Thursday, July 18, 2024

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి / దేవశయన ఏకాదశి / తోల్ ఏకాదశి / తొలి ఏకాదశి పర్వసమయ శుభాభినందనలు...💐🙂


దేవశయన ఏకాదశి అంటే దేవతలు నిద్రకు ఉపక్రమించే ఏకాదశి అనే లౌకిక అర్ధం కొంత వింతగా అనిపించడం సహజమే..
ఎందుకంటే ఊర్ధ్వలోకస్థులైన దివిజులకు / దేవతలకు మనుష్యులవలే నిద్రాహారాలు, షడూర్ములు, ఉండవు కాబట్టి 
"దేవతలు నిద్రకు ఉపక్రమించే ఏకాదశి" అని అనడంలోని ఆంతర్యం ఏంటి అనే సందేహం విజ్ఞ్యులకు సహజమే...

ఆశ్వయుజం, కార్తీకం 24:00 thru 4:00
మార్గశిరం, పుష్యం 4:00 thru 8:00
మాఘం, ఫాల్గుణం 8:00 thru 12:00
చైత్రం, వైశాఖం 12:00 thru 16:00
జ్యేష్టం, ఆషాఢం 16:00 thru 20:00
శ్రావణం, భాద్రపదం 20:00 thru 24:00

మన లోకంలో సూర్యుడి చుట్టూ సాగే భూభ్రమణం మరియు భూమిచుట్టూ సాగే చంద్రభ్రమణం కారణంగా మనకు ఏర్పడే 12 చాంద్రమాన మాసాల కాలం, దేవతలకు ఒక్క రోజుతో సమానం అనేది సనాతనధర్మాంతర్గతమైన ఆర్షవిజ్ఞ్యాన మాన్యుల మాట...

మీరు ఎప్పుడైనా పల్లెటూర్లకు వెళ్ళిన్నప్పుడు గమనించి ఉండి ఉంటే...పొద్దున కోడికూసే వేళకు అనగా 4:00 నుండి 6:00 గంటల మధ్య మొదలయ్యే వారి దైనందిన జీవితం, వ్యవసాయం, వర్తకవాణిజ్యం, పూర్తిచేసుకొని ఊరంతా కూడా 18:00 నుండి 20:00 గంటల మధ్యలో నిద్రకు ఉపక్రమించే విధంగా ఉంటుంది వాళ్ళ దైనందిన దినచర్య...
అంటే మనకు రమారమి సాయాహ్న సంధ్య 6 గంటలకు సూర్యాస్తమయ సమయం అనుకుంటే....దేవతలు కూడా పల్లెటూరి పురాతన పెద్దవాళ్ళలా 20:00 గంటలకు నిద్రకు ఉపక్రమించే విధంగా ఉండే సమయంలో ఈ దేవశయన ఏకాదశి ఉత్సవం ఉండును...
అదే విధంగా వేకువ ఝామున 3 గంటలకు బ్రాహ్మీముహూర్తంలో మేల్కొని ఉషోదయసంధ్యావిధిని ఆచరించే సత్బ్రాహ్మణ కోవిదులవలె దేవతల దేవోత్థాన ఏకాదశి కార్తీకమాసం లో ఉండును....

మనం సాధారణ మనుష్యులం కాబట్టి తినగానే బ్రేవ్ బ్రేవ్ అని, ఆవలిస్తూ నిద్రలోకి జారుకొని బాగా గాఢనిద్రలో అలసటమొత్తం వదిలి నూతనజవసత్వాలతో మరునాటి దైనందిన జీవితానికి ఉపక్రమిస్తాము...

మరి ఆకాశంలో సంచరించే అనగా వివిధ ద్యులోకాల్లో ఉండే దేవతలకు మనలా లౌకిక భోజనాలను స్వీకరించడం, పక్కవారికి చిరాకు కలిగించేంతగా గాఢనిద్రలో గుర్రుకొట్టడం, ఉండవు కాబట్టి అసలు ఈ దేవశయన ఏకాదశిలోని ఆంతర్యమేమి అని ఆలోచించి అధ్యాత్మ వివేచన కొనసాగిస్తే ఈశ్వరానుగ్రహంగా మనకు అందలి వైభవం అర్ధమౌను.....

