Wednesday, November 30, 2022

శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 మార్గశిర శుద్ధ షష్ఠి / స్కందషష్ఠి శుభాభినందనలు...😊🎇🍦🍧🎂✨🍨🍕💐🍓🍎


స్కందుడు / సుబ్రహ్మణ్యుడు / కార్తికేయుడు / శరవణుడు / కుమారస్వామి / షణ్ముఖుడు /
మురుగన్ / వేలాయుధన్ / ఇలా ఆ శివపుత్రుడికి ఎన్నెన్నో పేర్లు....

సాక్షాత్తు తండ్రికే ప్రణవోపదేశం చేసిన తత్త్వవేత్త గా వినుతి కెక్కిన దైవస్వరూపం.....

ఆరుపళైవీడ్ అనే ఆరు కౌమార క్షేత్రాల అధిదైవంగా అలరారే ఆ శ్రీవల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యుడి వైభవం అనన్యసామాన్యమైనది.....

ఎన్నో జన్మల పుణ్యబలం ఉంటేనే సుబ్రహ్మణ్యుడి ఆరాధన సాధ్యమయ్యేది అని శ్రీచాగంటి సద్గురువులు ప్రవచించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

శ్రీఆదిశంకరాచార్యులచే వ్యవస్థీకరింపబడిన షణ్మతస్థాపనలో మరియు పంచాయతన ఆరాధనా సంప్రదాయంలో సుబ్రహ్మణ్యతత్త్వం కూడా ఒకటి అని అనిపించినా... ఆ సుబ్రహ్మణ్యతత్త్వం లోనే షణ్మతాల వైభవం కానవస్తుంది.... 

అందుకే కాబోలు ఆతడు షణ్ముఖుడైనాడు....

ప్రతీవైదిక క్రతువులో వెలిగించబడే దీపమే సుబ్రహ్మణ్య స్వరూపం అని శ్రీచాగంటి సద్గురువులు బోధించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

ఆతరువాత సిమ్హాసనం పై కొలువైన 
గణపతి :: గాణాపత్యం
అంబిక / శక్తి :: శాక్తేయం
శివ ::.శైవం
విష్ణు :: వైష్ణవం
సూర్య :: సౌరం

ఈ 5 దేవతా తత్త్వాలలో సుబ్రహ్మణ్య తత్త్వం అంతర్లీనంగా ఇమిడి ఉంటుంది..... 

స్కందపూర్వజః అనే నామం తో గణపతి సదా స్తుతింపబడుతున్నాడు....

శక్తి చే అనుగ్రహింపబడిన ఆయుధాన్ని ధరించినవాడిగా శక్త్యాయుధన్ / వేలాయుధన్ గా శక్తికి అభిన్నమైన వాడిగా శాక్తేయులకు స్కందుడు సదా ఆరాధ్యుడు.....

శివతేజోసంభూతుడై, శరవణుడిగా, కార్తికేయుడిగా, సుబ్రహ్మణ్యుడు వెలుగొందుతున్నాడు....

" మురుగన్, మరుమఘన్ " 
అనే వాక్యం తో ఎంతో చతురత భరితమైన సామ్యముతో శైవం వైష్ణవం వియ్యమందిన వృత్తాంతాన్ని వివరిస్తూ ఆ దేవసేన పతి యొక్క శ్రీవైష్ణవ సంబంధం ఆస్తిక లోకం చే ఆరాధింపబడే ఇతివృత్తం గురించి శ్రీచాగంటి సద్గురువులు ప్రవచించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

ప్రతినిత్యం ధగధగ వెలిగే అమేయశక్తి పుంజమైన ప్రత్యక్ష పరమాత్మ సూర్యనారాయణుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు.......
ఏ ఆదిపరాశక్తికి ఒక తాటంకమై ఆ సూర్యమండలం పరిఢవిల్లుతున్నదో  ఆ 
" తాటంకయుగళీభూత తపనోడుపమండలా..."
యొక్క మరోపేరు స్కందమాత....
కాబట్టి స్కందుడి కరకమలంలో ఒదిగిన శక్తి ఆయుధంలోని తేజస్సు సూర్యశక్తితో సామ్యము కలిగి ఉండును......

కాబట్టి స్కందుడు షణ్ముఖుడే కాదు షణ్మతములకూ అంతర్లీనంగా వెలిగే పరతత్త్వ ద్యుతి....

1. అవతలి వ్యక్తి ఎంతటి ఘనుడైనను వారిచే జయింపశక్యంకాని రీతిలో ఉండే వాక్ శక్తి / వాక్ వైభవం / వాక్ శుద్ది / వాక్ సిద్ధి......

2. అమేయమైన మేధోప్రజ్ఞ్య & కుశాగ్ర బుద్ధికౌశలం..... 

3. అనన్యసామాన్యమైన సారస్వత శక్తి....

4. సకల రోగదోషపీడా నివారక శక్తి....

5. నిరుపమాన నాయకత్వ శక్తి....

6. కేకి (మయూరము/నెమలి) వాహనుడిగా కొలువై కాలం అనే సర్పాన్ని తన అధీనంలో ఉండేలా అలరారే స్కంద స్వరూపమే కాకుండా, ప్రత్యేకంగా కుండలినీ జాగృత శక్తిగా సర్పరూపంలోనూ, ఊర్ధ్వగమన జంటనాగుల స్వరూపంలోను, ఆరాధింపబడే స్కందుడి అనుగ్రహంతో ఒనగూరే యోగశక్తులు ఏ భూమికలకూ అందని దేవతానుగ్రహము.... 
(తిరుమలలో నెలకొన్న కుమారధార తీర్థంలో స్కందుడి కాలదమన శక్తి నిక్షిప్తమై ఉన్నది..)

ఇలా ఒకటా రెండా......స్కందుడి ఆరాధన ప్రసాదించే అనుగ్రహం సాటిలేనిదై ఉండే దైవానుగ్రహం.....

'33 కోట్ల దేవతల' అని సాధారణంగా అందరు అనే 33 వర్గముల దేవతా శక్తులకు సామ్యముగా ఉండేలా 33 మహిమాన్విత శ్లోకములతో, ఎంతో గంభీరమైన  పదప్రౌఢిమతో అలరారే అత్యంత శక్తివంతమైన 
" శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం " శ్రీ ఆదిశంకరాచార్యుల వారు " తిరుచ్చెందూర్ " అనే క్షేత్రంలో రచించడం గురించి శ్రీచాగంటి సద్గురువులు వివరించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి అర్చారాధనలతో, అనుగ్రహంతో భక్తులెల్లరు ఇవ్వాల విశేషంగా తరించి ఉంటారు.....

