Monday, November 28, 2022

Clarity is a consequence of handling your confusion consciously......💐


అందులో కొందరు బౌద్ధిక పరిణత గల వారు, విజ్ఞ్యులు, అన్ని రకాలుగా సహాయం చేసే సహృదయులై ఉండగా....
కొందరు హాయ్ బాయ్ అనే సామాన్యులై ఉండగా...
కొందరు కొన్ని కాసుల కోసం కక్కుర్తిపడే పిచ్చి కుక్కల్లా ప్రవర్తిస్తూ సాటి మనుష్యులను హింసించే అధములుగా ఉండగా,

వీరిలో ఒక్కొక్కరు వేరువేరుగా ఎవరికి వారుగా ఒక్కోదెగ్గర ఉండి....
కొందరు పరస్పర ప్రత్యర్ధులుగా ఉన్నప్పుడు,
ఒకరు గావించిన మూర్ఖపు పనులకు వేరొకరిని తప్పుపట్టడం ఎట్లు సమంజసం.....?

ఫర్ ఎగ్సాంపుల్, ఒకే ** కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను తీసుకుంటే.....
వ** *ధి ఒక పార్టీకి చెందిన వారు...
రా** *ధి ఒక పార్టీకి చెందిన వారు.....

వీరిలో ఒకరు చేసిన పనులకు ఇంకొకరిని, లేదా ** అనే పేరు సఫిక్స్ గా గల ఒక ఫ్యామిలి/గ్రూప్ వారందరినీ కూడా తప్పుపట్టడం ఏ విధంగానూ సమంజసం కాదు......

కాబట్టి ఎవరు దేనికి బాధ్యులో తెలుసుకొని వారిని మాత్రమే ఫోకస్ చేయడం భావ్యంగా ఉంటుంది కాని ఒకే ఇంటిపేరు గల వారందరినీ ఒకేగాటనకట్టడం ఎవ్విధంగానూ సరికాదు.....

హోళీ ఆట ఆడుతున్నప్పుడు.....
కొందరు పసుపురంగు పూసుకున్న వారు ఇబ్బంది కలిగించినందుకు.....
ఇక పసుపురంగు పూసుకున్న వారందరినీ కూడా తప్పుపట్టడం అనేది కుదరని పని..... 

ఎవ్వడైతే ఓర్వలేని తనంతో కుళ్ళుబోతు వేషాలు వేస్తున్నడో, దోపిడీ కుట్రలు రచిస్తున్నడో వాడి అసలు రంగును బయటపెట్టి నిలదీయడం సరి....... 
అంతేకాని వాడొక్కడికోసం ఇతర మంచివారిని ధూర్తులుగా భావించడం సారికాదు అనేది ఇక్కడి సారాంశం.....

ఒక వ్యక్తి తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తన ఉన్నతి / అభివృద్ధి మేరకు విజ్ఞ్యులను సంప్రదించి చక్కబెట్టుకునే పనిలో ఉండగా,
మధ్యలో అనవసరంగా దూరి ఎందుకు, ఏంటి అని ఎవడైనా ప్రశ్నిస్తే వాడే అసలైన దొంగ / మూలఘాతి అని లోకానికి బట్టబయలౌతుంది......

No comments:

Post a Comment