స్కందుడు / సుబ్రహ్మణ్యుడు / కార్తికేయుడు / శరవణుడు / కుమారస్వామి / షణ్ముఖుడు /
మురుగన్ / వేలాయుధన్ / ఇలా ఆ శివపుత్రుడికి ఎన్నెన్నో పేర్లు....
సాక్షాత్తు తండ్రికే ప్రణవోపదేశం చేసిన తత్త్వవేత్త గా వినుతి కెక్కిన దైవస్వరూపం.....
ఆరుపళైవీడ్ అనే ఆరు కౌమార క్షేత్రాల అధిదైవంగా అలరారే ఆ శ్రీవల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యుడి వైభవం అనన్యసామాన్యమైనది.....
ఎన్నో జన్మల పుణ్యబలం ఉంటేనే సుబ్రహ్మణ్యుడి ఆరాధన సాధ్యమయ్యేది అని శ్రీచాగంటి సద్గురువులు ప్రవచించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....
శ్రీఆదిశంకరాచార్యులచే వ్యవస్థీకరింపబడిన షణ్మతస్థాపనలో మరియు పంచాయతన ఆరాధనా సంప్రదాయంలో సుబ్రహ్మణ్యతత్త్వం కూడా ఒకటి అని అనిపించినా... ఆ సుబ్రహ్మణ్యతత్త్వం లోనే షణ్మతాల వైభవం కానవస్తుంది....
అందుకే కాబోలు ఆతడు షణ్ముఖుడైనాడు....
ప్రతీవైదిక క్రతువులో వెలిగించబడే దీపమే సుబ్రహ్మణ్య స్వరూపం అని శ్రీచాగంటి సద్గురువులు బోధించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....
ఆతరువాత సిమ్హాసనం పై కొలువైన
గణపతి :: గాణాపత్యం
అంబిక / శక్తి :: శాక్తేయం
శివ ::.శైవం
విష్ణు :: వైష్ణవం
సూర్య :: సౌరం
ఈ 5 దేవతా తత్త్వాలలో సుబ్రహ్మణ్య తత్త్వం అంతర్లీనంగా ఇమిడి ఉంటుంది.....
స్కందపూర్వజః అనే నామం తో గణపతి సదా స్తుతింపబడుతున్నాడు....
శక్తి చే అనుగ్రహింపబడిన ఆయుధాన్ని ధరించినవాడిగా శక్త్యాయుధన్ / వేలాయుధన్ గా శక్తికి అభిన్నమైన వాడిగా శాక్తేయులకు స్కందుడు సదా ఆరాధ్యుడు.....
శివతేజోసంభూతుడై, శరవణుడిగా, కార్తికేయుడిగా, సుబ్రహ్మణ్యుడు వెలుగొందుతున్నాడు....
" మురుగన్, మరుమఘన్ "
అనే వాక్యం తో ఎంతో చతురత భరితమైన సామ్యముతో శైవం వైష్ణవం వియ్యమందిన వృత్తాంతాన్ని వివరిస్తూ ఆ దేవసేన పతి యొక్క శ్రీవైష్ణవ సంబంధం ఆస్తిక లోకం చే ఆరాధింపబడే ఇతివృత్తం గురించి శ్రీచాగంటి సద్గురువులు ప్రవచించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....
ప్రతినిత్యం ధగధగ వెలిగే అమేయశక్తి పుంజమైన ప్రత్యక్ష పరమాత్మ సూర్యనారాయణుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు.......
ఏ ఆదిపరాశక్తికి ఒక తాటంకమై ఆ సూర్యమండలం పరిఢవిల్లుతున్నదో ఆ
" తాటంకయుగళీభూత తపనోడుపమండలా..."
యొక్క మరోపేరు స్కందమాత....
కాబట్టి స్కందుడి కరకమలంలో ఒదిగిన శక్తి ఆయుధంలోని తేజస్సు సూర్యశక్తితో సామ్యము కలిగి ఉండును......
కాబట్టి స్కందుడు షణ్ముఖుడే కాదు షణ్మతములకూ అంతర్లీనంగా వెలిగే పరతత్త్వ ద్యుతి....
1. అవతలి వ్యక్తి ఎంతటి ఘనుడైనను వారిచే జయింపశక్యంకాని రీతిలో ఉండే వాక్ శక్తి / వాక్ వైభవం / వాక్ శుద్ది / వాక్ సిద్ధి......
2. అమేయమైన మేధోప్రజ్ఞ్య & కుశాగ్ర బుద్ధికౌశలం.....
3. అనన్యసామాన్యమైన సారస్వత శక్తి....
4. సకల రోగదోషపీడా నివారక శక్తి....
5. నిరుపమాన నాయకత్వ శక్తి....
6. కేకి (మయూరము/నెమలి) వాహనుడిగా కొలువై కాలం అనే సర్పాన్ని తన అధీనంలో ఉండేలా అలరారే స్కంద స్వరూపమే కాకుండా, ప్రత్యేకంగా కుండలినీ జాగృత శక్తిగా సర్పరూపంలోనూ, ఊర్ధ్వగమన జంటనాగుల స్వరూపంలోను, ఆరాధింపబడే స్కందుడి అనుగ్రహంతో ఒనగూరే యోగశక్తులు ఏ భూమికలకూ అందని దేవతానుగ్రహము....
(తిరుమలలో నెలకొన్న కుమారధార తీర్థంలో స్కందుడి కాలదమన శక్తి నిక్షిప్తమై ఉన్నది..)
ఇలా ఒకటా రెండా......స్కందుడి ఆరాధన ప్రసాదించే అనుగ్రహం సాటిలేనిదై ఉండే దైవానుగ్రహం.....
'33 కోట్ల దేవతల' అని సాధారణంగా అందరు అనే 33 వర్గముల దేవతా శక్తులకు సామ్యముగా ఉండేలా 33 మహిమాన్విత శ్లోకములతో, ఎంతో గంభీరమైన పదప్రౌఢిమతో అలరారే అత్యంత శక్తివంతమైన
" శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం " శ్రీ ఆదిశంకరాచార్యుల వారు " తిరుచ్చెందూర్ " అనే క్షేత్రంలో రచించడం గురించి శ్రీచాగంటి సద్గురువులు వివరించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....
శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి అర్చారాధనలతో, అనుగ్రహంతో భక్తులెల్లరు ఇవ్వాల విశేషంగా తరించి ఉంటారు.....
ఎల్లరికీ స్కందషష్ఠి శుభాభినందనలు...😊🎇🍦🍧🎂✨🍨🍕💐🍓🍎
ఓం శరవణభవ ప్రసీద ప్రసీద
🙏🙏🙏🙏🙏🙏
( ఆసక్తి గల ఆస్తికులకు
" శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం " కామెంట్స్ లో జతపరిచాను )
No comments:
Post a Comment