ఎల్లరికీ స్కందషష్ఠి శుభాభినందనలు...😊🎇🍦🍧🎂✨🍨🍕💐🍓🍎

ఓం శరవణభవ ప్రసీద ప్రసీద
🙏🙏🙏🙏🙏🙏

( ఆసక్తి గల ఆస్తికులకు 
" శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం " కామెంట్స్ లో  జతపరిచాను )

Monday, November 28, 2022

శ్రీ శుభకృత్ నామ 2022 సంవత్సర కార్తీకమాసం లో శ్రీబాలాంబికా సమేత శ్రీవైదీశ్వరస్వామి వారి అనుగ్రహాన్ని బడసి తరించడం జన్మాంతర సుకృతం.... 😊🎂🍕🍨💐🍦💐🎇🍎🍓✨


శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించినవారికి గుర్తున్నట్టుగా.....
ఎంతో గంభీరమైన రీతిలో ఆ ఆదిదంపతుల దైవిక వైద్యవ్యవస్థను " శివా విశ్వాః భేషజీ.....
శివా రుద్రస్య భేషజీ...." అంటూ సద్గురువులు వివరించినారు...... 

ఈ లోకంలో ఎన్నో వృత్తులున్నాయ్....
కాని ఒక్క వైద్య వృత్తిలో ఉండే వారిని మాత్రమే 
" వైద్యో నారాయణో హరిః..." అంటూ సర్వే సర్వత్రా గౌరవించడం వినే ఉంటారు....... 

ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు ఉన్నాయో తెలియనంతగా కొన్ని వేలకోట్లు పోగేసుకున్న బడామనుషులు కూడా....
" నమ్మిన బంటులా నా వెంటే ఉన్నందుకు నా సొంత వారిగా భావించి ఎన్నెన్నో ఆస్తులు రాసిచ్చినా కూడా, నా ఉన్నతిని ఓర్వని ఈ బద్మాష్ ** నాకు ఇడ్లీలు పెట్టే వారిని సైతం తన గుప్పిట్లో పెట్టుకొని నా అరోగ్యం మొత్తం మెల్లమెల్లగా పాడుచేసి, నన్ను ఓర్వని వారితో చేతులు కలిపి వేధిస్తోంది....దయచేసి నాకు మంచి ఆహారాన్ని, వైద్యాన్ని అందించి కాపాడండి...."
అంటూ.....జీవితంలో ఎవ్వరికీ తలవంచని మహాసామ్రాజ్ఞిలా బ్రతికిన వారు కూడా వైద్యులకు వినమ్రంగా నమస్కరించి వేడుకున్న సందర్భాల గురించి మనం విన్నప్పుడు.....
నిజంగా వైద్యులు ఎంతటి మహానుభావులో కద అని అనిపించకమానదు......

సామాన్య లౌకిక వైద్య వ్యవస్థలో బాగమైన మంచి డాక్టర్లనే మనం ఇంతగా గౌరవిస్తామే....
అటువంటిది యావద్ వైశ్విక వ్యవస్థకు శ్రేయస్సును సమకూర్చే శివపార్వతుల వైద్యవ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుందో భక్తలోకానికి విదితమే...... 

శ్రీలలితాసహస్రనామావళిలో

సృష్టికర్త్రీ బ్రహ్మరూపా....
గోప్త్రీ గోవిందరూపిణీ.... 
సమ్హారిణీరుద్రరూపా.....
తిరోధానకరీశ్వరి......
సదాశివానుగ్రహదా.... 
పంచకృత్యపరాయణా......గా ఆ 
" శివా విశ్వాః భేషజీ....." స్తుతింపబడుతోంది.....కద.....

బ్రహ్మ గా ఉండి సృష్టి...
గోవిందుడి గా ఉండి స్థితి... 
రుద్రుడి గా ఉండి సమ్హారం...
ఈశ్వరి గా ఉండి తిరోధానం...
సదాశివ గా ఉండి అనుగ్రహం... 

అనే ఈ 5 వైశ్విక కృత్యాలను ఆద్యంతములు లేక అలరారే ఏ ఆదిపరాశక్తి నిర్వహిస్తున్నదో....,
ఆ ఆదిపరాశక్తే "శివా" గా నుతింపబడుతూ వైశ్విక వైద్యవ్యవస్థను శాసిస్తున్నది.....

" సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం " అనే శ్రీఆదిశంకరుల అనుగ్రహమైన సారస్వతఝరిని శ్రీచాగంటి సద్గురువులు ఎంతో వైభవభరితంగా వివరించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

శివ, శివా అనే నామాలను గట్టిగా పలికినప్పుడు గమనించండి... శివా అనే నామం ఉచ్చరించినప్పుడు సహజంగానే నాభి నుండి నాదమయి గా శక్తిప్రకటనం గావింపబడుతుంది...

నాదశక్తే జీవశక్తి అని ఆనాటి మన ఆర్ష వైదిక సంస్కృతిని ఆరాధించే ప్రాచ్య వైద్యుల దెగ్గరి నుండి ఈనాటి మన ఆధునిక వైద్యులవరకు...
ఒక పేషేంట్ దెగ్గరికి రాగానే ప్రప్రథమంగా వారి నాడి / పల్స్ మరియు హృదయలయను / హార్ట్బీట్ ను చెక్ చేస్తారు....
ఉండవలసిన నిర్ణీత స్థాయిలో ఆ కీలకసూచీలు లేకపోతే శరీరంలో ఏవో అవాంఛిత దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి అని అర్ధం.....

శరీరంలో ఏభాగానికి ఎవ్విధమైన ఇబ్బంది కలుగుతున్నది అని రోగిని ప్రశ్నించి ఆతదుపరి వైద్యశాస్త్రానుగుణంగా వారివారి ఎక్స్పీరియన్స్ మరియు మెడికల్ ప్రోవెస్ కి అనుగుణంగా సదరు వైద్యులు రోగికి చికిత్స అందించడం అనే పద్ధతిని మన లౌకిక ప్రపంచంలో గమనించే ఉంటారు....

అదే విధంగా పరమేశ్వరుడు, పరమేశ్వరి, వారి వారి పరతత్త్వ మహత్తును వైద్యశక్తిగా ప్రకటితం గావించే పుణ్యక్షేత్రాల్లో..... 

[ అనగా ఫర్ ఎగ్సాంపుల్....

తమిళనాడు లోని చిదంబర పంచభూత ఆకాశలింగ క్షేత్రానికి దెగ్గర్లో ఉండే శ్రీవైదీశ్వర ధన్వంతరి క్షేత్రంలో కొలువైన శ్రీబాలాంబికా / తయ్యల్నాయగి  సమేత వైదీశ్వర స్వామి వారు...,
వైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్రం...,
ఆరోగ్యప్రదాత గా ఆరాధింపబడే సూర్యనారాయణుడు వెలసిన క్షేత్రాలు......,
(అరసవిల్లి, కోణార్క్, తిరుచానూర్ సూర్య దేవాలయం, ఇత్యాది క్షేత్రాలు...) ]

ఆ శివా రుద్రస్య భేషజీ యొక్క వైద్యశక్తి ప్రస్ఫుటమైన అనుగ్రహంగా భక్తులకు లభించడం అనేది విశ్వాసం గల భక్తులు గమనించవచ్చు.....

"శివా విశ్వాః భేషజీ "అనే వైశ్విక శక్తి ప్రకటనం గురించిన గహనమైన తత్త్వం గురించి కాసేపు పక్కనపెట్టండి...

