తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు..?
అది ఇది అని...
దక్షిణామూర్తి ఉపాసకులకు, దక్షత మరచిన దక్షుడి వచనాలలా, నీతులు చెప్పడం మానేసి, విజ్ఞ్యతతో, భగవద్భక్తి తో జీవించడం ఉత్తమం...
ఎందుకంటే ఒక విజ్ఞ్యుడికి,
తళుకుబెళుకు రాళ్ళకు మరియు మేలిమిముత్యాలకు భేదం తెలియదని అనుకుకోవడం...
అమృతమయమైన గంగిగోవుపాలకు మరియు విషపూరితమైన జెర్సి ఆవుపాలకు భేదం తెలియదని అనుకుకోవడం...
అంతగా విజ్ఞ్యత అనిపించుకోదు సరికదా అది ధూర్తుల వైఖరిలా ఉండును....
మన సర్వతోముఖాభివృద్ధికి ఆటంకంగా ఉంటే అది తణుకులీనే ఖరీదైన అసలుసిసలు వజ్రమైనా సరే వర్జింపబడవలసిందే...
ఎందుకంటే అప్పుడప్పుడు ఫంక్షన్లకు వేసుకోవడానికి వజ్రాలు బావుంటాయేమో కాని....
ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి కుదరదు...
ఎందుకంటే ఒక అసలుసిసలైన వజ్రం కలిగించే వేడిని భరించడం అందరికీ సాధ్యంకాదు...
అందుకే కలియుగప్రత్యక్షదైవమైన శ్రీతిరుమలేశుడు కూడా అప్పుడప్పుడు తిరువీధి వాహనసేవల్లో, జ్యేష్టాభిషేకం లాంటి విశేషసేవల్లో మాత్రమే వజ్రాభరణాలు ధరించడం...
మరియు ప్రతినిత్యం శ్రీలక్ష్మీప్రదమైన స్వర్ణాభరణాలచే అలంకృతమైఉండడం భక్తులు గమనించే ఉంటారు...
శరీరానికి..,
ముత్యాలు చలువ...
బంగారం పుష్టి...
వజ్రం వేడి...
ఇత్యాదిగా ఒక్కో ఖరీదైన తణుకులీనే రాయి / రాళ్ళాభరణాలు ఒక్కోవిధమైన ఫలితాన్ని ఇచ్చును అనే సత్యాన్ని ఆయుర్వేదవైద్యశాస్త్రంలో నిష్ణాతులైన విజ్ఞ్యులను సంప్రదిస్తే చెప్తారు....
మరియు
ఆయా నవరత్నాలు గ్రహసంచారఫలితాలను ఎవ్విధంగా ప్రభావితం చేస్తాయో జ్యోతిషశాస్త్రంలో నిష్ణాతులైన విజ్ఞ్యులను సంప్రదిస్తే చెప్తారు....
కొందరికి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే...
భూమి యొక్క సహనాన్ని...
సముద్రం యొక్క లోతును...
ఆకాశం యొక్క అంచులను...
శ్రీతిరుమలేశుడి మహిమ్నతను...
శ్రీతిరుమలేశుడి భక్తుల విజ్ఞ్యతను...
మేయపరచాలని అనుకోవడం అంతగా కుదరనిపని...
కాబట్టి
ఎవరి పరిధిలో వారు, ఎవరికి నచ్చినట్టుగా వారు,
ఇతరులకు ఇబ్బందికలగని రీతిలో ఎవరికివారుగా ఉంటూనే, అందరికోసం అందరు అన్నట్టుగా జీవించడంలోనే ఎల్లరికీ జీవనసాఫల్యం లభించును....
"స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం,
న్యాయేన మార్గేన మహీం మహీశా,
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం,
లోకా: సమస్తా సుఖినో భవంతు..."
అంటే కేవలం గోవులకు, బ్రాహ్మణులకు నిత్యం శుభమస్తు అని కాదు అర్ధం...
గోవులు, బ్రాహ్మణులు (అనగా దేవాలయ అర్చకులు) సుఖసంతోషాలతో ఉంటే వారి అనుగ్రహంతో యావద్ సమాజం / ప్రపంచం సుభిక్షంగా ఉండును అనేది అందలి అసలైన తత్త్వార్ధం అని సద్గురు శ్రీచాగంటి గారు ప్రవచనాల్లో ఒకానొక సందర్భంలో విశదీకరించడం కొందరిలోకొందరికైనా గుర్తుండే ఉంటుంది...
కాబట్టి, సత్బ్రాహ్మణకౌశలాన్ని మించిన బుద్ధికుశలత కలిగిన వారము అని అనుకోవడం కొందరి జ్ఞ్యానలేమికి తార్కాణామే అవుతుంది సుమా...!
నువ్వనుకునే తూర్పు నిజతూర్పు కానప్పుడు..,
నువ్వనుకునే ఉత్తరం నిజఉత్తరం కానప్పుడు...,
నువ్వనుకునే పడమర నిజపడమర కానప్పుడు...,
నువ్వనుకునే దక్షిణం నిజదక్షిణం కానప్పుడు...,
నువ్వు ఏ సిద్ధాంత ప్రతిపాదికన సదరు శాస్త్రంలో ఆరితేరిన విజ్ఞ్యుల కౌశలానికే సవాల్ విసరగలనని అనుకుంటున్నావ్...?
అనేది ఆలోచించి విషయాలను ప్రస్తావించడమే సమంజసమౌను...
మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
సహకరించిన / సహకరించే సహృదయులైన విజ్ఞ్యులెల్లరికీ వందనం...🙏
🙂💐💐💐....
No comments:
Post a Comment