడిగా ప్రభవించి, " రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం " గా ఆరాధింపబడి, సీతారాములను తిరిగి ఒక్కటి గావించిన అసాధ్యసాధకుడిగా నిలిచి, భవిష్యద్ బ్రహ్మత్త్వాన్ని / చిరంజీవిత్వాన్ని / వరంగా గైకొని, శ్రీరాముడు సరయు నదీ ప్రవేశం తో తన అవతారపరిసమాప్తి గావించినా, శ్రీరామచంద్రుడి వైభవం అనేది దశదిశలా దిగ్దిగంతములకు వ్యాప్తి గావించేలా ఉండే హనుమంతుల వారి శ్రీరామ దాసత్వ మహత్వాన్ని ఈనాటికీ మనం దర్శిస్తూనే ఉన్నాము......

ఆయన వైకుంఠ రాముడిగా శంఖ చక్ర ధారిగా కలియుగంలో వరభద్రగిరీశుడిగా వెలసినా సరే,  తన ఎదురుగా ఏకఫలకంపై హనుమంతుల వారు మరియు గరుత్మంతుల వారు ఇద్దరూ కూడా పక్కపక్కనే బలిపీఠ / ధ్వజస్తంభ ప్రాంగణంలో గర్భాలయంలోని స్వామివారికి అభిముఖంగా  కొలువై ఉండడం మనం భద్రాచల పుణ్యక్షేత్రంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు గమనించవచ్చు.......
( ఇలా ఇద్దరు దాసులు స్వామివారికి అభిముఖంగా ఉండడం నేను ఇంతవరకు మరే ఆలయంలోను దర్శించలేదు.....)
దాస్య భక్తి లోని మహిమ్నత అనేది యుగాలు మారినా, తరాలు మారినా, ఇహపరాల్లోను అంతటి కీర్తిని గడింపజేస్తుంది అనేది మన సనాతనధర్మ వైభవంలో గమనించవచ్చు......

శ్రీమద్రామాయణ మహాకావ్య మంత్రార్ణవంలో అత్యంత శక్తివంతమైన జయమంత్రం గా పెద్దలచే అనాదిగా ఆరాధింపబడే ఈ క్రింది శ్లోక మంత్రంలో " दासोहं कोसलेंद्रस्य " అనే పదప్రయోగం భగవద్ దాస్యానికి గల వైభావాన్ని చెప్పకనే చెప్పుతున్నది కద......

जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः
राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः ।
दासोहं कोसलेंद्रस्य रामस्याक्लिष्टकर्मणः
हनुमान् शत्रुसैन्यानां निहंता मारुतात्मजः ॥

न रावण सहस्रं मे युद्धे प्रतिबलं भवेत्
शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः ।
अर्धयित्वा पुरीं लंकामभिवाद्य च मैथिलीं
समृद्धार्धो गमिष्यामि मिषतां सर्वरक्षसाम् ॥

ఒక ఎం.ఎల్.ఏ గారి పేరు, వైభవం ఒక ప్రాంతానికి పరితమై ఉండేదిగా కావచ్చు...... కాని ఒక ముఖ్యమంత్రి గారి పేరు, వైభవం.....
ఒక ప్రధానమంత్రి గారి పేరు, వైభవం.....
యావద్ రాష్ట్ర, దేశంలోను స్థిరీకరింపబడి ఉండే అంశం....

అచ్చం అదే విధంగా....
ఒక్కొక్క దేవతా స్వరూపం యొక్క పేరు, వైభవం....
ఒక్కొక్క ప్రాంతానికి పరితమై ఉండేదిగా కావచ్చు...... 
కాని హనుమంతుల వారి పేరు, వైభవం యావద్ లోకంలోను స్థిరీకరింపబడి ఉండే విశేషం....

ఒకానొక దాసుడి భక్తి యొక్క శక్తికి, శాశ్వతంగా వెనక్కి తిరిగి దర్శనం ప్రసాదించే వైనాన్ని ఇప్పటికీ మనం ఉడుపి శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో దర్శించవచ్చు...
అటువంటి మహిమాన్వితమైన ఆలయంలో  "ముఖ్యప్రాణ దేవర" గా ఆంజనేయస్వామి వారు వ్యాసరాయులచే విశేషమైన ఆరాధనలు అందుకొని, దక్షిణభారత దేశంలో ఒకానొక సమయంలో పరిఢవిల్లిన విజయనగర మహాసామ్రాజ్య వైభవానికి ఆ హనుమంతుడే మూలకారణం...

కర్మన్ ఘాట్ హనుమాన్, తాడ్బంద్ హనుమాన్, కేసరి హనుమాన్, ఇత్యాదిగా మన భాగ్యనగరంలో ఎన్నో చోట్ల వెలసిన హనుమంతుడి వైభవం, శక్తి ఎల్లరికీ తెలిసిందే.....

నా జీవితంలో నా బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ రోజుల్లో, నర్సాపూర్ కి  సమీపంలో ఉండే కొండాపూర్ అనే అడవి ప్రదేశంలో గిరిజనుల ఆరాధ్య దైవంగా వెలసిన హనుమంతుడి అనుగ్రహం కూడా బహు విశేషమైనది......

ఆంజనేయస్వామి వారి వైభవాన్ని బహు శక్తివంతంగా గ్రాహ్యపరిచే ఈ క్రింది అన్నమాచార్యుల సంకీర్తనలో 3వ చరణంలో దాస్య భక్తి గురించి అన్నమాచార్యుల వారు ఎంతో గొప్పగా నుడివినారు......

Audio link : Sri G. Balakrishnaprasad gaaru

http://annamacharya-lyrics.blogspot.com/2011/08/753amjaneya-anilaja-hanumamta.html?m=1

పల్లవి
ఆంజనేయ అనిలజ హనుమంత
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత
శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా

చరణం-1
తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషాముగ్రము తెచ్చు చొట
నీరోమములు కావ నిఖిల కారణము

చరణం-2
నీ మూలమునగాదె నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయను
రాముడు నీ వంకనేపొ రమణి సీతా దేవి
ప్రేమముతో మగుడా పెండ్లాడెను

చరణం-3
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా

సర్వం కొండగట్టు శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి సమేత 
ఆంజనేయస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు......🙏🎂🍕🍦🍧😊

No comments:

Post a Comment