NASA సైంటిస్టులు ఆ అంతరిక్ష పరిరక్షక, పోషక శక్తి గురించిన వివరాల కోసం ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు... "సూర్యుడి నుండి నిరంతరాయంగా వెలువడే తరంగాలు ఓం అనే శబ్దాన్ని వినిపిస్తున్నాయి..."
అని మాత్రమే చెప్పగలిగారు......
అంతకుమించి ఆ భానుమండల మధ్యస్థయై కొలువైన భగమాలిని సృజించే భైరవి శక్తి గురించి వాళ్ళు కనుక్కోలేకపోయారు....

"సశాస్త్రీయ సవైదిక ప్రతిష్ఠాపనతో కొలువైన 
ఒక ఆగమోక్త మూర్తి నుండి ప్రసరింపబడే పరారుణ
కాంతి తరంగాలు....
మరియు
ఒక పరిధి గల ప్రాకారంలో సృజింపబడి, వ్యాప్తిగావింపబడి అక్కడ ఉండే వ్యక్తి, వస్తు సముదాయంతో సంగమించే వివిధ శబ్ద / శక్తి తరంగాలు..."

అనే కాన్సెప్ట్ పై ఆధారపడి ఉండే ఆద్యంతరహితమైన వైశ్విక దైవిక వ్యవస్థ మన సనాతనధర్మాంతర్గతమైన దైవారాధనా వ్యవస్థ..... 

స్విచ్ ఆన్ చేయగానే 2.4 GHz పౌనఃపున్యం తో ప్రసరింపబడే సూక్ష్మతరంగాల ద్వారా నిన్నమొన్న తయారైన సమోసాలను, పీట్జాబర్గర్లను మైక్రోవేవ్ ఒవెన్ లో క్షణాల్లో వేడిచేసుకొని తినే ఆధునిక మనిషికి.....
ఏనాటినుండి పరిఢవిల్లుతున్నదో చెప్పలేని ఒక దైవిక వ్యవస్థకూడా అత్యధిక తరంగదైర్ఘ్యంతో కూడిన అటువంటి సిద్ధాంతాలకు అనుగుణమైన రీతిలోనే పనిచేస్తుంది అని అంటే ఇదంతా ఏదో పాతచింతకాయ పచ్చడి అన్నట్టుగా తక్కువచేసి మాట్లాడడం ఎంతవిచిత్రమో కద...!

ఏదేమైనా ఎవరి విశ్వాసం వారికి గొప్ప....
ఎవరి నమ్మకం వారికి బలం...
ఎవరికి కలిగిన స్వాంతన వారికి కలిగిన అనుగ్రహం....
ఎవరికి లభించిన ప్రశాంతత వారి యొక్క సుఖశాంతభరితజీవనం....

శ్రీ శుభకృత్ నామ 2022 సంవత్సర కార్తీకమాసం లో శ్రీబాలాంబికా సమేత శ్రీవైదీశ్వరస్వామి వారి అనుగ్రహాన్ని బడసి తరించడం జన్మాంతర సుకృతం.... 😊🎂🍕🍨💐🍦💐🎇🍎🍓✨

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించినవారికి గుర్తున్నట్టుగా.....
ఎంతో గంభీరమైన రీతిలో ఆ ఆదిదంపతుల దైవిక వైద్యవ్యవస్థను " శివా విశ్వాః భేషజీ.....
శివా రుద్రస్య భేషజీ...." అంటూ సద్గురువులు వివరించినారు...... 

ఈ లోకంలో ఎన్నో వృత్తులున్నాయ్....
కాని ఒక్క వైద్య వృత్తిలో ఉండే వారిని మాత్రమే 
" వైద్యో నారాయణో హరిః..." అంటూ సర్వే సర్వత్రా గౌరవించడం వినే ఉంటారు....... 

ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు ఉన్నాయో తెలియనంతగా కొన్ని వేలకోట్లు పోగేసుకున్న బడామనుషులు కూడా....
" నమ్మిన బంటులా నా వెంటే ఉన్నందుకు నా సొంత వారిగా భావించి ఎన్నెన్నో ఆస్తులు రాసిచ్చినా కూడా, నా ఉన్నతిని ఓర్వని ఈ బద్మాష్ ** నాకు ఇడ్లీలు పెట్టే వారిని సైతం తన గుప్పిట్లో పెట్టుకొని నా అరోగ్యం మొత్తం మెల్లమెల్లగా పాడుచేసి, నన్ను ఓర్వని వారితో చేతులు కలిపి వేధిస్తోంది....దయచేసి నాకు మంచి ఆహారాన్ని, వైద్యాన్ని అందించి కాపాడండి...."
అంటూ.....జీవితంలో ఎవ్వరికీ తలవంచని మహాసామ్రాజ్ఞిలా బ్రతికిన వారు కూడా వైద్యులకు వినమ్రంగా నమస్కరించి వేడుకున్న సందర్భాల గురించి మనం విన్నప్పుడు.....
నిజంగా వైద్యులు ఎంతటి మహానుభావులో కద అని అనిపించకమానదు......

సామాన్య లౌకిక వైద్య వ్యవస్థలో బాగమైన మంచి డాక్టర్లనే మనం ఇంతగా గౌరవిస్తామే....
అటువంటిది యావద్ వైశ్విక వ్యవస్థకు శ్రేయస్సును సమకూర్చే శివపార్వతుల వైద్యవ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుందో భక్తలోకానికి విదితమే...... 

శ్రీలలితాసహస్రనామావళిలో

సృష్టికర్త్రీ బ్రహ్మరూపా....
గోప్త్రీ గోవిందరూపిణీ.... 
సమ్హారిణీరుద్రరూపా.....
తిరోధానకరీశ్వరి......
సదాశివానుగ్రహదా.... 
పంచకృత్యపరాయణా......గా ఆ 
" శివా విశ్వాః భేషజీ....." స్తుతింపబడుతోంది.....కద.....

బ్రహ్మ గా ఉండి సృష్టి...
గోవిందుడి గా ఉండి స్థితి... 
రుద్రుడి గా ఉండి సమ్హారం...
ఈశ్వరి గా ఉండి తిరోధానం...
సదాశివ గా ఉండి అనుగ్రహం... 

అనే ఈ 5 వైశ్విక కృత్యాలను ఆద్యంతములు లేక అలరారే ఏ ఆదిపరాశక్తి నిర్వహిస్తున్నదో....,
ఆ ఆదిపరాశక్తే "శివా" గా నుతింపబడుతూ వైశ్విక వైద్యవ్యవస్థను శాసిస్తున్నది.....

" సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం " అనే శ్రీఆదిశంకరుల అనుగ్రహమైన సారస్వతఝరిని శ్రీచాగంటి సద్గురువులు ఎంతో వైభవభరితంగా వివరించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....

శివ, శివా అనే నామాలను గట్టిగా పలికినప్పుడు గమనించండి... శివా అనే నామం ఉచ్చరించినప్పుడు సహజంగానే నాభి నుండి నాదమయి గా శక్తిప్రకటనం గావింపబడుతుంది...