ఫస్టఫాల్, ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఎంజినీర్ కి కూడా అర్ధమయ్యే విధంగా అసలు ఈ దేవతల కాన్సెప్ట్ ఏంటి అనేది కొంత వివరించే ప్రయత్నం గావిస్తాను....

ఒక జావ క్లాస్ ఫైల్ ని మీరు ఎగ్సాంపుల్ గా తీసుకుంటే, అది ఒక బ్లూ ప్రింట్ వంటిది...
ఎవరెవరు ఇన్ హౌస్ జె.వి.ఎం నుండి సదరు క్లాస్ ని ఇంపోర్ట్ కీ వర్డ్ తో దిగుమతిచేసుకొని, వారి క్లాస్ ఫైల్ లో ఇన్వోక్ చేసుకొని సదరు జావా ఆబ్జెక్ట్ లో ఆ క్లాస్ ఫైల్ లో ఉండే బిజినెస్ లాజిక్ ని వినియోగించుకుంటారనేది వారివారి ప్రోగ్రామింగ్ స్టైల్ పై ఆధారపడి ఉండే అంశం...

సొ, ఇక్కడ 

1. ఒక యునివర్సల్ జెనెరిక్ క్లాస్ ఫైల్ ఉంది అని తెలుసుకోవడం మొదటి మెట్టు..

2. ఆ జెనెరిక్ క్లాస్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం రెండో మెట్టు.

3. ఆ జెనెరిక్ క్లాస్ ఫైల్ యొక్క ఇన్స్టాంటియేషన్ తో తను క్రోడీకరించే బిజినెస్ లాజిక్ ని అనుసంధానించి, తన క్లాస్ ఫైల్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ తో తనకు కావలసిన కస్టమైస్డ్ బిజినెస్ లాజిక్ ని ఎగ్సిగ్యూట్ చేసి తనకు ఉపయుక్తమైన ఫలితాలను సాధించుకోవడం అనేది మనం జావ / జే.వి.ఎం / కంపైలర్ / లైబ్రరి / రన్ టైం జార్ / స్పెసిఫిక్ క్లాస్ / ఆబ్జెక్ట్ / హీప్ స్పేస్ / జి.సి ఇత్యాది టర్మినాలజి తో వ్యవహరించి సాఫ్ట్వేర్ ఎంజినీరింగ్ అని గౌరవిస్తున్నాము...

అట్టి ఒకానొక సాఫ్ట్వేర్ (కస్టమైస్డ్ పి.హెచ్.పి) పై నిర్మింపబడిన ముఖపుస్తకం (ఫేస్ బుక్) సోషల్ మెసేజింగ్ అప్ప్లికేషన్ అనే సామాజిక మాధ్యమం ద్వారా నేను రాసే మీరు చదివే ఈ కవనం ఫేస్ బుక్ సెంట్రల్ సర్వర్లో ఎంతో సంక్షిప్త రూపంలో ఎంక్రిప్టెడ్ ఫాంలో కొలువై ఇన్వోక్ చేసిన ప్రతి ఫేస్ బుక్ యాప్ యుజర్ కి లభ్యమయ్యేలా కొలువైఉన్నది అని అంటే మీరు కాదనగలరా...?

అచ్చం అదే విధంగా...

ప్రేయర్ ద్వారా ఇన్వోక్ చేసిన ప్రతి భక్తుడికి కూడ తత్ దైవిక శక్తి తనదైన శైలిలో సదరు అనుగ్రహమును ప్రసాదించేవిధంగా..
సదరు దైవిక శక్తి అనేది సదరు దేవతా ఉపాధి పేర ఆకాశంలో భూమికి సదరు దూరంలో కొలువైఉండే సదరు ద్యులోకంలో శాశ్వతంగా ఉన్నది...

