కొందరు జాగ్రత్తగా విని అర్ధం చేసుకుంటే మంచిది....
ఈ మాటలతో విజ్ఞ్యులైన గౌ|| ముఖ్యమంత్రివర్యులు మరియు గౌ|| ప్రధానమంత్రివర్యులు కూడా ఏకీభవిస్తారు...
కాబట్టి ఇతరులు ఏకీభవించడం గురించి పెద్దగా చర్చలు అక్కర్లేదు....
ట్రైన్ అనేది ఒక జెనెరిక్ పదం....
ఎక్కడో ఒక స్టేషన్లో ఆగే గూడ్స్ ట్రైన్ వేరు...
ప్రతీ స్టేషన్లో ఆగే ప్యాసెంజర్ ట్రైన్ వేరు....
ఏవో కొద్ది స్టేషన్లలో మాత్రమే ఆగే ఎక్స్ప్రెస్స్ ట్రైన్ వేరు....
ఒకటో రెండో స్టేషన్లలో మాత్రమే ఆగే సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేరు...
గూడ్స్ ట్రైన్ యొక్క వేగం వేరు...
ప్యాసెంజర్ ట్రైన్ యొక్క వేగం వేరు...
ఎక్స్ప్రెస్స్ ట్రైన్ యొక్క వేగం వేరు...
సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ యొక్క వేగం వేరు...
విజ్ఞ్యులచే తన గమ్యస్థానం నిర్దేశింపబడిన ఒక వందేభారత్ బుల్లెట్ ట్రైన్ 180 కె.ఎం.పి.హెచ్ లో శరవేగంతో దూసుకువస్తుండగా ..
"సర్...మీరు ఈ రాష్ట్రముఖ్యమంత్రివర్యులు కాబట్టి /
మీరు ఈ దేశప్రధానమంత్రివర్యులు కాబట్టి...
మిమ్మల్ని ఎవరు కాదనరు కాబట్టి...
ట్రైన్ ని కొంచెం స్లో గా నడపమని డ్రైవర్ కి చెప్పడానికి,
ట్రైన్ డోర్ అందేంత సమీపంగా ఎంతో దెగ్గరగా నిల్చొని,
అన్ని భోగీల్లో ప్రయాణిస్తున్న ప్రజలకు హాయ్ చెప్తే బావుంటుంది....కద..."
అని ఒక బుద్ధిహీనుడు అంటే...
విజ్ఞ్యులు ఏమని అంటారు.....
"నేనే కాదు...విజ్ఞ్యులైన నా ప్రజలెవ్వరూ కూడా అంతటి శరవేగంతో ప్రయాణించే ట్రైన్స్ కి సమీపంగా కాదు కద...
కొంచెం దూరంలో కూడా నిల్చోనవసరంలేదు...
ఎందుకంటే,
ఆ ట్రైన్ యొక్క డెస్టినేషన్ అరైవల్ టైం కి తగ్గట్టుగా,
తన అత్యున్నతస్థాయికి తగ్గట్టుగా,
తన విహిత కర్తవ్యాన్ని నిర్వహించేందుకు, తనుప్రయాణించవలసిన వేగంతో తనదార్లో తను దూసుకుపోతుంటే....
మధ్యలో అనవసరంగా మనం కలగజేసుకోవడం ఎందుకు....?
ఇబ్బంది పెట్టడం ఎందుకు..?
మనం ఇబ్బంది పడడం ఎందుకు...?
మీపనిమీరు చేసుకోండి...ట్రైన్ తన పని తాను చేసుకుంటుంది...అదే అందరికి మంచిది...."
అనే అంటారు.....
కొందరు ప్రాజ్ఞ్యుల విజ్ఞ్యతభరిత నిర్ణయాల్లో కలగజేసుకొని అట్లా కాదు ఇట్లా...అది కాదు ఇది....
అని ఏదో ఒక అనవసర జోక్యంతో ఎవరైనా మాట్లాడాలని అనుకుంటే...
పైన ఉదాహరణలో పేర్కొన్న రీతిలోనే....
ఏ విజ్ఞ్యులైనా సరే....
"మీకెందుకయ్య...వాళ్ళు ఏది కొనుక్కుంటే మీకెందుకు....
వాళ్ళు ఎక్కడుంటే మీకెందుకు...మీకవసరమా...?
మీపని మీరు చేసుకోండి...వారి విజ్ఞ్యతకు అనుగుణంగా వాళ్ళకు నచ్చిన వస్తువులను వాళ్ళు కొనుక్కుంటరు..."
అనే అంటారు....
కాబట్టి, కలువకు, కమలానికి సరిగ్గా భేదం తెలియని వారు...
వెన్నెల చల్లదనం గురించి, ఎండ వేడిమి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది....