Monday, November 28, 2022

శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు, తి.తి.దే ఆస్థానవిద్వాంసులు, అన్నమాచార్య సంకీర్తనా ప్రచారయజ్ఞ్య కోవిదులకు వారి శ్రీశుభకృత్ నామ సంవత్సర జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులు....🙏😊


పదకవితాపితామహులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు శ్రీవేంకటేశ్వరుని పై భక్తి, ప్రేమ, అనురాగం తో కూడిన మహోన్నత భావసంపదతో సృజించిన పదసుమాలతో ఎవ్విధంగా శ్రీనివాసుని శ్రీపాదపద్మములను అర్చించి తరించినారో, అంతటి మహోన్నతనైన భావ రాగ స్వర సంపదతో మన ఈ కాలంలో మరో అన్నమయ్య గా కొలువై శ్రీవారి శ్రీపాదపద్మములను వారి ఎన్నెన్నో సంకీర్తనా సౌగంధికలతో నిత్యం అర్చిస్తూ వారు తరిస్తూ ఎల్లరినీ తరింపజేస్తున్న మహానుభావులు శ్రీగరిమెళ్ళ గురువు గారు.......
వారి అధ్యాత్మ భక్తి సంగీత కృషికి ఎన్ని భారతరత్న పురస్కారాలు ఇచ్చినా సరిపోవు.....
అంతటి అనన్యసామాన్యమైన నాణ్యమైన స్వఛ్ఛమైన మధురమైన సౌకుమార్య స్వర సంపద వారిది.....

ఫర్ ఎగ్సాంపుల్, వారు ఆలపించిన వందలాది మధురమైన సంకీర్తనల్లో అత్యంత రమణీయమైన ఒకానొక సంకీర్తన, "అమృతవర్షిణి" రాగంలో వారు ఆలపించిన " త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు...." అనే సంకీర్తనలో.....
" తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి....." అనే ఆలాపన ఎంతమంది భక్తుల హృదయలయలను హత్తుకుందో లెక్కేలేదు......

మరియు " యీపాదమే కదా..." అనే మరో అత్యత్భుతమైన సంకీర్తనలో..... 

"యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపైనిరవైనది ||"

అనే వారి ఆలాపన ఎంతటి భావగాంభీర్యాన్ని వ్యక్తపరుస్తుందో అనేది భక్తలోకానికి విదితమే.....

మరియు "మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును..." అనే మరో అత్యత్భుత సంకీర్తనలో...

"సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు 
కరుణాకరునకును కాత్యాయనీనుతకలితనామునకు"

అనే ఆలాపన ఎంతటి గగనగంభీరమైన రీతిలో ఉంటుందో భక్తులెల్లరికీ విదితమే....!

హైదరబాద్ నల్లకుంట శ్రీశంకర మఠంలో వారికి  స్వర్ణగండపెండేర అలంకరణోత్సవంలో మరియు తిరుమల ఆలయ సన్నిధిలో ఆలాపన అనంతరం, వారి అనుగ్రహ ఆశీస్సులను ప్రత్యక్షంగా అందుకోవడం నా జన్మాంతర సుకృతం.....

ఆహారం, ఆహార్యం, వాతావరణం, సాంగత్యం, వ్యాపకం, ఔషధం, సంగీతం వీటి వల్ల మనిషి చాలా ప్రభావితం అవుతాడు....
వీటిలో సంగీతం ప్రత్యేకించి సంప్రదాయ కర్ణాటక సంగీతం యొక్క శక్తి అనంతమైనది..... 
అది ఎన్ని మహత్తులనైనను చూపగలదు.....
ఎంతటి మేధోసంపత్తినైనను సిద్ధింపజేయగలదు... 
ఎంతో ప్రశాంతతను అనుగ్రహించగలదు.....

అత్యద్భుతంగా మనిషి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దగల రాగౌషధరసగుళికలైన అన్నమాచార్యుల సంకీర్తనలకు గల శక్తి అనంతమైనది....
ఆ సంకీర్తనల్లో నిక్షిప్తమైన సాహితీ శక్తిని సారసభావరంజితమైన రాగాలాపనతో లోకానికి అందించే వారి సంకీర్తనాయజ్ఞ్యం నిరంతరంగా కొనసాగుతూ భక్తులెల్లరి జీవితాల్లో అవి శాశ్వతమైన ఆనంద కారకాలుగా కలకాలం పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తూ.....గురువుగారి పాదపద్మములకు సవినయ సాంజలిబంధక జన్మదిన శుభాభినందనా నమస్సుమాంజలి.... 😊🍎🍦🎂🍨💐🎇🍕🍨🙏

No comments:

Post a Comment