అని అంటే మీరు కాదనగలరా...?

ఒకే జావ క్లాస్ ని ఒకేసారి ఎంతమంది ఎంజినీర్స్ అయినా ఇంపోర్ట్ చేసుకొని వారివారి ఇన్ హౌస్ జె.వి.ఎం లో ఇన్వోక్ చేసుకోవచ్చును....
అట్లే
ఒకే దైవిక శక్తిని ఒకేసారి ఎంతమంది భక్తులైనా అనుసంధానించుకొని వారివారి ప్రార్ధనామందిరాల్లో / ఆలయాల్లో ఇన్వోక్ చేసుకోవచ్చును....,
అని అనడం కూడా అంతే సమంజసం...

నేను సూర్యపరమాత్మను ఇక్కడ మా ఇంట్లో సూర్యగాయత్రితో  ప్రార్ధించినట్టే, ఎంతో మంది విజ్ఞ్యులు ఎన్నో చోట్ల వారివారి ఇండ్లల్లో, ఆలయాల్లో ప్రార్ధించే సూర్యగాయత్రికి తగినవిధంగా సూర్యదేవుడు / ఆదిత్యశక్తి ఒకేవిధంగా అనుగ్రహించును అనేది అందలి అర్ధం....

అనగా ఒకేదేవతా శక్తి ఎప్పుడైన, ఎక్కడైనా, ఎన్నడైనా, ఎప్పటికీ ఒకేవిధంగా ప్రార్ధించిన వారందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా, ఒక యునివర్సల్ జెనెరిక్ జావ క్లాస్ లా విశ్వంలో కొలువై ఉన్నది అని అంటే మీరు కాదనగలరా...?

పరమాత్మ చే 33 విధములుగా క్లాసిఫై గావింపబడిన అట్టి వివిధ దేవతా శక్తుల "మేంటనెన్స్" టైం ని దేవశయన ఏకాదశి అని వ్యవహరిస్తారు...
{
12 ద్వాదశాదిత్యులు, 11 ఏకాదశ రుద్రులు, 8 అష్టవసువులు, 2 అశ్వినీదేవతలు (దేవవైద్యులు) అనే 33 వర్గాలుగా కొలువైఉండే దేవతా సమిష్టిని 33 కోట్ల దేవతలు అని శాస్త్రీయులు నిర్వచిస్తారు...
సంస్కృతంలో కోటి అనగా వ్యష్టి అని అర్ధం... 
(ఆ వివరాలు ఈ క్రింది వికి పేజ్ లో ఉన్నవి)
[ https://en.m.wikipedia.org/wiki/List_of_Hindu_deities 
}

మీరు అప్పుడప్పుడు మీ బ్యాంక్ వారినుండి డౌన్ టైం / మేంటనెన్స్ / లిమిటెడ్ అప్ప్లికేషన్ సర్వీసెస్ అవైలబిలిటి /
అనే ఈ-మేల్స్ రావడం గామనించే ఉంటారు కద...

అనగా ఆ సర్వీసెస్ / అప్ప్లికేషన్స్ అన్నీ కూడా నిద్రపోతున్నై అని కాదు అర్ధం....వాటి యొక్క యాన్యువల్ మేంటనెన్స్ కోసమై, ఒక పవర్ఫుల్ రెప్లికా బ్యాకప్ సర్వర్ ని స్టార్ట్ చేసి, రౌటర్ ద్వారా సర్వీస్ రిక్వెస్ట్స్ అన్నీ కూడా ఆ బ్యాకప్ సర్వర్ కి రౌట్ చేయబడే సమయంలో, యాక్ట్చువల్ సర్వర్లో హోస్టైఉన్న అప్ప్లికేషన్ / సర్వీసెస్ అన్నీ కూడా సరికొత్త శక్తితో నవీకరింపబడి వినియోగదారులకు లభ్యమైతున్నవి అనేది అందలి అంతరార్ధం....

