Tuesday, December 3, 2024

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర / చాంద్రమాన మార్గశిర మాసాంతర్గత సౌరమాన ధనుర్మాస / మార్గళి శ్రీవ్రతం / తిరుప్పావై ఆరాధనోత్సవ శుభాభినందనలు...💐😊(డిసెంబర్-16-2024 నుండి జనవరి-14-2025 వరకు)

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర  / చాంద్రమాన మార్గశిర మాసాంతర్గత సౌరమాన ధనుర్మాస / మార్గళి శ్రీవ్రతం / తిరుప్పావై ఆరాధనోత్సవ శుభాభినందనలు...💐😊
(డిసెంబర్-16-2024 నుండి జనవరి-14-2025 వరకు)

ఆషాఢ శుద్ధ ఏకాదశి / తొలిఏకాదశి నుండి వైకుంఠ ఏకాదశి / పుష్య శుద్ధ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి వరకు దక్షిణాయనం మొత్తం....

అమ్మవారి జాతర అని ఆషాఢమాసం మొత్తం....
శ్రీవరలక్ష్మినోములని శ్రావణమాసం మొత్తం...
వినాయకనవరాత్రోత్సవాలని భాద్రపదమాసం మొత్తం...
దుర్గాదేవి ఆరాధన / దీపావళి ఉత్సవం అని ఆశ్వయుజమాసం మొత్తం...
దేవోత్థాన ఏకాదశి / క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి, ఇత్యాదిగా అత్యంత విశేషమైన హరిహరప్రీతికరమైన ఆరాధనా సమయంగా కార్తీకమాసం మొత్తం...
శ్రీవ్రతం / తిరుప్పావై / వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి ఇత్యాది విశేష ఉత్సవపర్వసమయంగా మార్గశిరమాసం మొత్తం....

అధ్యాత్మపరంగా ఎంతో బిజి బిజి గా ఉండే ఈ దక్షిణాయనపుణ్యకాల సమయం, విజ్ఞ్యులచే పరిగణింపబడే ఉపాసనా సమయం....

రాకెట్ సైన్స్ తో చంద్రుణ్ణి దాటి మార్స్ పైకి కూడా ప్రయాణించి, భూమిపైనుండి ఆ గ్రహాలపైన రోవర్లను నడిపిస్తూ,
రోదసీ విజ్ఞ్యాన విశేషాలను అందుకుంటున్న ఆధునిక కాలపు కొందరు నవయుగమానవులకు, ఎస్పెషల్లి కొందరు చదువుకున్న మూర్ఖులకు కూడా, ఈ పాతకాలం నాటి ఆధ్యాత్మికత ఏదో చాదస్తంగా అనిపించవచ్చు...

ప్రతీ రోజు పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించేంతవరకు, ఒక రోజులోని 12 గంటల పాటు మెలకువగా ఉండి అన్నపానీయములను శరీరంలోకి వేస్తూ దృఢమైన శరీరాన్ని గడిస్తూ, రాత్రి 12 గంటల పాటు, నిద్ర / రెస్ట్ / అనే పేరుతో సేదతీరుతూ ఉండే మనిషికి....

మరి అదే విధంగా సంవత్సరకాలంలో కూడా....
ఉత్తరాయణం, దక్షిణాయణం, అనే రెండు కాలవిభాగాలు ఉంటాయని...
సంవత్సరంలో సగం సమయం ఉత్తరాయణంగా, మరో సగం
దక్షిణాయణంగా విభాగింపబడి, దేవతలకు పగటి సమయంగా భావింపబడే ఉత్తరాయణపుణ్యకాలంలో, పెళ్ళిల్లు, ఫంక్షన్లు, అని ప్రాపంచిక నిమగ్నతలో బిజిబిజి గా ఉంటూ, దక్షిణాయణపుణ్యకాలంలో దేవతలను ఉద్దేశ్యించిగావింపబడే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉండడం, జీవితంలో అభివృద్ధిని కాంక్షించే మానవులకు విహితకర్తవ్యం అని అనడం కూడా అటువంటి సామ్యమే....

