ఉత్తరాయణంలో మాఘపంచకం ఎంతటి ప్రశస్తమైనదో దక్షిణాయణంలో కార్తిక మాసానిది అంతటి ప్రశస్తి...
కార్తిక దీపారాధన....
కార్తిక తీర్థస్నానం...
కార్తిక పౌర్ణమి.....
కార్తిక శుద్ధ ఏకాదశి/క్షీరాబ్ధి ద్వాదశి
ఇత్యాదిగా కార్తిక మాసం మొత్తం కూడా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్న హరిహరప్రీతికరమైన పరమపవిత్ర మాసం....
కృత్తికలచే పాలింపబడిన వాడు కాబట్టి కార్తికేయుడు గా కుమారస్వామి పేర్గాంచడం భక్తలోకానికి విదితమే....
27 నక్షత్రాల్లో చంద్రుడు కూడుకుంటూ సాగే అశ్విని, కృత్తిక, మృగశిర, పుష్యమి, మఖాది 12 నక్షత్రాల్లో కృత్తికది బహు విశేషమైన స్థానం.....
నక్షత్ర సూక్తమ్
తైత్తిరీయ సంహితాః | కాండ 3 ప్రపాఠకః – 5 అనువాకమ్ – 1
ఓం || అగ్నిర్నః’ పాతు కృత్తి’కాః | నక్ష’త్రం దేవమి’ంద్రియమ్ | ఇదమా’సాం విచక్షణమ్ | హవిరాసం జు’హోతన | యస్య భాంతి’ రశ్మయో యస్య’ కేతవః’ | యస్యేమా విశ్వా భువ’నానిసర్వా” | స కృత్తి’కాభిరభిసంవసా’నః | అగ్నిర్నో’ దేవస్సు’వితే ద’ధాతు || 1 ||
అని సనాతనధర్మం కృత్తికానక్షత్రాన్ని స్తుతిస్తున్నది.....
అగ్ని సంబంధమైన నక్షత్రం కావడం,
అధిదేవత సూర్యుడిగాగల నక్షత్రం కావడం వల్ల కృత్తిక యొక్క ప్రభావం అత్యంత కీలకమైనదిగా జ్యోతిష శాస్త్రంచే తెలియబడుతున్నది.....
యావద్ సనాతన ధర్మ శాస్త్ర వాంజ్ఞ్మయాన్ని ఒక విరాట్ వేదశాస్త్ర పురుషుడిగా భావించినట్లైతే......
జ్యోతిష శాస్త్రం ఆతడి నేత్ర స్థానంలో కొలువై ఉంటుంది అని సద్గురువులు ప్రవచించినారు....
త్రికాలజ్ఞ్యానసంపన్నులైన మన సనాతన మహర్షులు ఏది చేసినా కూడా అది లోకశ్రేయస్సుకై సర్వసజ్జనోద్ధరణే లక్ష్యంగా ఎంతో ఉన్నతమైన భావగాంభీర్యంతో స్తోత్ర / అక్షర సారస్వతంగా వారి అనుభవాలను / దర్శనాలను వచించి అందించి ఆచరించి తరించమని సెలవివ్వడం ఈశ్వరానుగ్రహంగా ఈ భరతభూమిపై అనాదిగా కొనసాగిన / కొనసాగే సంప్రదాయం.....
ఒక పెద్ద మామిడి చెట్టుపై ఉన్న మధురమైన మామిడిపళ్ళను అందుకొని ఆరగించి అరోగ్యంతో వర్ధిల్లాలంటే....
Algorithm 1 :
1. ఎన్నో చెట్ల మధ్యన ఉన్న ఫలాన చెట్టు మామిడి చెట్టు అని తెలియాలి...
2. కొమ్మలపైకి నేర్పుతో ఎక్కుతూ ఆ దోర మామిడికాయలు ఉన్న కొమ్మవరకు చేరుకోవాలి....
3. రసి అంటకుండా ఆ మామిడి కాయలను సంగ్రహించాలి...
4. అంతే జాగ్రత్తగా పళ్ళను ఒక కవర్లో వేసుకొని చెట్టు దిగాలి...
5. క్రిందికి వచ్చిన తర్వాత ఆ పళ్ళను ఆరగించాలి....
లేదా
Algorithm 2 :
చెట్ట్లపైకి నేర్పుతో ఎక్కడం అనే విద్య రాని వారు, ఆ మామిడికాయలు పండ్లై వాటంతట అవే రాలేంతవరకు వేచి ఉండి క్రింద భూమిపైకి చేరుకున్న పళ్ళను స్వీకరించాలి.....
(గులేర్ తో చెట్లపైకి రాళ్ళు రువ్వడం, ఒక పెద్ద బొంగు కర్రతో వాటిని రాల్చుకోవడం ఇత్యాది వాటి గురించి కాసేపు పక్కన పెట్టండి....)
అచ్చం అదే విధంగా ఒక ఉన్నతోన్నతమైన స్థాయిలో ఉండే ఖగోళం గురించిన విజ్ఞ్యానాన్ని ఆకళింపు చేసుకోవడం ఎల్లరికి సాధ్యం కాకపోవచ్చు....
కేవలం చెట్ట్లెక్కడం వచ్చిన వారికి మాత్రమే మామిడి పండ్లు అని అనడం ఏవిధంగా అయితే భావసంకుచితత్త్వం అనిపించుకుంటుందో......
ఆకాశం గురించి తెలిసిన వారికి మాత్రమే సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహ, దేవి, దేవతా, అనుగ్రహం
అని అనడం కూడా అట్లే భావసంకుచితత్త్వం అనిపించుకుంటుంది......
అశ్విని, కృత్తిక, మృగశిర, పుష్యమి, మఖ అనే శక్తివంతమైన నక్షత్రాల కూడికతో వెలిగే చంద్రుడి అనుగ్రహాన్ని ఉపాసనా కాలమైన దక్షిణాయణం లో ఎల్లరూ సులభంగా అందుకొని తరించేలా మన పెద్దలు ఇలా నదీతీర్థస్నానాల పేరిట ఒక సత్సంప్రదాయాన్ని వ్యవస్థీకరించి తరించమని మనకు అందించినారు......
అనగా పైన వివరించిన ఉదాహరణలో Algorithm 2 అన్నమాట..
ఆకాశం లోని వివిధ ద్యులోక వాసుల అనుగ్రహాన్ని తమలో నిక్షిప్తం గావించుకొని ప్రవహించడం జీవనదులకు గల ఒకానొక ప్రత్యేకత.....
ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడమంటే...,
అధముడు, సామాన్యుడు ఉత్తముడు, అనే 3 వర్గాలుగా విభాగింపబడి ఉండే ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కోలా వారి వారి జ్ఞ్యానస్థాయికి తగ్గట్టుగా మాట్లాడుతారు....
ఒక వ్యక్తి కలతతో ఉండి ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ తన లోకంలో తాను ఉన్నట్టుగా ఉంటే.....
1. అధముడు....
" వీడికేదో అయ్యింది రా.....పాతనగరానికి పట్కపోండి.....రోడ్ల మీద పదిరూపాలకు ఏవో పసర్లు పోస్తరంట....మందులుమాకులు ఇస్తరంట....అది...ఇది....అంటూ
వాడి యొక్క అధమస్థాయిని ప్రతిబింబించేలా ఏదో ఒకటి వాగుతాడు.....
2. సామాన్యుడు.....
" ఏదో ఒక సినిమా చూడు, పాటలు విను.....తలనొప్పిగా ఉంటే ఇంత అల్లంచాయ్ తాగి రెస్ట్ తీసుకొ...."
అంటూ మాట్లాడుతాడు...
3. ఉత్తముడు.....
" విష్ణుసహస్రం / లలితాసహస్రం విను / పఠించు.....ఏదో ఒక పురాణ ప్రవచనం ఆలకించు....ఆలయానికి వెళ్ళు...తలనొప్పి తగ్గకపోతే ఒకసారి హొస్పిటల్ చెకప్ కి వెళ్ళిరా..... "
అంటూ సెలవిస్తాడు...
ఇక్కడ గమనిస్తే ఒకే సందర్భాన్ని
ఒక్కో వ్యక్తి ఒక్కోలా విశ్లేషించి వారి వారి జ్ఞ్యాన స్థాయికి తగ్గట్టుగా అవతలి వ్యక్తి స్వీకరించడానికి ఒక ప్రతిపాదన గావిస్తారు.....
ఆ ప్రతిపాదనను అవతలి వ్యక్తి ఏ విధంగా స్వీకరిస్తాడు అనేది స్వీకరించే వారి యొక్క జ్ఞ్యాన స్థాయికి సంబంధించిన అంశం......
అచ్చం అదే విధంగా......
సనాతన ధర్మ శాస్త్ర వైభవాన్ని మథించినవారు వచించేది ఎంతో ఉన్నతమైన రీతిలో ఉంటుంది....
ఉన్నతమైన వారు వారి వారి ఉన్నత స్థితి నుండి దిగజారి ప్రవర్తించడం అనేది చాలా సులువు......
కాని అధో స్థాయిలో ఉండే వారు ఉన్నతమైన రీతిలో ప్రవర్తించడం అనేది అంత సులువు కాదు....దానికి ఎంతో పరిశ్రమ కావాలి కాబట్టి....
ఫర్ ఎగ్సాంపుల్.....
"అంగన్యాస కరన్యాసములతో ఆంతరబాహిర శౌచసిద్ధితో లలితాసహస్రాన్ని పఠించి ఒకానొక ఉన్నతస్థాయిలో ఓలలాడే చిత్తవృత్తులతో జీవించే వ్యక్తి......
"అంబికా అనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా....."
అనే నామాలకు వ్యాఖ్యానం పై ఎందరో సజ్జనులతో సర్వోన్నతమైన చర్చల్లో బహు రమ్యముగా భాషించగలడు.....
మరియు కొందరు అధములు తనను అనవసరంగా పదే పదే విసిగించడమే పనిగా ఉంటే......
"మందిని ముంచి బత్కే మీ బద్మాష్ సంతకు ఎంత చెప్పినా అర్ధమై సావదా....నా జోలికి రావొద్దని.....నన్ను విసిగించొద్దని....నా జీవితంలో కలగజేసుకోవద్దని.....
నన్ను అవమానిస్తరు.......నా వారిని హింసిస్తరు.....
మళ్ళి నా సొమ్మే మింగిసావాలని గూడుపుఠానీలు రచిస్తరు....కండ్లల్ల కారంగొట్టి ఇరగదంత నా జోలికొచ్చే బాడ్ఖావ్లను......."
అంటూ ఒకింత క్రింది స్థాయికి దిగజారి కూడా ప్రవర్తించగలడు......
ఒక అధముడు కేవలం ఇలా ఒక క్రిందిస్థాయిలోనే మాట్లాడగలడు కాని పైన పేర్కొన్న విధంగా సహస్రమనాలకు భాష్యాల గురించి మాట్లాడడం....కెప్లర్స్ లా గురించి......మాక్స్వెల్ల్ థియరి గిరుంచి......బేయీస్ థియోరం గురించి.....ఇత్యాది వాటి గురించి మాట్లాడడం అనేది అన్వయం కాని విషయం......
అదే విధంగా సనాతన ధర్మశాస్త్రాల వైభవాన్ని / భగవంతుడి తత్త్వ విశేషాలను గౌరవించే వ్యక్తి యొక్క నడవడికి....
మరియు వీటిపై ఏమాత్రం అవహాగన లేని వ్యక్తి యొక్క నడవడికి భూమ్యాకాశాలకున్నంత భేదం ఉంటుంది....
కార్తిక మాసం యొక్క వైభవాన్ని కార్తిక దీపారాధనగా,
కార్తిక నదీ తీర్థ స్నానం గా ఆరాధించే సంప్రదాయానికి గల విశేషాలను నుడివే సజ్జనులైన సనాతన ధర్మశాస్త్ర కోవిదులను నమస్కరించి గౌరవించడం ఎల్లరి విహితధర్మం......
కార్తిక దామోదర దేవతాభ్యో నమః.....
కార్తిక త్రయంబక దేవతాభ్యో నమః.....
🙏🍇🍓🍧🍨🍕🎇💐🎂😊🍦🍎
No comments:
Post a Comment