శ్రీమహావిష్ణువు మేన్ సర్వర్ అయితే ఆదిపరాశక్తి పవర్ఫుల్ బ్యాకప్ రెప్లికా సర్వర్...
వివిధ అప్ప్లికేషన్స్ కి వారు ఎవ్విధమైన నూతన జవసత్వాలు అందించి లోకానికి దేదీప్యమానమైన దైవిక శక్తి యొక్క అనుగ్రహం అందిస్తున్నారు అనేది ఎంతో గహనమైన దేవతాతత్త్వానికి సంబంధించిన అంశం..

ఆ కడు గహనమైన దేవలోకరహస్యాలను
ఆకళింపుజేసుకోవాలంటే మీకు కర్మసిద్ధాంతం పై చక్కని అవగాహన ఉండాలి...
ఏ బీజాక్షరం ఏ దేవతా శక్తికి సంబంధించినది మరియు ఏ గాయత్రికి ఏ దేవతా శక్తి స్పందించునో తెలిసి ఉండాలి...
సదరు జీవుడి జన్మజన్మాంతరార్జితమైన పుణ్యబలసంచయ శక్తికొలది ఎట్టి ద్యులోక ఉపాధికి తగినదో నిర్ణయించే బ్రహ్మగారి విరించి తత్త్వం గురించిన అవగాహన ఉండాలి..
వీటన్నిటిని స్మరణమాత్రంచే శాసించే శ్రీమహావిష్ణువు యొక్క శ్రీవైకుంఠలోని చిత్రవిచిత్రాలు, మరియు శ్రీకైలాసం లోని ఉమామహేశ్వరుల పరిపాలనా వైచిత్రి గురించి తెలిసిఉండాలి...
అట్టి అసంఖ్యాక శ్రీవైకుంఠలోకాలు, శ్రీకైలాసాలకు ఆవాసమైన ఆదిపరాశక్తి యొక్క మణిద్వీప వైభవం, అట్టి మణిద్వీప శక్తులన్నీ కూడా శ్రీచక్ర నవావరణ దేవతాశక్తులుగా ఎవ్విధంగా కొలువై ఆరాధింపబడును అనే శాక్తేయారాధనా వైభవమంజరులపై తగు అవగాహన ఉండాలి...

అసలు ఇవన్నీ ఏంటి అని తెలుసుకోవాలంటే మీకు ఈశ్వరుడికి నమస్కరించడం ఎట్లాగో తెలిసిఉండాలి...భక్తభాగవతులు, వేదమూర్తులు, బ్రహ్మవేత్తల పట్ల గౌరవమరియాదలు కలిగి ఉండాలి..
అప్పుడు అవన్నీ కూడా ఈశ్వరానుగ్రహంగా జ్యోతకమయ్యే దేవతాతత్త్వాలుగా భాసించి భక్తులను అనుగ్రహించును...

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్ష గా వ్యవహరింపబడే దక్షిణాయణ కాలంలో అందుకే మన పెద్దలు విశేషంగా ఆదిపరాశక్తి ఆరాధనగావించండి అని చెప్పడం.....

ఆషాఢం లో వివిధ జాతర్లలో వివిధ పేర్లతో విశేషమైన శక్తి ఆరాధన...
శ్రావణం లో విశేషమైన శ్రావణ లక్ష్మీ ఆరాధన...
భాద్రపదం లో విశేషమైన పితృదేవతల ఆరాధనలో భాగంగా స్వధాదేవి ఆరాధాన...
ఆశ్వయుజం లో దసరా, దీపావళి, ఉత్సవాంతర్గతంగా దుర్గా శరన్నవరాత్రి ఆరాధన, శ్రీలక్ష్మీ ఆరాధన...
ఇత్యాదిగా ఈ దక్షిణాయణ కాలం మొత్తం కూడా విశేషమైన ఆదిపరాశక్తి ఆరాధనతో వర్ధిల్లడం మీరు గమనించే ఉంటారు...

