Friday, December 27, 2024

చలికాలంలో మాత్రమే లభించే ఉసిరికాయలతో మీరుకూడా తప్పకుండా ఈ ఔషధీమధురాన్ని ట్రై చేసి చూడండి...🙂💐

శ్రీకరమైన దేశరక్షణకు దేశసరిహద్దులో సైనిక పహారా, గృహరక్షణకు ఇంటిచుట్టూ చక్కని ప్రహరీ, దేహరక్షణకు చక్కని ఇమ్యూనిటి అత్యావశ్యకమైన అంశం...

ఈ చలికాలంలో ప్రకృతి ప్రసాదించే మహౌషధీ ఫలం ఆమలకఫలం / ఉసిరికాయ్.....
కార్తీకమాసం ముగిసింది కాబట్టి ప్రతిఒక్కరూ ఏదో ఒకరూపంలో ఉసిరికాయ్ ని తప్పకుండా సేవించి చక్కని ఆరోగ్యాన్ని గడించడం ఆరోగ్యాభివృద్ధికారక అంశం...
ఉసిరికాయ్ పచ్చడి, చారు, చూర్ణము, ఇత్యాదిగా ఒక్కొక్కరూ ఒక్కోలా వారివారి అభిరుచిమేరకు ఉసిరికాయ్ ని ఆరగించడం పరిపాటి...
ఈ క్రింద పేర్కొనబడిన ఉసిరికాయ్ వంటకం ఎన్నెన్నో ఔషధీగుణాలతో పరిపుష్టమైన అమృతసమమైన భోజ్యపదార్ధం...

మన తాతముత్తాతలు ఇటువంటి బలవర్ధకమైన ఆహారం సేవించారు కాబట్టే ఎనభైల్లో కూడా అలుపెరగని రీతిలో వారిపనులను వారే చేసుకునేవారు...కిలోమీటర్లమేర నడిచేవారు..మనవలుమనవరాండ్ల బాగోగులుకూడా చక్కగా నిర్వహించేవారు....

ఈ చలికాలంలో మాత్రమే లభించే ఉసిరికాయలతో మీరుకూడా తప్పకుండా ఈ ఔషధీమధురాన్ని ట్రై చేసి చూడండి...🙂💐

https://www.facebook.com/share/p/akapD9Nv12nEW4ZY/

No comments:

Post a Comment