ఒక పశువుకు కూడా, పొద్దున మొత్తం తినితిరగడం, రాత్రి మొత్తం నిద్రించడం అనేది సాధారణమైన విహితకర్తవ్యం....
మరి పశువుకు, మనిషికి భేదం ఎక్కడంటే....
సాధారణ నిద్ర పశునిద్ర...
విశేషమైన నిద్ర ఈశ్వరారాధనలో నిమగ్నమైన శరీరం యొక్క సమాధిస్థితిలో గావింపబడిన తపస్సుగా పరిగణింపబడును....
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించిన వారికి గుర్తున్నట్టుగా, 11 మాట్లు శివనామస్మరణతో నిద్రకు ఉపక్రమించి, 3 మాట్లు శ్రీహరి నామస్మరణతో నిద్రనుండి బాహ్యప్రపంచంలోకి మేలుకునే మనిషి యొక్క నిద్ర అనేది,
అష్టాంగయోగంలోని సమాధిస్థితిగా సంఖ్యాశాస్త్రపరంగా కూడా, సాంఖ్యసిద్ధిని గడించును....
ఎట్లనగా, అట్టి ఈశ్వరనామస్మరణతో (11×3=33) వర్గముల దేవతలకు శరీరంలో నిర్దేశింపబడిన యోగస్థానాల్లో 
వారిని ఆసీనులై ఉండమని ప్రార్ధించినట్టుగా శాస్త్రం పరిగణించును...
తద్వారా శ్రీరుద్రపఠనంలోని వచనాలకు సామ్యముగా, ఒక్కోదేవతాశక్తి ఒక్కోఅనుగ్రహపుష్టిని, శరీరానికి దైవిక తేజస్సును అనుగ్రహించి మనిషిని పరిపూర్ణంగా తరింపజేయును...

అట్టిదేవతానుగ్రహాన్ని మేయపరచడం కేవలం తత్త్వశాస్త్రంలో కోవిదులైన వారికి మాత్రమే సాధ్యం....
ఒక చిన్న ఎగ్సాంపుల్ తో ఈ విశేషాన్ని వివరిస్తాను...
మీ ఇంట్లో వెలుగుతున్న టార్చ్ లైట్ కి, వెలగని టార్చ్ లైట్ కి భేదం ఏంటి..?
ఒక దాంట్లోని బ్యాట్రీస్ యాక్టివ్ గా ఉన్నాయ్...
మరొక దాంట్లోని బ్యాట్రీస్ ఇనాక్టివ్ గా ఉన్నాయ్...
అనగా మన కంటికి కనిపించని, కనిపించనవసరంలేని స్మాల్ మాగ్నిట్యూడ్ లో ఉండే ఒకానొక విద్యుత్శక్తి రెండవ టార్చ్ లైట్లోని బ్యాట్రీస్ లో నిండుకున్నదని అర్ధం....

మరి మీరిప్పుడు ఒక బిందెలోని మంచినీళ్ళు నిండుకుంటే, మరో బిందేలోనుండి ఒంపుకున్నట్టు,
ఒక యాక్టివ్ బ్యాట్రీలోని శక్తిని, ఒక ఇనాక్టివ్ బ్యాట్రీ లోకి ఒంపుతారా..?
లేక ఒక పద్ధతిప్రకారంగా చార్జింగ్ తో (అవి రిచార్జబుల్ బ్యాట్రీస్ అనుకోండి) ఇనాక్టివ్ బ్యాట్రీస్ ని యాక్టివ్ చేస్తారా...?

అచ్చం ఇదేవిధంగా, మన కంటికి కనిపించని, కనిపించనవసరం లేనివి పుణ్యం, దైవత్వం....
వాటిని ఎప్పటికప్పుడు రిచార్జ్ చేసుకుంటూ ఉండాలి....
అది వ్యక్తిగతంగానూ, మరియు సామాజికపరంగానూ...
ఎందుకంటే, పుణ్యం క్షయించిపోవడం మరియు ఆసురితత్త్వం అలుముకోవడం చాలా తేలిక....
వాటికోసం పెద్దగా శ్రమించనవసరంలేదు....

వివాదాస్పదమైన రీతిలో కొందరిని ఎత్తిచూపడం నా ఉద్దేశ్యం కాదు కాని...
ప్రపంచం మొత్తం గమనిస్తున్న విధంగా...ఏవిధంగా, దైవత్వం / పుణ్యపురుషులు తగ్గిపోయి ఆసురితత్త్వం పెచ్చుమీరి కొన్ని దేశాలు మొత్తం ఇవ్వాళ రాక్షసులతో అతలాకుతలమై అట్టుడికిపోతున్నవో....
ఆ దేశాల్లో ఉన్న కొద్దిమంది పుణ్యపురుషులను కూడా ఏవిధంగా దేశక్షేమానికై / దేశంలోని విజ్ఞ్యుల సమ్రక్షణకై పాటుబడనీయకుండా ఇబ్బంది పెడుతున్నరో
అనేది వార్తల్లో యావద్ లోకం వీక్షిస్తున్న సత్యమే....