నాదశక్తే జీవశక్తి అని ఆనాటి మన ఆర్ష వైదిక సంస్కృతిని ఆరాధించే ప్రాచ్య వైద్యుల దెగ్గరి నుండి ఈనాటి మన ఆధునిక వైద్యులవరకు కూడా ఎల్లరూ విశ్వసించిన సిద్ధాంతసత్యం...
ఒక పేషేంట్ దెగ్గరికి రాగానే ప్రప్రథమంగా వారి నాడి / పల్స్ మరియు హృదయలయను / హార్ట్బీట్ ను చెక్ చేస్తారు....
ఉండవలసిన నిర్ణీత స్థాయిలో ఆ కీలకసూచీలు లేకపోతే శరీరంలో ఏవో అవాంఛిత దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి అని అర్ధం.....

శరీరంలో ఏభాగానికి ఎవ్విధమైన ఇబ్బంది కలుగుతున్నది అని రోగిని ప్రశ్నించి ఆతదుపరి వైద్యశాస్త్రానుగుణంగా వారివారి ఎక్స్పీరియన్స్ మరియు మెడికల్ ప్రోవెస్ కి అనుగుణంగా సదరు వైద్యులు రోగికి చికిత్స అందించడం అనే పద్ధతిని మన లౌకిక ప్రపంచంలో గమనించే ఉంటారు....

అదే విధంగా పరమేశ్వరుడు, పరమేశ్వరి, వారి వారి పరతత్త్వ మహత్తును వైద్యశక్తిగా ప్రకటితం గావించే పుణ్యక్షేత్రాల్లో..... 

[ అనగా, ఫర్ ఎగ్సాంపుల్....
తమిళనాడు లోని చిదంబర పంచభూత ఆకాశలింగ క్షేత్రానికి దెగ్గర్లో ఉండే శ్రీవైదీశ్వర ధన్వంతరి క్షేత్రంలో కొలువైన శ్రీబాలాంబికా / తయ్యల్నాయగి  సమేత శ్రీవైదీశ్వర స్వామి వారు...,
శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్రం...,
ఆరోగ్యప్రదాత గా ఆరాధింపబడే సూర్యనారాయణుడు వెలసిన క్షేత్రాలు......,
(అరసవిల్లి, కోణార్క్, తిరుచానూర్ సూర్య దేవాలయం, ఇత్యాది క్షేత్రాలు...) ]

ఆ శివా రుద్రస్య భేషజీ యొక్క వైద్యశక్తి ప్రస్ఫుటమైన అనుగ్రహంగా భక్తులకు లభించడం అనేది విశ్వాసం గల భక్తులు గమనించవచ్చు.....

"శివా విశ్వాః భేషజీ "అనే వైశ్విక శక్తి ప్రకటనం గురించిన గహనమైన తత్త్వం గురించి కాసేపు పక్కనపెట్టండి...

NASA సైంటిస్టులు ఆ అంతరిక్ష పరిరక్షక, పోషక శక్తి గురించిన వివరాల కోసం ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు... "సూర్యుడి నుండి నిరంతరాయంగా వెలువడే తరంగాలు ఓం అనే శబ్దాన్ని వినిపిస్తున్నాయి..."
అని మాత్రమే చెప్పగలిగారు......
అంతకుమించి ఆ భానుమండల మధ్యస్థయై కొలువైన భగమాలిని సృజించే భైరవి శక్తి గురించి వాళ్ళు కనుక్కోలేకపోయారు....

"సశాస్త్రీయ సవైదిక ప్రతిష్ఠాపనతో కొలువైన 
ఒక ఆగమోక్త మూర్తి నుండి ప్రసరింపబడే పరారుణ
కాంతి తరంగాలు....
మరియు
ఒక పరిధి గల ప్రాకారంలో సృజింపబడి, వ్యాప్తిగావింపబడి అక్కడ ఉండే వ్యక్తి, వస్తు సముదాయంతో సంగమించే వివిధ శబ్ద / శక్తి తరంగాలు..."
అనే కాన్సెప్ట్ పై ఆధారపడి ఉండే ఆద్యంతరహితమైన వైశ్విక దైవిక వ్యవస్థ మన సనాతనధర్మాంతర్గతమైన దైవారాధనా వ్యవస్థ..... 

స్విచ్ ఆన్ చేయగానే 2.4 GHz పౌనఃపున్యం తో ప్రసరింపబడే సూక్ష్మతరంగాల ద్వారా నిన్నమొన్న తయారైన సమోసాలను, పీట్జాబర్గర్లను మైక్రోవేవ్ ఒవెన్ లో క్షణాల్లో వేడిచేసుకొని తినే ఆధునిక మనిషికి.....,
ఏనాటినుండి పరిఢవిల్లుతున్నదో చెప్పలేని ఒక దైవిక వ్యవస్థకూడా అత్యధిక తరంగదైర్ఘ్యంతో కూడిన అటువంటి సిద్ధాంతాలకు అనుగుణమైన రీతిలోనే పనిచేస్తుంది అని అంటే ఇదంతా ఏదో పాతచింతకాయ పచ్చడి అన్నట్టుగా తక్కువచేసి మాట్లాడడం ఎంతవిచిత్రమో కద...!

ఏదేమైనా ఎవరి విశ్వాసం వారికి గొప్ప....
ఎవరి నమ్మకం వారికి బలం...
ఎవరికి కలిగిన స్వాంతన వారికి కలిగిన అనుగ్రహం....
ఎవరికి లభించిన ప్రశాంతత వారికి సుఖసంతోషకారకం....

లయకర్తగా నుతింపబడే హరుడు ఏమి హరించగలడు అనే ప్రశ్న సంధింపబడితే దానికి సమాధానం....

సదరు క్షేత్రంలో వెలసి, పురాణైతిహ్యానుగుణంగా వెలిగే హరవిలాసంతో కొలువైన హరుడు....
దుఃఖాలను హరిస్తాడు....
ఈతిబాధలను హరిస్తాడు...
రోగాలను హరిస్తాడు....
పాపాలను హరిస్తాడు....
అజ్ఞ్యానాన్ని హరిస్తాడు....
తద్వారా అసంఖ్యాక జన్మపరంపరగా సాగే సదరు జీవుడి జీవయాత్రావశ్యకతను హరించి జన్మరాహిత్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు...
ఆ విశ్వాసం తో ఆరాధించిననాడు.....

"శాస్త్రోక్తంగా నా అభిషేకం చేస్తే ఎంత ఫలితమో శ్రద్ధగా దర్శించినా కూడా అంతే ఫలితం..." అనే గురువాక్కుని నమ్మినవాడు....సోమప్రదక్షిణంతో త్రికరణశుద్ధిగా నన్ను నమస్కరించిన పుణ్యాన్ని ఆగామికర్మ జనిత సద్యోపుణ్యఫలితంగా మార్చి వీడి బాధకు కారణమైన శ్వాసకోశ రుగ్మత యొక్క తీవ్రత తగ్గిస్తేనే కద వీడు మరలా నన్ను నమ్మి నమస్కరించేది అనే హృదయవైశాల్యం గలవాడు కాబట్టే ఆతడు శ్రీవల్లీదేవసేనా సహిత శ్రీసెల్వముత్తుకుమారస్వామి సమేత, శ్రీబాలాంబికా / తయ్యల్ నాయగి సమేత,
శ్రీ వైదీశ్వరుడై అలరారుచున్నాడు...!

