శ్రీకరమైన 2022 బాలలదినోత్సవ శుభాభినందనలు....!😊🍕🍨🍦🎇🍎🍓
"పిల్లలు దేవుడూ చల్లనివారే...
కల్లకపటమెరుగని కరుణామయులే...... "
అనే పాట వినే ఉంటారు.....
బాలలను భగవద్ స్వరూపులుగా ఆరాధించే భారతీయ సంస్కృతి యొక్క మహోన్నత వైభవం ఎల్లరికీ విదితమే.....
ఒక చిన్న మామిడి మొక్క యోగ్యులైన సమ్రక్షకుల చెంత ఉన్ననాడు అది ఎంతో చక్కగా పెరిగి ఎన్నెన్నో మధురసభరిత మామిడి ఫలాలను అందించే మహా వృక్షమై పరిఢవిల్లుతుంది.....
అదే చిన్న మామిడి మొక్క ధూర్తుల వద్ద ఉన్ననాడు ప్రతీ పండగకు కాలవసిన ఓ 4 మామిడాకుల కోసం ఆ మొక్కను సరిగ్గా ఎదగనివ్వరు.....
అచ్చం అదే విధంగా బాలలు కూడా.....
వారిలోని గొప్పదనాన్ని గుర్తించి, గౌరవించి, ప్రోత్సహించే వారి సమ్రక్షణలో ఉన్ననాడు ఆ పిల్లలు యావద్ ప్రపంచం గౌరవించే భావిభారత పౌరులుగా అభివృద్ధిని సాధిస్తారు.....
వారిని నిత్యం వేధిస్తూ, అవమానిస్తూ, కించపరుస్తూ, నిర్లక్ష్యంతో చూసే వాతావరణంలో ఉన్నప్పుడు పిల్లలు సమాజానికి ఏ విధంగానూ ఉపకరించని కలుపుమొక్కలుగానే మిగులుతారు.......
(బురదలో వికసించే పద్మంలా, ఎక్కడో కొద్ది మంది మాత్రమే ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నాసరే ఈశ్వరానుగ్రహంతో, భక్తభాగవత సహాయసహకారంతో జీవితంలో ఉన్నతిని సాధించగలరు.....)
పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా......
డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పోలీసులు, ప్రభుత్వాధికారులు ఇత్యాదిగా కాకపోయినా పర్వాలేదు.....
1. సద్వర్తనులైన సాటి మనుషులను గౌరవించగలిగే సంస్కారబలం......
2. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జీవించగలిగే బౌద్ధిక పరిణత.....
3. స్వయంకృషితో జీవితంలో అభివృద్ధిని సాధించగలిగే దక్షత......
4. చిన్న చిన్న విషయాల్లోనే విషయమంతా గ్రాహ్యమయ్యేలా నిరంతర వికసిత మేధో సంపత్తితో జీవించగలిగే ప్రజ్ఞ్య......
5. ప్రశాంతంగా బ్రతుకుతూ ఇతరులను కూడా ప్రశాంతంగా బ్రతనివ్వడం అనే కనీస ధర్మాన్ని పద్ధతిగా పాటించగలిగే విచక్షణ...
ఇత్యాదివన్నీ కూడా పిల్లల్లో బాల్యంలోనే పాదుకొల్పబడినప్పుడు వారు లోకం మెచ్చే మాన్యులుగా రాణిస్తారు.....
భారతభాగ్య విధాతలకు, భావి భారత పౌరులందరికీ 2022 బాలలదినోత్సవ శుభాభినందనలు...
🍨🎂🍧💐🍕😊🎇🍦🍎🍓🍇✨🎄🌺🌷
No comments:
Post a Comment