కాబట్టి మనుష్యుల సమూహమైన సమాజంలోని సిమ్హభాగం సత్త్వగుణసంవృద్ధిని కోల్పోయి, నిత్యం రజోగుణ, తమోగుణంతో పేట్రేగిపోతూ ఉంటే యావద్ మానవాళికి కూడా ప్రశాంతజీవనం అనేది ప్రశ్నార్ధకమౌను...

నీళ్ళు ఇంకిపోయిన నదిలో ఎంత ఇసుక ఉన్న, ఎన్ని ఇతర వస్తువులున్నా అవన్నీ వ్యర్ధమే....ఎందుకంటే నది అనగా నిత్యం ప్రవహించే స్వచ్ఛమైన నీరు అని అర్ధం...
అవ్విధముగనే...
ప్రశాంతత లేని జీవితంలో ఎన్నిఉన్నా అవన్నీ వ్యర్ధమే....
ఎందుకంటే అర్ధవంతమైన జీవితం అనగా నిత్యం ప్రశాంతతను సమకూర్చే కాలప్రవాహం అని అర్ధం....
అనగా మనం ప్రశాంతంగా జీవించడం..
మరియు మనచుట్టూ ఉండే సమాజాన్ని ప్రశాంతంగా ఉండనీయడంలోనే ఎల్లరి సార్ధకత ఉండును....

అట్టి ఆంతర, బాహిర ప్రశాంతతకు ఆవాసం సత్త్వగుణ ప్రధానమైన భగవంతుడు...
అనగా సగుణ సాకార పరమాత్మగా ఆరాధింపబడే శ్రీమహావిష్ణువు అని శాస్త్రవచనం....
(పరమేశ్వరపంచాస్యవైభవంలో ఉత్తరాభిముఖమైఉండే వామదేవ వదనమే శ్రీమహావిష్ణువు అని శైవాగమం కీర్తిస్తున్నది కాబట్టి కొందరు వారి సంకుచితత్త్వంతో, శివకేశవభేదములు ఎంచరాదు)

మనిషిని మృగత్వం నుండి మాధవత్వం వైపుగా నడిపించేది భగవద్ అనుగ్రహం.....
అట్టి భగవద్ అనుగ్రహమే మనిషికి అన్నివిధములైన విభూతులను అనుగ్రహించే సర్వోన్నతమైన సాధనం...

మృగం యొక్క శిరస్సులా ఆకాశంలో భాసించే మృగశిరా నక్షత్రమండలంతో కూడుకున్న పౌర్ణమి చంద్రుడు ప్రకాశించే మృగశిరామాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్ర శ్రీరుద్రాభిషేకం విశేషమైన ఈశ్వరానుగ్రహ వైభవం అని శ్రీచాగంటి సద్గురువులు ప్రవచించడం కొందరు విజ్ఞ్యులకైనా గుర్తుండే ఉంటుంది....
అటువంటి మహిమాన్వితమైన రోజునే ఈ సంవత్సరం సౌరమానం ప్రకారంగా ఏర్పడే ధనుర్మాసం ప్రారంభమవ్వడం (డిసెంబర్-16-2024) మరింత విశేషమైన అంశం....

ఒక చక్కని మధురమైన వంటకాన్ని వండుకొని తరించాలంటే, అటువంటి మధురమైన వంటకాన్ని చేయడంలో నిష్ణాతులైన వారిని స్ఫూర్తిగా భావించి, వారిని అనుసరించి, మనమూ తరించగలగాలి...

అవ్విధముగనే, చక్కని మధురమైన భగవదనుగ్రహ పరిపుష్ఠమైన జీవితంతో తరించాలంటే, అటువంటి మధురమైన జీవితాన్ని జీవించిన / జీవించే నిష్ణాతులైన భక్తులను స్ఫూర్తిగా భావించి, వారిని అనుసరించి, మనమూ తరించగలగాలి....