ఓం నమో వైదీశ్వర ప్రసీద ప్రసీద.....🙏🙏🙏🙏🙏

శ్రీ వైథ్యనాథ అష్టకం

శ్రీ రామసౌమిత్రి జటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ |
శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||

గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే |
సమస్త దేవైరభిపూజితాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||

భక్తఃప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ |
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||

ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివందితాయ |
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ |
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||

వేదాంతవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయపదాంబుజాయ |
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||

స్వతీర్థ మృద్భస్మ భృతాంగభాజాం పిశాచ దుఃఖార్తి భయాపహాయ |
ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ స్రక్గంధ భస్మాద్యభి శోభితాయ |
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ ||

"ēkā̍ cha mē ti̠sraścha̍ mē̠ pañcha̍ cha mē sa̠pta cha̍ mē̠ nava̍ cha ma̠ ēkā̍daśa cha mē̠ trayō̍daśa cha mē̠...."


"ēkā̍ cha mē ti̠sraścha̍ mē̠ pañcha̍ cha mē sa̠pta cha̍ mē̠ nava̍ cha ma̠ ēkā̍daśa cha mē̠ trayō̍daśa cha mē̠...."

and so goes on the Shree RudraChamaka paaraayanam.....

as it keeps going on...it is not the Parameshwara in front of us who is all that is being extolled as "Eakadasha chamay Trayoadasha chamay......" 
it is indeed our very own soul that becomes one with the Parameshwara ShivaLinga swaroopam being worshiped in-front of us after the Adwaita Siddhi gets conferred upon us as we get engrossed in the Abhishekam / Ablution ritual in-tune to our Bhakti and ChittaShuddhi....

i.e., when we are extolling Parameshwara saying..... 
"You are 11....You are 13.....You are this...
You are that...."
and so on and so forth .....
It is indeed us who are becoming.... 
"I am 11...I am 13.....I am this...I am that...."
and so on and so forth .....

and thus the "mighty" "NirvaanaShatkam" by HH Shree AadiShankaraachaarya states....

manobuddhyahaṅkāra cittāni nāhaṃ
na ca śrotrajihve na ca ghrāṇanetre .
na ca vyoma bhūmirna tejo na vāyuḥ
cidānandarūpaḥ śivo’ham śivo’ham ||1||

Neither am I the mind nor intelligence or ego,
Neither am I the organs of hearing (ears), nor that of tasting (tongue), smelling (nose) or seeing (eyes),
Neither am I the sky, nor the earth, neither the fire nor the air,
I am Shiva, the supreme auspiciousness of the nature of consciousness-bliss.
I am (Shiva) the auspiciousness.

Hence I am 11 😊🎂🍦🍧🍕🍨

Clarity is a consequence of handling your confusion consciously......💐


అందులో కొందరు బౌద్ధిక పరిణత గల వారు, విజ్ఞ్యులు, అన్ని రకాలుగా సహాయం చేసే సహృదయులై ఉండగా....
కొందరు హాయ్ బాయ్ అనే సామాన్యులై ఉండగా...
కొందరు కొన్ని కాసుల కోసం కక్కుర్తిపడే పిచ్చి కుక్కల్లా ప్రవర్తిస్తూ సాటి మనుష్యులను హింసించే అధములుగా ఉండగా,

వీరిలో ఒక్కొక్కరు వేరువేరుగా ఎవరికి వారుగా ఒక్కోదెగ్గర ఉండి....
కొందరు పరస్పర ప్రత్యర్ధులుగా ఉన్నప్పుడు,
ఒకరు గావించిన మూర్ఖపు పనులకు వేరొకరిని తప్పుపట్టడం ఎట్లు సమంజసం.....?

ఫర్ ఎగ్సాంపుల్, ఒకే ** కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను తీసుకుంటే.....
వ** *ధి ఒక పార్టీకి చెందిన వారు...
రా** *ధి ఒక పార్టీకి చెందిన వారు.....

వీరిలో ఒకరు చేసిన పనులకు ఇంకొకరిని, లేదా ** అనే పేరు సఫిక్స్ గా గల ఒక ఫ్యామిలి/గ్రూప్ వారందరినీ కూడా తప్పుపట్టడం ఏ విధంగానూ సమంజసం కాదు......

కాబట్టి ఎవరు దేనికి బాధ్యులో తెలుసుకొని వారిని మాత్రమే ఫోకస్ చేయడం భావ్యంగా ఉంటుంది కాని ఒకే ఇంటిపేరు గల వారందరినీ ఒకేగాటనకట్టడం ఎవ్విధంగానూ సరికాదు.....

హోళీ ఆట ఆడుతున్నప్పుడు.....
కొందరు పసుపురంగు పూసుకున్న వారు ఇబ్బంది కలిగించినందుకు.....
ఇక పసుపురంగు పూసుకున్న వారందరినీ కూడా తప్పుపట్టడం అనేది కుదరని పని..... 

ఎవ్వడైతే ఓర్వలేని తనంతో కుళ్ళుబోతు వేషాలు వేస్తున్నడో, దోపిడీ కుట్రలు రచిస్తున్నడో వాడి అసలు రంగును బయటపెట్టి నిలదీయడం సరి....... 
అంతేకాని వాడొక్కడికోసం ఇతర మంచివారిని ధూర్తులుగా భావించడం సారికాదు అనేది ఇక్కడి సారాంశం.....

ఒక వ్యక్తి తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తన ఉన్నతి / అభివృద్ధి మేరకు విజ్ఞ్యులను సంప్రదించి చక్కబెట్టుకునే పనిలో ఉండగా,
మధ్యలో అనవసరంగా దూరి ఎందుకు, ఏంటి అని ఎవడైనా ప్రశ్నిస్తే వాడే అసలైన దొంగ / మూలఘాతి అని లోకానికి బట్టబయలౌతుంది......

శ్రీకరమైన 2022 బాలలదినోత్సవ శుభాభినందనలు....!🍎🍓🎇🍦🍕🍨😊


"పిల్లలు దేవుడూ చల్లనివారే...
కల్లకపటమెరుగని కరుణామయులే...... "
అనే పాట వినే ఉంటారు..... 

బాలలను భగవద్ స్వరూపులుగా ఆరాధించే భారతీయ సంస్కృతి యొక్క మహోన్నత వైభవం ఎల్లరికీ విదితమే.....

ఒక చిన్న మామిడి మొక్క యోగ్యులైన సమ్రక్షకుల చెంత ఉన్ననాడు అది ఎంతో చక్కగా పెరిగి ఎన్నెన్నో మధురసభరిత మామిడి ఫలాలను అందించే మహా వృక్షమై పరిఢవిల్లుతుంది..... 

అదే చిన్న మామిడి మొక్క ధూర్తుల వద్ద ఉన్ననాడు ప్రతీ పండగకు కాలవసిన ఓ 4 మామిడాకుల కోసం ఆ మొక్కను సరిగ్గా ఎదగనివ్వరు.....

అచ్చం అదే విధంగా బాలలు కూడా..... 
వారిలోని గొప్పదనాన్ని గుర్తించి, గౌరవించి, ప్రోత్సహించే వారి సమ్రక్షణలో ఉన్ననాడు ఆ పిల్లలు యావద్ ప్రపంచం గౌరవించే భావిభారత పౌరులుగా అభివృద్ధిని సాధిస్తారు.....

