Tuesday, December 3, 2024

Many happy returns of the day to Shree Anumula Revanth Reddy gaaru, hon'ble Chief minister of Telangana..💐😊

గౌ || రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల పుట్టినరోజు కానుకగా...,
ఈ క్రింది ముఖ్యాంశాలను ఆలకించి...

*****************************************************
1. హైదరాబాద్ మహానగర వ్యవస్థీకృత సుందరీకరణలో భాగంగా, ఎవ్విధంగా ఇతర దేశాల/నగరాల అభివృద్ధిని అధ్యయనం చేసి పలు సంస్కరణలను అమలుపరిచే దిశగా అమాత్యవర్గం కార్యాచరణను రూపొందిస్తున్నదో.,
అవ్విధముగనే రాష్ట్ర పరిపాలన యొక్క వ్యవస్థీకృత ఆధునికీకరణలో భాగంగా, ఇతర మహానగరాల/రాష్ట్రాల/దేశాల మెరుగైన ఆధునిక సాంకేతిక ఆధారిత అంతర్జాల విధానాల ద్వారా, త్వరితగతిన పౌరసేవలను సులభంగా అందిచే దిశగా, అన్నిప్రభుత్వవ్యవస్థలు కూడా అనుసంధానాత్మక ఏకీకృత విధానంగా సమీకృతం గావింపబడేలా విస్తృతమైన సాంకేతికత యొక్క వినియోగాన్ని ప్రోత్సహించేలా అమాత్యవర్గంతో కలిసి తగురీతిలో సంస్కరణలను అమలుపరచడం...

2. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలకబృందం, ఇతరులతో ఎన్ని రకాల అనివార్యమైన అభిప్రాయభేదాలు ఉన్నాకూడా, ఫెడెరల్ స్ఫూర్తితో కేవలం రాష్ట్రాభివృద్ధికారకప్రయోజనాలను సాధించుకునే దిశగా మాత్రమే రాష్ట్రాధికారవ్యష్టి యొక్క శక్తియుక్తులు వినియోగింపబడేలా సమర్ధవంతమైన సుపరిపాలనను ప్రజలకు చేరువచేయడం...

3.కులమతవర్ణవర్గాది అనివార్య తారతమ్యాలకు అతీతంగా, ప్రజాస్వామ్యవిలువలకు ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలోని శాంతిభద్రతలకు ఎల్లప్పుడూ అగ్రపీఠాన్ని వేసి, నెలకొని ఉన్న  మతసామరస్యాన్ని పరిరక్షించడం, అందుకు విఘాతం కలిగించే ఎట్టివారినైనా సరే ఉపేక్షించకుండా లా అండ్ ఆర్డర్ వ్యవస్థను అత్యాధునిక సాంకేతిక వినియోగంతో మరింతగా బలోపేతం గావించడం...

4. పర్యవేక్షణ, పరిధి, పరిమితి, అనే మూడు అత్యంతముఖ్యమైన అంశాల్లో సమతూకం పాటించిన మాన్యులు ఎల్లప్పుడూ చరిత్రలో మాన్యులైన మహనీయులుగా వినుతికెక్కారు. అవ్విధమైన సమతూకం, పరిపాలనలో, అధికారవినిమయంలో కూడా పాటించినప్పుడు, పాలకులను సర్వత్రా ప్రజలు హర్షించెదరు..,
అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ పరిపాలించడం....

5. కట్టుబడిఉండవలసిన ధర్మానికి,
ఆచరించవలసిన కర్తవ్యానికి,
స్వీకరించిన బాధ్యతకు,
అనివార్యమైన బంధాలకు,
ఏర్పరుచుకున్న బాంధవ్యానికి,

సరైన పర్యవేక్షణను కలిగిఉండి, సరైన పరిధిని నిర్దేశించుకొని, 
సరైన పరిమితితో ఆదరించి, పండిత ఆమోదయోగ్యమైన,
పౌరహితకరమైన, ప్రజారంజకమైన, సుపరిపాలనను అందించే ప్రజాస్వామ్యసేవాయజ్ఞ్యంలో...
*****************************************************

మీరు తరించి, ప్రజలను, తరింపజేయగలరని ఆకాంక్షిస్తూ,మీకు హార్ధిక జన్మదినోత్సవ శుభాభినందనానమస్సులు...💐😊🙏

Many happy returns of the day to Shree Anumula Revanth Reddy gaaru, hon'ble Chief minister of Telangana..💐😊

No comments:

Post a Comment