ఈ కలియుగంలో సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అవతారంగా, శ్రీవిష్ణుచిత్తులవారికి భూదేవి అంశలో శ్రీవిళ్ళిపుత్తూరులో లభించిన మహాభక్తురాలు గోదాదేవి...
శ్రీవైష్ణవవైభవాన్ని జదగ్విఖ్యాతంగావించిన పన్నిద్దరాళువార్లలో
ఒకరిగా, ఆండాళ్ తల్లిగా, గోదమ్మది శ్రీవైష్ణవభక్తిసామ్రాజ్యంలో సర్వోన్నతమైన స్థానం...
ఎంతగా అంటే, ఆండాళ్ అమ్మవారి సన్నిధిలేని ఆలయాన్ని, విజ్ఞ్యులు పరిపూర్ణ శ్రీవైష్ణవాలయంగా పరిగణించరు...

అందుకే, సర్వోన్నతమైన ప్రప్రథమ శ్రీవైష్ణవుడైన పరమేశ్వరుడి పెద్దకొడుకు, వినాయగర్ / పిళ్ళైయార్ (వినాయకుడు) సృజించిన కావేరి నది మధ్యలో ఎంతో ఠీవిగా కొలువైన సూర్యవంశ చక్రవర్తుల ఆరాధ్యమూర్తి, శ్రీరంగనాథస్వామివారినే, పరిపూర్ణ దైవమైన శ్రీకృష్ణపరమాత్మగా భావించి....
మధురభక్తిసామ్రాజ్యానికి మకుటాయమానమైన ముప్పది
" తిరుప్పావై " పాశురాలు, గోదమ్మవారిచే లోకానికి అనుగ్రహింపబడిన మహనీయమైన సారస్వతంగా  ఖ్యాతిగడించడం, వాటిని అనుసంధించే భక్తులెల్లరికీ కూడా విశేషమైన శ్రియానుగ్రహం లభించితరించడం అనే సత్యం అధ్యాత్మ ప్రపంచ విజ్ఞ్యులకు విదితమైన విశేషమే..!

మాకు స్టీల్ ప్లేట్లో అన్నం, కూర, పప్పుచారు, పెరుగును భోజనంగా స్వీకరించడం తెలుసు...
ఆచార్యులు వెండి కంచంలో పంచభక్షపరమాన్నములను  వడ్డిస్తున్నారు...ఇప్పుడెట్లా అని అలోచించేవారు అవివేకులు....
భక్తభాగవతానుగ్రహంగా, ఇన్నాళ్ళకు ఆచార్యులచే వెండి కంచంలో పంచభక్షపరమాన్నములు ప్రసాదంగా ఎంతో ఆప్యాయంగా అనుగ్రహింపబడడం జన్మాంతరసుకృతం....అని వాటిని నమస్కరించి స్వీకరించి తరించడం విజ్ఞ్యుల వివేకం....

అవ్విధముగనే...,
మాకు ఏవో అందరికీ తెలిసిన నాలుగు సాధారణ స్తోత్రాలు మాత్రమే తెలుసు...
ఆచార్యులు ద్రావిడంలో తిరుప్పావై స్తోత్రాలు అనుసంధిస్తున్నారు...ఇప్పుడెట్లా అని అలోచించేవారు అవివేకులు....
భక్తభాగవతానుగ్రహంగా, ఇన్నాళ్ళకు ఆచార్యులచే ద్రావిడ ప్రబంధస్తోత్రానుగ్రహం ఎంతో ఆప్యాయంగా అనుగ్రహింపబడడం జన్మాంతరసుకృతం....అని నమస్కరించి తిరుప్పావై, తిరుప్పల్లాండు, ఇత్యాది
స్తోత్రాలను తెలుగు ముద్రణలో నేర్చుకొని అనుసంధించి తరించడం విజ్ఞ్యుల వివేకం....

ఆండాళ్ తిరువడిగలే శరణం...💐😊🙏
ఆచార్య తిరువడిగలే శరణం...💐😊🙏

(
యావద్ శ్రీవైష్ణవసారస్వతానికి నిలయంగా భాసిల్లే prapatti.com అనే వెబ్సైట్ లో, మీకు నచ్చిన భాషలో స్తోత్రాలను డౌన్లోడ్ చేసుకునే భాగ్యం ఆ సైట్ నిర్వాహకులు ఎంతో దయాళువులై కల్పించారు...విజ్ఞ్యులు ఈ వెబ్సైట్ ని సద్వినియోగించుకొని తరించగలరు..
The key words to search (without the double quotes) are...
"Tiruppaavai"
"Tiruppallaandu"
"Tiruppalliyezuchchi"
)


No comments:

Post a Comment