వారిని నిత్యం వేధిస్తూ, అవమానిస్తూ, కించపరుస్తూ, నిర్లక్ష్యంతో చూసే వాతావరణంలో ఉన్నప్పుడు పిల్లలు సమాజానికి ఏ విధంగానూ ఉపకరించని కలుపుమొక్కలుగానే మిగులుతారు.......

(బురదలో వికసించే పద్మంలా, ఎక్కడో కొద్ది మంది మాత్రమే ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నాసరే ఈశ్వరానుగ్రహంతో, భక్తభాగవత సహాయసహకారంతో జీవితంలో ఉన్నతిని సాధించగలరు.....)

పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా......
డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పోలీసులు, ప్రభుత్వాధికారులు ఇత్యాదిగా కాకపోయినా పర్వాలేదు..... 
1. సద్వర్తనులైన సాటి మనుషులను గౌరవించగలిగే సంస్కారబలం......
2. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జీవించగలిగే బౌద్ధిక పరిణత.....
3. స్వయంకృషితో జీవితంలో అభివృద్ధిని సాధించగలిగే దక్షత......
4. చిన్న చిన్న విషయాల్లోనే విషయమంతా గ్రాహ్యమయ్యేలా నిరంతర వికసిత మేధో సంపత్తితో జీవించగలిగే ప్రజ్ఞ్య......
5. ప్రశాంతంగా బ్రతుకుతూ ఇతరులను కూడా ప్రశాంతంగా బ్రతనివ్వడం అనే కనీస ధర్మాన్ని పద్ధతిగా పాటించగలిగే విచక్షణ...

ఇత్యాదివన్నీ కూడా పిల్లల్లో బాల్యంలోనే పాదుకొల్పబడినప్పుడు వారు లోకం మెచ్చే మాన్యులుగా రాణిస్తారు..... 

భారతభాగ్య విధాతలకు, భావి భారత పౌరులందరికీ 2022 బాలలదినోత్సవ శుభాభినందనలు...
🍨🎂🍧💐🍕😊🎇🍦🍎🍓🍇✨🎄🌺🌷

శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు, తి.తి.దే ఆస్థానవిద్వాంసులు, అన్నమాచార్య సంకీర్తనా ప్రచారయజ్ఞ్య కోవిదులకు వారి శ్రీశుభకృత్ నామ సంవత్సర జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులు....🙏😊


పదకవితాపితామహులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు శ్రీవేంకటేశ్వరుని పై భక్తి, ప్రేమ, అనురాగం తో కూడిన మహోన్నత భావసంపదతో సృజించిన పదసుమాలతో ఎవ్విధంగా శ్రీనివాసుని శ్రీపాదపద్మములను అర్చించి తరించినారో, అంతటి మహోన్నతనైన భావ రాగ స్వర సంపదతో మన ఈ కాలంలో మరో అన్నమయ్య గా కొలువై శ్రీవారి శ్రీపాదపద్మములను వారి ఎన్నెన్నో సంకీర్తనా సౌగంధికలతో నిత్యం అర్చిస్తూ వారు తరిస్తూ ఎల్లరినీ తరింపజేస్తున్న మహానుభావులు శ్రీగరిమెళ్ళ గురువు గారు.......
వారి అధ్యాత్మ భక్తి సంగీత కృషికి ఎన్ని భారతరత్న పురస్కారాలు ఇచ్చినా సరిపోవు.....
అంతటి అనన్యసామాన్యమైన నాణ్యమైన స్వఛ్ఛమైన మధురమైన సౌకుమార్య స్వర సంపద వారిది.....

ఫర్ ఎగ్సాంపుల్, వారు ఆలపించిన వందలాది మధురమైన సంకీర్తనల్లో అత్యంత రమణీయమైన ఒకానొక సంకీర్తన, "అమృతవర్షిణి" రాగంలో వారు ఆలపించిన " త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు...." అనే సంకీర్తనలో.....
" తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి....." అనే ఆలాపన ఎంతమంది భక్తుల హృదయలయలను హత్తుకుందో లెక్కేలేదు......

మరియు " యీపాదమే కదా..." అనే మరో అత్యత్భుతమైన సంకీర్తనలో..... 

"యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపైనిరవైనది ||"

అనే వారి ఆలాపన ఎంతటి భావగాంభీర్యాన్ని వ్యక్తపరుస్తుందో అనేది భక్తలోకానికి విదితమే.....

మరియు "మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును..." అనే మరో అత్యత్భుత సంకీర్తనలో...

"సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు 
కరుణాకరునకును కాత్యాయనీనుతకలితనామునకు"

అనే ఆలాపన ఎంతటి గగనగంభీరమైన రీతిలో ఉంటుందో భక్తులెల్లరికీ విదితమే....!

హైదరబాద్ నల్లకుంట శ్రీశంకర మఠంలో వారికి  స్వర్ణగండపెండేర అలంకరణోత్సవంలో మరియు తిరుమల ఆలయ సన్నిధిలో ఆలాపన అనంతరం, వారి అనుగ్రహ ఆశీస్సులను ప్రత్యక్షంగా అందుకోవడం నా జన్మాంతర సుకృతం.....

ఆహారం, ఆహార్యం, వాతావరణం, సాంగత్యం, వ్యాపకం, ఔషధం, సంగీతం వీటి వల్ల మనిషి చాలా ప్రభావితం అవుతాడు....
వీటిలో సంగీతం ప్రత్యేకించి సంప్రదాయ కర్ణాటక సంగీతం యొక్క శక్తి అనంతమైనది..... 
అది ఎన్ని మహత్తులనైనను చూపగలదు.....
ఎంతటి మేధోసంపత్తినైనను సిద్ధింపజేయగలదు... 
ఎంతో ప్రశాంతతను అనుగ్రహించగలదు.....

అత్యద్భుతంగా మనిషి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దగల రాగౌషధరసగుళికలైన అన్నమాచార్యుల సంకీర్తనలకు గల శక్తి అనంతమైనది....
ఆ సంకీర్తనల్లో నిక్షిప్తమైన సాహితీ శక్తిని సారసభావరంజితమైన రాగాలాపనతో లోకానికి అందించే వారి సంకీర్తనాయజ్ఞ్యం నిరంతరంగా కొనసాగుతూ భక్తులెల్లరి జీవితాల్లో అవి శాశ్వతమైన ఆనంద కారకాలుగా కలకాలం పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తూ.....గురువుగారి పాదపద్మములకు సవినయ సాంజలిబంధక జన్మదిన శుభాభినందనా నమస్సుమాంజలి.... 😊🍎🍦🎂🍨💐🎇🍕🍨🙏

శ్రీకరమైన 2022 కార్తిక శుద్ధ చతుర్దశి ప్రయుక్త రెండవ కార్తిక సోమవారం శుభాభినందనలు.....


ఉత్తరాయణంలో మాఘపంచకం ఎంతటి ప్రశస్తమైనదో దక్షిణాయణంలో కార్తిక మాసానిది అంతటి ప్రశస్తి...
కార్తిక దీపారాధన....
కార్తిక తీర్థస్నానం...
కార్తిక పౌర్ణమి.....
కార్తిక శుద్ధ ఏకాదశి/క్షీరాబ్ధి ద్వాదశి

ఇత్యాదిగా కార్తిక మాసం మొత్తం కూడా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్న హరిహరప్రీతికరమైన పరమపవిత్ర మాసం....

కృత్తికలచే పాలింపబడిన వాడు కాబట్టి కార్తికేయుడు గా కుమారస్వామి పేర్గాంచడం భక్తలోకానికి విదితమే....

27 నక్షత్రాల్లో చంద్రుడు కూడుకుంటూ సాగే అశ్విని, కృత్తిక, మృగశిర, పుష్యమి, మఖాది 12 నక్షత్రాల్లో కృత్తికది బహు విశేషమైన స్థానం.....

నక్షత్ర సూక్తమ్ 
తైత్తిరీయ సంహితాః | కాండ 3 ప్రపాఠకః – 5 అనువాకమ్ – 1 
ఓం || అగ్నిర్నః’ పాతు కృత్తి’కాః | నక్ష’త్రం దేవమి’ంద్రియమ్ | ఇదమా’సాం విచక్షణమ్ | హవిరాసం జు’హోతన | యస్య భాంతి’ రశ్మయో యస్య’ కేతవః’ | యస్యేమా విశ్వా భువ’నానిసర్వా” | స కృత్తి’కాభిరభిసంవసా’నః | అగ్నిర్నో’ దేవస్సు’వితే ద’ధాతు || 1 ||

అని సనాతనధర్మం కృత్తికానక్షత్రాన్ని స్తుతిస్తున్నది..... 

అగ్ని సంబంధమైన నక్షత్రం కావడం,
అధిదేవత సూర్యుడిగాగల నక్షత్రం కావడం వల్ల కృత్తిక యొక్క ప్రభావం అత్యంత కీలకమైనదిగా జ్యోతిష శాస్త్రంచే తెలియబడుతున్నది.....

యావద్ సనాతన ధర్మ శాస్త్ర వాంజ్ఞ్మయాన్ని  ఒక విరాట్ వేదశాస్త్ర పురుషుడిగా భావించినట్లైతే......
జ్యోతిష శాస్త్రం ఆతడి నేత్ర స్థానంలో కొలువై ఉంటుంది అని సద్గురువులు ప్రవచించినారు.... 

త్రికాలజ్ఞ్యానసంపన్నులైన మన సనాతన మహర్షులు ఏది చేసినా కూడా అది లోకశ్రేయస్సుకై సర్వసజ్జనోద్ధరణే లక్ష్యంగా ఎంతో ఉన్నతమైన భావగాంభీర్యంతో స్తోత్ర / అక్షర సారస్వతంగా వారి అనుభవాలను / దర్శనాలను వచించి అందించి ఆచరించి తరించమని సెలవివ్వడం ఈశ్వరానుగ్రహంగా ఈ భరతభూమిపై అనాదిగా కొనసాగిన / కొనసాగే సంప్రదాయం..... 

ఒక పెద్ద మామిడి చెట్టుపై ఉన్న మధురమైన మామిడిపళ్ళను అందుకొని ఆరగించి అరోగ్యంతో వర్ధిల్లాలంటే....

Algorithm 1 :

1. ఎన్నో చెట్ల మధ్యన ఉన్న ఫలాన చెట్టు మామిడి చెట్టు అని తెలియాలి... 
2. కొమ్మలపైకి నేర్పుతో ఎక్కుతూ ఆ దోర మామిడికాయలు ఉన్న కొమ్మవరకు చేరుకోవాలి....
3. రసి అంటకుండా ఆ మామిడి కాయలను సంగ్రహించాలి... 
4. అంతే జాగ్రత్తగా పళ్ళను ఒక కవర్లో వేసుకొని చెట్టు దిగాలి... 
5. క్రిందికి వచ్చిన తర్వాత ఆ పళ్ళను ఆరగించాలి....

లేదా 

Algorithm 2 : 

చెట్ట్లపైకి నేర్పుతో ఎక్కడం అనే విద్య రాని వారు, ఆ మామిడికాయలు పండ్లై వాటంతట అవే రాలేంతవరకు వేచి ఉండి క్రింద భూమిపైకి చేరుకున్న పళ్ళను స్వీకరించాలి.....

(గులేర్ తో చెట్లపైకి రాళ్ళు రువ్వడం, ఒక పెద్ద బొంగు కర్రతో వాటిని రాల్చుకోవడం ఇత్యాది వాటి గురించి కాసేపు పక్కన పెట్టండి....) 
 
అచ్చం అదే విధంగా ఒక ఉన్నతోన్నతమైన స్థాయిలో ఉండే ఖగోళం గురించిన విజ్ఞ్యానాన్ని ఆకళింపు చేసుకోవడం ఎల్లరికి సాధ్యం కాకపోవచ్చు....

కేవలం చెట్ట్లెక్కడం వచ్చిన వారికి మాత్రమే మామిడి పండ్లు అని అనడం ఏవిధంగా అయితే భావసంకుచితత్త్వం అనిపించుకుంటుందో......

ఆకాశం గురించి తెలిసిన వారికి మాత్రమే సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహ, దేవి, దేవతా, అనుగ్రహం 
అని అనడం కూడా అట్లే  భావసంకుచితత్త్వం అనిపించుకుంటుంది......

అశ్విని, కృత్తిక, మృగశిర, పుష్యమి, మఖ అనే శక్తివంతమైన నక్షత్రాల కూడికతో వెలిగే చంద్రుడి అనుగ్రహాన్ని ఉపాసనా కాలమైన దక్షిణాయణం లో ఎల్లరూ సులభంగా అందుకొని తరించేలా మన పెద్దలు ఇలా నదీతీర్థస్నానాల పేరిట ఒక సత్సంప్రదాయాన్ని వ్యవస్థీకరించి తరించమని మనకు అందించినారు......

అనగా పైన వివరించిన ఉదాహరణలో Algorithm 2 అన్నమాట..

ఆకాశం లోని వివిధ ద్యులోక వాసుల అనుగ్రహాన్ని తమలో నిక్షిప్తం గావించుకొని ప్రవహించడం జీవనదులకు గల ఒకానొక ప్రత్యేకత..... 

ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడమంటే...,
అధముడు, సామాన్యుడు  ఉత్తముడు, అనే 3 వర్గాలుగా విభాగింపబడి ఉండే ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కోలా వారి వారి జ్ఞ్యానస్థాయికి తగ్గట్టుగా మాట్లాడుతారు....

ఒక వ్యక్తి కలతతో ఉండి ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ తన లోకంలో తాను ఉన్నట్టుగా ఉంటే.....

1. అధముడు....
" వీడికేదో అయ్యింది రా.....పాతనగరానికి పట్కపోండి.....రోడ్ల మీద పదిరూపాలకు ఏవో పసర్లు పోస్తరంట....మందులుమాకులు ఇస్తరంట....అది...ఇది....అంటూ 
వాడి యొక్క అధమస్థాయిని ప్రతిబింబించేలా ఏదో ఒకటి వాగుతాడు.....