శ్రీవైష్ణవం, శాక్తేయం ఒకే నాణానికి గల రెండు పార్శ్వములు అనేది సంప్రదాయ పెద్దల ఉవాచ..
అందుకే ఆదిపరాశక్తికి ఇవ్విధమైన శ్రీలలితా సహస్రనామాలతో ఆరాధన...

గోప్త్రీ గోవిందరూపిణి,
హరిభక్తిప్రదాయిని,
వైష్ణవి విష్ణురూపిణి,
నారాయణి,

ఇతఃపూర్వం ప్రయాణించిన జన్మపరంపరల్లో...
ఎట్టి పుణ్యపాప సంచయం వల్ల, ఇప్పుడు మనం ఉన్న ఈ జన్మ సంభవించిందో...
ఈ జన్మలో మనం కూడబెట్టే ఆగామి కర్మ ఫలితాల వల్ల రాబోవు జన్మపరంపరలు ఎట్టివో....
అనే విషయంగురించే పెద్దగా అవగాహన ఉండని సదరు సామాన్యుడికి,
ఆయాజీవుల పుణ్యబలసంపత్తికి అనుగుణంగా సదరు దేవతా ఉపాధులకు వారిని కేటాయించడం అనే అత్యంత గహనమైన దేవలోక సిద్ధాంతం గురించిన అవగాహన లభించాలంటే అది కేవలం ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే సిద్ధించే అంశం...

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు విన్నవారికి గుర్తున్నట్టుగా ఈ దక్షిణాయణ పుణ్యకాలాన్ని సంప్రదాయ పెద్దలు విశేషమైన ఉపాసనా కాలంగా వ్యవహరిస్తారు...
అందుకే పీఠాధిపతులు కూడా వారివారి ధర్మప్రచార ప్రయాణాలకు విరామం ఇచ్చి, ఎక్కడ కొలువై ఉన్నవారు అక్కడే ఉండి ఉపాసనను కొనసాగించేది...

సంవత్సరంలో ఇటువంటి పర్వదినోత్సవం నాడే విశేషమైన చందనాలంకార / శ్రీగంధభూషిత స్వామివారిగా దర్శనమిచ్చే, హైదరబాద్, కూకట్పల్లీ, వివేకానందనగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి మహిమ్నత ఎనలేనిది...🙂💐

దేవశయన ఏకాదశి తో "యోగనిద్ర" కి ఉపక్రమించే స్వామివారు భక్తులెల్లరినీ కూడా మరింత బాగా దర్శిస్తూ చల్లగా అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ, అందరికీ తొలి ఏకాదశి పండగ శుభాభినందనలు...🙂💐

భక్తులకు సకలభోగభాగ్యాలను అనుగ్రహించే ఆ భోగీంద్రశాయి యొక్క యోగీంద్ర తత్త్వాన్ని అన్నమాచార్యుల వారు ఎంతో ఘనమైన ఈ క్రింది సంస్కృత సంకీర్తనగా అందించి మనల్ని అనుగ్రహిస్తే, కీ||శే. శ్రీ సత్తిరాజు వేణుమాధవ్ గారు అంతే ఘనంగా ఆలపించి అమరులైనారు....

https://annamacharya-lyrics.blogspot.com/2021/01/903-yogi-bhogi-natanam-kuru.html?m=1

యోగి భోగి నటనం కురు వుల్లాసానన మోహన
సాగరోద్భవకన్యకాపతి సారస శ్రీవేంకటగిరియోగి

లీలా నక్షత్రజాలాధికరండ
మాలాత్త్రెవిక్రమాకారయోగి
హలాహలకర కోలాహలకర
శూలాయుదవంద్య పరిపూర్ణయోగి
కాళివినుత ప్రహేళిచరితాహి
మౌళిఘనసారవిన్యస్తయోగి    

గరుడపక్షివాహగమనవిహరి
గురునాగశైలేశ గోరక్కు రే
మురళీనాదశృంగ మోహనమురారి రే
కరుణానందసాగరశాయి రే
పరమ శ్రీవేంకటపతియవతార
నరరూపగోపకానాథ గోరక్కు రే


No comments:

Post a Comment