2. సామాన్యుడు.....
" ఏదో ఒక సినిమా చూడు, పాటలు విను.....తలనొప్పిగా ఉంటే ఇంత అల్లంచాయ్ తాగి రెస్ట్ తీసుకొ...."
అంటూ మాట్లాడుతాడు...

3. ఉత్తముడు.....
" విష్ణుసహస్రం / లలితాసహస్రం విను / పఠించు.....ఏదో ఒక పురాణ ప్రవచనం ఆలకించు....ఆలయానికి వెళ్ళు...తలనొప్పి తగ్గకపోతే ఒకసారి హొస్పిటల్ చెకప్ కి వెళ్ళిరా..... "
అంటూ సెలవిస్తాడు...

ఇక్కడ గమనిస్తే ఒకే సందర్భాన్ని
ఒక్కో వ్యక్తి ఒక్కోలా విశ్లేషించి వారి వారి జ్ఞ్యాన స్థాయికి తగ్గట్టుగా అవతలి వ్యక్తి స్వీకరించడానికి ఒక ప్రతిపాదన గావిస్తారు.....

ఆ ప్రతిపాదనను అవతలి వ్యక్తి ఏ విధంగా స్వీకరిస్తాడు అనేది స్వీకరించే వారి యొక్క జ్ఞ్యాన స్థాయికి సంబంధించిన అంశం...... 

అచ్చం అదే విధంగా......
సనాతన ధర్మ శాస్త్ర వైభవాన్ని మథించినవారు వచించేది ఎంతో ఉన్నతమైన రీతిలో ఉంటుంది.... 

ఉన్నతమైన వారు వారి వారి ఉన్నత స్థితి నుండి దిగజారి ప్రవర్తించడం అనేది చాలా సులువు......
కాని అధో స్థాయిలో ఉండే వారు ఉన్నతమైన రీతిలో ప్రవర్తించడం అనేది అంత సులువు కాదు....దానికి ఎంతో పరిశ్రమ కావాలి కాబట్టి....

ఫర్ ఎగ్సాంపుల్.....

"అంగన్యాస కరన్యాసములతో ఆంతరబాహిర శౌచసిద్ధితో లలితాసహస్రాన్ని పఠించి ఒకానొక ఉన్నతస్థాయిలో ఓలలాడే చిత్తవృత్తులతో జీవించే వ్యక్తి......
 
"అంబికా అనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా....." 
అనే నామాలకు వ్యాఖ్యానం పై ఎందరో సజ్జనులతో సర్వోన్నతమైన చర్చల్లో బహు రమ్యముగా భాషించగలడు.....

మరియు కొందరు అధములు తనను అనవసరంగా పదే పదే విసిగించడమే పనిగా ఉంటే......
"మందిని ముంచి బత్కే మీ బద్మాష్ సంతకు ఎంత చెప్పినా అర్ధమై సావదా....నా జోలికి రావొద్దని.....నన్ను విసిగించొద్దని....నా జీవితంలో కలగజేసుకోవద్దని.....
నన్ను అవమానిస్తరు.......నా వారిని హింసిస్తరు.....
మళ్ళి నా సొమ్మే మింగిసావాలని గూడుపుఠానీలు రచిస్తరు....కండ్లల్ల కారంగొట్టి ఇరగదంత నా జోలికొచ్చే బాడ్ఖావ్లను......."

అంటూ ఒకింత క్రింది స్థాయికి దిగజారి కూడా ప్రవర్తించగలడు......

ఒక అధముడు కేవలం ఇలా ఒక క్రిందిస్థాయిలోనే మాట్లాడగలడు కాని పైన పేర్కొన్న విధంగా సహస్రమనాలకు భాష్యాల గురించి మాట్లాడడం....కెప్లర్స్ లా గురించి......మాక్స్వెల్ల్ థియరి గిరుంచి......బేయీస్ థియోరం గురించి.....ఇత్యాది వాటి గురించి మాట్లాడడం అనేది అన్వయం కాని విషయం......

అదే విధంగా సనాతన ధర్మశాస్త్రాల వైభవాన్ని / భగవంతుడి తత్త్వ విశేషాలను గౌరవించే వ్యక్తి యొక్క నడవడికి.... 
మరియు వీటిపై ఏమాత్రం అవహాగన లేని వ్యక్తి యొక్క నడవడికి భూమ్యాకాశాలకున్నంత భేదం ఉంటుంది....

కార్తిక మాసం యొక్క వైభవాన్ని కార్తిక దీపారాధనగా,
కార్తిక నదీ తీర్థ స్నానం గా ఆరాధించే సంప్రదాయానికి గల విశేషాలను నుడివే సజ్జనులైన సనాతన ధర్మశాస్త్ర కోవిదులను నమస్కరించి గౌరవించడం ఎల్లరి విహితధర్మం......

కార్తిక దామోదర దేవతాభ్యో నమః.....
కార్తిక త్రయంబక దేవతాభ్యో నమః.....
🙏🍇🍓🍧🍨🍕🎇💐🎂😊🍦🍎

Informative details on the interlaced path connecting various temple towns.....


The name "Madurai" reminds me of an incident from sathguru Shree ChaagaTi gaari pravachanams... where in a typical middle class ascetic person is insulted by the then Archaka fraternity of the Madurai MeenaakShi temple by not allowing him in to the temple premises.....
The former simply grabs a coconut and prays Meenaakshi to transfuse the "16" ShoDaSha kaLalu from her Garbhaalaya Moorthy so that he can carry the divinity with him to his own place.....
After the ShoDaSha Kalaakarshanam got completed successfully, he left the temple and in no time the Archaka group remains shell-shocked by observing that all the TapahShakti held by the MarakataMeenaakshi moorti was completely captured by that ascetic.... 

Later on they apologized him for their arrogance, after which they were re-instilled in to the MarakataMeenaakshi moorthy as usual with the appropriate recitals....

It is to be noted that unlike Kaashi  Vishaalaakshi and Kanchi Kaamaakshi, Meenaakshi was born as a Kshatriya warrior princess and married Sundareshwarar in a grand wedding ceremony arranged by Lord Shree MahaaVishnu and there after settled as goddess Meenaakshi Sundareshwarar in their Madurai province...
Thus, the form of goddess Meenaakshi heralds the divinity born and manifested on the planet earth....

उद्यद्भानु सहस्रकोटिसदृशां केयूरहारोज्ज्वलां
बिम्बोष्ठीं स्मितदन्तपंक्तिरुचिरां पीताम्बरालंकृताम् ।
विष्णुब्रह्मसुरेन्द्रसेवितपदां तत्वस्वरूपां शिवां
मीनाक्षीं प्रणतोऽस्मि संततमहं कारुण्यवारांनिधिम् ॥ १॥

I remain ever bowing to that (goddess) Minákshi, an ocean of compassion, who is radiant like the multitudes of rising Suns, and is resplendent with the bracelet and necklace and is having reddish lips (like the bimba fruit), with shining rows of smiling teeth, and decorated with silk garments, and is having the feet worshipped by the gods Vishnu, Brahmá and Indra and is of the form of the reality and is auspicious. AA